• TFIDB EN
  • ఎంఎం కీరవాణి
    కీరవాణిగా ప్రసిద్ధి చెందిన కోడూరి మరకతమణి కీరవాణి భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు. ప్రధానంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సంగీతం అందించారు. ఆయన సినీ రంగంలో MM కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో MM క్రీమ్‌గా ప్రసిద్ధి చెందాడు. తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. మనసు - మమత(1989) చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అయితే ఆ తర్వాత ఆయనకు అవకాశాలు పెద్దగా రాలేదు. రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన క్షణక్షణం(1991) చిత్రం ఆయనకు బ్రేక్ ఇచ్చింది. అన్నమయ్య, సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, బాహుబలి 1,2, RRR, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్ళి సందడి, సుందరకాండ, విక్రమార్కుడు, సై, మర్యాద రామన్న వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. కీరవాణి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించాడు. అలాగే రాజమౌళి డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకు కీరవాణి మ్యూజిక్ అందించారు. అన్నమయ్య చిత్రానికిగాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.


    @2021 KTree