• TFIDB EN
  • నాగ శౌర్య
    జననం : జనవరి 22 , 1989
    ప్రదేశం: ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    నాగశౌర్య తెలుగు సినిమా నటుడు. "క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్"(2011) చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. జాతీయ అవార్డు అందుకున్న చందమామ కథలు చిత్రంలో నటించాడు. నాగశౌర్య తన కెరీర్‌ ప్రారంభంలో మొదటి ఐదేళ్లు చాలా కష్టపడ్డాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందాడు. చలో చిత్రం ఇతని కేరీర్‌ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక మంధాన హీరోయిన్‌గా తెలుగులో పరిచయమైంది. అశ్వథమా, వరుడు కావలెను, కృష్ణ బృందా విహారి, రంగబలి వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు.
    Read More

    నాగ శౌర్య వయసు ఎంత?

    నాగ శౌర్య వయసు 36 సంవత్సరాలు

    నాగ శౌర్య ముద్దు పేరు ఏంటి?

    నాగ శౌర్య రెడ్డి

    నాగ శౌర్య ఎత్తు ఎంత?

    5'9"(179cm)

    నాగ శౌర్య అభిరుచులు ఏంటి?

    టెన్నీస్ ఆడటం

    నాగ శౌర్య ఏం చదువుకున్నారు?

    బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్

    నాగ శౌర్య ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    హైదరాబాద్ యూసఫ్‌ గూడలోని సేయింట్ మేరీస్ కాలేజీలో చదివాడు.

    నాగ శౌర్య రిలేషన్‌లో ఉంది ఎవరు?

    నిహారిక కొణిదెలతో అఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి

    నాగ శౌర్య బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    నాగ శౌర్య In Sun Glasses

    Images

    Naga Shaurya In Sunglasses

    Images

    Naga Shaurya Images

    నాగ శౌర్య With Pet Dogs

    Images

    Naga Shaurya Images

    Images

    Naga Shaurya With Dog

    నాగ శౌర్య Childhood Images

    Images

    Naga Shaurya

    నాగ శౌర్య అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Naga Shaurya

    నాగ శౌర్య నటించిన టాప్ హిట్ చిత్రాలుEditorial List
    నాగ శౌర్య నటించిన టాప్ హిట్ చిత్రాలు
    నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్ ఛలో సినిమా విజయంతో లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్‌లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం నాగ శౌర్య అసలు పేరు? నాగశౌర్య ముల్పూరి నాగ శౌర్య ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు నాగ శౌర్య తొలి సినిమా? క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. నాగశౌర్యకు వివాహం అయిందా? 2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.  నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు? ఐశ్వర్య రాయ్ నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా? టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు. నాగ శౌర్య ఇష్టమైన హీరో? తమిళ్ హీరో సూర్య నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్? నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది. నాగశౌర్యకు ఇష్టమైన కలర్? నీలం రంగు నాగ శౌర్య పుట్టిన తేదీ? 1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు. నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు? శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్ నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ నాగ శౌర్య ఏం చదివాడు? బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(Bcom) https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి? చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు? నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.  నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం? పెరుగు వడ నాగశౌర్య ముద్దుపేరు? నాని నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్? అనుష్క శెట్టి
    మార్చి 21 , 2024
    MARCH 17 | ఈ వారం థియేటర్లు/ఓటీటీలో విడుదలయ్యే తెలుగు చిత్రాలు గతవారం పూర్తిగా చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఈ సారి ప్రేక్షకులను అలరించేందుకు భారీ సినిమాలు వస్తున్నాయి. కేజీఎఫ్‌ రేంజ్ ట్రైలర్‌తో ఆకట్టుకున్న కబ్జ(Kabzaa) థియేటర్లలో సందడి చేయనుంది. అవసరాల శ్రీనివాస్‌, నాగ శౌర్య కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతుంది. భారీ చిత్రాలు ఓటీటీ వేదికగా సందడి చేయనున్నాయి.  మల్టీస్టారర్ కబ్జ ఇండియన్‌ రియల్ స్టార్‌ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, పునిత్ శివరాజ్‌ కుమార్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం కబ్జ. టీజర్ విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ రేంజ్‌లో ట్రైలర్ ఉండటంతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అంటున్నారు. ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతి పురస్కరించుకొని మార్చి 17న విడుదల చేస్తున్నారు. https://www.youtube.com/watch?v=CHc1bsUKv4U హ్యాట్రిక్ మూవీ దర్శకుడు అవసరాల శ్రీనివాస్, హీరో నాగశౌర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలనా అబ్బాయి- ఫలనా అమ్మాయి. టి.జి విశ్వ ప్రసాద్, దాసరి పద్మ నిర్మాతలు. ఈ చిత్రం కూడా మార్చి 17న రిలీజ్ అవుతుంది. సినిమా అందరినీ అలరిస్తోందని చిత్రబృందం నమ్మకంతో ఉంది. https://www.youtube.com/watch?v=kX5vAM8TXzE ‘సార్‌’ సందడి ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.  రైటర్ పద్మభూషణ్ రెడీ ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం ట్రైలర్‌తో హైప్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు సుహాస్. రైటర్ పద్మభూషణ్‌తో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నాడు. మార్చి 17వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు  Title CategoryLanguagePlatformRelease DateSathigani rendu ekaraluMovie Telugu Aha March 17Locked Series Telugu Aha March 17Money shotMovieEnglishNetflixMarch 15Kuthey Movie Hindi NetflixMarch 16Shadow and bone SeriesEnglish Netflix March 16Maestro Series English Netflix March 17In his shadow marchMovieEnglish Netflix March 17The magician elephant Animated MovieEnglishNetflix March 17Black adamMovieEnglish Prime videoMarch 15Dome Series English Prime video March 17Lock Movie Tamil Zee5 March 17Pop kaun Series Hindi Disney+hoststarMarch 17Rocket boysSeries Hindi Sony livMarch 16
    మార్చి 14 , 2023
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే! ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.  రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.  సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.  రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.  అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.  జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.  రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.  నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.  విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.  సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు. 
    ఫిబ్రవరి 23 , 2024
    'Phalana Abbayi Phalana Ammayi' Review: సింపుల్‌గా సాగే రోమాంటిక్ డ్రామా కానీ… నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా ఎలాంటి బజ్‌ లేకుండానే థియేటర్లలోకి వచ్చేసింది. వీరి కాంబోలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద మంచి హిట్ కావటంతో ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులను వీరిద్దరూ మెప్పించారా? అవసరాల తన దర్శకత్వ ప్రతిభను చూపించాడో లేదో? చూద్దాం. దర్శకుడు: అవసరాల శ్రీనివాస్ నటీ నటులు: నాగశౌర్య, మాళవిక నాయర్ సంగీతం: కల్యాణ్ మాలిక్ సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా కథేంటి? సంజయ్‌ ( నాగశౌర్య ), అనుపమ ( మాళవిక నాయర్ ) మధ్య జరిగే లవ్‌, రొమాంటిక్ డ్రామా. కొన్నేళ్ల పాటు స్నేహంతో కలిసి ఉన్న ఈ ఇద్దరూ ప్రేమించుకోవటం, తర్వాత వాళ్ల మధ్య ఎదురయ్యే సమస్యలు, విడిపోవటం చివరకు మళ్లీ కలుసుకోవటం అనే సింపుల్‌ కథ. ఎలా ఉందంటే?  కళాశాల నేపథ్యంలో జరిగే సన్నివేశాలతో సినిమా ప్రారంభించి ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చేందుకు అవసరాల ప్రయత్నించాడు. పాత్రల పరిచయం సింపుల్‌గా చేసి తన మార్క్ చూపించాడు.  హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. కథనం చాలా నెమ్మదిగా సాగుతుందని సగటు ప్రేక్షకులకు అనిపిస్తుంది. ప్రేక్షకులు పూర్తిగా ఇబ్బంది కలగకుండా కామెడీతో కవర్ చేయాలని చూశాడు దర్శకుడు. అవి కొంత మేరకు మాత్రమే మెప్పిస్తాయి. అన్ని చోట్ల నవ్వులు పూయించకపోవటంతో ప్రేక్షకులకు ఆ భావన పోదు.  దాదాపు 10 సంవత్సరాలు కలిసి ఉన్న జంట కొన్ని అనుకోని కారణాలతో విడిపోవటంతో ఇంటర్వెల్‌కు చేరుతుంది. ఫస్టాఫ్ ముగిసే సరికే ప్రేక్షకులు నిరాశకు గురవుతారు.  సెకాండాఫ్‌లోనూ కథనంలో వేగం లేదు. క్లైమాక్స్‌ను చిన్న సింపుల్ పాయింట్‌తో ముగించేశాడు అవసరాల శ్రీనివాస్‌. సాంకేతికంగా చిత్రం మెుత్తం నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరుగుతుంది. వీళ్లిద్దరూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరూ మరోసారి నటనలో తమ ప్రతిభ చూపించారు.  నాగశౌర్యతో క్లాసిక్ హిట్స్‌ తీసిన అవసరాల శ్రీనివాస్‌కు ఓవర్సీస్‌లో మంచి పేరు ఉంది. కానీ, అక్కడ కూడా ప్రేక్షకులను సినిమా నిరాశపర్చింది.  సినిమా చూసిన వాళ్లందరూ చాలా స్లోగా ఉందని చెబుతున్నారు. అవసరాల ఈ సారి స్క్రీన్‌ ప్లే మ్యాజిక్ చేయలేదని చెప్పవచ్చు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలో ఏదైనా బాగుందంటే అది కళ్యాణ్ మాలిక్ సంగీతం మాత్రమే. ఇందులో ఉన్న రెండు పాటలు బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. బీజీఎం కూడా బాగుంది.  సునీల్ కుమార్ నామా సినిమాటోఫ్రీతో, కిరణ్ గంటి ఎడిటింగ్‌లో అద్భుతం అనిపించారు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో వాళ్ల నైపుణ్యంతో రాబట్టగలిగారు.   బలాలు నాగశౌర్య, మాళవిక నాయర్ సంగీతం సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బలహీనతలు స్లో నరేషన్ రేటింగ్ : 2.5/5 ఊహలు గుసగుసలాడే వంటి చిత్రాన్ని చూద్దామనే అంచనాలతో వెళితే మాత్రం నిరాశ తప్పదు.
    మార్చి 17 , 2023

    నాగ శౌర్య పెంపుడు కుక్క బ్రీడ్ ఏంటి?

    Cane Corso, Lhasa Apso

    నాగ శౌర్య తల్లిదండ్రులు ఎవరు?

    శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్

    నాగ శౌర్య తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    శంకర్ ప్రసాద్ వ్యాపారవేత్త కాగా... ఉషా ప్రసాద్ హోమ్‌ మేకర్

    నాగ శౌర్య‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    గౌతమ్

    నాగ శౌర్య పెళ్లి ఎప్పుడు అయింది?

    2022 నవంబర్ 20న బెంగళూరులో తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.

    నాగ శౌర్య Family Pictures

    Images

    Naga Shaurya's Wife

    Images

    Naga Shaurya's Family

    నాగ శౌర్య ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నాగ శౌర్య సహజమైన నటన అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా అతని యూనిక్ యాక్టింగ్ స్టైల్‌ గుర్తింపునిచ్చింది.

    నాగ శౌర్య లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

    తెలుగులో నాగ శౌర్య ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    నాగ శౌర్య కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    నాగ శౌర్య తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా ఛలోచిత్రంలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి

    నాగ శౌర్య రెమ్యూనరేషన్ ఎంత?

    నాగ శౌర్య ఒక్కో చిత్రానికి రూ.4కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    నాగ శౌర్య కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    పెరుగు వడ

    నాగ శౌర్య కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నాగ శౌర్య కు ఇష్టమైన నటి ఎవరు?

    నాగ శౌర్య ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌

    నాగ శౌర్య ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    నీలం రంగు

    నాగ శౌర్య ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్

    నాగ శౌర్య ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్ కోహ్లీ, ధోని

    నాగ శౌర్య కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    తిరుమల, ఆంధ్రప్రదేశ్

    నాగ శౌర్య ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.10 కోట్లు

    నాగ శౌర్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    916K ఫాలోవర్లు ఉన్నారు.

    నాగ శౌర్య సోషల్‌ మీడియా లింక్స్‌

    నాగ శౌర్య కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    ఐరా క్రియేషన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది.
    నాగ శౌర్య వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నాగ శౌర్య కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree