• TFIDB EN
  • కోడి రామకృష్ణ
    ప్రదేశం: పాలకొల్లు, మద్రాసు ప్రావిన్స్, డొమినియన్ ఆఫ్ ఇండియా
    కోడి రామకృష్ణ తెలుగులో దిగ్గజ దర్శకుల్లో ఒకరు. తెలుగు సినిమాలో VFXను పరిచయం చేసింది విఠలాచార్య అయితే వాటిని అత్యున్నత స్థాయిలో వాడుకుంది మాత్రం కోడి రామకృష్ణనే అని చెప్పాలి. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రం ద్వారా డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన దాసరి నారాయణరావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. చాలా సినిమాల్లో సహాయ దర్శకుడిగా పనిచేశారు. గూఢచారి నెం.1, రిక్షావోడు, అంజి, మంగమ్మగారి మనవడు, దేవి, అమ్మోరు, దేవుళ్లు, దేవీపుత్రుడు, అరుంధతి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. దర్శకడిగా ఆయన 100కి పైగా చిత్రాలు తీశారు. అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసినవారిలో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు తర్వాత కోడి రామకృష్ణ ఉన్నారు. దర్శకుడిగా 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.


    @2021 KTree