• TFIDB EN
  • మోహన్ బాబు
    జననం : మార్చి 19 , 1952
    ప్రదేశం: మోదుగులపాలెం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
    మంచు మోహన్ బాబు టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 573 సినిమాల్లో నటించారు. మోహన్ బాబు, దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. సూపర్ స్టార్ రజినీకాంతకు అత్యంత సన్నిహితుడు. మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమాల్లోకి వచ్చాక మోహన్‌ బాబుగా పేరు మార్చుకున్నారు.
    Read More

    మోహన్ బాబు వయసు ఎంత?

    మంచు మోహన్ బాబు వయసు 72 సంవత్సరాలు

    మోహన్ బాబు ముద్దు పేరు ఏంటి?

    కలెక్షన్‌ కింగ్‌

    మోహన్ బాబు ఎత్తు ఎంత?

    6'0'' (182cm)

    మోహన్ బాబు ఏం చదువుకున్నారు?

    పీఈటీ

    మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సినిమాల్లోకి రాకముందు పీఈటీ టీచర్‌గా పనిచేశారు.

    మోహన్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    మోహన్ బాబు‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    మోహన్‌ బాబు.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 500 పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో 9 తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి.

    మోహన్ బాబు అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Mohan Babu

    Viral Videos

    Watch on YouTube

    Mohan Babu Viral Video

    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండిEditorial List
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండి
    ETV WIN ఓటీటీ యాప్‌లో తప్పక చూడాల్సిన సినిమాలుEditorial List
    ETV WIN ఓటీటీ యాప్‌లో తప్పక చూడాల్సిన సినిమాలు
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?

    మోహన్ బాబు తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    మంచు నారాయణ స్వామి, లక్ష్మమ్మ దంపతులకు 19 మార్చి 1952లో మోహన్‌ బాబు జన్మించారు.

    మోహన్ బాబు‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    మోహన్‌బాబుకు ముగ్గురు సోదరులు, ఒక సిస్టర్‌ ఉన్నారు. సోదరుల పేర్లు రంగనాథ్‌ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ. సిస్టర్ పేరు విజయ.

    మోహన్ బాబు పెళ్లి ఎప్పుడు అయింది?

    మోహన్‌ బాబు.. రెండుసార్లు వివాహం చేసుకున్నారు. మెుదటి పెళ్లి విద్యా దేవిని చేసుకోగా ఆమె అనివార్య కారణాలతో చనిపోయారు. దీంతో ఆమె చెల్లెలు నిర్మలా దేవిని రెండో వివాహం చేసుకున్నారు.

    మోహన్ బాబు కు పిల్లలు ఎంత మంది?

    మోహన్‌బాాబుకు ముగ్గురు సంతానం. మెుదటి భార్య బిడ్డలు మంచు విష్ణు, మంచు లక్ష్మీ. మంచు మనోజ్‌ రెండో భార్య సంతానం. ఈ ముగ్గురు టాలీవుడ్‌లో ప్రముఖ నటీ నటులుగా ఉన్నారు.

    మోహన్ బాబు Family Pictures

    Images

    Mohan Babu With His Grand Daughters

    Images

    Mohan Babu Family

    మోహన్ బాబు ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    1975లో వచ్చిన 'స్వర్గం నరకం' సినిమాలో విలన్‌గా చేసి మోహన్‌బాబు బాగా ఫేమస్‌ అయ్యారు. ఆ మూవీ తర్వాతనే భక్తవత్సలం నాయుడు నుంచి మోహన్‌ బాబుగా తన పేరును మార్చుకున్నారు.

    మోహన్ బాబు లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో మోహన్ బాబు ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    మోహన్ బాబు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    మోహన్‌ బాబు.. తన కెరీర్‌లో ఎన్నో అత్యుత్తమైన పాత్రలు చేశారు. వాటిలో పెదరాయుడు, యమదొంగసినిమాల్లోని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

    మోహన్ బాబు బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Mohan Babu best stage performance

    మోహన్ బాబు బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Mohan Babu best dialogues

    Watch on YouTube

    Mohan Babu dialogues

    Watch on YouTube

    Manchu Mohan Babu best dialogues

    Watch on YouTube

    Manchu Mohan Babu dialogues

    Watch on YouTube

    Mohan Babu best dialogues

    నటన కాకుండా మోహన్ బాబు కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?

    మోహన్‌ బాబు గొప్ప విద్యావేత్తగా గుర్తింపు పొందారు. 1993లో శ్రీ విద్యానికేతన్‌ ట్రస్ట్‌ను స్థాపించారు. ఈ ట్రస్టు కింద శ్రీ విద్యానికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, శ్రీ విద్యానికేతన్‌ డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్‌ నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు.

    మోహన్ బాబు కు ఇష్టమైన నటుడు ఎవరు?

    మోహన్ బాబు కు ఇష్టమైన నటి ఎవరు?

    మోహన్ బాబు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీషు

    మోహన్ బాబు ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    మోహన్ బాబు వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Range Rover Autobiography Audi Q7 Rover Vogue Toyota Fortuner

    మోహన్ బాబు ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    మోహన్‌ బాబు ఆస్తుల విలువ.. రూ.584 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    మోహన్ బాబు కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డు - 1995

      1995లో 'పెదరాయుడు' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.

    • సిని'మా' అవార్డు - 2008

      2008లో 'యమదొంగ' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా సిని'మా' అవార్డు తీసుకున్నారు.

    • ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ - 2016

      2016లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

    • గౌరవ డాక్టరేట్‌ - 2017

      2017లో డా.ఎంజీఆర్‌ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు.

    • విశ్వ నట సార్వభౌమ

      ఒకప్పటి కేంద్ర మంత్రి, సినీ నిర్మాత సుబ్బిరామి రెడ్డి చేతుల మీదుగా 'విశ్వ నట సార్వభౌమ' అనే బిరుదును అందుకున్నారు.

    మోహన్ బాబు కు సంబంధించిన వివాదాలు?

    "- శ్రీ రాములయ్య సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ బాంబ్‌ బ్లాస్‌ జరిగింది. ఈ ఘటనలో 23 మంది చనిపోగా.. మోహన్‌ బాబు తృటిలో తప్పించుకున్నారు. - అక్కినేని నాగేశ్వరరావు కంటే గొప్ప నటుడ్ని అని ఓ సందర్భంలో మోహన్‌బాబు చెప్పండం వివాదస్పదంగా మారింది. - మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశించి పలు సందర్భాల్లో పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి."

    మోహన్ బాబు కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    మోహన్‌ బాబు.. నిర్మాతగానూ ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటివరకూ 40 చిత్రాలను నిర్మించారు. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేశాయి. ప్రస్తుతం ఆయన రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో కన్నప్పసినిమాను నిర్మిస్తున్నారు.

    మోహన్ బాబు కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    1990వ దశకంలో టీడీపీ తరపున మోహన్‌ బాబు చరుగ్గా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకొచ్చారు. 2019 ఏపీ ఎలక్షన్స్‌లో వైఎస్సార్‌సీపీ తరపున మోహన్‌బాబు ప్రచారం చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ మోహన్‌ బాబు లేరు.
    మోహన్ బాబు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మోహన్ బాబు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree