• TFIDB EN
  • మియా జార్జ్
    జననం : జనవరి 28 , 1992
    ప్రదేశం: ప్లాసనల్
    మియాా జార్జ్ తమిళ, మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి. కెరీర్‌ ప్రారంభంలో మలయాళ సీరియల్స్‌లో నటించింది. 'ఓరు స్మాల్‌ ఫ్యామిలీ' (2010) సినిమాతో తెరంగేట్రం చేసింది. 'మెమోరీస్‌' (2013) మూవీతో పాపులారిటీ సంపాదించింది. 'ఉంగరాల రాంబాబు' (2017) సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగు, తమిళం, మలయాళ భాషలు కలిపి 42 చిత్రాల్లో మియా జార్జ్‌ నటించింది. అలాగే ఆరు సీరియల్స్‌లోనూ కనిపించింది. ఇటీవల 'జై మహేంద్రన్‌' వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టింది.

    మియా జార్జ్ వయసు ఎంత?

    మియాా జార్జ్ వయసు 33 సంవత్సరాలు

    మియా జార్జ్ ముద్దు పేరు ఏంటి?

    మియా

    మియా జార్జ్ ఎత్తు ఎంత?

    5' 7'' (170 cm)

    మియా జార్జ్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, పెయింటింగ్స్‌

    మియా జార్జ్ ఏం చదువుకున్నారు?

    ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌

    మియా జార్జ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మలయాళ సీరియల్స్‌లో సపోర్టింగ్‌ రోల్స్‌ చేశారు.

    మియా జార్జ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఆల్ఫోన్సా కాలేజ్‌, కేరళ సెయింట్‌ థామస్‌ కాలేజ్‌, కేరళ

    మియా జార్జ్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-25-35

    మియా జార్జ్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. సునీల్‌ హీరోగా చేసిన 'ఉంగరాల రాంబాబు' (2017) సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించింది. తెలుగు, తమిళం, మలయాళ భాషలు కలిపి 42 చిత్రాల్లో మియా జార్జ్‌ నటించింది.

    మియా జార్జ్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    జై మహేంద్రన్‌' (2024) వెబ్‌సిరీస్‌లో మియా కీలక పాత్ర పోషించింది.

    మియా జార్జ్ In Saree

    Images

    Miya George Beautiful in Saree

    Images

    Miya George Hot Looks in Saree

    మియా జార్జ్ In Ethnic Dress

    Images

    Miya George In Traditional Dress

    Images

    Actress Miya George Images in Traditional Dress

    మియా జార్జ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Miya George

    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే? నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు   రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి సినిమాటోగ్రఫీ: డడ్లీ  సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: నవంబర్ 24, 2023   మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన 'ఆదికేశవ' మూవీపై వైష్ణవ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్‌ లుక్‌లో వైష్ణవ్‌ కనిపించాడు. మరి, 'ఆదికేశవ'తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్‌-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ బాలు (వైష్ణవ్‌ తేజ్‌) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్‌)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్‌ కలవగానే ఓ పాట, విలన్‌ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్‌ అన్నట్లు సినిమా సాగిపోతుంది.  ఎవరెలా చేశారంటే వైష్ణవ్‌తేజ్‌ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్‌ బాయ్‌గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్‌గా జోజు జార్జ్‌ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్‌, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్‌ అక్కడక్కడా నవ్వించాడు డైరెక్షన్‌ ఎలా ఉందంటే? కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్‌ సినిమాల్లాగే డైరెక్టర్‌ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్‌ మాత్రం బాగుంది.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్‌ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ వైష్ణవ్‌తేజ్‌ నటనమలుపులునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ కథ, కథనంపండని భావోద్వేగాలు  రేటింగ్‌: 2.5/5
    నవంబర్ 24 , 2023
    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా? న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం సంగీతం:  సుశిన్  శ్యామ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్ నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (తెలుగు డబ్బింగ్‌) విడుద‌ల తేదీ: 06-04-2024 ఇటీవల మలయాళంలో విడుదలై సెన్సేషన్‌ సృష్టించిన చిత్రం ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Review). రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇక్క‌డ కూడా భారీ కలెక్షన్స్‌ రాబట్టనుందా? అసలు ఈ చిత్ర కథేంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.  కథేంటి కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులంద‌రూ మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ నడుపుతుంటారు. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. అక్క‌డ వారంతా స‌ర‌దాగా గ‌డుపుతుండ‌గా అనుకోకుండా సుభాష్.. 150 అడుగులకు పైగా లోతున్న అతి ప్ర‌మాద‌క‌ర‌మైన డెవిల్స్ కిచెన్ లోయ‌లోకి ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? పోలీసులు వాళ్ల‌పై తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మేంటి? పోలీసులు, ఫైర్ సిబ్బంది కాకుండా సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ మాత్ర‌మే లోయ‌లోకి ఎందుకు దిగాడు? వాళ్లిద్ద‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారా? లేదా? అన్న‌ది కథ. ఎవరెలా చేశారంటే కుట్ట‌న్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన మిత్ర బృంద‌మంతా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అహ్లాదకరమైన సన్నివేశాల్లోనూ.. ఉత్కంఠభరిత సీన్లలోనూ చక్కగా నటించి ఒదిగిపోయారు. ఓ నిజమైన స్నేహితుల బృందాన్ని తెరపై చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కల్పించడంలో వారంతా సక్సెస్‌ అయ్యారు. ఇక లోయలో చిక్కుకున్నప్పుడు షాబిన్‌ షాహిర్‌, సుభాష్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఓ దశలో ఇదంతా నిజమేమోనన్న భావనను కలిగిస్తుంది. తెర కనిపించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? 2006లో గుణ కేవ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయ‌.. క‌టిక చీక‌ట్ల మ‌ధ్య తామే చిక్కుకున్నమన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కలిగేలా దర్శకుడు క‌థ‌ను న‌డిపించాడు. విరామం వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాకున్నా.. మంజుమ్మ‌ల్ గ్యాంగ్ చేసే అల్లరితో డైరెక్టర్‌ ఎక్కడా బోర్‌ కొట్టనివ్వలేదు. సుభాష్.. లోయలో ప‌డిన త‌ర్వాత నుంచి క‌థ ఉత్కంఠభరితంగా మారుతుంది. సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ లోయ‌లోకి దిగే ఎపిసోడ్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా డైరెక్టర్‌ తెరకెక్కించారు. సుభాష్‌ను కుట్ట‌న్ చేరుకున్న‌ప్పుడు ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్ష‌కుల్ని ఉలిక్కిప‌డేలా చేస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్‌ యూత్‌కు మినహా మిగిలిన వయసుల వారికి అంతగా కనెక్ట్‌ కాకపోవచ్చు. చివరిగా చక్కటి ముగింపుతో డైరెక్టర్‌ చిదంబరం అంద‌రి మ‌న‌సుల్ని బ‌రువెక్కించేలా చేశారు.  టెక్నికల్‌గా  సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. డైరెక్టర్‌, నటీనటుల తర్వాత ఎక్కువ క్రెడిట్‌ సినిమాటోగ్రాఫర్‌ షైజు ఖలీద్‌కు ఇవ్వాల్సిందే. కేవ్‌ సెటప్‌ను తన కెమెరాతో అద్భుతంగా చూపించాడు. నిజంగా ఒక కేవ్‌లో ఉన్నామన్న ఫీలింగ్‌ను తన కెమెరా పనితనంతో ఆడియన్స్‌లో  కలిగించాడు. అలాగే నేపథ్యం సంగీతం కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. భావోద్వేగ సన్నివేశాలను బీజీఎం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ కథఉత్కంఠరేపే సెకండాఫ్‌సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్‌ సంగీతం మైనస్‌ పాయింట్స్‌  నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3.5/5
    ఏప్రిల్ 06 , 2024
    Review: విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా? విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం మార్చి 22 థియేటర్లలో విడుదలైంది. ప్రచార చిత్రాలు, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, విశ్వక్‌సేన్ హిట్ కొట్టాడా? డైరెక్టర్‌గా, యాక్టర్‌గా విశ్వక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పించిందా? అనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.  దర్శకుడు: విశ్వక్‌సేన్  నటీ నటులు: విశ్వక్‌సేన్, నివేథా పెతురాజ్, రావు రమేశ్, రోహిణి, తదితరులు సంగీతం: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, జార్జ్ విలియమ్స్ కథేంటి? కృష్ణ దాస్(విశ్వక్‌సేన్) ఒక అనాథ. ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి రిచ్‌గా బతకాలని కలలు కంటుంటాడు. వెయిటర్‌గా చేస్తున్న సమయంలోనే కీర్తి(నివేథా పెతురాజ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు, సంజయ్ రుద్ర(విశ్వక్‌సేన్) ఓ ఫార్మా కంపెనీని నడిపే సీఈవో. అనుకోని కారణాల వల్ల సంజయ్ జీవితంలోకి కృష్ణదాస్ ప్రవేశించాల్సి వస్తోంది. అయితే, సంజయ్‌గా దాస్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? సంజయ్, దాస్‌లకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? చివరికి వీరిద్దరూ కలుసుకున్నారా? అనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది?  అందరికీ తెలిసిన ఫార్ములానే కావడంతో కథలో కొత్తదనం కనిపించలేదు. ఫస్టాఫ్‌లో కామెడీ సన్నివేశాలు కాస్త నవ్వించాయి. నివేదాతో లవ్ ట్రాక్ మరీ అంతగా ఆకట్టుకోలేదు. మొత్తానికి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్ధంలో తొలి పది నిమిషాలు అది కొనసాగుతుంది. ఆ తర్వాత సినిమాలో ట్విస్టులు రావడం మొదలవుతాయి. అయితే, కథలో అవసరమైన వాటికన్నా ఎక్కువ ట్విస్టులు ఉండటం ప్రేక్షకులకు రుచించలేదు. కొన్ని ట్విస్టులను ప్రేక్షకులు ఊహిస్తారు. ఎమోషనల్ సీన్స్‌ మరింత మెరుగ్గా ఉండాల్సింది. క్లైమాక్స్‌లో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  ఎవరెలా చేశారు?  విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో అలరించాడు. తనలోని భిన్న కోణాలను చూపించడానికి ఈ రెండు పాత్రలు బాగా ఉపయోగపడ్డాయి. నటన పరంగా విశ్వక్‌ ఆకట్టుకున్నాడు. బోల్డ్ డైలాగ్‌లతో మాస్ ఆడియెన్స్‌ని మురిపించాడు. నివేదా పేతురాజ్ అందంగా కనిపించింది. రావు రమేశ్, రోహిణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మహేశ్, హైపర్ ఆది కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మరో ముఖ్య పాత్రలో అజయ్ మెప్పించాడు.  టెక్నికల్‌గా సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సెకండాఫ్‌లో స్టోరీని నడిపించడానికి విశ్వక్‌ బాగానే శ్రమించాడు. తనలోని డైరెక్టర్‌కు పనిచెప్పాడు. ఇక లియోన్ జేమ్స్ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. ముఖ్యంగా ‘మావా బ్రో’, ‘ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా’ పాటలు తెరపై సందడి చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పనిచెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ విశ్వక్‌సేన్ నటన సంగీతం నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ ఎక్కువ ట్విస్టులు స్క్రీన్ ప్లే ఫైనల్‌గా.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న దాస్‌.. క్లాస్ ప్రేక్షకులకు ధమ్కీ ఇచ్చాడు. రేటింగ్: 2.5/5
    మార్చి 22 , 2023
    Malaika Arora: ఘాటు అందాలతో మలైకా రచ్చ రచ్చ… నెటిజన్లకు పెద్ద పని చెప్పిన హాట్ బ్యూటీ హాట్ డాల్ మలైకా అరోరా మరోసారి ఘాటు అందాలతో రచ్చ చేసింది. మిల్కీ వైట్ అవుట్‌ ఫిట్‌తో సోగసుల విందు చేసింది. లేటు వయసులోనూ వన్నె తగ్గని అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైట్ అండ్ వైట్ జార్జెట్‌లో టాప్‌ ఆండ్ బాటమ్స్‌లో టూ పాయింట్స్ వద్ద బ్లాక్ ప్లవర్స్‌ అద్దికతో సొగసును రెట్టింపు చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అరోరా వయసు పెరుగుతుందా? తరగి పోతుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందాలను విందు చేయడంలో కుర్ర హీరోయిన్లతో పొటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఊపిరి సలపకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. హాట్ హాట్ క్లీవేజ్ అందాలతో అబ్బా..! అనిపిస్తోంది. నిత్యం యోగా, బాడీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఇంపైన అందంతో బాడీని మెయిన్‌టెయిన్ చేస్తోంది ఆరోరా తన అందాన్ని కాపాడుకునేందుకు జిమ్‌, యోగా సెంటర్లలో గంటల తరబడి ఉంటానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది ఈ సొగసుల కోవా ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా.. ఇంకా 25+ అందంలా మెరిసిపోతూ మాయ చేస్తోంది మలైకా అరోరా 1973 అక్టోబర్ 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. హీందీతో పాటు పలు చిత్రాల్లో నటిగా, ఐటెం సాంగ్స్ చేసి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది షారుక్ ఖాన్ నటించిన దిల్‌సే చిత్రంలో చయ్య.. చయ్య పాటలో నర్తించి యావత్ సినీలోకం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ పాట తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది  నటిగా మలైకా కాంటే (2002), EMI (2008) వంటి చిత్రాలలో లీడ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. దబాంగ్, దబాంగ్ 2,  బిచ్చు, భారతీయుడు, మా తుఝే సలామ్, డాలీ కీ డోలీ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌తో  ప్రేక్షకులను అలరించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బసింగ్ సినిమాలో కెవ్వు కేక పాటలో నటించి పవర్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో రాత్రైనా నాకు ఓకే ఐటెం సాంగ్‌లో నర్తించి యూత్‌లో యమ క్రేజ్ సంపాదించింది. ఇక మలైకా అరోరా వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో వివాహం చేసుకుని 2015వరకు కాపురం చేసింది. ఆ తర్వాత తనకన్న వయసులో చాలా చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌ను 2016లో పెళ్లి చేసుకుంది. దీంతో తన అందానికి మరింత మెరుగులు దిద్దుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ సొగసుల కొమ్మ
    సెప్టెంబర్ 05 , 2023

    మియా జార్జ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఒక సిస్టర్‌ ఉన్నారు. పేరు గిని జార్జ్‌.

    మియా జార్జ్ పెళ్లి ఎప్పుడు అయింది?

    వ్యాపారవేత్త అశ్విన్‌ ఫిలిప్‌ను 2020 సెప్టెంబర్‌ 12న మియా జార్జ్‌ పెళ్లి చేసుకుంది.

    మియా జార్జ్ కు పిల్లలు ఎంత మంది?

    ఒక బాబు ఉన్నాడు. పేరు లూసా జోసెఫ్‌ ఫిలిప్‌.

    మియా జార్జ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    మలయాళ చిత్రం 'మెమోరీస్‌'తో మియా జార్జ్‌ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

    మియా జార్జ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ఓరు స్మాల్‌ ఫ్యామిలీ' (2010) అనే మలయాళ చిత్రంతో మియా జార్జ్‌ తెరంగేట్రం చేసింది. 'ఉంగరాల రాంబాబు' (2017) సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

    తెలుగులో మియా జార్జ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    మెమోరీస్‌' (2013)

    మియా జార్జ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    అనార్కలి (2015) చిత్రంలో డా. షెరిన్‌ జార్జ్‌ పాత్ర.

    మియా జార్జ్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    మియా జార్జ్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    మియా జార్జ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    మియా జార్జ్ కు ఇష్టమైన నటి ఎవరు?

    మియా జార్జ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    మలయాళం, హిందీ, ఇంగ్లీషు

    మియా జార్జ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    మియా జార్జ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌

    మియా జార్జ్ కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    చిత్ర, శ్రేయా ఘోషల్‌, ఏ.ఆర్‌. రెహమాన్‌

    మియా జార్జ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    మియా జార్జ్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    మియా జార్జ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    షిమ్లా

    మియా జార్జ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    900K ఫాలోవర్లు ఉన్నారు.

    మియా జార్జ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    మియా జార్జ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • జయ్‌సీ ఫౌండేషన్‌ అవార్డ్‌ - 2013

      'విషుధన్‌' చిత్రానికి స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ అందుకుంది.

    • TNSFA Awards 2015 - 2015

      'అమర కావ్యం' చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డ్‌ తీసుకుంది

    • ఆసియానెట్‌ కామెడీ అవార్డ్‌ - 2017

      'షెర్లాక్ టామ్స్‌' చిత్రానికి బెస్ట్‌ పాపులర్‌ నటి అవార్డు అందుకుంది

    మియా జార్జ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    చీనావాలా సీ ఫుడ్‌ రెస్టారెంట్‌, వెటో జెమ్‌ ఫ్రీ వరల్డ్‌ తదితర వ్యాపార ప్రకటనల్లో మియా నటించింది.
    మియా జార్జ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మియా జార్జ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree