• TFIDB EN
  • హరీష్ శంకర్
    ప్రదేశం: ధర్మపురి, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
    హరీష్‌ శంకర్‌ టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో 1979 మార్చి 31 జన్మించారు. బాల్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకల్లో పాల్గొన్నారు. సినిమాలపై ఆసక్తితో తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌, స్క్రీన్‌ రైటర్‌ చేశారు. 'షాక్' (2006) సినిమాతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 'మిరపకాయ్' (2011)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నారు. పవన్‌తో చేసిన 'గబ్బర్‌ సింగ్‌' చిత్రం హరీష్ శంకర్‌ను స్టార్‌ డైరెక్టర్‌గా మార్చింది. ఇప్పటివరకూ 8 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

    హరీష్ శంకర్ వయసు ఎంత?

    హరీష్‌ శంకర్‌ వయసు 45 సంవత్సరాలు

    హరీష్ శంకర్ ఎత్తు ఎంత?

    5' 7'' (170cm)

    హరీష్ శంకర్ అభిరుచులు ఏంటి?

    స్క్రిప్ట్‌ రైటింగ్‌, వాచింగ్‌ మూవీస్‌

    హరీష్ శంకర్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    హరీష్ శంకర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    కెరీర్‌ ప్రారంభంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. 'నిన్నే ఇష్టపడ్డాను', 'వీడే' చిత్రాలకు పని చేశారు.

    హరీష్ శంకర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగు 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరో 8 చిత్రాలకు స్క్రీన్‌ రైటర్‌గా వర్క్‌ చేశారు. నటుడిగా ఆరు సినిమాల్లో తళుక్కుమన్నారు.

    హరీష్ శంకర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    హరీష్ శంకర్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    హరీశ్‌ శంకర్‌కు విష్ణు ప్రసాద్‌ అనే సోదరుడు ఉన్నాడు. అలాగే ఒక చెల్లెలు కూడా ఉన్నారు.

    హరీష్ శంకర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    మిరపకాయ్‌', 'గబ్బర్‌ సింగ్‌' వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను తెరకెక్కించి పాపులర్‌ డైరెక్టర్ అయ్యారు.

    హరీష్ శంకర్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'షాక్‌'. రవితేజ, జ్యోతికజంటగా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

    తెలుగులో హరీష్ శంకర్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన హరీష్ శంకర్ తొలి చిత్రం ఏది?

    గబ్బర్‌ సింగ్‌, దువ్వాడ జగన్నాథం చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.

    హరీష్ శంకర్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.10-15 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.

    హరీష్ శంకర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    హరీష్ శంకర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    హరీష్ శంకర్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    హరీష్ శంకర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌, గ్రీన్‌

    హరీష్ శంకర్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    హరీష్ శంకర్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    మాల్దీవులు

    హరీష్ శంకర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    177K ఫాలోవర్లు ఉన్నారు.

    హరీష్ శంకర్ సోషల్‌ మీడియా లింక్స్‌

    హరీష్ శంకర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డ్‌ - 2012

      గబ్బర్‌ సింగ్‌ చిత్రానికి గాను ఉత్తమ డైరెక్టర్‌ ఎంపిక

    హరీష్ శంకర్ కు సంబంధించిన వివాదాలు?

    - గతంలో హరీశ్‌ శంకర్‌, కెమెరామెన్‌ ఛోటా కె. నాయుడు మధ్య నడిచిన మాటల యుద్ధం తరచూ వివాదస్పదమైంది. - గద్దలకొండ గణేష్ చిత్రానికి తొలుత 'వాల్మీకీ' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయడంపై వివాదం రాజుకుంది. - కేజీఎఫ్‌ చిత్రంపై కామెంట్స్‌ చేసిన డైరెక్టర్‌ వెంకటేష్‌ మహాకు పరోక్షంగా హరీష్‌ శంకర్‌ క్లాస్‌ పీకడం చర్చనీయాంశమైంది.

    హరీష్ శంకర్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    పొలిటికల్‌గా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అయితే తాను తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌' చిత్రంలో జనసేన పార్టీకి ప్రయోజనకరంగా డైలాగ్ రాశారు. ఆ పార్టీకి సానుభూతి పరుడిగా ఉన్నారు.
    హరీష్ శంకర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే హరీష్ శంకర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree