• TFIDB EN
  • మహేష్ బాబు
    జననం : ఆగస్టు 09 , 1975
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    ఘట్టమనేని మహేష్ బాబు ఆగష్టు 9, 1975న ప్రముఖ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరదేవిలకు చెన్నైలో జన్మించారు. మహేష్‌కు ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు పద్మావతి, మంజుల, ఒక చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. మహేష్ బాబు తన నాలుగవ ఏట దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన 'నీడ'(1979) చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. బాలనటుడిగా తన తండ్రితో కలసి ఏడు చిత్రాలలో నటించాడు. తన విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే జరిగింది.
    Read More

    మహేష్ బాబు వయసు ఎంత?

    మహేష్ బాబు వయసు 49 సంవత్సరాలు

    మహేష్ బాబు ముద్దు పేరు ఏంటి?

    ప్రిన్స్ , ప్రిన్స్ మహేష్ బాబు , టాలీవుడ్ సూపర్ స్టార్ ,

    మహేష్ బాబు ఎత్తు ఎంత?

    6"(188cm)

    మహేష్ బాబు అభిరుచులు ఏంటి?

    మహేష్‌కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.”ఎమోషనల్ ఇంటెలిజెన్స్” మహేష్‌కి ఇష్టమైన పుస్తకం.

    మహేష్ బాబు ఏం చదువుకున్నారు?

    B.Com

    మహేష్ బాబు ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    లయోలా కాలేజ్ చెన్నై

    మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    విజయ్, గల్లా జయదేవ్

    మహేష్ బాబు In Sun Glasses

    Images

    Actor Mahesh

    Images

    Mahesh Babu Sunglasses Images

    మహేష్ బాబు With Pet Cats

    Images

    Mahesh Babu With Pet Cat

    మహేష్ బాబు అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Mahesh Babu

    Description of the image
    Editorial List
    కొరటాల శివ హిట్ చిత్రాలు
    కొరటాల శివ సినిమాల జాబితాEditorial List
    కొరటాల శివ సినిమాల జాబితా
    త్రివిక్రమ్- మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలుEditorial List
    త్రివిక్రమ్- మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు
    త్రివిక్రమ్ హిట్ చిత్రాలుEditorial List
    త్రివిక్రమ్ హిట్ చిత్రాలు
    <strong>SSMB 29: సోషల్ మీడియాలో మహేష్ బాబు లెటెస్ట్ ఫొటోలు లీక్… సింహంతో మాములుగా లేడు!&nbsp;&nbsp;</strong>
    SSMB 29: సోషల్ మీడియాలో మహేష్ బాబు లెటెస్ట్ ఫొటోలు లీక్… సింహంతో మాములుగా లేడు!&nbsp;&nbsp; మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా కోసం 2025 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రల ఎంపికకు కూడా రాజమౌళి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. Image Credit: X ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో సినిమా నిర్మాణం సినిమా గొప్పతనాన్ని మరింత పెంచేందుకు రాజమౌళి వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్‌తో చేతులు కలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికా అడవుల్లో కొన్ని వినూత్నమైన లొకేషన్లను పరిశీలించి, (Mahesh Babu Ai Images)అత్యంత యథార్థంగా ఉండేలా ఎంపిక చేశారని టాక్. అంతేకాకుండా, గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరిపి, ఇంటర్నేషనల్ స్థాయికి తగినంత ఉన్నతమైన విజువల్ ఎఫెక్ట్స్‌పై దృష్టి సారించారు. Image Credit: X రెండేళ్ల పాటు షూటింగ్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ సెట్స్‌లోనే(Mahesh Babu Ai Images) గడపవలసి ఉంటుంది. ఈ సినిమా హై-వోల్టేజ్ యాక్షన్, అడ్వెంచర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. https://twitter.com/AbhiM2608/status/1866455157590184410 ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ జోడీగా &nbsp;ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా ఎలిజబెత్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు. Image Credit: X ఎక్స్‌లో మహేష్ బాబు ఏఐ పిక్స్ వైరల్ SSMB29&nbsp; సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని ఫ్యాన్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌(AI) ద్వారా క్రియేట్ చేశారు. SSMB29 కథా నేపథ్యంతో ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలు ఆశ్యర్యపరుస్తున్నాయి. సింహంతో ఉన్న మహేష్ బాబు పిక్స్ ఔరా! అని అబ్బురపడేలా ఉన్నాయి. అడవిలో మహేష్ బాబు ఫైట్స్‌ చేస్తున్నట్లుగా ఏఐ క్రియేట్ చేసింది. మరో ఫొటోలో రాజమౌళి మహేష్ బాబుకు సీన్ వివరిస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం(Mahesh Babu Ai Images) ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇలాగే మహేష్ మెకోవర్ ఉంటే ఫ్యాన్స్‌కు పండగేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Image Credit: X ముఫాసా పాత్రపై మహేష్ ఉత్సాహం ఇటీవల మహేష్ బాబు, డిసెంబర్ 20న విడుదల కానున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్‌లో లీడ్ క్యారెక్టర్ ముఫాసా పాత్రకు వాయిస్ అందించారు. ఈ అవకాశంపై మహేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, "ముఫాసా పాత్ర నాకు ఎంతో ఇష్టమైనది. కుటుంబంపై ప్రేమ, సంరక్షణ అనే అంశాలను ఈ పాత్ర అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాత్రకు డబ్బింగ్ ఇవ్వడం నా కల సాకారమైనంతటిది" అని అన్నారు. తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ అందించగా, ఇతర పాత్రలకు (Mahesh Babu Ai Images)సత్యదేవ్, అలీ, బ్రహ్మానందం, అయ్యప్ప పి. శర్మ వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించగా, డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. Image Credit: X అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు SSMB 29 చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా కావడం, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, భారీ బడ్జెట్, మహేష్ బాబు వంటి స్టార్ హీరో అందులో నటించడమే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్‌ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలను అందుకునే విధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
    డిసెంబర్ 10 , 2024
    మహేష్ బాబు గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా? తెలుగులో అత్యంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్దిమంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా... తనకంటూ ప్రత్యేకమైన శైలీ, యాక్టింగ్ నేచర్‌తో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తూ.. రియల్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. మరి అలాంటి సూపర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు పుట్టినరోజు ఎప్పుడు? మహేష్ బాబు ఆగస్టు 9న చెన్నైలే జన్మించారు. నటుడు కృష్ణ, ఇందిరలకు జన్మించిన ఐదుగురు పిల్లలలో అతను నాల్గవవాడు.&nbsp; మహేష్ బాబు ఎవరు? మహేష్ బాబు ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత.&nbsp; మహేష్ బాబు ఎత్తు ఎంత? 6 అడుగులు మహేష్ బాబు హీరోగా ఎన్ని సినిమాలు ఆడాడు? &nbsp;సూపర్ స్టార్ మహేష్ నీడ (1979) చిత్రంలో బాల నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత, అతను బాల నటుడిగా&nbsp; బాల నటుడిగా 9 సినిమాలు చేసాడు. మేయిన్ హీరోగా ఇప్పటి వరకు 28 చిత్రాలకు పనిచేశాడు.&nbsp; మహేష్ బాబుకు పెళ్లయిందా? మహేష్ బాబు.. మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ను ఫిబ్రవరి 10, 2005న వివాహం చేసుకున్నాడు. వంశీ చిత్రంలో మహేష్ సరసన నమ్రత కలిసి నటించారు.&nbsp; మహేష్ బాబు ఎక్కడ నివసిస్తున్నారు? మహేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ.150 కోట్లు. భారతదేశంతో పాటు విదేశాలలో అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నాడు. మహేష్ బాబు కొత్త సినిమా ఏమిటి? సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో కలిసి # SSMB29లో నటిస్తున్నాడు. మహేష్ బాబుకి ఇష్టమైన ఆహారం, పుస్తకాలు మరియు అభిరుచులు? ప్రిన్స్ మహేష్ బాబుకి ఇష్టమైన వంటలలో హైదరాబాదీ బిర్యానీ ఒకటి.&nbsp; మహేష్‌కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం."ఎమోషనల్ ఇంటెలిజెన్స్" మహేష్‌కి ఇష్టమైన పుస్తకం. మహేష్ బాబుకి ఫిల్మ్ అవార్డ్స్ మహేష్ బాబు ఎనిమిది ప్రతిష్టాత్మక నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, మూడు సిని'మా' అవార్డులు, మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, నాలుగు SIIMA అవార్డులు అందుకున్నారు. https://www.youtube.com/watch?v=4TljKLaVuM0
    ఏప్రిల్ 08 , 2024
    Heroes in Ads: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ.. ఇక..Jr NTR, అల్లు అర్జున్ పరిస్థితి? ఒకప్పుడు యాడ్స్ అంటే బాలీవుడ్ నటులే గుర్తొచ్చేవారు. కానీ, ఇప్పుడలా లేదు. ఏ యాడ్ చూసినా టాలీవుడ్ హీరోలే. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి లోకల్ ప్రొడక్టు వరకు ప్రతీ ప్రచారానికి తెలుగు హీరోలే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలా చేస్తున్న ప్రకటనల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కో హీరో ఏకంగా నాలుగైదు యాడ్స్ చేస్తుండటం డామినేషన్‌ని తెలియజేస్తోంది. సినిమాలతో పాటు యాడ్స్‌లలో బిజీబిజీగా గడుపుతున్న ఆ స్టార్స్ ఎవరో చూసేద్దామా.&nbsp; అల్లు అర్జున్ పుష్ప సినిమా బన్నీని ఐకాన్ స్టార్‌గా మార్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పలు యాడ్‌లలో చేస్తున్నాడు. ఇటీవలే రెడ్ బస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. కేఎఫ్‌సి చికెన్ తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రాల్ స్ట్రాంగ్ పీవీసీ పైప్‌లకూ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. కోకాకోలా కూల్‌డ్రింక్ యాడ్‌లోనూ నటించాడు. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌కీ అల్లు అర్జునే బ్రాండ్ అంబాసిడర్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ తరఫున కూడా బన్నీ ప్రచారం చేస్తున్నాడు. ఇలా సినిమాలతో పాటు ప్రకటనలతోనూ బన్నీ బాగానే కమాయిస్తున్నాడు. ఒక్కో ప్రకటనకి అల్లు అర్జున్ రూ.7 నుంచి రూ.10 కోట్లు తీసుకుంటాడని టాక్. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) విజయ్ దేవరకొండ శ్యామ్ స్టీల్ ఇండియాతో విజయ్ చేతులు కలిపాడు. ఈ స్టీల్ గుణగణాలను తెలియజేస్తూ డిజైన్ చేసిన యాడ్‌లో విజయ్ నటించాడు. దీంతో పాటు జైవర్స్ ఫుట్‌వేర్ కంపెనీని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. లక్స్ కాజి మెన్స్ ఇన్నర్‌వేర్ తరఫున ప్రచార కర్తగా ఉన్నాడు. థమ్స్ అప్(Thumbs Up) యాడ్‌లోనూ విజయ్ దేవరకొండ నటించాడు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకు తంబ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు విజయ్ ఏకంగా రూ.10 కోట్లు తీసుకున్నట్లు టాక్. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) మహేశ్ బాబు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన మహేశ్ బాబు.. యాడ్స్‌ ఎక్కువ చేస్తుంటాడు. ఇటీవల మౌంటెన్ డ్యూ అనే సాఫ్ట్‌డ్రింక్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. దీంతో పాటు మహేశ్ బాబు ఎవరెస్ట్ గ్రాండ్ మసాలా యాడ్‌లో నటించాడు. ఆంధ్రా హాస్పిటల్స్‌తోనూ మహేశ్ బాబు అసోసియేట్ అయ్యాడు. మౌంటెన్ డ్యూ యాడ్‌కి మహేశ్ బాబు ఏకంగా రూ.12 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పలు కంపెనీలు ఎన్టీఆర్ కోసం క్యూ కట్టాయి. రీసెంట్‌గా జూనియర్ మెక్ డొనాల్డ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరించాడు.&nbsp; 24 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ లిషియస్ అనే ఫుడ్ డెలివరీ యాప్‌కి, ఆప్పీ ఫిజ్ కూల్‌డ్రింక్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.&nbsp; View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) రామ్‌చరణ్ రామ్‌చరణ్ పలు ప్రకటనల్లో నటించాడు. గతంలో సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ తరఫున ప్రచారం చేశాడు. ఇటీవల ఫ్రూటీ యాడ్‌లోనూ అలియా భట్‌తో కలిసి చెర్రీ నటించాడు. గతేడాది మీషో బ్రాండ్ తరఫున యాడ్‌లో తళుక్కున మెరిశాడు.&nbsp; https://www.youtube.com/watch?v=PtNSXvlZVIM
    జూన్ 13 , 2023
    Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్! మాతృదినోత్సవాన్ని సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లో బిజీగా ఉండే వారంతా మదర్స్‌డే రోజున పూర్తిగా తమ తల్లులతో టైమ్‌ స్పెండ్ చేశారు. వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సినీ తారలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. మరోవైపు అమ్మ దూరమైన జాన్వికపూర్‌, విష్ణుప్రియ తదితరులు తల్లితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తారలు పోస్టు చేసిన ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ చిరంజీవి మేనల్లుడు, ఉప్పెన సినిమా హీరో పంజా వైష్ణవ్‌ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. అన్న సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి తల్లితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.  View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) శ్రీజ కొణిదెల మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూమార్తె శ్రీజ.. మాతృదినోత్సవం రోజున తన తల్లితో సరదాగా గడిపింది. తన అక్క సుశ్మితతో కలిసి తల్లితో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. తనకు లభించిన అత్యుత్తమైన బహుమతి తన తల్లి అని శ్రీజ క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) కాజల్ అగర్వాల్ ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్‌ కూడా తన తల్లికి మదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పింది. తన తల్లితో దిగిన ఫోటోనూ షేర్‌ చేసిన కాజల్‌.. ఆమె లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే దానిని కాదని పేర్కొంది.&nbsp; View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఆమెతో దిగిన చిన్నప్పటి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్‌ మధర్ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) విష్ణు ప్రియ బుల్లితెర యాంకర్‌ విష్ణుప్రియ మాతృదినోత్సవం రోజున తన తల్లిని గుర్తు చేసుకుంది. ప్రతీ క్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటానని చనిపోయిన తల్లీని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టింది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) రాశి ఖన్నా నటి రాశి ఖన్నా తన తల్లితో ఎంతో సంతోషంగా ఉయ్యాల ఊగుతున్న ఫొటోను షేర్ చేసింది. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) మమతా మోహన్‌ దాస్‌ నటి మమతా మోహన్‌ దాస్‌ కూడా తన తల్లి గొప్పతాన్ని నెటిజన్లకు తెలియజేసింది. నా జీవితంలో గడిపిన ప్రతీ రోజూ నువ్వు ఇచ్చిందేనని తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఆమెతో దిగిన ఫొటోను కూడా నెటిజన్లతో మమతా పంచుకుంది.  View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) హనీరోజ్‌ గ్లామర్‌ బ్యూటీ హనీరోజ్‌ కూడా మాతృదినోత్సవం రోజున తన తల్లి ప్రేమను గుర్తుచేసుకుంది. తన అమ్మతో పాటు ప్రపంచంలోని ప్రతీ అమ్మకు శుభాకాంక్షలు తెలియజేసింది.&nbsp; View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) పద్మావతి మహేష్‌బాబు సోదరి గల్లా పద్మావతి కూడా మాతృదినోత్సవ రోజున తన తల్లి చూపించిన ఆప్యాయతను గుర్తుచేసుకుంది. పద్మావతి కుమారుడు, నటుడు అశోక్‌ గల్లా ఈ ఫొటోను షేర్ చేశాడు. తన తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు.&nbsp; View this post on Instagram A post shared by Galla Ashok (@ashokgalla_) నైనికా విద్యాసాగర్ మీనా కుమార్తె నైనికా విద్యాసాగర్‌ తన తల్లితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది.&nbsp; View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16)
    మే 15 , 2023

    మహేష్ బాబు తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    మహేష్ బాబు తెలుగులో ప్రముఖ దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణఇందిర దంపతుల కుమారుడు. కృష్ణకు కలిగిన ఐదుగురి సంతానంలో మహేష్ బాబు నాల్గొవాడు.రమేష్ బాబు , పద్మావతి, మంజలుతర్వాత జన్మించాడు. మహేష్ బాబు తర్వాత కృష్ణకు ప్రియదర్శిని జన్మించింది. ఈమే ప్రముఖ టాలీవుడ్ హీరో సుధీర్ బాబును వివాహం చేసుకుంది.

    మహేష్ బాబు పెళ్లి ఎప్పుడు అయింది?

    మహేష్ బాబు.. మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ను ఫిబ్రవరి 10, 2005న వివాహం చేసుకున్నాడు. వంశీచిత్రంలో మహేష్ సరసన నమ్రత కలిసి నటించారు.

    మహేష్ బాబు కు పిల్లలు ఎంత మంది?

    మహేష్ బాబు నమ్రతా దంపతులకు ఇద్దరు పిల్లలు. సితార మరియు గౌతమ్

    మహేష్ బాబు Family Pictures

    Images

    Mahesh Babu with his Family

    Images

    Mahesh Babu Family Images

    మహేష్ బాబు ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    అతడు, ఒక్కడు, దూకుడు, పోకిరి, బిజినెస‌మ్యాన్వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు.

    మహేష్ బాబు లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో మహేష్ బాబు ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మహేష్ బాబు తొలి చిత్రం ఏది?

    మహేష్ బాబు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    మహేష్ బాబు తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా పోకిరిలోపండు, ఒక్కడులో అర్జున్, అతడులోపార్థు పాత్రలు గుర్తింపునిచ్చాయి.

    మహేష్ బాబు బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Stage Performance

    View post on X

    Stage Performance

    మహేష్ బాబు బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Dialogues

    Best Dialogue

    మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంత?

    మహేష్ బాబు ఒక్కో చిత్రానికి రూ.30 కోట్లు నుంచి రూ.40 కోట్లు తీసుకుంటున్నాడు

    మహేష్ బాబు కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్ బిర్యాని

    మహేష్ బాబు కు ఇష్టమైన నటుడు ఎవరు?

    మహేష్ బాబు కు ఇష్టమైన నటి ఎవరు?

    మహేష్ బాబు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    మహేష్ బాబు ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    మహేష్ బాబు ఫెవరెట్ సినిమా ఏది?

    మహేష్ బాబు ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లూ

    మహేష్ బాబు కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    మహేష్ బాబు కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్

    మహేష్ బాబు వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    రేంజ్ రోవర్, లంబోర్గిని, అడీ ఏ8, మెర్సిడెస్ బెంజ్-E క్లాస్ మరియు బీఎండబ్యూ

    మహేష్ బాబు ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.150కోట్లు

    మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    13.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    మహేష్ బాబు సోషల్‌ మీడియా లింక్స్‌

    మహేష్ బాబు కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • మహేష్ బాబు తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని’మా’ అవార్డును పొందింది.

    మహేష్ బాబు కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    మహేష్ బాబుకు G. మహేష్ బాబు అనే ప్రొడక్షన్ హౌజ్ ఉంది. అలాగే AMB సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి.

    మహేష్ బాబు ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    సంతూర్, జీలైట్, మౌంటెన్ డ్యూ, డెన్వేర్, జీతెలుగు ఛానెల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
    మహేష్ బాబు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మహేష్ బాబు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree