• TFIDB EN
  • జిస్ జాయ్
    ప్రదేశం: వజక్కలా, కొచ్చి, కేరళ
    జిస్ జాయ్ మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ డబ్బింగ్ కళాకారుడు, చిత్ర రచయిత, దర్శకుడు మరియు గీత రచయిత. సైకిల్ థీవ్స్ అనే మలయాళ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతను అల్లు అర్జున్ కోసం డబ్బింగ్ చెప్పాడు, తరువాతి చేసిన సినిమాల తెలుగు నుండి మలయాళం డబ్బింగ్ వెర్షన్ కోసం.
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి! సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్‌ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్‌ సంగీతం సమకూర్చారు.&nbsp; ఉత్సవం (Utsavam) దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆయ్‌ (Aay) నార్నే నితిన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్‌’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.&nbsp; తలవన్‌ (Thalavan) జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో బిజు మేనన్‌, ఆసిఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్‌’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies&nbsp;MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
    సెప్టెంబర్ 09 , 2024
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం! మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌' (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ అయింది. స్టాలిన్ చిత్రం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ జోడీ ఎలాంటి కెమిస్ట్రీని స్క్రీన్‌పై పండిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే విశ్వంభర సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోనుందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవి 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ గెటప్‌లో చిరంజీ మునుపెన్నడు కనిపించని లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని టాక్. ప్లాష్ బ్యాక్ నేపథ్యంగా వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ విజువ్ వండర్స్‌గా ఉంటాయని సమాచారం. మరోవైపు రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్  సైతం చేశాడు. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే పాత్రను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్‌తో పాటుగా ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని చిన్నపాటి లీక్స్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని క్రేజీ గెటప్‌లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రం కోసం ప్రత్యేకంగా తన బాడీని టోన్ చేస్తున్నారు. యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువసేపూ వ్యయామం చేస్తున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.  ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.
    ఫిబ్రవరి 26 , 2024
    Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా? నటీనటులు : విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్‌ వెరేళ్ల తదితరులు రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా సంగీతం : లిజో కె. జోస్‌ ఎడిటర్‌ : అమర్‌ రెడ్డి కుడుముల నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి విడుదల తేదీ: 20-09-2024 ‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం. కథేంటి కర్నూల్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్‌) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్‌ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్‌ వార్‌ ఫేర్‌ను కర్నూల్‌ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్‌ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్‌ ఇంకాస్త బాగా ఎలివేట్‌ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విశ్వాంత్‌ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 20 , 2024
    Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే? నటులు: మహేష్‌ బాబు, సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ (డబ్బింగ్ చెప్పినవారు) దర్శకత్వం: బబ్యారీ జెన్ కిన్స్ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ లక్ట్సాన్‌ ఎడిటింగ్‌: జోయ్‌ మెక్‌మిలన్‌ సంగీతం: డేవ్‌ మెట్జర్‌, నికోలక్‌ బ్రిటెల్‌, లిన్‌ మాన్యుల్‌ మిరాండ నిర్మాతలు: అడెలె రొమన్‌స్కీ, మార్క్‌ కారియాక్‌ నిర్మాణ సంస్థ: డిస్నీ విడుదల: డిసెంబర్‌ 20, 2024&nbsp; హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King Review In Telugu) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేష్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పాడు. అలాగే సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్‌ కూడా పలు తమ స్వరాన్ని అందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 20న ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మహేష్‌ డబ్బింగ్‌ ఆకట్టుకుందా? యానిమేషన్‌ వర్స్క్‌ మెప్పించాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఓవర్) చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ పెరుగుతాడు. ‌దూరంగా ఉండే మిలేలే అనే స్వర్గం లాంటి రాజ్యం గురించి తరచూ వింటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓరోజు వరదల రావడంతో ముఫాసా కొట్టుకుపోతాడు. అలా టాకా (సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌) ఉన్న రాజ్యానికి వస్తాడు. ముఫాసా రాకను టాకా తండ్రి ఒప్పుకోడు. కానీ టాకా తన అన్నలా పెంచుకుందామని పట్టుబడతాడు. టాకా తల్లి కూడా సపోర్ట్ చేయడంతో ముఫాసా వారి ఫ్యామిలీలో భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై తెల్ల సింహాలు దాడి చేయగా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. అది తెలిసిన తెల్ల సింహాల రాజు కిరోస్‌ ముఫాసా ఉంటున్న రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకొని ముఫాసా, టాకాలు చిన్నప్పుడు విన్న మిలేలే రాజ్యం వైపు పయనమవుతారు. ఈ ప్రయాణంలో వాటికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ముఫాసాను చంపడానికి కిరోస్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ముఫాసాకు టాకా ఎందుకు ఎదురు తిరిగాడు? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ.  డబ్బింగ్‌ ఎలా ఉందంటే ముఫాసా: ది లయన్‌ కింగ్‌ (Mufasa: The Lion King Review) లైవ్‌ యానిమేషన్‌ చిత్రం. ఇందులో నటీనటులు కనిపించరు వారు చెప్పిన వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది. డబ్బింగ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగులో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ ఓవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఫాసా పాత్రకు మహేష్‌ డబ్బింగ్‌ బాగా సెట్ అయ్యింది. తెరపై సింహాం ప్లేస్‌లో మహేష్‌ను ఊహించుకునేంతలా అతడు తన వాయిస్‌తో మెస్మరైజ్‌ చేశాడు. సెటైర్లు, పంచ్‌లు, గంభీరమైన డైలాగ్స్‌తో మహేష్ అదరగొట్టాడు. టాకా పాత్రకు నటుడు సత్యదేవ్‌ వాయిస్‌ బాగా సెట్‌ అయ్యింది. మంచి సోదరుడిగా, ఆ తర్వాత విలన్లతో చేతులు కలిపిన వెన్నుపోటు దారుడిగా వాయిస్‌లో మంచి వేరియేషన్స్‌ ప్రదర్శించాడు. అటు పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పగా, టిమోన్‌ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు. వారిద్దరు తమ వాయిస్‌తో కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలకు డబ్బింగ్‌ చెప్పినవారు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. https://twitter.com/DisneyStudiosIN/status/1867064334456615039 డైరెక్షన్ ఎలా ఉందంటే 2019లో వచ్చిన 'ది లయన్‌ కింగ్‌' చిత్రానికి ప్రీక్వెల్‌గా దర్శకుడు బ్యారీ జెన్ కిన్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ముఫాసా రాజు కాగా అతడి కొడుకు సింబా చుట్టూ కథ తిరిగింది. తాజా చిత్రంలో ముఫాసా ఎలా రాజు అయ్యాడు? టాకా అలియాస్‌ స్కార్‌ ఎవరు? అనేది చూపించాడు. స్టోరీ పరంగా చూస్తే పెద్దగా మెరుపులు కనిపించవు. కానీ విజువల్స్‌, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్‌లో ఆసక్తి రగిలించాడు దర్శకుడు. ముఖ్యంగా మిలేలే అనే స్వర్గం లాంటి ప్రపంచంలో ప్రేక్షకులను లీనం చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా బాగున్నాయి. ముఫాసా, టాకా సోదరుల కథ ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేలా ఉండటం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. అయితే రొటీన్‌ స్టోరీ, ఊహాజనీతమైన కథనం మైనస్‌గా చెప్పవచ్చు. పెద్దలు, మాస్‌ ఆడియన్స్‌ సంగతి ఏమోగానీ, చిన్నారులకు మాత్రం ముఫాసా పక్కా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చెప్పవచ్చు. రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్లి వస్తారు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; టెక్నికల్‌గా హాలీవుడ్ స్టాండర్డ్స్ (Mufasa: The Lion King Review) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ నెక్స్ట్‌ లెవల్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌ టాప్‌ నాచ్‌ పనితీరు కనబరిచింది. నిజమైన సింహాలను తెరపై చూస్తున్నట్లుగా భ్రమను కల్పించడంలో వారు పూర్తిగా సక్సెస్‌ అయ్యారు. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో డిస్నీ ఎక్కడా రాజీపడలేదు. చాలా నాణ్యమైన గ్రాఫిక్స్‌ను అందించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ మహేష్‌బాబు డబ్బింగ్‌గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ మాయజాలంసంగీతం, సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ ఊహాజనితంగా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    డిసెంబర్ 20 , 2024
    జిస్ జాయ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే జిస్ జాయ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree