• TFIDB EN
  • పి. రవిశంకర్
    ప్రదేశం: మద్రాసు, మద్రాసు రాష్ట్రం, భారతదేశం
    పి. రవిశంకర్‌ దక్షిణాదికి చెందిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు, సినీ నటుడు. దిగ్గజ నటుడు పి. జె. శర్మ కుమారుడు. నటుడు సాయికుమార్‌కు స్వయాన సోదరుడు. విలన్‌, సహాయక పాత్రలతో పాపులర్ అయ్యారు. 'అరుంధతి' సినిమాతో సహా ఆరు సార్లు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు.

    పి. రవిశంకర్ వయసు ఎంత?

    పి. రవిశంకర్‌ వయసు 58 సంవత్సరాలు

    పి. రవిశంకర్ ముద్దు పేరు ఏంటి?

    బొమ్మాళి రవిశంకర్‌

    పి. రవిశంకర్ ఎత్తు ఎంత?

    6' 3'' (190 cm)

    పి. రవిశంకర్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌

    పి. రవిశంకర్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేట్‌

    పి. రవిశంకర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    గోరింటాకు(1979) చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 1000 పైగా చిత్రాల్లో రవి శంకర్‌ నటించారు.

    పి. రవిశంకర్ In Sun Glasses

    పి. రవిశంకర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    పి. రవిశంకర్ తల్లిదండ్రులు ఎవరు?

    పీ.జే శర్మ, క్రిష్ణ జ్యోతి దంపతులకు 1966 నవంబర్‌ 28న రవి శంకర్‌ జన్మించారు.

    పి. రవిశంకర్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    రవి శంకర్‌ తండ్రి పీ.జే. శర్మ టాలీవుడ్‌లో దిగ్గజ నటులు. తెలుగు, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. 500కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారుడిగా తన గాత్రం అందించారు. 2014, డిసెంబర్ 14న హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.

    పి. రవిశంకర్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ప్రముఖ టాలీవుడ్‌ నటుడు సాయికుమార్‌ సోదరుడు అవుతాడు. ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 300 పైగా చిత్రాలు చేశారు. రాజేశేఖర్‌, సుమన్‌ వంటి హీరోలకు డబ్బింగ్‌ చెప్పారు. మరో సోదరుడు అయ్యప్ప కూడా నటుడిగా రాణిస్తున్నాడు. వీరితో పాటు కమల నారాయణ్‌, ప్రియా కార్తికేయన్‌ అనే ఇద్దరు సిస్టర్స్‌ ఉన్నారు.

    పి. రవిశంకర్ కు పిల్లలు ఎంత మంది?

    రవి శంకర్‌కు ఓ కుమారుడు ఉన్నాడు. పేరు అధ్వే శంకర్‌. టాలీవుడ్‌ నటుడు ఆది, రవిశంకర్‌కు అన్నయ కుమారుడు అవుతాడు.

    పి. రవిశంకర్ Family Pictures

    పి. రవిశంకర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో రవిశంకర్‌ బాగా పాపులర్‌ అయ్యారు. 3,500 చిత్రాలకు ఆయన డబ్బింగ్‌ చెప్పారు.

    తెలుగులో పి. రవిశంకర్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    1979 నుంచి ఆయన సినిమాల్లో ఉన్నారు. చాలా చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. 'దండుపాళ్యం' (2012) సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా తొలిసారి లీడ్‌రోల్‌లో కనిపించారు.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన పి. రవిశంకర్ తొలి చిత్రం ఏది?

    పి. రవిశంకర్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    2011లో వచ్చిన కన్నడ చిత్రం 'కెంపెగౌడ'లో అత్యుత్తమ పాత్రను పోషించారు.

    పి. రవిశంకర్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    పి. రవిశంకర్ రెమ్యూనరేషన్ ఎంత?

    పాత్రను బట్టి ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

    పి. రవిశంకర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    పి. రవిశంకర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, ఇంగ్లీషు

    పి. రవిశంకర్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    పి. రవిశంకర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, బ్లూ

    పి. రవిశంకర్ కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    పి. రవిశంకర్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    పి. రవిశంకర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    22.4K ఫాలోవర్లు ఉన్నారు.

    పి. రవిశంకర్ సోషల్‌ మీడియా లింక్స్‌

    పి. రవిశంకర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డ్‌ - 1999

      'ప్రేమ కథ' చిత్రానికి ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంపిక

    • నంది అవార్డ్‌ - 2002

      'ఇంద్ర' చిత్రానికి ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంపిక

    • నంది అవార్డ్‌ - 2004

      'సై' చిత్రానికి ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంపిక

    • నంది అవార్డ్‌ - 2006

      'పోకిరి' చిత్రానికి ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంపిక

    • నంది అవార్డ్‌ - 2007

      'అతిథి' చిత్రానికి ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంపిక

    • నంది అవార్డ్‌ - 2008

      'అరుంధతి' చిత్రానికి ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంపిక

    • నంది అవార్డ్‌ - 2009

      'ఆంజనేయులు' చిత్రానికి ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంపిక

    • ఫిల్మ్‌ఫేర్‌ - 2012

      'ఢమరుకం' చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు

    • నంది అవార్డ్‌ - 2012

      'జులాయి' చిత్రానికి ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎంపిక

    పి. రవిశంకర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే పి. రవిశంకర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree