డి. రామానాయుడు
తెలుగులో మూవీ మొఘల్‌గా పేరుగాంచిన దగ్గుబాటి రామానాయుడు ప్రముఖ నిర్మాత. ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు. 1964లో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు. ఆ బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం రాముడు భీముడు(1964). కమర్షియల్‌గా ఈచిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నష్టాలు తెచ్చాయి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ప్రేమ్‌నగర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.రాముడు, భీముడు, ప్రేమ్‌నగర్, జీవనతరంగాలు, శ్రీకృష్ణతులాభారం, ముందడుగు, సోగ్గాడు, సెక్రెటరీ, దేవత, ప్రేమించుకుందాం రా, నువ్వు లేక నేను లేను,మల్లీశ్వరి, దృశ్యం వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వచ్చినవే. సినీరంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్న పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. నిర్మాతగా మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన రాణించారు. టీడీపీ తరఫున ఎంపీగా బాపట్ల(1999) నుంచి గెలిచారు. 2003లో బెస్ట్ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందారు. ఆయన చిన్న కుమారుడు వెంకటేష్, ఆయన మనవడు రానా తెలుగులో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు సురేష్ నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నారు.
డి. రామానాయుడు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే డి. రామానాయుడు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.