• TFIDB EN
  • హారిస్ జయరాజ్
    ప్రదేశం: చెన్నై, తమిళనాడు, భారతదేశం
    హారిస్ జయరాజ్ దక్షిణ భారత దేశంలో ప్రముఖ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చి కొద్దికాలంలోనే ప్రముఖ సంగీతదర్శకులలోఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన తండ్రి ఎస్.ఎమ్. జయకుమార్ కూడా సినిమాలలో గిటారిస్టుగాను, సంగీతకారునిగాను పనిచేశాడు. తొలు కెరీర్ ఆరంభంలో ఏ.ఆర్. రెహమాన్‌ దగ్గర అనుచరుడిగా పనిచేశాడు. 2005లో అపరిచితుడు, గజిని, తొట్టిజయ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వాసు, ఘర్షణ, సైనికుడు, అపరిచితుడు, ఆరెంజ్, సూర్య s/o కృష్ణన్, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామని పురస్కారం అందుకున్నాడు. ఉత్తమ సంగీత దర్శకుడిగా 5 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు.


    @2021 KTree