• TFIDB EN
  • కె. రాఘవేంద్రరావు
    ప్రదేశం: కోలవెన్ను, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
    కోవెలమూడి రాఘవేంద్రరావు దర్శకేంద్రుడిగా తెలుగు నాట ప్రసిద్ధి చెందారు. తెలుగులో రొమాంటిక్ సినిమాలకు బెంచ్‌ మార్క్ సెట్ చేసిన ఆయన.. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. శోభన్ బాబు నటించిన 'బాబు'(1975) చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. అడవిరాముడు, పదహారేళ్ల వయసు, వేటగాడు, కొండవీటి సింహం, దేవత, జస్టిస్ చౌదరి, జానకి రాముడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, అన్నమయ్య, పెళ్లిసందడి, శ్రీరామదాసు, సాహసవీరుడు సాగరకన్య బ్లాక్ బాస్టర్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్, శ్రీదేవి వంటి వారు ఆయన దర్శకత్వంలోనే వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన తెలుగుతో పాటు హిమ్మత్ వాలా, తోఫా లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో అగ్రహీరోలందరితోను సినిమాలు తీసి వారికి హిట్స్ అందించారు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశారు. ఇతని కుమారుడు ప్రకాష్ కోవెలమూడి కూడ నటుడిగా, సినీ నిర్మాతగ పేరుపొందారు. రాఘవేంద్రరావు మొత్తం ఎనిమిది నంది పురస్కారాలు, ఒక IIFA పురస్కారం, ఒక సైమా అవార్డు, ఐదు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు, రెండు సార్లు 'సినీ మా' అవార్డులు అందుకున్నారు.
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?

    కె. రాఘవేంద్రరావు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే కె. రాఘవేంద్రరావు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree