• TFIDB EN
  • హెబ్బా పటేల్
    జననం : జనవరి 06 , 1989
    ప్రదేశం: ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం
    హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడో రకం ఆడో రకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్‌ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ఇక కన్నడలో ఆమె తొలిచిత్రం 'అధ్యక్ష' కాగా.. తమిళ్‌లో 'తిరుమనం ఎనుం నిఖా' మొదటి సినిమా.

    హెబ్బా పటేల్ వయసు ఎంత?

    హెబ్బా పటేల్‌ వయసు 36 సంవత్సరాలు

    హెబ్బా పటేల్ ఎత్తు ఎంత?

    5' 5'' (162cm)

    హెబ్బా పటేల్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్, స్విమ్మింగ్

    హెబ్బా పటేల్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యూయేషన్‌

    హెబ్బా పటేల్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సోఫియా కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌, ముంబయి

    హెబ్బా పటేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    రాజ్‌తరుణ్‌

    హెబ్బా పటేల్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-28-33

    హెబ్బా పటేల్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకూ 19 చిత్రాల్లో నటించింది.

    హెబ్బా పటేల్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    మస్తిస్‌ (2020), వ్యవస్థ (2023)

    హెబ్బా పటేల్ Hot Pics

    Images

    Hebah Patel Hot images

    Images

    Hebah Patel Hot images

    హెబ్బా పటేల్ In Saree

    Images

    Hebah Patel Hot images

    Images

    Hebah Patel Hot images

    హెబ్బా పటేల్ In Half Saree

    Images

    Hebah Patel In Half Saree

    Images

    Hebah Patel

    హెబ్బా పటేల్ In Ethnic Dress

    Images

    Hebah Patel In Ethnic Wear

    Images

    Hebah Patel Images in Traditional Dress

    హెబ్బా పటేల్ Childhood Images

    Images

    Hebah Patel Childhood Images

    హెబ్బా పటేల్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Hebah Patel Hot images

    Images

    Hebah Patel

    Viral Videos

    View post on Instagram
     

    Hebah Patel Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Hebah Patel Hot Insta Reel

    హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా? హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్‌ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది? 1989,  జనవరి 6న జన్మించింది హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా? అలా ఎలా(2014) తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా కుమారి 21F(2015) హెబ్బా పటేల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది? ముంబై హెబ్బా పటేల్ అభిరుచులు? డ్యాన్సింగ్, స్విమ్మింగ్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ హెబ్బా పటేల్‌కు  ఇష్టమైన కలర్ ? వైట్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్, మహేష్ బాబు హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ihebahp/?hl=en https://www.youtube.com/watch?v=kSipyGA5qC0
    ఏప్రిల్ 02 , 2024
    Hebah Patel: బొద్దుగా ఉన్నా ముద్దుగానే కనిపిస్తున్న హెబ్బా పటేల్.. ఏమాత్రం అందం తగ్గలేదుగా..! కుమారి 21ఎఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన నటి హెబ్బా పటేల్. ఇటీవల టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ కోసం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఈవెంట్‌కి హాజరై ర్యాంప్ వాక్ చేసింది. ఈ మేరకు హెబ్బా ఫొటోలు వైరల్ అయ్యాయి. వరుసగా వెబ్‌సిరీస్‌లు చేస్తూ హెబ్బా పటేల్ బిజీబిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాల్లో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. కుమారి 21ఎఫ్ సినిమా సమయంలో నాజూకుగా కనిపించిన ఈ చిన్నది రాను రాను బొద్దుగా తయారైంది. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలోనూ కాస్త బొద్దుగా కనిపించింది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లోనూ ‘హెబ్బా పటేల్’ బొద్దుగానే కనిపిస్తోంది. థైస్ అందాలను చూపిస్తూ ఫొటోలు దిగింది. కుమారి 21ఎఫ్ సినిమా తర్వాత ఈ అమ్మడికి ఆశించిన మేర విజయం లభించలేదు. కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తరువాత సినిమాలు పరాజయం చవిచూశాయి. అందం, నటన పరంగా ప్రేక్షకులను మెప్పించిన ఈ నటి స్టార్ హీరోయిన్‌గా ఎదగలేక పోయింది. హెబ్బా పటేల్ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తోంది. 2014లోనే ‘తిరుమనం ఎనుం నిఖా’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడలోనూ అధ్యక్ష మూవీలో తళుక్కుమంది.
    ఫిబ్రవరి 23 , 2023
    Honeymoon Express Review: బోల్డ్‌ కంటెంట్‌ ఫుల్లు.. అవి మాత్రం నిల్లు.. ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రివ్యూ! నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు డైరెక్టర్‌ : బాల రాజశేఖరుని సంగీతం : కల్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం : ఆర్‌.పి పట్నాయక్‌ నిర్మాత : కేకేఆర్‌, బాలరాజు విడుదల తేదీ: 21 జూన్‌, 2024 చైతన్యరావు (Chaitanya Rao), హెబ్బా పటేల్‌ (Hebah Patel) ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందా? చైతన్యరావు, హెబ్బాపటేల్‌కు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. కథేంటి ఇషాన్‌ (చైతన్య రావు), సోనాలి(హెబ్బా పటేల్) ఒక చిన్న యాక్సిడెంట్‌ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే వీళ్లిద్దరి ఆలోచన విధానం వేర్వేరుగా ఉంటాయి. సోనాలి చాలా ఫాస్ట్‌ అయితే.. ఇషాన్ నిదానం. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఏదోక  సమస్యలు వస్తుంటాయి. ఓ రోజు వీరికి సీనియర్‌ కపుల్స్‌ పరిచయమై హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే గేమ్‌ గురించి చెబుతారు. అలా వారిని ఓ రిసార్ట్‌కు పంపిస్తారు. ఇంతకీ హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ అంటే ఏంటి? దాని వల్ల ఇషాన్‌ - సోనాలి మధ్య గొడవలు సద్దుమణిగాయా? వీరి శృంగార జీవితం బాగుపడిందా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే కొన్ని రోజులుగా వరుస చిత్రాలతో అలరిస్తున్న చైతన్య రావు.. ఈ సినిమాలోనూ చక్కటి నటన కనబరిచాడు. రెండు వేరియేషన్స్‌లో నటించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ మరోమారు తన అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వీరి మధ్య కెమెస్ట్రీ యూత్‌ను మెప్పిస్తుంది. సీనియర్‌ జంటగా తనికెళ్ల భరణి, సుహాసిని ఎప్పటిలాగే తమ సెటిల్డ్‌ నటనతో అలరించారు. థియేటర్లలో నవ్వులు పూయించారు. కథ మెుత్తంగా ప్రధానంగా ఈ నలుగురు మధ్యే సాగడం గమనార్హం. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే పెళ్లైన కొత్త జంట కొద్ది రోజులకే విడిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. యువ జంటలు చిన్న చిన్న పొరపొచ్చాలకే విడాకుల వరకూ వెళ్తున్నారు. ఈ అంశాన్నే కథాంశంగా తీసుకొని దర్శకుడు బాల శేఖరుని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకోవాలన్న సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కథ చెప్పే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. సైన్స్‌ ఫిక్షన్‌, టైమ్‌ ట్రావెల్‌ అంటూ కథను ఎటెటో తీసుకెళ్లి కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేశారు. యూత్‌ను అట్రాక్ట్‌ చేస్తూ తీసిన కొన్ని సీన్లు మరీ బోల్డ్‌గా అనిపిస్తాయి. వల్గారిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ మూవీకి కనెక్ట్‌ కాకపోవచ్చు. తమ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్లే ఫ్యూచర్‌ నుంచి రావడం అనేది కాస్త కొత్తగా అనిపిస్తుంది.  టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్‌ అందించిన పాటలు బాగున్నాయి. ఆర్‌.పి పట్నాయక్ అందించిన నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన పనిని ఇంకాస్త బెటర్‌గా నిర్వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ చైతన్య రావు, హెబ్బా పటేల్‌ నటనసమకాలిన అంశాలు ఉండటంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథనం, స్క్రీన్‌ప్లేసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5   https://telugu.yousay.tv/en/do-you-know-these-top-secrets-about-hebah-patel.html
    జూన్ 21 , 2024
    Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా? నటీనటులు : చేతన్ కృష్ణ, చేతన్ మద్దినేని, వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు. దర్శకత్వం :  సాయి కిషోర్ మచ్చా సంగీతం:  గోపీ సుందర్  సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి నిర్మాత : ఎం.ఎస్‌ రామ్ కుమార్  విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 చేతన్ మద్దినేని (Chetan Maddineni), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam Review). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పిందించిందా? ఇప్పుడు పరిశీలిద్దాం.  కథేంటి కార్తిక్‌ (చేతన్ మద్దినేని)కు తన తండ్రి రామరాజు (సాయికుమార్‌) అంటే చాలా ఇష్టం. నాన్నపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తుంటాడు. అటు రామరాజు సైతం కొడుకుపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు. ఏ విషయాన్నైనా ఇద్దరు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ఓ రోజు సుహానా (హెబ్బా పటేల్‌)ను చూసి కార్తిక్‌ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్‌ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న (రామరాజు), అతడి తమ్ముడు (బెనర్జి)తో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు వచ్చింది? కార్తీక్‌ వాటిని ఎలా పరిష్కరించాడు? చివరికీ సుహానా - కార్తిక్‌ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరో కార్తిక్‌ పాత్రలో చేతన్‌ కృష్ణ పర్వాలేదనిపించాడు. నటన పరంగా గతంతో పోలిస్తే పరిణితి చూపించాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో మరింత వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో అతడి నటన తేలిపోయింది. ఇక హీరోయిన్‌ సుహానా పాత్రలో హెబ్బా పటేల్ ఎప్పటిలాగే మెప్పించింది. చాలా రోజుల తర్వాత కమర్షియల్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి జోడి బాగా కుదిరింది. హీరో కజిన్‌గా సుహాస్‌ పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతడి కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితోపాటు సాయికుమార్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గిరిధర్‌ తదిరులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సాయికిషోర్‌ మచ్చా ఎంచుకున్న కథ సాదాసీదాగా ఉంది. అయితే మంచి రొమాంటిక్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం మాత్రం అభినందనీయం. లవ్‌ట్రాక్‌ ఉన్నా ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తో పాటు ఫ్యామిలీ అనుబంధాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, వారి మధ్య వచ్చే గొడవలు, అలకలు చూపించారు. ఇవి కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రవీణ్‌ చేసే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మార్చారు డైరెక్టర్‌. హీరోయిన్ ఫాదర్‌ గురించి తెలిసి హీరో షాకవ్వడం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌ మెుత్తాన్ని వెన్నెల కిషోర్‌ తన భుజాలపై నడిపించాడు. స్లో న్యారేషన్‌, గొప్ప క్యాస్టింగ్‌ ఉన్నా సరిగా వాడుకోకపోవడం, అక్కడక్కడ హీరో ఇచ్చే అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాలకు వస్తే గోపి సుందర్‌ అందించిన మ్యూజిక్‌ ప్రధాన అసెట్ అయ్యింది. పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొత్త ఫీల్‌ను అందించింది. అలాగే సిద్ధార్థ్‌ రామస్వామి కెమెరా వర్క్‌ మెప్పించింది. విజువల్స్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటిర్‌ సినిమాను మరింత షార్ట్‌గా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్ కామెడీఫ్యామిలీ ఎమోషన్స్సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటీన్ స్టోరీరెగ్యులర్‌ లవ్‌ట్రాక్‌స్లో న్యారేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    నవంబర్ 08 , 2024

    హెబ్బా పటేల్ తల్లిదండ్రులు ఎవరు?

    హెబ్బా తల్లి పేరు నజ్‌మున్నిసా పటేల్‌.. తండ్రి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు.

    హెబ్బా పటేల్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    హెబ్బా పటేల్‌కు ఒక సోదరుడు (హదిల్‌ పటేల్‌), సోదరి (హన్నా పటేల్‌) ఉన్నారు.

    హెబ్బా పటేల్ Family Pictures

    Images

    Hebah Patel

    హెబ్బా పటేల్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    కుమారి 21F చిత్రంతో హెబ్బా పటేల్‌ ఫేమస్‌ అయ్యింది.

    హెబ్బా పటేల్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    అధ్యక్ష' (కన్నడ) చిత్రంతో ఆమె తెరంగేట్రం చేసింది. తెలుగులో 'అలా ఎలా' ఆమెకు తొలి చిత్రం.

    తెలుగులో హెబ్బా పటేల్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    కుమారి 21F

    హెబ్బా పటేల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఓదెల రైల్వే స్టేషన్‌లో రాధ పాత్ర

    హెబ్బా పటేల్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    హెబ్బా పటేల్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    హెబ్బా పటేల్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌ వెజ్‌

    హెబ్బా పటేల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సల్మాన్ ఖాన్, మహేష్ బాబు

    హెబ్బా పటేల్ కు ఇష్టమైన నటి ఎవరు?

    దీపికా పదుకొనే

    హెబ్బా పటేల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు, తెలుగు

    హెబ్బా పటేల్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    పింక్‌, వైట్‌

    హెబ్బా పటేల్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    హెబ్బా పటేల్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    హెబ్బా పటేల్ ఆస్తి.. రూ.5-8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

    హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    1.7 మిలియన్‌ ఫాలోవర్లు

    హెబ్బా పటేల్ సోషల్‌ మీడియా లింక్స్‌

    హెబ్బా పటేల్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సంతోషం ఫిల్మ్‌ అవార్డ్‌ - 2016

      'అలా ఎలా', 'కుమారి 21ఎఫ్‌' చిత్రాలకు గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా సంతోషం ఫిల్మ్‌ అవార్డ్‌ అందుకుంది.

    • జీ తెలుగు, టీవీ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌

      'కుమారి 21ఎఫ్‌' చిత్రానికి గాను జీ తెలుగు, టీవీ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ అందుకుంది.

    హెబ్బా పటేల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే హెబ్బా పటేల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree