• TFIDB EN
  • దాసరి నారాయణరావు
    ప్రదేశం: పాలకొల్లు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
    దాసరి నారాయణరావు తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుల్లో ఒకరు. ఆయన డైరెక్టర్‌గానే కాకుండా, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడిగా సుపరిచితుడు. ప్రపంచంలో అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డులకెక్కాడు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. 250 పైగా చిత్రాలలో మాటల రచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించి గుర్తింపు పొందాడు. తాతా మనవడు(1973) ఆయన డైరెక్షన్‌లో వచ్చిన తొలి చిత్రం. స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు, శివరంజని, సూరిగాడు, అమ్మ రాజీనామా, కటకటాల రుద్రయ్య, గొరింటాకు, ప్రేమాభిషేకం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, ఓసేయ్ రాములమ్మ వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. దాసరి కెరీర్‌లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఉత్తమ డైరెక్టర్‌గా, నటుడిగా కలిపి మూడు నంది అవార్డులు అందుకున్నారు. దాసరి నారాయణ రాజకీయాల్లోనూ రాణించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు.
    దాసరి నారాయణరావు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే దాసరి నారాయణరావు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree