

ఫారియా అబ్దుల్లా
జననం : మే 28 , 1998
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ), భారతదేశం
ఫరియా అబ్దుల్లా తెలుగు సినిమా నటి. 1998, మే 28న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి సంజయ్ అబ్దుల్లా, తల్లి కౌసర్ సుల్తానా. తన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ సంపాదించింది.
ఫారియా అబ్దుల్లా వయసు ఎంత?
ఫరియా అబ్దుల్లా వయసు 27 సంవత్సరాలు
ఫారియా అబ్దుల్లా ఎత్తు ఎంత?
5'10"(178cm)
ఫారియా అబ్దుల్లా అభిరుచులు ఏంటి?
మోడలింగ్, డ్యాన్సింగ్, పేయింటింగ్
ఫారియా అబ్దుల్లా ఏం చదువుకున్నారు?
మాస్ మీడియా కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివింది.
ఫారియా అబ్దుల్లా ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
మెరిడియన్ స్కూల్, హైదరాబాద్, లయోలా అకాడమీ డిగ్రీ- పీజీ కాలేజ్, హైదరాబాద్
ఫారియా అబ్దుల్లా రిలేషన్‌లో ఉంది ఎవరు?
ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం సింగిల్ గా ఉంటోంది. తన డేటింగ్ హిస్టరీపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
ఫారియా అబ్దుల్లా ఫిగర్ మెజర్‌మెంట్స్?
32-28-34
ఫారియా అబ్దుల్లా In Saree
ఫారియా అబ్దుల్లా Hot Pics
ఫారియా అబ్దుల్లా In Ethnic Dress
ఫారియా అబ్దుల్లా In Half Saree
ఫారియా అబ్దుల్లా In Modern Dress
ఫారియా అబ్దుల్లా అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Faria Abdullah Viral Video
Insta Hot Reels
Faria Abdullah Hot Insta Reel
- Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం. [toc] Eesha Rebba తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు. Tatoo images యుక్తిత రేజా రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది. నిహారిక కొణిదెల మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు. https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది. సంయుక్త మీనన్ మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది. అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది. https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs తృప్తి డిమ్రి టాటూస్ న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు. సమంత టాటూస్ సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది. మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) శృతి హాసన్ టాటూస్ అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది. https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh రాశి ఖన్నా టాటూస్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి. అనసూయ భరద్వాజ్ టాటూస్ అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం. ఫరియా అబ్దుల్లా టాటూస్ పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) అనన్య నాగళ్ల టాటూ గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) మమతా మోహన్ దాస్ టాటూ ఒకప్పుడూ టాలీవుడ్ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది. నేహా శర్మ టాటూస్ అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది. శోభిత దూళిపాళ శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు. షిర్లి షెటియా అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది. View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer) రుహాని శర్మ రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.అక్టోబర్ 22 , 2024
- Mathu Vadalara 2: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘మత్తు వదలరా 2’.. త్రీ డేస్ కలెక్షన్స్ ఎంతంటే?శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్, రోహిణి, సునీల్ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం (సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొంది. ముఖ్యంగా కమెడియన్ సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో తొలి రోజు సాలిడ్ వసూళ్లు సాధించి ఆ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి వీకెండ్లో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వసూళ్ల జాతర 'మత్తు వదలరా 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి రెండు రోజుల్లో (శుక్ర, శని) రూ.11 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం ఆదివారం కూడా సాలిడ్ వసూళ్లనే రాబట్టింది. ఫస్ట్ త్రీ డేస్‌లో ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.16.2 కోట్లు కొల్లగొట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 'పదహారేళ్ల వయసు.. పదహారు కోట్ల గ్రాసూ’ అంటూ ఈ పోస్టర్‌కు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అటు ఓవర్సీస్లో 600K డాలర్లకు పైగా రాబట్టినట్లు మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో ‘మత్తు వదలరా 2’ కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయమని, ఈ వీకెండ్ నాటికిి రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. https://twitter.com/MythriOfficial/status/1835560518255255726 https://twitter.com/MythriOfficial/status/1835533814803894507 తొలి రోజు ఎంతంటే కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్ 13) ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఓవర్సీస్లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేశాయి. https://twitter.com/MythriOfficial/status/1834823161281757529 వారందరికీ బూస్టప్! ‘మత్తు వదలరా’ (పార్ట్ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. కథేంటి డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ. https://telugu.yousay.tv/mathu-vadalara-2-day-1-collections-mathu-vadalara-2-has-a-great-opening-what-are-the-collections.htmlసెప్టెంబర్ 16 , 2024
- Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తు వదలరా 2’ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్.. వసూళ్లు ఎంతంటే?శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్, రోహిణి, సునీల్ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్ తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొంది. సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సాలిడ్ ఓపెనింగ్స్ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా కమెడీ సత్య కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. తొలి రోజున ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేస్తున్నారు. ఈ వీకెండ్లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో 'మత్తు వదలరా 2' ఈజీగానే రూ.15 కోట్ల గ్రాస్ అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. వారందరికీ బూస్టప్! ‘మత్తు వదలరా’ (పార్ట్ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. కథేంటి డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ. https://telugu.yousay.tv/mathu-vadalara-2-movie-review-comedian-satyas-one-man-show-how-is-mathu-vadalara-2.htmlసెప్టెంబర్ 14 , 2024

ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన 'చిట్టి' పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఫరియా సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ప్రస్తుతం తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫరియాకు డ్యాన్స్ అంటే ఇష్టం. మరి ఫరియా గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About faria abdullah) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫరియా అబ్దుల్లా దేనికి ఫేమస్?
ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ దక్కింది.
ఫరియా అబ్దుల్లా వయస్సు ఎంత?
1998 మే 28న జన్మించింది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు
ఫరియా అబ్దుల్లా ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
ఫరియా అబ్దుల్లా ఎక్కడ పుట్టింది?
కువైట్
ఫరియా అబ్దుల్లా ఉండేది ఎక్కడ?
హైదరాబాద్
ఫరియా అబ్దుల్లా ఏం చదివింది?
మల్టీమీడియా మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది
ఫరియా అబ్దుల్లా తల్లిదండ్రుల పేర్లు
M.J అబ్దుల్లా(వ్యాపారవేత్త), కౌసర్ సుల్తానా(డాక్టర్)
ఫరియా అబ్దుల్లా ఫెవరెట్ హీరో?
విజయ్ దేవరకొండ
ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం?
జాతిరత్నాలు, ఈ చిత్రంతో పాటు మసూధ, లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ సినిమాలో నటించింది.
ఫరియా అబ్దుల్లా అభిరుచులు?
మోడలింగ్, డ్యాన్సింగ్, పేయింటింగ్
ఫరియా అబ్దుల్లా ఇష్టమైన ఆహారం?
బిర్యాని
ఫరియా అబ్దుల్లాకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, రెడ్
ఫరియా అబ్దుల్లా పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
ఫరియా అబ్దుల్లా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్, స్టేజీ ఫర్ఫామెన్స్ ఇచ్చేది.
ఫరియా అబ్దుల్లా ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/fariaabdullah/?hl=en
https://www.youtube.com/watch?v=Xcc_cng9Cl8
ఫరియా అబ్దుల్లా మరికొన్ని విషయాలు
ఫరియా అబ్దుల్లా స్కూల్ డేస్‌లో బ్రైట్ స్టూడెంట్‌గా ఉండేది. భారతీయ విద్యా భవన్‌లో హెడ్ గర్ల్ ఆఫ్ స్కూల్‌గా ఎంపికైంది.ఫరియా కుడి చేతి మీద Veni Vidi Vici అనే పదాలు రాసి ఉంటాయి. వీటి అర్థం "నేను వచ్చాను, చూశాను, జయించాను"ఫరియా అబ్దుల్లాకు ఖాళీ సమయంలో కొత్త ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుందిఫరియాకు తన చెల్లెలు ఇనయా అబ్దుల్లా అంటే చాలా ఇష్టం
ఏప్రిల్ 13 , 2024
Aa Okkati Adakku Review: వింటేజ్ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్ కొట్టినట్లేనా?
నటీ నటులు : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు..
డైరెక్టర్ : మల్లీ అంకం
సినిమాటోగ్రాఫర్ : సూర్య
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : రాజీవ్ చిలక
నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 3 మే, 2024
అల్లరి నరేష్ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
గణపతి పాత్రలో అల్లరి నరేష్ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్ ఎక్స్‌ప్రెషన్స్, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే రాజ్ సుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అల్లరి నరేష్ నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 03 , 2024
టాప్ 30 గూగుల్‌లో వెతికిన తెలుగు నటీమణులు]50కి పైగా స్టేజి షోలు చేసిన ఫరియా, 2021 బ్లాక్‌బస్టర్ ‘జాతిరత్నాలు’లో చిట్టిగా మనసులు దోచింది. 2022లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా అంతగా ఆడకపోయినా..స్పెషల్ సాంగ్స్, సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఈమెను రేసులో నిలబెట్టాయి.31.ఫరియా అబ్దుల్లా
ఫిబ్రవరి 13 , 2023
Mathu Vadalara 2 Movie Review: కమెడియన్ సత్య వన్ మ్యాన్ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?
నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
రచన, దర్శకత్వం : రితేష్ రానా
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రాఫర్ : సురేష్ సారంగం
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
నిర్మాత : చిరంజీవి (చెర్రీ)
విడుదల తేదీ: సెప్టెంబర్ 13, 2024
శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్, రోహిణి, సునీల్ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్ తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. చాలిచాలని జీతంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డబ్బులు సరిపోకా వారు స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mathu Vadalara 2 Movie Review)
ఎవరెలా చేశారంటే
హీరోగా శ్రీ సింహా మంచి నటన కనబరిచాడు. కామెడీ, యాక్షన్ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతీ సీన్‌లో సత్య పక్కన ఉండటంతో అతడే హైలెట్ అయ్యాడు. ఈ సినిమాకు సత్యనే మెయిన్ హీరో అని చెప్పవచ్చు. తన పంచ్ డైలాగ్స్‌తో, కామెడీ టైమింగ్‌తో సత్య అదరగొట్టాడు. ముఖ్యంగా అతడి ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ‘సెక్సీ సైరన్’ అంటూ సినిమాలో అతడు చేసే హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు ఇందులో మంచి రోల్ దక్కింది. చిట్టి పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ రోల్ గుర్తుండిపోతుంది. అటు వెన్నెల కిషోర్ సైతం తనదైన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సునీల్, రోహిణి తదితర ముఖ్య తారాగారణం తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రితేశ్ రాణా కథలన్నీ కూడా సింపుల్‌గా డ్రగ్స్, గన్స్, డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈసారి కూడా దర్శకుడు అలాంటి స్టోరీనే ఎంచుకున్నారు. ఒక కిడ్నాపింగ్ డ్రామాకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంతో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్‌బాబుతో పాటు పలువురు స్టార్ హీరోలను రిఫరెన్స్‌లుగా తీసుకోవడం బాగా కలిసొచ్చింది. శ్రీ సింహా, సత్య పాత్రలను చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అలాగే తెరపై కనిపించే ప్రతీ క్యారెక్టర్ కొత్తగా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రథమార్థం మెుత్తాన్ని ఫన్ రైడ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
శ్రీ సింహా, సత్య కామెడీ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ సాగదీత సీన్స్‌ప్రిడిక్టబుల్ క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 13 , 2024

జాతి రత్నాలు
హాస్యం , డ్రామా
11 మార్చి 2021 న విడుదలైంది

బంగార్రాజు
హాస్యం , ఫాంటసీ
14 జనవరి 2022 న విడుదలైంది

బచ్చల మల్లి
20 డిసెంబర్ 2024 న విడుదలైంది

మత్తు వదలరా 2
13 సెప్టెంబర్ 2024 న విడుదలైంది

ఆ ఒక్కటీ అడక్కు
03 మే 2024 న విడుదలైంది

ది జెంగబూరు కర్స్
09 ఆగస్టు 2023 న విడుదలైంది
.jpeg)
రావణాసుర
07 ఏప్రిల్ 2023 న విడుదలైంది

జాతి రత్నాలు
11 మార్చి 2021 న విడుదలైంది
ఫారియా అబ్దుల్లా తల్లిదండ్రులు ఎవరు?
ఫరియా అబ్దుల్లా తల్లి పేరు కౌసర్ సుల్తానా, MJ అబ్దుల్లా
ఫారియా అబ్దుల్లా సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఫరియా అబ్దల్లా చెల్లెలు పేరు ఇనాయన సుల్తానా
ఫారియా అబ్దుల్లా ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలుచిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసినచిట్టి పాత్రకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ దక్కింది.
ఫారియా అబ్దుల్లా లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో ఫారియా అబ్దుల్లా ఫస్ట్ హిట్ మూవీ ఏది?
ఫారియా అబ్దుల్లా కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
ఫరియా అబ్దుల్లా తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేసింది. ముఖ్యంగా జాతిరత్నాలుసినిమాలో చిట్టి పాత్రతో పాటు ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో సిద్ధి పాత్రలు గుర్తింపు తెచ్చాయి.
ఫారియా అబ్దుల్లా బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Faria Abdullah best stage performance
ఫారియా అబ్దుల్లా బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Faria Abdullah best dialogues
ఫారియా అబ్దుల్లా రెమ్యూనరేషన్ ఎంత?
ఫరియా అబ్దుల్లా ఒక్కో చిత్రానికి రూ.75 LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.
ఫారియా అబ్దుల్లా కు ఇష్టమైన ఆహారం ఏంటి?
నాన్ వెజ్
ఫారియా అబ్దుల్లా కు ఇష్టమైన నటుడు ఎవరు?
ఫారియా అబ్దుల్లా ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, ఇంగ్లీష్, హిందీ
ఫారియా అబ్దుల్లా ఫెవరెట్ సినిమా ఏది?
ఫారియా అబ్దుల్లా ఫేవరేట్ కలర్ ఏంటి?
వైట్, రెడ్
ఫారియా అబ్దుల్లా కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
దుబాయ్
ఫారియా అబ్దుల్లా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
867K ఫాలోవర్లు ఉన్నారు
ఫారియా అబ్దుల్లా సోషల్ మీడియా లింక్స్
ఫారియా అబ్దుల్లా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఫారియా అబ్దుల్లా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.