
మకరంద్ దేశ్‌పాండే
జననం : మార్చి 06 , 1966
ప్రదేశం: దహను, మహారాష్ట్ర, భారతదేశం
మకరంద్ దేశ్‌పాండే హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, మలయాళం, తమిళ సినిమా మరియు భారతీయ థియేటర్‌లలో భారతీయ నటుడు, రచయిత మరియు దర్శకుడు. అతను తరచుగా జంగిల్ వంటి వివిధ చిత్రాలలో సహాయక మరియు కీలక పాత్రలలో కనిపిస్తాడు. , సర్ఫరోష్, స్వదేస్, మక్దీ, బ్బుద్దా... హోగా టెర్రా బాప్ మరియు దర్నా జరూరీ హై ఇక్కడ అతను తాగుబోతు, బాటసారి మరియు హాస్య పాత్రలను పోషిస్తాడు. అతను 5 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించాడు.
కథనాలు

Rules Ranjann Review: అక్కడక్కడా మెప్పించినా… మొత్తానికే బెడిసి కొట్టింది
తారాగణం:
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్
డైరెక్టర్: రతినం కృష్ణ
నిర్మాతలు: దివ్యంగా లావణ్య, మురళి క్రిష్ణ వేమూరి
సంగీతం: అమ్రీష్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కుమార్
టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల్లో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు చేసింది 6 సినిమాలే అయినా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. తనతో సినిమా చేస్తే నష్టాలు మాత్రం రావనే భరోసా మాత్రం ఇండస్ట్రీలో కలిగించాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మీటర్ సినిమా ప్లాప్ కావడంతో.. తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్‌నే కిరణ్ అబ్బవరం ఈసారి ఎంచుకున్నాడు. భారీ తారాగణంతో వచ్చిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉంది? కిరణ్ మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా? ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మనో రంజన్(కిరణ్ అబ్బవరం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన జీవితాన్ని కఠినమైన రూల్స్ పెట్టుకుని కొనసాగిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత స్నేహితురాలు సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటాడు. సనాను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ సనాకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఈ సినిమా పెద్దగా కథ లేకున్నా కామెడీ ట్రాక్ ముందుకు సాగింది. ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొడుతుందనే టైంలో వెన్నెల కిషోర్ బరిలోకి దిగి తన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్విస్తాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌తో ముందుకెళ్తుంది. సెకండాఫ్‌కు వచ్చేసరికి తేలిపోయింది. ఫస్టాప్ మాదిరి కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది. అనవసరమైన ఎలివేషన్స్ జొప్పించారనిపిస్తుంది. కొన్ని సీన్లు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్‌లో హైపర్ ఆది, వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊరటనిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
గత సినిమాల కంటే భిన్నంగా కిరణ్ అబ్బవరం నటన బాగుంది. ప్రతి సినిమాలో ఒకేలాగా నటిస్తాడు అనే అపవాదును ఈ సినిమా ద్వారా కిరణ్ చెరిపేసుకున్నాడు. సినిమాలో కంప్లీట్‌గా తన లుక్‌ను మార్చేసుకున్నాడు. మనో రంజన్ పాత్రకు న్యాయం చేశాడు. ఇక నేహా శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. తన గ్లామర్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. సమ్మోహనుడా సాంగ్‌లో నేహా పరువాల విందుతో కనువిందు చేసింది. హైపర్ ఆది, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు మంచి అసెట్ అని చెప్పవచ్చు. ఆది కామెడీ పంచ్‌లు కడుపుబ్బ నవ్విస్తాయి. వైవా హర్ష తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించాడు. మకరంద్ దేశ్ పాండే, సుబ్బరాజు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
యంగ్ డైరెక్టర్ రతినం కృష్ణ సాధారణ కథతో మెప్పించలేక పోయాడు. స్టోరీ పట్ల నెరెషన్‌లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది. భారీ తారాగణం ఉన్న సరైన రీతిలో వారిని ఉపయోగించుకోలేదనే భావన కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీ ట్రాక్‌నే.. సెకంఢాఫ్‌లో కొనసాగిస్తే బాగుండేది అనిపించింది. అనవసరమైన ఎలివేషన్స్‌కు వెళ్లారనిపిస్తుంది. మొత్తానికి కొద్దిసేపైన ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
రూల్స్ రంజన్ మూవీ నిర్మాణ విలువల పరంగా బాగుంది. అమ్రీష్ మ్యూజిక్ బాగుంది. దులీప్ కుమార్ సినిమాటోగ్రఫీ ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది.
బలాలు
ఫస్టాప్ కామెడీ ట్రాక్
నెహా శెట్టి గ్లామర్
బలహీనతలు
అనవసరమైన ఎలివేషన్స్
సెకండాఫ్
స్టోరీ
చివరగా.. రూల్స్ రంజన్ అక్కడ అక్కడ నవ్వించే .. కామెడీ ఎంటర్టైనర్
రేటింగ్: 2.5/5
అక్టోబర్ 06 , 2023
Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?
నటీనటులు : రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్ విజయ్, పృథ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు
డైరెక్టర్ : ఏ.ఎస్. రవి కుమార్
సంగీతం : జేబీ
సినిమాటోగ్రఫీ : జవహర్ రెడ్డి
నిర్మాత : మాల్కాపురం శివ కుమార్
విడుదల తేదీ : ఆగస్టు 2, 2024
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) హీరోయిన్లుగా చేశారు. మకరంద్ దేశ్‌పాండే, రాజా రవీంద్ర, ప్రగతి ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో హీరోయిన్లుగా చేసిన రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రాజ్‌తరుణ్ తనను మోసం చేసి మాల్వీతో రిలేషన్‌లో ఉన్నట్లు అతడి మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు పట్టించుకోడు. కానీ శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే శైలజాను కంట్రోల్ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? వారి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో రాజ్ తరుణ్ గిరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తొలుత అమాయకుడిగా, ఆపై ప్రేయసి కోసం శత్రువులపై తిరగబడే ప్రియుడిగా రెండు డైమన్షన్లలో మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్ దుమ్మురేపాడు. ఈ స్థాయి యాక్షన్ సీన్స్ అతడు ఇప్పటివరకూ చేయలేదు. ఇక శైలజా పాత్రలో హీరోయిన్ మాల్వీ మల్హోత్ర ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే అయిన్పప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్క్రీన్‌పై రాజ్ తరుణ్ - మాల్వీ మల్హోత్ర కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సెకండ్ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా అద్భుతంగా నటించింది. ఇక జాన్ విజయ్, రఘుబాబు, అంకిత ఠాకూర్, ప్రగతి, రాజా రవీంద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని లవ్ & యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తొలి భాగం మెుత్తం హీరో-హీరోయిన్ పరిచయం, వారి లవ్ ట్రాక్‌తో సాగిపోయింది. గిరిని శైలజా డామినేట్ చేసే క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదరడంతో ఫస్టాఫ్ ఎక్కడా బోర్ లేకుండా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు డైరెక్టర్. రెండో భాగాన్ని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో పూర్తిగా నింపేశారు. రాజ్ తరుణ్‌ను ఎన్నో మాస్ యాంగిల్స్‌లో చూపించి డైరెక్టర్ ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్స్ రాజ్‌తరుణ్ కటౌట్‌కు మించి ఉండటంతో లాజికల్‌గా కనెక్ట్ కాలేము. భావోద్వేగ సన్నివేశాలు సైతం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి 'తిరబడరా సామి' నచ్చుతుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే జేబీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను బీజీఎం మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే పాటలు గుర్తుంచుకునేలా లేవు. అటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్‌తరుణ్ నటనలవ్ ట్రాక్‌యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
వర్కౌట్ కాని ఎమోషన్స్‌కొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 02 , 2024
LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
జులై నెల మొత్తం ప్రభాస్ కల్కి హవా సాగింది. ఇప్పుడు ఆగస్టు నెలలో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో పలు చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. శివం భజే, బడ్డీ, అంటోనీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అటు ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో 20కి పైగా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విడుదల కానున్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు
బడ్డీ
చాలా రోజుల తర్వాత బడ్డీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. ఈ సినిమాను ఫూల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శామ్ ఆంటోస్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెకిత్తించాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.
శివం భజే
యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శివంభజే. అఫ్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైవిధ్యమైన కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మంచి ఎగ్జైటింగ్ ఫీలింగ్ పొందుతారని మూవీ టీమ్ తెలిపింది.
ఉషా పరిణయం
తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతూ 'ఉషా పరిణయం'సినిమా వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. శ్రీకమల్ సరసన తాన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథ, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా రానుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది.
తిరగబడర సామి
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో యువ హీరో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఆయన సరసన మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులను అలరించనుంది. యువతరాన్ని ఆకర్షింటే రొమాంటిక్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అయితే రాజ్ తరుణ్- లావణ్య వివాదం సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వారం విడుదలైన పురుషోత్తముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో చూడాలి. లెటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలనాటి రామచంద్రుడు
కృష్ణవంశీ, మోక్ష జంటగా నటింంచిన చిత్రం అలనాటి రామచంద్రుడు. తన ప్రేమకోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న యువకుడిని ఆ యువతి ప్రేమించిందా? లేదా? వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైనప్‌తో కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాను చిలుకూరి ఆకాష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు
ఇక ఓటీటీ విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళిపై వచ్చిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష నటించిన 'బృందా' సిరీస్, డ్యూన్ పార్ట్ 2, కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్లను ఇక్కడ చూడండి.
PlatformTitleTypeRelease DateNetflixA Good Girl's Guide to MurderEnglish seriesAugust 01NetflixBorderless FogIndonesian movieAugust 01NetflixLove Is Blind MexicoSpanish seriesAugust 01NetflixMon Laferte TemoSpanish movieAugust 01NetflixUnstable Season 2English seriesAugust 01NetflixModern Masters: SS RajamouliTelugu documentaryAugust 02NetflixSaving Bikini BottomEnglish movieAugust 02NetflixJoe RoganEnglish comedy eventAugust 03Amazon PrimeThe Lord of the Rings: The Rings of Power S2English seriesJuly 29Amazon PrimeBatman: Caped CrusaderEnglish seriesAugust 01HotstarFuturama Season 12English seriesJuly 29HotstarNo Way OutKorean seriesJuly 31HotstarKingdom of the Planet of the ApesTelugu dubbed movieAugust 02Book My ShowThe Bike RidersEnglish movieAugust 02Jio CinemaDune Part 2Telugu dubbed movieAugust 01Jio CinemaGud ChadiHindi movieAugust 01Jio CinemaTarotEnglish filmAugust 03Jio CinemaDas June Ki RaatHindi seriesAugust 04Sony LivBrindaTelugu dubbed seriesAugust 02Apple TV+Women in BlueEnglish seriesJuly 31
జూలై 29 , 2024
Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
సినిమా- స్పై
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం
నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
డైరెక్టర్: గ్యారీ బీహెచ్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి నేపథ్యంతో వచ్చిన కార్తికేయ సిరీస్ 1,2 మంచి హిట్ సాధించాయి. ఈసారి దేశ భక్తి కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పై' విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ప్రేక్షకుల అంచనాలను స్పై అందుకుందా? నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.
కథ:
జై(నిఖిల్) రా ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మిషిన్‌లో పనిచేస్తూ 'రా' ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్( ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకోవాలని 'రా' చీఫ్ శాస్త్రి( మకరంద్ పాండే) ఆ కేసు ఫైల్స్ జైకి అప్పగిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అనుహ్యంగా దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి జైకి తెలుస్తుంది. అసలు ఓ ఉగ్రవాది దగ్గర నేతాజీ ఫైల్స్ ఎందుకున్నాయి? నేతాజీ డెత్ మిస్టరీ చివరకు జై ఛేదించాడా? అన్న అంశాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
స్పై మూవీ గతంలో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాలనే పోలి ఉంది. ఓ రా చీఫ్.. హీరో అయిన రా ఏజెంట్‌కు సిక్రెట్ మిషిన్ అప్పగిస్తాడు. అతడు చివరికి మిషిన్ పూర్తి చేసి విలన్ చంపే కామన్ పాయింట్‌ను స్పై చిత్రం కూడా ఫాలో అయింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించి గూఢాచారి 116 నుంచి అడవి శేషు నటించిన గూఢచారి వరకు ఇదే ఫార్మూలలో వచ్చి హిట్ సాధించాయి. స్పై మూవీ సైతం ఇదే తరహాలో ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు కొత్తదనం అనిపించదు. ఫస్టాప్‌లో నిఖిల్, హీరోయిన్ వైష్ణవి లవ్ స్టోరీ, జోర్డాన్‌లో ఆయుధాల స్మగ్లింగ్ వంటి సీన్లు ఉంటాయి. నేతాజీ రిలేటెడ్ సీన్స్ బాగున్నాయి. కోర్ పాయింట్స్ ఉన్నా సీన్లకు హైప్ తీసుకురాలేదు. అయితే ఫస్టాఫ్‌లో ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ విషయానికొస్తే... ఏజెంట్ జై టీమ్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి తెలుస్తుంది. దాని ఆధారంగా చేసుకుని సెకండాఫ్ సాగుతుంది. సినిమాలో దేశభక్తి కోటింగ్ తప్ప.. ఆ కోర్ పాయింట్‌కు తగ్గ సీన్లు మాత్రం పడలేదు. రెగ్యులర్ స్పై మూవీలాగే కనిపిస్తుంది. కొన్ని ఓవర్ ఎలివేటెడ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు అంతగా పండలేదు.
ఎవరెలా చేశారంటే?
రా ఏజెంట్‌గా నిఖిల్ సిద్ధార్జ్ బాగా సూట్ అయ్యాడు. గతంలో చేసిన క్యారెక్టర్స్ మాదిరి ఉండటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో పర్వాలేదనిపించింది. అభినవ్ గోమఠం.. కామెడీని పండించాడు. అతనితో యాక్షన్ సీన్ల కంటే కామెడీ సీన్లే ఎక్కువ ఉంటాయి. రానా దగ్గుపాటి కొద్దిసేపు కనిపించి అలరిస్తాడు. మిగతా క్యారెక్టర్లు పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్, ఆర్యన్ రాజేష్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్‌గా..
స్పై సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ మెపిస్తాయి. యాక్షన్ సీన్లు ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. సాంగ్స్ మెప్పించవు. విశాల్ చంద్ర శేఖర్ ట్యూన్స్ విషయంలో ఇంకాస్తా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే. గ్రాఫిక్స్ సీన్స్ మెప్పించవు. కొన్ని చోట్లు తేలిపోయాయి.యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. స్వతహాగా ఎడిటర్ అయిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పనిచెప్పడంలో పనిచెప్పలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి.
చివరగా: ఓవరాల్‌గా గూఢచారి టెంప్లెట్‌లో సినిమా కావాలనుకునే వారికి 'స్పై' వినోదాన్ని అయితే పంచుతుంది.
రేటింగ్: 2.25/5
జూన్ 29 , 2023

తిరగబడరా సామీ
02 ఆగస్టు 2024 న విడుదలైంది

రజాకార్ - సైలెంట్ జెనోసిదే అఫ్ హైదరాబాద్
15 మార్చి 2024 న విడుదలైంది

రూల్స్ రంజన్!
06 అక్టోబర్ 2023 న విడుదలైంది

ది జెంగబూరు కర్స్
09 ఆగస్టు 2023 న విడుదలైంది

హిడింబ
20 జూలై 2023 న విడుదలైంది

స్పై
29 జూన్ 2023 న విడుదలైంది

పొన్నియిన్ సెల్వన్: II (PS 2)
28 ఏప్రిల్ 2023 న విడుదలైంది

తగ్గేదెలే
04 నవంబర్ 2022 న విడుదలైంది
.jpeg)
లైగర్
25 ఆగస్టు 2022 న విడుదలైంది
.jpeg)
ఆర్ఆర్ఆర్
25 మార్చి 2022 న విడుదలైంది
.jpeg)
రొమాంటిక్
29 అక్టోబర్ 2021 న విడుదలైంది

బొంభాట్
03 డిసెంబర్ 2020 న విడుదలైంది
మకరంద్ దేశ్‌పాండే వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మకరంద్ దేశ్‌పాండే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.