• TFIDB EN
  • మిథిలా పాల్కర్
    జననం : జనవరి 11 , 1993
    ప్రదేశం: బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
    మిథిలా పాల్కర్‌ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. 1993 జనవరి 11న ముంబయిలో జన్మించింది. కెరీర్‌ ప్రారంభంలో 'మజా హనీమూన్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌ చేసింది. 'కట్టి బట్టి' (2015) చిత్రంతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది. 'ఓరి దేవుడా' (2021) సినిమాతో తొలిసారి తెలుగు ఆడియన్స్‌ పలకరించింది. ఇందులో చక్కటి నటన కనబరిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, మరాఠి భాషల్లో 8 చిత్రాల్లో మిథిలా నటించింది.

    మిథిలా పాల్కర్ వయసు ఎంత?

    మిథిలా పాల్కర్‌ వయసు 32 సంవత్సరాలు

    మిథిలా పాల్కర్ ఎత్తు ఎంత?

    5' 3'' (163cm)

    మిథిలా పాల్కర్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, సింగింగ్‌, ట్రావెలింగ్‌

    మిథిలా పాల్కర్ ఏం చదువుకున్నారు?

    బ్యాచిలర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా

    మిథిలా పాల్కర్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఐ.ఈ.ఎస్‌. మోడరన్‌ ఇంగ్లీష్‌ స్కూల్‌, ముంబయి శ్రీమతి మితిబాయ్‌ మోతిరామ్‌ కుంద్నాని కాలేజ్‌, ముంబయి

    మిథిలా పాల్కర్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-24-34

    మిథిలా పాల్కర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 'ఓరి దేవుడా' (2022) అనే ఒకే ఒక్క ఫిల్మ్‌ చేసింది. హిందీ, మరాఠి భాషల్లో 8 చిత్రాల్లో నటించింది.

    మిథిలా పాల్కర్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    గర్ల్‌ ఇన్‌ సిటీ, లిటిల్‌ థింగ్స్‌, ఆఫిషియల్‌ చుక్యాగిరి, మసాబా మసాబా

    మిథిలా పాల్కర్ Hot Pics

    Images

    Mithila Palkar

    Images

    Mithila Palkar Hot Image Poses

    మిథిలా పాల్కర్ In Bikini

    Images

    Mithila Palkar Hot In Bikini

    Images

    Mithila Palkar In Bikini

    మిథిలా పాల్కర్ In Saree

    Images

    Mithila Palkar In Traditional Looks

    Images

    Mithila Palkar Hot Images in Saree

    మిథిలా పాల్కర్ With Pet Dogs

    Images

    Actress Mithila Palkar Pet Dog

    Images

    Mithila Palkar Images With Pet Dog

    మిథిలా పాల్కర్ In Ethnic Dress

    Images

    Mithila Palkar Images in Ethnic Wear

    Images

    Mithila Palkar

    మిథిలా పాల్కర్ In Modern Dress

    Images

    Mithila Palkar Hot Images

    మిథిలా పాల్కర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Mithila Palkar

    Insta Hot Reels

    View post on Instagram
     

    Mithila Palkar insta Reel

    View post on Instagram
     

    Actress Mithila Palkar Hot Insta reel

    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే! నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..! టాలీవుడ్‌లో టాప్ హీరోల సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు హీరోయిన్లు. నాయికగా కెరీర్‌లో సుస్థిర స్థానం ఏర్పరుచుకోవాలంటే ఒకట్రెండు పెద్ద సినిమాల్లో నటించాల్సిందే. అప్పుడే రీచ్ పెరిగి హీరోయిన్లకు ఆదరణ మొదలవుతుంది. బడా ప్రాజెక్టులో నటిస్తున్నారంటే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ చూపు కూడా హీరోయిన్‌పై పడుతుంది. అలా అవకాశాలు మెరుగవుతాయి. అచ్చం ఇలాగే హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఫీలయ్యింది. కానీ, బర్త్ డే(Nidhi Agarwal BirthDay) రోజున ఈ అమ్మడు తీవ్ర నిరాశలో కూరుకుపోయిందట. కారణం ఏంటో చూద్దాం.  అదృష్టమేనా.. టాప్ హీరోతో బడా సినిమాలో ఛాన్స్ రావడం ఒక రకంగా అదృష్టమే. చాలా మంది ఎగిరి గంతేస్తారు. నిధి అగర్వాల్ కూడా దాదాపు ఇలాంటి ఫీలింగ్‌‌నే ఎక్స్‌ప్రెస్ చేసింది. ప్రస్తుతం నిధి చేతిలో అరకొర సినిమాలు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోందీ బ్యూటీ. చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా గొప్ప విషయమని ఇటీవల నిధి తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. కల నిజమైందంటూ చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు ఇదే కల కలగానే మిగిలి పోయే ప్రమాదం పొంచి ఉంది. కారణం.. ‘హరిహర వీరమల్లు’ భవితవ్యమే.  https://twitter.com/AgerwalNidhhi/status/1680791420440023040?s=20 రెండేళ్లకు పైగా.. సాధారణంగా పెద్ద సినిమా చిత్రీకరణకు కాస్త సమయం పడుతుంది. ప్రారంభం నుంచి రిలీజ్ వరకు కనీసం ఏడాది సమయం తీసుకుంటుంది. కానీ, పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వచ్చిన పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ 2021లో వచ్చింది. భారీ తారాగణంతో బిగ్ బడ్జెట్ చిత్రంగా దీనిని తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. పవన్ ఇందులో మళ్లయోధుడి పాత్ర పోషిస్తున్నారు. నిధితో పాటు సోనాల్ చౌహాన్, బాబీ డియోల్ ఇందులో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెరుగుతున్న ఆందోళన.. ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ పది కాలాల పాటు సాగాలంటే కచ్చితంగా చిత్రాలు విజయం సాధించాలి. అప్పుడే అవకాశాల ద్వారాలు మూసుకు పోకుండా ఉంటాయి. గ్లామర్ డోజ్ ఏ మాత్రం తగ్గకూడదు. వీటన్నిటితో పాటు సమయ పాలన తప్పనిసరి. ఎక్కడ చిన్న లోపం జరిగినా సినిమా అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాంటి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే రిలీజైన సినిమాలు హిట్ కావాలి. నిధి అగర్వాల్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా మిగతా ప్రాజెక్టులు పెద్దగా ఆదరణను పొందలేక పోయాయి. కెరీర్ గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ అవకాశంతో ఇక సెట్ అయిపోయినట్లేనని భావించింది. కానీ, చిత్ర షూటింగ్ వాయిదా పడుతున్న కొద్దీ నిధిలో ఆందోళన పెరిగిపోతోందని టాక్. అసలు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు నిధిని భయపెట్టిస్తున్నాయి. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ అవకాశం దక్కించుకున్నట్లు టాక్. దీంతో ఈ సినిమానైనా త్వరగా వస్తుందేమో అన్న ఆశ అమ్మడిలో నెలకొంది.  వెయిట్ చేయాల్సిందే హరిహర వీరమల్లు, ప్రభాస్-మారుతిల సినిమాలు ఈ ఏడాది రిలీజయ్యే అవకాశాలు లేవు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించాలంటే నిధి మరో ఏడాది కాలం ఆగాల్సిందే. ఆ లోపు తనని మరచిపోకుండా ఉండటానికి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన రెగ్యులర్ యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. నిధి మల్టీ టాలెంటెడ్. ఈ అమ్మడు డ్యాన్సర్ కూడా. జిమ్నాస్టిక్స్ కూడా బాగా చేస్తుంది.  
    ఆగస్టు 17 , 2023
    ఉదిత్ నారాయణ్ తెలుగు సూపర్ హిట్ సాంగ్స్]మిథువా- లగాన్ చిత్రంలో స్ఫూర్తి కలిగించే పాట హిందీ హిట్స్Listen now
    ఫిబ్రవరి 14 , 2023
    Kalki 2898 AD Day1 Collections Target: అదే జరిగితే ప్రభాస్‌ చరిత్ర సృష్టించడం ఖాయం..! బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిసేందుకు సరిగ్గా ఒక రోజే మిగిలి ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తొలి రోజు కలెక్షన్స్‌లో ఎలాంటి రికార్డ్స్‌ బద్దలు అవుతాయోనని యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే కల్కి సినిమా ప్రీ బుకింగ్స్‌ టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ముంబయి వంటి నగరాల్లో ఒక్కో టికెట్‌ రూ.3000 వేలకు సైతం విక్రయించారు. అటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం టికెట్ ధరలు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. దీంతో డే1 కలెక్షన్స్‌ పరంగా కల్కి సరికొత్త రికార్డ్‌ సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. తొలి రోజు రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ చరిత్రను తిరగరాస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో డే 1 కలెక్షన్స్‌ పరంగా టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  యూఎస్‌లో రికార్డు వసూళ్లు 'కల్కి 2898 ఏడీ' చిత్రం యూఎస్‌లో దుమ్మురేపుతోంది. విడుదలకు ముందే పలు రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కలెక్షన్స్‌ 3 మిలియన్లు దాటిపోయాయి. కల్కికి పాజిటివ్‌ టాక్‌ వస్తే ఈజీ గానే 'ఆర్‌ఆర్‌ఆర్‌', ‘బాహుబలి 2’ రికార్డ్స్‌ను చెరిపేస్తుందని అక్కడి వారు అంటున్నారు. యూఎస్‌లోని కొన్ని ఏరియాల్లో కల్కి టికెట్‌ ధర గరిష్టంగా రూ.1.5 లక్షలు కూడా పలికినట్లు చెబుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే కల్కికి ఏమాత్రం పాటిజివ్‌ టాక్‌ వచ్చినా ఓవర్సీస్‌ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.  Top 10 Highest Opening Day Collections in India 1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.  3. సలార్‌ (2023) ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్‌ తెగ మెచ్చుకున్నారు.  4. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.  5. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 6. జవాన్‌ (2023) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది. 7. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.  8. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.  9. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.  10. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది. 
    జూన్ 26 , 2024

    మిథిలా పాల్కర్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఒక సిస్టర్‌ ఉంది.

    మిథిలా పాల్కర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఓరి దేవుడా' (2022) చిత్రంతో తెలుగులో పాపులర్ అయ్యింది.

    మిథిలా పాల్కర్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    మిథిలా పాల్కర్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    లిటిల్‌ థింగ్స్‌' సిరీస్‌లో అత్యుత్తమ పాత్ర పోషించింది.

    మిథిలా పాల్కర్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    మిథిలా పాల్కర్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    మిథిలా పాల్కర్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    పిజ్జా, కప్‌కేక్స్‌

    మిథిలా పాల్కర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    మిథిలా పాల్కర్ కు ఇష్టమైన నటి ఎవరు?

    మిథిలా పాల్కర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    మిథిలా పాల్కర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    పింక్‌

    మిథిలా పాల్కర్ కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    అన్నా కెండ్రిక్‌

    మిథిలా పాల్కర్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    మిథిలా పాల్కర్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    స్విట్జర్లాండ్‌

    మిథిలా పాల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

    మిథిలా పాల్కర్ సోషల్‌ మీడియా లింక్స్‌

    మిథిలా పాల్కర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ - 2017

      'మురంబ' (మరాఠి) చిత్రానికి ఉత్తమ తెరంగేట్ర నటిగా ఎంపిక

    • ఐరీల్‌ అవార్డ్స్‌ - 2019

      'లిటిల్‌ థింగ్స్‌' ఉత్తమ హాస్య నటిగా ఎంపిక

    • ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ - 2021

      'లిటిల్‌ థింగ్స్‌' చిత్రానికి ఉత్తమ నటిగా ఎంపిక

    మిథిలా పాల్కర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మిథిలా పాల్కర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree