• TFIDB EN
  • కైకాల సత్యనారాయణ
    ప్రదేశం: కవుతారం, కృష్ణా జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
    కైకాల సత్యనారాయణ తెలుగులో లెజెండరీ నటుల్లో ఒకరు. ఆయన 60 ఏళ్ల సినీ జీవితంలో 700కు పైగా సినిమాల్లో నటించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద వంటి వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. సిపాయి కూతురు(1959) అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. సత్యనారాయణ అనేక చిత్రాలలో నటించగా, ముఖ్యంగా "కురుక్షేత్రం" (1977), "సోగ్గాడు" (1975), "పాతాళ భైరవి" (1951), యమగోల, యమలీల, దాన వీర శూర కర్ణ, భైరవ ద్వీపం, సాహసవీరుడు - సాగరకన్య, ఘటోత్కచుడు వంటి చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందారు.
    కైకాల సత్యనారాయణ నటించిన టాప్ 15 చిత్రాలుEditorial List
    కైకాల సత్యనారాయణ నటించిన టాప్ 15 చిత్రాలు


    @2021 KTree