• TFIDB EN
  • రాహుల్ విజయ్
    ప్రదేశం: హైదరాబాద్‌
    రాహుల్‌ విజయ్‌ టాలీవుడ్‌కు చెందిన యువ నటుడు. 1992లో హైదరాబాద్‌లో జన్మించాడు. ఇతని తండ్రి సినిమా స్టంట్ మాస్టర్ విజయ్. 'ఈ మాయ పేరేమిటో' (2018) సినిమాతో రాహుల్‌ వెండి తెరకు పరిచయం అయ్యాడు. 'కోట బొమ్మాళి పీ.ఎస్' (2023) మంచి గుర్తింపు సంపాదించాడు. ప్రస్తుతం యువ కథానాయకుడిగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

    రాహుల్ విజయ్ ఎత్తు ఎంత?

    5'9" (176cm)

    రాహుల్ విజయ్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, మ్యూజిక్‌ వినడం

    రాహుల్ విజయ్ ఏం చదువుకున్నారు?

    ఎంఏ (మాస్ కమ్యూనికేషన్)

    రాహుల్ విజయ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సెయింట్ మేరీస్ కాలేజీ, హైదరాబాద్‌

    రాహుల్ విజయ్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 6 చిత్రాల్లో నటించారు.

    రాహుల్ విజయ్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    రాహుల్ విజయ్ In Sun Glasses

    Images

    Rahul Vijay Images in Sunglasses

    Images

    Rahul Vijay In Sunglasses

    రాహుల్ విజయ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Rahul Vijay

    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే? నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన  లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?  ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.   సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    మే 17 , 2024
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌  తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న  థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.  ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..  పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.  (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.  మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,  మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన  కృష్ణ (రాహుల్ విజయ్)ని  ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    Vijay Devarakonda: ఏ తెలుగు హీరో చేయని ఫీట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఏమిటంటే? టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్‌ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీతా గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో విజయ్ కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఫొటోగ్రాఫర్‌గా మారి బాలీవుడ్‌ నటితో రొమాన్స్‌ చేశాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  ‘సాహిబా’ వచ్చేసింది.. మ్యూజిక్‌ కంపోజర్‌, సింగర్‌ జస్లీన్‌ రాయల్‌ (Jasleen Royal) రూపొందించిన 'హీరియో' సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యింది. దాని తర్వాత ఆమె కంపోజ్‌ చేసిన మరో కొత్త సాంగ్‌ 'సాహిబా' (Sahiba Music Album) తాజాగా మ్యూజిక్‌ లవర్స్‌ ముందుకు వచ్చింది. ఇందులో రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వింటేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మ్యూజిక్‌ లవర్స్‌ హృదయాలను హత్తుకునేలా ఈ ఆల్బమ్‌ ఉంది. ఈ సాంగ్‌లో విజయ్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించగా బాలీవుడ్‌ నటి రాధిక మదన్ (Radhika Madan) రాజవంశానికి చెందిన రాకుమారిగా చేసింది. ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ సాంగ్‌లో విజయ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సాంగ్‌ మధ్యలో ముస్లిం కాస్ట్యూమ్‌లో కనిపించి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. సాహీబా ఆల్బమ్‌ సెన్సేషన్‌ కావడం పక్కా అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. https://www.youtube.com/watch?v=NW6Dgax2d6I&t=224s హీరియోను తలదన్నేలా.. గత కొద్ది రోజుల క్రితం సింగర్ జస్లీన్ విడుదల చేసిన ‘హీరియే’ ఆల్బమ్ (Heeriye Music Album) అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ మ్యూజిక్ లవర్స్‌ను అలరించేందుకు ‘సాహిబా’ను జస్లీన్‌ రాయల్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ, రాధిక మదన్ కెమిస్ట్రీ మరో లెవెల్లో ఉందని చెప్పవచ్చు. ఈ ఆల్బమ్  ‘హీరియే’ సాంగ్‌ను మించి హిట్ అవుతుందని విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ అంచనా వేస్తున్నారు.  https://twitter.com/jasleenroyal/status/1855857071662711025 బాలయ్య వాయిస్‌ ఓవర్‌! రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం 'జెర్సీ' ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'VD 12' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. విజయ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాగా ఇది రాబోతోంది. ఈ సినిమాలో విజయ్‌ రగ్‌డ్‌ లుక్‌లో సరికొత్త మాస్‌ అవతారంతో కనిపించబోతున్నాడు. ఇందులో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse), రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth) నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలో రిలీజ్‌ కానున్న ఈ మూవీ టీజర్‌కు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వాయిస్‌ ఓవర్‌ అందిస్తారని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్‌ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.  విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం విజయ్‌ వరుస ఫ్లాప్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఆయన రీసెంట్‌ చిత్రాలు లైగర్‌, ఖుషీ, ఫ్యామిలీ స్టార్‌ బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఎలాగైన హిట్‌ కొట్టాలన్న కసితో విజయ్ ఉన్నాడు. ప్రస్తుతం విజయ్‌ చేతిలో 'VD 12'తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. 'ఖుషీ' తర్వాత దిల్‌ రాజు నిర్మాణంలో మరో ప్రాజెక్ట్‌ను విజయ్‌ అనౌన్స్‌ చేశాడు. దీనిని యంగ్‌ డైరెక్టర్‌ 'రాజావారు రాణివారు' ఫేమ్ రవికిరణ్‌ కోలా (Ravi Kiran Kola) తెరకెక్కించనున్నాడు. అలాగే రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఒక పీరియాడికల్ యాక్షన్‌ డ్రామా కూడా రౌడీ బాయ్‌ చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. 
    నవంబర్ 15 , 2024
    Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..! సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ‘మ్యూజికల్ కాన్సర్ట్’ (Musical Concert) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలు హిట్టయ్యాయి. దీంతో మ్యూజికల్ కాన్సర్ట్‌ని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్, సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి, తదితరులు స్టేజిపై సందడి చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల్లోని పాటలు పాడుతూ హోరెత్తించారు. అయితే, మ్యూజిక్ సెషన్ అనంతరం చిన్మయి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా నాగచైతన్య ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చిందని చర్చ సాగుతోంది.  https://twitter.com/SureshPRO_/status/1691450193684934656 సమంత అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది సినిమాల్లోని ఆమె గాత్రమే. సామ్‌కి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే. సమంత తొలి సినిమా నుంచి వీరిద్దరి కాంబో కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా ఖుషి సినిమాకు సైతం సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో చిన్మయి, రాహుల్ దంపతులు అండగా నిలిచారు. కుంగిపోవద్దని ధైర్యం నూరి పోశారు.  https://twitter.com/SamanthaPrabuFC/status/1691498121405374464 అంతకుముందు నాగచైతన్యతో విడాకుల ఘటనపై సామ్ మీద చై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోశారు. సమంత ప్రవర్తనే కారణమంటూ నిందించారు. దీంతో సామ్ కుంగుబాటుకి గురైంది. సన్నిహితుల సాయంతో క్రమంగా కోలుకుంటూ సామ్ తిరిగి మేకప్ వేసుకుంది. అయితే, ఈ తతంగం అందరూ మర్చిపోయిన సమయంలో చిన్మయి చేసిన కామెంట్స్ నాటి రోజుల్ని గుర్తు చేశాయి.  https://twitter.com/TeamSamantha__/status/1691659796737622037 చిన్మయి ఏమందంటే? స్టేజిపై పాట పాడిన అనంతరం యాంకర్ సుమ చిన్మయికి మైక్ ఇచ్చింది. ‘ఈ స్టేజిపై నుంచి నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నా సామ్.. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది నీ వల్లే. ఈ రోజు నువ్వు ఎంతో మందిలో స్ఫూర్తి నింపావు. అమ్మాయిలకు, అబ్బాయిలకు నువ్వొక హీరోవి. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఉత్తమమైన వ్యక్తి సమంత. చాలా మంచి అమ్మాయి, ధైర్యవంతురాలు. ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా ఏమీ మారదు’ అంటూ మాట్లాడింది. అనంతరం, సమంతకు డెడికేట్ చేస్తూ ఓ పాట పాడింది. నాగచైతన్యతో విడాకులపై సమంతను బలిపశువును చేయడంపై చిన్మయి ఇలా స్ట్రాంగ్ రిప్లే ఇచ్చినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.  https://twitter.com/SamanthaPrabuFC/status/1691489745350897664 ఫ్యాన్స్ హ్యాపీ చిన్మయి స్పీచ్‌పై సమంత ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు సరైన విషయం చెప్పారంటూ చిన్మయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత గురించి ఫ్యాన్స్ మనసులోని మాటను చిన్మయి బయటపెట్టారని చెబుతున్నారు. సామ్, చిన్మయిల ఫ్రెండ్‌షిప్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరికొందరు ఫ్యాన్స్ సైతం ఇదే విధమైన ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తరఫున మాట్లాడినందుకు చిన్మయికి ధన్యవాదాలు చెబుతున్నారు. https://twitter.com/__GirDhar/status/1691518743820791809 విజయ్, సామ్ పర్ఫార్మెన్స్ మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఖుషి టైటిల్ సాంగ్‌కి వీరిద్దరూ కలిసి కాలు కదిపారు. సామ్‌ని విజయ్ ఒంటిచేత్తో ఎత్తుకుని గింగిరాలు తిప్పాడు. అలాగే పైకి ఎత్తుకుని ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. కిందికి దిగగానే సామ్ ‘హల్లో హైదరాబాద్’ అని విష్ చేయగా ‘తెలుగు ప్రజల్లారా..’ అంటూ రౌడీబాయ్ స్టార్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  https://twitter.com/AndhraBoxOffice/status/1691475831133274112
    ఆగస్టు 16 , 2023

    రాహుల్ విజయ్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    రాహుల్ 1992లో హైదరాబాదులో జన్మించాడు. ఇతని తండ్రి సినిమా స్టంట్ మాస్టర్ విజయ్.

    రాహుల్ విజయ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఒక సోదరి ఉంది. పేరు దివ్య విజయ్‌ (నిర్మాత)

    రాహుల్ విజయ్ Family Pictures

    Images

    Rahul Vijay Images

    Images

    Rahul Vijay With His Mother

    రాహుల్ విజయ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    కోట బొమ్మాళి పీ.ఎస్ సినిమాతో పాపులర్ అయ్యాడు.

    రాహుల్ విజయ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో రాహుల్ విజయ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రాహుల్ విజయ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    కోట బొమ్మాళి పీ.ఎస్ చిత్రంలో కానిస్టేబుల్‌ సత్తారు రవి కుమార్‌ పాత్ర

    రాహుల్ విజయ్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    రాహుల్ విజయ్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    రాహుల్ విజయ్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.20-50 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.

    రాహుల్ విజయ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    రాహుల్ విజయ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, బ్లూ

    రాహుల్ విజయ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    రాహుల్ విజయ్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    రోహిత్ శర్మ

    రాహుల్ విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    25.4K ఫాలోవర్లు ఉన్నారు.

    రాహుల్ విజయ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రాహుల్ విజయ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాహుల్ విజయ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree