
హోవిక్ కీచ్కేరియన్
జననం : నవంబర్ 14 , 1972
ప్రదేశం: బీరూట్, లెబనాన్
హోవిక్ కీచ్కేరియన్, 1972 నవంబర్ 14న బెయ్రూట్, లెబనాన్‌లో జన్మించారు, ఆయన తన కెరీర్‌ను బాక్సర్‌గా ప్రారంభించి, తరువాత నటనలోకి మారారు. ఆయన 2000ల ఆరంభంలో చలనచిత్ర కెరీర్‌ను ప్రారంభించారు, "స్కార్పియన్ ఇన్ లవ్" (2013) చిత్రంలో నటించారు, దీనికి గోయా ఉత్తమ నూతన నటుడు నామినేషన్ అందుకున్నారు. "మనీ హెయిస్ట్" (లా కాసా డీ పాపెల్) సిరీస్‌లో బొగొటా పాత్రతో అంతర్జాతీయంగా ప్రసిద్ధుడయ్యారు. ఆయన నటన చిత్రాలు మరియు టెలివిజన్ షోలలో వివిధ పాత్రలతో కొనసాగుతుంది.
కథనాలు

IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్ హవా.. ఆ మూవీస్ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే!
ఐఎండీబీ మోస్ట్ పాపులర్ మూవీస్ - 2024 జాబితాలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
https://twitter.com/IMDb_in/status/1815619130948771914
2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు
IMDB రిలీజ్ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్ దేవగన్ నటిస్తున్న ‘సింగం అగైన్’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా', 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
https://twitter.com/IMDb_in/status/1815645100988379418
జూలై 24 , 2024
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్ ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. తారక్ గత కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉంటూ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ‘వార్ 2’కు సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
సిక్స్ ప్యాక్‌లో తారక్!
‘వార్ 2’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ ఫైట్ సీన్ వుండనుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫైట్ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు గ్రాండ్ ఎంట్రీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ YRF (Yash Raj Films) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘వార్ 2’లో మరో బాలీవుడ్ బ్యూటీ!
‘వార్ 2’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరోయిన్‌ను కత్రీనా కైఫ్ ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమే మేకర్స్ సంప్రదించగా ఇందుకు కత్రీనా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హృతిక్, తారక్ లాంటి టాప్ డ్యాన్సర్లు ఉన్న సినిమాలో ఐటెం సాంగ్‌ను కత్రినా చేస్తుందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే అని చెప్పవచ్చు.
దేవర నుంచి ఫస్ట్ సింగిల్
ప్రస్తుతం తారక్ 'వార్ 2'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మే 20న తారక్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఒక రోజు ముందే ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. మే 19న సా. 7.02 ని.లకు ఈ పాట విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు పోస్టర్‌ను సైతం రిలీజ్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/UrsVamsiShekar/status/1791707613316763915
మే 18 , 2024
Jr NTR తీరులో మార్పు.. హిందీ స్టార్లతో కలిసి నైట్ డేట్!
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood)లో బిజీ బిజీగా ఉన్నాడు. ముంబయిలో ‘వార్ 2’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న తారక్.. నిన్న రాత్రి బాలీవుడ్ స్టార్ హీరోలతో హల్‌చల్ చేశాడు. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కల్చర్‌లోకి తారక్!
నైటౌట్లు, డిన్నర్ పార్టీలకు దూరంగా ఉండే తారక్.. ముంబయిలో ఈ నియమానికి చెక్ పెట్టినట్లు ఉన్నాడు. ఆదివారం రాత్రి.. తారక్ పూర్తిగా బాలీవుడ్ కల్చర్‌లోకి మారిపోయాడు. హిందీ స్టార్లు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt), వార్-2 హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), సబా ఆజాద్ (Sabha Ajad), కరణ్ జోహార్ (Karan Johar)లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్‌కు వెళ్లాడు. తారక్‌తో పాటు అతడి భార్య ప్రణతి కూడా ఈ పార్టీలో పాల్గొంది. స్టార్ హీరోలందర్నీ ఒక్కసారిగా బయట చూసి ముంబయి ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఎగబడ్డారు. వారిని తమ కెమెరాల్లో బందించేందుకు ప్రయత్నించారు. అటు స్థానికులు సైతం తారక్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
https://twitter.com/i/status/1784800640054784018
https://twitter.com/i/status/1784782516681073070
https://twitter.com/i/status/1784737249713619077
https://twitter.com/i/status/1784857172771279114
60 రోజుల కాల్ షీట్స్!
వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ కోసం తారక్ 60 రోజులు కేటాయించినట్లు సమాచారం. కాగా, అంతకుముందు వచ్చిన వార్ చిత్రంలో హృతిక్‌తో పాటు మరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాకు మించి ‘వార్ 2’ ఉండబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని బయట రూమర్లు ఉన్నాయి.
తారక్ సీరియస్
ఇటీవల ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు తారక్ వెళ్తుండగా బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు అతడ్ని చుట్టుముట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా కెమెరాల్లో తారక్‌ను బందించబోయారు. దీంతో తారక్‌కు కోపం చిర్రెత్తుకొచ్చింది. ‘ఓయ్..’ అంటూ ఒక్కసారిగా ఫొటోగ్రాఫర్లపై కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్‌తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు. అయితే ‘వార్ 2’లో తన లుక్‌ను రివీల్ చేయకుండా తారక్ జాగ్రత్తపడుతున్నాడు. అయినప్పటికీ ఆయనకు సంబంధించిన ఫొటోలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడంతో తారక్‌కు కోపం వచ్చింది.
https://twitter.com/i/status/1783491705049886808
ఏప్రిల్ 29 , 2024
నేహా శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
నేహా శర్మ తెలుగులో చిరుత చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం హిట్ అయినా నేహా శర్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత కుర్రాడు చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో హిందీ బాట పట్టింది. యంగిస్థాన్, ముబారకన్ వంటి హిందీ చిత్రాల్లో మెప్పించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న నేహా శర్మ గురించి(Some Lesser Known Facts about Neha Sharma) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
నేహా శర్మ ఎప్పుడు పుట్టింది?
1987, నవంబర్ 21న జన్మించింది
నేహా శర్మ తెలుగులో నటించిన తొలి సినిమా?
చిరుత
నేహా శర్మ ఎత్తు ఎంత?
5 అడుగుల 6అంగుళాలు
నేహా శర్మ ఎక్కడ పుట్టింది?
బాగల్ పూర్, బిహార్
నేహా శర్మ అభిరుచులు?
వంట చేయడం
నేహా శర్మకు ఇష్టమైన ఆహారం?
క్యారెట్ కేక్
నేహా శర్మకు ఇష్టమైన కలర్ ?
బ్లాక్
నేహా శర్మకు ఇష్టమైన హీరో?
హృతిక్ రోషన్
నేహా శర్మ పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
నేహా శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
నేహా శర్మ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/nehasharmaofficial/?hl=en&img_index=1
https://www.youtube.com/watch?v=cQPgwBRqe-c
ఏప్రిల్ 04 , 2024

రెడ్ క్వీన్
29 ఫిబ్రవరి 2024 న విడుదలైంది
హోవిక్ కీచ్కేరియన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే హోవిక్ కీచ్కేరియన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.