రాజీవ్ రవి
రాజీవ్ రవి కేరళలోని కొచ్చికి చెందిన భారతీయ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు మరియు నిర్మాత. అతను హిందీ మరియు మలయాళ చిత్రాలలో తన పనికి బాగా ప్రసిద్ది చెందాడు. 1997లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాక, అతను తన వృత్తిని ప్రారంభించాడు. సంతోష్ తుండియిల్ తీసిన మలయాళ చిత్రం, ప్రణయవర్ణంగల్ (1998), అసలు సినిమాటోగ్రాఫర్ వేణు డేట్ క్లాష్‌లు వచ్చినప్పుడు, నిర్మాత ఆర్. మోహన్ (గుడ్‌నైట్ మోహన్) చేత ప్రారంభించబడిన చాందినీ బార్ (2001) చిత్రంతో అతను సినిమాటోగ్రాఫర్‌గా ప్రవేశించాడు. ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు.
కథనాలు

Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్ సుమ తనయుడు.. ‘బబుల్ గమ్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాణ సంస్థలు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 29-12-2023
రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్ గమ్’. రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్ వంటి ప్రముఖ తారలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, ట్రైలర్, పాటలు యువతరాన్ని ఆకర్షించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోషన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.
కథ
హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ.
ఎవరెలా చేశారంటే
హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేశాడు. హర్షవర్ధన్, అనుహాసన్ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్ రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రోషన్, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్, క్లైమాక్స్
మైసన్ పాయింట్స్
రొటిన్ కథ, కథనంసాగదీత సీన్స్
రేటింగ్: 2.5/5
డిసెంబర్ 29 , 2023
Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా?
ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గౌరి ప్రియ (Gouri Priya)
టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్ పక్కన ‘లవర్’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
https://www.youtube.com/watch?v=8dwrE0OCq40
ఆనందిని (Anandhi)
వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్ హీరోగా చేసింది.
చాందిని చౌదరి (Chandini Chowdary)
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్ సేన్ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
దివ్య శ్రీపాద (Divya Sripada)
టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్ కామ్రేడ్’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala)
ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్, మేజర్, పొన్నిసెల్వన్ వంటి హిట్ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
రితు వర్మ (Ritu Varma)
హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్ షా' (Badshah) సినిమాలో కాజల్ ఫ్రెండ్ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.
https://www.youtube.com/watch?v=4hNEsshEeN8
స్వాతి రెడ్డి (Swathi Reddy)
వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా, గోల్కొండ స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్ ఆఫ్ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.
https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE
డింపుల్ హయాతి (Dimple Hayathi)
ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606
శివాని నగరం (Shivani Nagaram)
ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి.
మానస చౌదరి (Maanasa Choudhary)
ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.
https://twitter.com/i/status/1762802318934950146
అంజలి (Anjali)
తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, సరైనోడు, వకీల్‌సాబ్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
మార్చి 06 , 2024
Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్ మీ’ ప్రయోగం ఫలించిందా?
నటీనటులు : ఆశిష్, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ
దర్శకత్వం : అరుణ్ భీమవరపు
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
సినిమాటోగ్రాఫీ : పీ.సీ. శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్ : కొల్లా అవినాష్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లాది
విడుదల తేదీ : 25 మే, 2024
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ఇఫ్ యూ డేర్ (If You Dare) అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, మే 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
తొలి చిత్రం రౌడీ బాయ్స్‌లో కాలేజీ కుర్రాడిగా అలరించిన ఆశిష్.. ఈ సినిమాలో డెవిల్స్ హంటర్ పాత్రలో మెప్పించాడు. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా నటించి నటుడిగా ఇంకాస్త మెరుగయ్యాడు. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో మెప్పించింది. ఆమెకు కీలకమైన పాత్రే దక్కింది. ఆడియన్స్ వైష్ణవి చైతన్యకు మరోమారు కనెక్ట్ అవుతారు. బుల్లితెర నటుడు రవికృష్ణ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం ఈ ముగ్గురి పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అరుణ్.. ఒక నవల రచయిత కావడంతో సినిమా చూస్తున్నంత సేపు ఓ నవల చదువుతున్న ఫీల్ కలుగుతుంది. దెయ్యమే చెప్తున్నట్లుగా కథను నడిపించడం ఆసక్తికరం. తొలి భాగం అంతా అర్జున్ గురించి, అతడు దివ్యవతిని వెతుక్కుంటూ వెళ్లడం గురించే చూపించారు. ఇంటర్వెల్‌కు ముందు దెయ్యంతో వచ్చే సన్నివేశాలు.. ఆపై రివీల్ చేసే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్.. ప్రీక్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్టును డైరెక్టర్ రివీల్ చేసుకుంటూ వెళ్లడం మెప్పిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో చాలా చోట్ల డైరెక్టర్ తడబడినట్లు కనిపిస్తుంది. ఐదారుగురు హీరోయిన్స్‌ను తెరపైకి తీసుకొచ్చి కథపై ఆసక్తిరేపినా.. వారి పాత్రలను సరిగా వివరించకపోవడంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. క్లైమాక్స్ కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే ఓ లవ్‌స్టోరీకి దెయ్యం కథను జోడించి డైరెక్టర్ అరుణ్ చేసిన తొలి ప్రయోగం కొంతమేర ఫలించిందని చెప్పొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం మెస్మరైజ్ చేస్తుంది. తన నైపుణ్యంతో అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆయన తన BGMతోనే ఆడియన్స్‌ను భయపెట్టారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా సినిమా కోసం బాగా శ్రమించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
ఆశిష్, వైష్ణవి చైతన్యఆసక్తికరంగా సాగే కథనంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
కన్ఫ్యూజింగ్ సీన్స్‌ఏమోషన్స్ లేకపోవడం
Telugu.youSay.tv Rating : 2.5/5
https://telugu.yousay.tv/top-secrets-you-didnt-know-about-vaishnavi-chaitanya.html
మే 25 , 2024
Srikakulam sherlock holmes Review: డిటెక్టివ్‌గా వెన్నెల కిషోర్ ఓకే.. మరి హిట్ కొట్టాడా?
నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, శియా గుప్తా, రవితేజ మహాదాస్యం, మురళీధర్ గౌడ్, అనీష్ కురువిల్లా, బాహుబలి ప్రభాకర్, భద్రం, నాగ్ మహేశ్, ప్రభావతి తదితరులు
రచన, దర్శకత్వం: రైటర్ మోహన్
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: ఎన్.మల్లికార్జున్
నిర్మాత: వెన్నపూస రమణారెడ్డి
విడుదల తేదీ: 25-12-2024
వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ (Srikakulam Sherlock Holmes). ప్రముఖ రచయిత మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, స్నేహ గుప్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
షెర్లాక్ హోమ్స్‌గా (Srikakulam sherlock holmes Review) పిలవబడే ఓం ప్రకాష్ (వెన్నెల కిషోర్) శ్రీకాకుళంలో ఓ డిటెక్టివ్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి వైజాగ్‌లో జరిగిన ఓ మర్డర్ కేసు సాల్వ్ చేయమని ఛాలెంజ్ వస్తుంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు అనుమానితులు బాలకృష్ణ (రవితేజ మహాదాస్యం), భ్రమరాంబ (అనన్య నాగళ్ళ), రమేష్ పట్నాయక్(ప్రభాకర్) తదితరులని మార్క్ చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌లో చనిపోయింది ఎవరు? హత్యతో ఈ ఏడుగురికి నిజంగానే సంబంధం ఉందా? ఎందుకు చంపారు? నిజంగానే ఓం ప్రకాష్ ఈ కేసు సాల్వ్ చేశాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
డిక్టెటివ్ షెర్లాక్ పాత్రకు వెన్నెల కిషోర్ న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలో సహజత్వం లోపించింది. తనకు ఎంతో బలమైన కామెడీని ఈ పాత్రలో పండించలేకపోయాడు. నిజానికి కామెడీకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. అనన్య నాగళ్లకు మంచి పాత్ర లభించింది. భ్రమరాంబ పాత్రలో బాగా చేసింది. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్ చూపించింది. అనీష్ కురివెళ్ల రోల్ బాగున్నప్పటికీ ఆతడి పాత్రకు వేరొకరి చేత డబ్బింగ్ చెప్పించడం సింక్ కాలేదు. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, నాగ్ మహేష్ తదితరులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రైటర్ మోహన్ ఓ వినోదాత్మక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో తడబడ్డాడు. 1991 నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కోణం నుంచి సినిమాను మెుదలపెట్టిన డైరెక్టర్.. ఆ వెంటనే కథకు సంబంధించిన మర్డర్‌ను చూపించి ఆసక్తి పెంచాడు. మెుత్తం ఏడుగురు అనుమానితులను తెరపైకి తీసుకొచ్చి అసలు దోషి ఎవరన్న దానిపై సెస్పెన్స్ క్రియేట్ చేశాడు. చివరి వరకూ హంతకుడ్ని రివీల్ చేయకుండా ఆసక్తిని మెయిన్‌టెన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే హంతకుడ్ని పట్టుకొనే క్రమంలో వచ్చే పరిశోధన ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. మధ్య మధ్యలో వచ్చే కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. ప్రధానంగా డిటెక్టివ్ చిత్రాల్లో కనిపించే థ్రిల్లింగ్ మూమెంట్స్ మిస్ అయ్యాయి.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం ఏమాత్రం మెప్పించలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదునుపెడితే బాగుండేంది. నిర్మాణ విలువలు మాత్రం కథకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథలో కొత్తదనంఅనన్య నాగళ్ల నటనసెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు
మైనస్ పాయింట్స్
ప్రథమార్ధంథ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడంసంగీతం
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 26 , 2024

మహారాజ్
21 జూన్ 2024 న విడుదలైంది

వైరస్
07 జూన్ 2019 న విడుదలైంది

నా పేరు సూర్య,నా ఇల్లు ఇండియా
04 మే 2018 న విడుదలైంది
రాజీవ్ రవి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాజీవ్ రవి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.