• TFIDB EN
  • మాళవిక శర్మ
    జననం : జనవరి 26 , 1999
    ప్రదేశం: ముంబయి
    మాళవిక శర్మ ప్రముఖ టాలీవుడ్ నటి, మోడల్. తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషా చిత్రాల్లోనూ నటిస్తోంది. తెలుగులో రవితేజతో కలిసి నేల టిక్కెట్ (2018)తో అరంగేట్రం చేసింది. రెడ్, హరోం హర చిత్రాలతో గుర్తింపు పొందింది. మాళవిక శర్మ, రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీ లాలో డిగ్రీ చేసింది.

    మాళవిక శర్మ వయసు ఎంత?

    మాళవిక శర్మ వయసు 26 సంవత్సరాలు

    మాళవిక శర్మ ఎత్తు ఎంత?

    5'6" (168 cm)

    మాళవిక శర్మ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్, డ్యాన్సింగ్, మోడలింగ్

    మాళవిక శర్మ ఏం చదువుకున్నారు?

    క్రిమినాలజీలో LLB చేసింది

    మాళవిక శర్మ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    రిజ్వి లా కాలేజ్, ముంబై

    మాళవిక శర్మ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    మాలవిక శర్మ ప్రస్తుతం సింగిల్‌గా ఉంటుంది. ఆమెకు ఎలాంటి అఫైర్స్ లేవు. తన దృష్టి అంతా సినిమాలపై కేంద్రీకరించింది.

    మాళవిక శర్మ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-26-32

    మాళవిక శర్మ Hot Pics

    Images

    Malvika Sharma latest images

    Images

    Malvika Sharma latest images

    మాళవిక శర్మ In Modern Dress

    Images

    Malvika Sharma Hot

    Images

    Malvika Sharma Hot In Modern Dress

    మాళవిక శర్మ In Half Saree

    Images

    Malvika Sharma In Half Saree

    Images

    Malvika Sharma In Half Saree

    మాళవిక శర్మ In Ethnic Dress

    Images

    Malvika Sharma In Ethnic Wear

    Images

    Malvika Sharma

    మాళవిక శర్మ In Saree

    Images

    Malvika Sharma In Saree

    Images

    Malvika Sharma Images in Saree

    మాళవిక శర్మ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Malvika Sharma latest images

    Images

    Malvika Sharma

    Insta Hot Reels

    View post on Instagram
     

    Malvika Sharma Insta Reel

    View post on Instagram
     

    Malvika Sharma Hot Insta Reel

    View post on Instagram
     

    Malavika Sharma insta reels

    View post on Instagram
     

    Malavika Sharma Hot Instagram Reels

    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?
    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా? నటీనటులు : సుధీర్‌ బాబు, మాళవిక శర్మ, జయప్రకాష్‌, సునీల్‌, అర్జున్‌ గౌడ, రవి కాలే తదితరులు దర్శకత్వం : జ్ఞానసాగర్‌ ద్వారక సంగీతం : చైతన్ భరద్వాజ్‌ ఎడిటర్‌ : రవితేజ గిరిజాల నిర్మాత : సుమంత్‌ జి. నాయుడు విడుదల తేదీ: 14- 05-2024 సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాలపై అంచనాలను పెంచింది. గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్‌బాబు.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జూన్‌ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సుధీర్‌బాబుకు హిట్‌ అందించిందా? అతడి అంచనాలను నిలబెట్టిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి 1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్‌ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్‌ తెలివితేటలతో గన్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే సుబ్రహ్మణ్యం పాత్రలో.. సుధీర్‌బాబు కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన కుప్పం యాసలో మాట్లాడుతూ తన మార్క్‌ నటనతో మెప్పించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపించాడు. ఇక అతడికి జోడీగా చేసిన మాళవిక శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుధీర్‌బాబుతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. విలన్‌ పాత్రల్లో జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ మంచి ప్రభావం చూపించారు. కానిస్టేబుల్‌ పాత్రతో సునీల్‌ ఆకుట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే అయిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మెప్పించింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్‌ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్‌.. ఇంటర్వెల్‌ ముందుకు వచ్చే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్‌ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్‌ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా.. మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్‌ ఇస్తుందని చెప్పవచ్చు.  సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 1980ల నాటి కుప్పాన్ని వారు మళ్లీ రీ క్రియేట్ చేసిన తీరు ప్రశంసనీయం. అటు సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా మూవీకి బాగా ప్లస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ వర్క్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సుధీర్‌బాబు నటనయాక్షన్‌ సీక్వెన్స్‌ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంకానరాని మలుపులు Telugu.yousay.tv Rating : 3/5  
    జూన్ 14 , 2024
    Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? మాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా మాళవిక శర్మ (Malavika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్లుగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A. Harsha) రూపొందించిన చిత్రం ‘భీమా’ (Bhimaa). ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వీకే నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో గోపిచంద్‌ విశ్వరూపం చూపించాడని కథనాలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత గోపిచంద్‌కు సాలిడ్‌ హిట్‌ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భీమా తొలిరోజు కలెక్షన్స్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌? ప్రీ బిజినెస్‌ లెక్కలు ఎలా ఉన్నాయి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.  భీమా తొలి రోజు కలెక్షన్స్‌.. భీమా చిత్రాన్ని మేకర్స్‌ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్లలో చిత్రాన్ని ప్రదర్శనకు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రా కలిపి 600 స్కీన్లలో, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. దీనికి తగ్గట్లే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ లభించినట్లు తెలుస్తోంది. ట్రెడ్‌ లెక్కల ప్రకారం ఈ సినిమా తొలి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.35కోట్లు, ఓవర్‌సీస్‌ ఇతర ప్రాంతాలు కలిపి రూ.1.25 కోట్లు వసూలు చేసింది. అయితే కొన్ని ఏరియాల్లో మిక్స్‌డ్‌ టాక్‌ రావడం భీమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. లేదంటే ఈజీగానే రూ.5 కోట్ల మార్క్‌ను సాధించేదని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే గోపిచంద్‌ గత చిత్రం ‘రామబాణం’.. తొలిరోజున రూ. 2.5 కోట్ల గ్రాస్‌ సాధిస్తే.. ‘భీమా’ అంతకు రెట్టింపు వసూలు చేయడం విశేషం.  సాక్నిక్‌ లెక్కల ప్రకారం ప్రముఖ సినిమా వెబ్‌సైట్ సాక్నిక్‌ (Sacnilk) లెక్కల ప్రకారం.. భీమా చిత్రం తొలిరోజు రూ.3.50 కోట్ల నెట్‌ కలెక్షన్లను (Bhimaa Day1 Net Collections) వసూలు చేసింది. ఓవర్సీస్‌ లెక్కలను మాత్రం ఈ సైట్‌ ప్రస్తావించలేదు. ఇక తొలిరోజు ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్‌ షోస్‌ 27.58%, మధ్యాహ్నం 33.55%, సాయంత్రం 27.70%, సెకండ్‌ షో 49.49% నమోదైంది. నేడు, రేపు వీకెండ్‌ కావడంతో ఆక్యుపెన్సీ శాతం మరింత పెరిగే అవకాశముంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో రూ.6 కోట్లకుపైగా కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌? గోపీచంద్ హీరోగా ఒక హిట్ అందుకునేలోపే.. మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. అయితే తనకు అచ్చొచ్చిన యాక్షన్‌ జానర్‌లో 'భీమా' చేయడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ (Bhimaa Movie Pre Release Business)ను మంచిగానే చేసింది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా థ్రియేటికల్‌ హక్కులు రూ.11.30 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలంగాణ (నైజాం) రూ. 3.50 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ రూ. 4.50 కోట్లకు బిజినెస్‌ జరిగింది. మెుత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.50 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కాగా.. కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ.1.8 కోట్లు జరిగింది. 'భీమా' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ.12 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  'భీమా'లో అదరగొట్టిన గోపిచంద్‌! భీమా చిత్రంలో గోపిచంద్‌.. రెండు కోణాల్లో క‌నిపించే పాత్ర‌ల్లో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో విశ్వరూపం చూపించేశాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.  https://telugu.yousay.tv/gopichand-bheema-review-gopichand-sivathandavam-in-action-sequences-bheema-movie-hit-free.html
    మార్చి 09 , 2024
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా? నటీనటులు : గోపిచంద్‌, ప్రియా భవాని శంకర్‌, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌, ముఖేష్‌ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్‌ చంద్ర తదితరులు  దర్శకుడు : ఎ. హర్ష సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాత : కె. కె. రాధామోహన్‌ మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్‌ మెప్పించాడా? లేదా? కథ భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్‌ లవ్‌ ట్రాక్‌ ఎలా మెుదలైంది? అన్నది కథ. ఎవరేలా చేశారంటే ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్‌ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష..  డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. ప‌ర‌శురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్‌ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్‌ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్‌ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్‌ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.  టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ గోపిచంద్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ సాగదీత సీన్లుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే! ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్‌ కానుంది. ఈ వీకెండ్‌ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు హరోం హర సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. రాయణ్‌  తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్ర 'రాయణ్‌' (Raayan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్‌ హీరోయిన్‌గా చేసింది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్‌, కాళిదాస్‌ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  ఇంద్రాణి  యానీయా, అంకిత, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంద్రాణి' (Indrani). ఈ చిత్రం స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్‌ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.  మ్యూజిక్‌ షాప్‌ మూర్తి టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్‌ ఈ సినిమా విడుదల కానుంది. 'ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు' అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. మహారాజా (తెలుగు డబ్‌) తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి నటించిన 'మహా రాజా' (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్‌ కానుంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పారిజాత పర్వం చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు 'ఆహా' (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్‌, హర్ష కీలక పాత్రలు చేశారు.  TitleCategoryLanguagePlatformRelease DateTour Day France Unchained S2SeriesEnglishNetflixJune 11My Next Guest S2SeriesEnglishNetflixJune 12Mysteries Of The Terracotta WarriorsMovieEnglishNetflixJune 12Doctor ClimaxSeriesEnglishNetflixJune 13Gangs Of GodavariMovieTeluguNetflixJune 14Maha RajMovieHindiNetflixJune 14Protecting ParadiseMovieEnglishDisney + HotstarJune 10The Colour Of VictorySeriesEnglishDisney + HotstarJune 10Not Dead At S2SeriesEnglishDisney + HotstarJune 12Gaanth Chapter 1SeriesHindiJio CinemaJune 11GroundMovieTeluguAmazonJune 10The Boys Season 4SeriesTeluguAmazonJune 13Paarijatha ParvamMovieTeluguAhaJune 12Kurangu PedalSeriesTamilAhaJune 14Love Ki Arrange MarriageMovieHindiZee 5June 14ParuvuSeriesTeluguZee 5June 14
    జూన్ 10 , 2024

    మాళవిక శర్మ తల్లిదండ్రులు ఎవరు?

    ఆమె తండ్రి పేరు సంజీవ్ శర్మ

    మాళవిక శర్మ‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    మాళవిక సోదరుడు పేరు వేదాంత్ శర్మ

    మాళవిక శర్మ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    రవితేజహీరోగా వచ్చిన నెలటికెట్టుసినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది.

    తెలుగులో మాళవిక శర్మ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    మాళవిక శర్మ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    నేల టికెట్టు చిత్రంలో ఆమె చేసిన మాళవిక పాత్ర గుర్తింపు తీసుకొచ్చింది.

    మాళవిక శర్మ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    మాళవిక శర్మ రెమ్యూనరేషన్ ఎంత?

    మాళవిక శర్మ ఒక్కో చిత్రానికి రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.

    మాళవిక శర్మ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్ వెజ్

    మాళవిక శర్మ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    మాళవిక శర్మ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    మరాఠి, హిందీ, ఇంగ్లీష్

    మాళవిక శర్మ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్

    మాళవిక శర్మ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్ కోహ్లీ

    మాళవిక శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.1 మిలియన్ ఫాలోవర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో మాళవిక శర్మను అనుసరిస్తున్నారు.

    మాళవిక శర్మ సోషల్‌ మీడియా లింక్స్‌

    మాళవిక శర్మ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మాళవిక శర్మ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree