• TFIDB EN
  • రాజశేఖర్
    జననం : ఫిబ్రవరి 04 , 1962
    ప్రదేశం: లక్ష్మీపురం, మద్రాసు రాష్ట్రం, భారతదేశం
    రాజశేఖర్ వరదరాజన్ ప్రధానంగా తెలుగు చిత్రసీమలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ నటుడు. ముప్పై ఎనిమిది సంవత్సరాలకు పైగా సాగిన కెరీర్‌లో, అతను ఎనభైకి పైగా చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించాడు. అతను అనేక పాత్రలలో నటించాడు. తలంబ్రాలు, శృతిలయలు, ఆహుతి, అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు, అన్న, ఓంకారం, సూర్యుడు, శివయ్య, మనసున్న మారాజు, మా అన్నయ్య, సింహరాసి, ఎవడైతే నాకేంటి, గోరింటాకు, PSV గరుడ వేగ వంటి ప్రముఖ చిత్రాలతో పాటు రాజశేఖర్ ఉత్తమ నటుడిగా రెండు అవార్డులు గెలుచుకున్నారు.
    కథనాలు
    Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!
    Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..! రాజశేఖర్ - జీవిత నట వారసురాలు శివాత్మిక (Shivathmika Rajashekar) సోషల్‌ మీడియాలో మరోమారు రెచ్చిపోయింది.  తాజా ఫొటో షూట్‌లో హద్దులన్నీ చెరిపేసిన ఈ చిన్నది నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.  శివాత్మిక అందాలను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్ ఆమెదంటూ కామెంట్స్ చేస్తున్నారు.  2019లో ‘దొరసాని’ చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా పురస్కారం అందుకుంది.  దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.  స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్‌మీడియాపై ఫోకస్ పెట్టింది.  తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శక నిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. హాట్‌ డోస్‌ను రెట్టింపు చేస్తూ ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను పంచుకుంటోంది. చురకత్తుల్లాంటి చూపులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.  శివాత్మిక తీరుతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్‌పై కన్నేస్తున్నారు. ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురు ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3 లక్షల 95 వేల మంది ఫాలో అవుతున్నారు.
    ఫిబ్రవరి 16 , 2024
    Shivathmika Rajashekar: సమ్మర్‌లో మరింత హీట్‌ పెంచుతున్న శివాత్మిక అందాలు రాజశేఖర్ నట వారసురాలు శివాత్మిక సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాాగా కొన్ని ఫోటోలను షేర్‌ చేసిన ఈ బామ ఎద అందాలతో రెచ్చిపోయింది. నడుము, ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించే ఈ భామను హాట్‌ లుక్స్‌లో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.  2019లో దొరసాని చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా పురస్కారం అందుకుంది.  దొరసాని తర్వాత పంచతంత్రం, ఆకాశం చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.  గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్‌ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.  శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 
    ఏప్రిల్ 04 , 2023
    Shivathmika: స్టన్నింగ్‌ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..! యంగ్‌ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ మరోమారు తన ‌అందచందాలతో సోషల్‌మీడియాను ఆకర్షించింది. ఈ అమ్మడి లేటెస్ట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  తాజా ఫొటోల్లో మోడ్రన్‌ డ్రెస్‌లో కనిపించిన ఈ భామ లేలేత అందాలను ఆరబోసింది. ఎద, నడుము ఒంపులను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.  స్టార్‌ హీరోయిన్‌ కావాలని భావిస్తున్న ఈ భామ తన ఒంపుసొంపులను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు.  తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శకనిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఫ్యాషన్ డ్రెస్ వేసిన శివాత్మిక కెమెరాకు పోజులిచ్చింది. ప్రముఖ నటులు జీవిత-రాజశేఖర్ కుమార్తె అయిన శివాత్మిక 2019లో వచ్చిన దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పీరియాడిక్‌ లవ్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.  గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్‌ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.  శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 
    నవంబర్ 16 , 2023
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే? నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన  లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?  ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.   సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    మే 17 , 2024

    రాజశేఖర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాజశేఖర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree