• TFIDB EN
  • రాహుల్ హరిదాస్
    జననం : నవంబర్ 02 , 1986
    ప్రదేశం: హైదరాబాద్
    రాహుల్ దయాకిరణ్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు, తెలుగు చిత్రసీమలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. అతను శేఖర్ కమ్ముల యొక్క 2007 చిత్రం, హ్యాపీ డేస్‌తో తన సినీ రంగ ప్రవేశం చేసాడు.
    కథనాలు
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ !
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ ! నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్ ఎడిటింగ్: జి.సత్య నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్‌ విడుదల తేదీ : మే 31, 2024 యంగ్‌ హీరో కార్తికేయ (Karthikeya) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా చేసింది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌, టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తికేయ నటన సినిమాపై అంచనాలు పెంచింది. మరి మే 31న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ఎలా ఉంది? ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ తనదైన నటనతో అదరగొట్టాడు. బాధ, ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లలోనూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లభించలేదు. స్క్రీన్‌పై కనిపించినంత సేపు తన గ్లామర్‌తో ఏదోలా నెట్టుకొచ్చింది. అటు సోదరుడి పాత్రలో రాహుల్‌ టైసన్‌ మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. విలన్‌ పాత్రలో బొమ్మాళి రవిశంకర్‌ ఎప్పటిలాగే తన మార్క్‌ ఏంటో చూపించాడు. తనికెళ్ల భరణి సహా మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి.. తొలి చిత్రంతోనే తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యాడు. హీరో లాకప్‌లో ఉండే సీన్‌తో మూవీని మెుదలు పెట్టిన డైరెక్టర్‌.. డిఫరెంట్‌గా ఫ్లాష్‌బ్యాక్‌లో కథను నడిపించారు. స్టోరీ సెటప్‌ కోసం ఫస్టాప్‌ను ఉపయోగించుకున్న అతడు.. ఇంటర్వెల్‌కు ఇచ్చిన బిగ్‌ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని రగిలించారు. అక్కడ నుంచి ఏమాత్రం ఫ్లో మిస్‌ కాకుండా క్లైమాక్స్‌ వరకూ ఇంట్రస్టింగ్‌గా కథను నడిపించి ఆకట్టుకున్నాడు. అయితే క్లైమాక్స్‌ను రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మెట్‌లో ముగించడం కాస్త ఆసంతృప్తిగా అనిపిస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. కెమెస్ట్రీ అసలు వర్కౌట్‌ కాలేదు. కొన్ని లాజికల్‌ ఎర్రర్స్‌ను మినహాయిస్తే ‘భజే వాయు వేగం’ తప్పకుండా థ్రిల్‌ చేస్తుంది. టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. కపిల్‌ కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రాధన్‌ సాంగ్స్‌ కూడా బాగున్నాయి. ఆర్‌.డి రాజశేఖర్‌ కెమెరా పనితనం మెపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ కార్తికేయ నటనఇంటర్వెల్‌ ట్విస్ట్‌సెకండాఫ్‌ మైనస్‌ పాయింట్ హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌రొటిన్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5  
    జూన్ 05 , 2024
    Sai Pallavi: నిత్యామీనన్‌.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్‌ రాకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌! నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్‌ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్‌ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి తన నటన, మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవికి తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డు అన్యాయం జరిగినట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ దఫా కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని భావించిన తమను అవార్డ్స్‌ కమిటీ నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  సాయిపల్లవిని కాదని..! 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సెన్సార్‌ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటి నామినేషన్స్‌లో గార్గి చిత్రానికి గాను సాయిపల్లవి అవార్డు రేసులో నిలిచింది. తన తండ్రిని జైలు నుంచి తీసుకురావడానికి పోరాడే ఉపాధ్యాయురాలిగా అందులో సాయి పల్లవి అద్భుత నటన కనబరిచింది. దీంతో కచ్చితంగా ఆమెకు నేషనల్ అవార్డు వస్తుందని సినీ విశ్లేషకులతో పాటు ఆమె అభిమానులు భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా నిత్యా మీనన్‌ను జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేసి అవార్డుల ఎంపిక కమిటీ షాకిచ్చింది. తిరుచిట్రంబళం (తమిళం) చిత్రానికి గాను నిత్యామీనన్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది. అలాగే 'కచ్‌ ఎక్స్‌ప్రెస్‌' అనే గుజరాతీ ఫిల్మ్‌లో నటించిన మానసి పరేఖ్‌కు ఉత్తమ నటి అవార్డ్‌ సంయుక్తంగా వరించింది. నిత్యా మీనన్‌ ఏం గొప్ప..! నేషనల్ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో సాయి పల్లవికి అన్యాయం జరిగిదంటూ సోషల్‌ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు హల్‌చల్‌ చేస్తున్నాయి. సాయిపల్లవిని కాదని నిత్యమీనన్‌కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటన కంటే నిత్యా మీనన్‌ నటన ఏం బాగుందని ప్రశ్నిస్తున్నారు. తిరుచిట్రంబళం చిత్రంలో నిత్య మీనన్‌ నటన బాగున్నప్పటికీ అది గార్గీలో సాయి పల్లవి యాక్టింగ్‌ను మ్యాచ్‌ చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. తండ్రి కోసం పోరాడే ఉపాధ్యాయురాలి పాత్రలో సాయిపల్లవి జీవించేసిందని గుర్తు చేస్తున్నారు.  https://twitter.com/david_bro18/status/1824390579129815154 https://twitter.com/jammypants4/status/1824662625713521129 https://twitter.com/tum_saath_ho/status/1824438399735869460 బెస్ట్‌ యాక్టర్‌గా సౌత్‌ స్టార్‌ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా 'ఆట్టమ్‌'  (Aattam) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా 'కేజీఎఫ్‌ 2', బెస్ట్‌ హిందీ ఫిల్మ్‌గా గుల్‌మోహర్‌ నిలిచాయి. ఇక ‘కాంతార’ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న రిషబ్‌ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచాడు. జాతీయ అవార్డు విజేతలు వీరే ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్‌ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతి) ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్‌ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్‌ రెహమాన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 తమిళం) ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి (పొన్నియిన్‌ సెల్వన్‌ - 1) ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: శ్రీపాథ్‌ (మాలికాపురం  - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే:  ఆనంద్‌ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్‌: మహేష్‌ భువనేండ్‌ (ఆట్టం) ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: అన్బరివు (కేజీఎఫ్-‌ 2)ఉత్తమ మేకప్‌: సోమనాథ్‌ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నిక్కి జోషి (కచ్‌ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల (గుల్‌మోహర్‌) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2  (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్‌ 2  (కన్నడ)ఉత్తమ  ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్‌ సెల్వన్‌ - 1  (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం  : గుల్‌మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్‌ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ  (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్‌ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ) జాతీయ ఉత్తమ నాన్‌ ఫీచర్‌ సినిమాలు ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌: ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌  (మరాఠీ)ఉత్తమ యానిమేషన్‌ సినిమా: ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్‌ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ : బస్తి దినేశ్‌ షెనోయ్‌  (ఇంటర్‌మిషన్‌ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌: విశాల్‌ భరద్వాజ్‌ (ఫుర్సత్‌ - లీజర్‌/ హిందీ)ఉత్తమ క్రిటిక్‌: దీపక్‌ దుహా (హిందీ) ఉత్తమ బుక్‌ ఆన్‌ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌ కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ - ఇంగ్లిష్‌)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్‌ దివాన్‌ -మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లీష్‌)
    ఆగస్టు 17 , 2024
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే? నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన  లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?  ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.   సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    మే 17 , 2024
    ‘ముఖచిత్రం’తో ఎంట్రీ ఇచ్చిన అయేషా ఖాన్ అందాల విందు]నటుడు రాహుల్ రామకృష్ణను, రచయిత సందీప్ రాజ్‌ని అయేషా ఖాన్ ఫాలో అవుతోంది. మరికొంత మంది టాలీవుడ్, బాలీవుడ్ తారలను అనుసరిస్తోంది.
    ఫిబ్రవరి 13 , 2023

    రాహుల్ హరిదాస్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాహుల్ హరిదాస్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree