• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    మణి శర్మ

    మణిశర్మ తెలుగులో మెలోడి బ్రహ్మగా పేరొందిన సుప్రసిద్ధ సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. 200కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర ఆయన శిష్యరికం చేశారు. సూపర్ హీరోస్ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. చిరంజీవి నటించిన బావాగారు బాగున్నార చిత్రం ఈయన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొందాయి. సమరసింహారెడ్డి, గణేష్, చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, మనోహరం, ఇంద్ర, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, పోకిరి, చిరుత, ఒక్కడు, ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. ఈయన సంగీత ప్రతిభకు పలు పురస్కారాలు లభించాయి. ఆయన కెరీర్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా రెండు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు.


    @2021 KTree