.jpeg)
రాజేంద్ర ప్రసాద్
జననం : జూలై 19 , 1956
ప్రదేశం: నిమ్మకూరు, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటకిరిటీగా ప్రఖ్యాతి గాంచిన రాజేంద్ర ప్రసాద్.. బాపు డైరెక్షన్‌లో వచ్చిన స్నేహం(1977) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 'అహ నా పెళ్లంట', లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, 'ఆ నలుగుగురు' చిత్రాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాల్లో నటించాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న ఆరోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. 45 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్‌లో రాజేంద్రప్రసాద్ 200కు పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సహాయ నటుడిగా శ్రీమంతుడు, కౌసల్యకృష్ణమూర్తి, నాన్నకు ప్రేమతో, మహానటి వంటి హిట్ చిత్రాల్లో నటించారు.

రాజేంద్ర ప్రసాద్ నటించిన బెస్ట్ కామెడీ చిత్రాల లిస్ట్ ఇదే

రాజేంద్ర ప్రసాద్ నటించిన బెస్ట్ కామెడీ చిత్రాల లిస్ట్ ఇదే

రాజేంద్ర ప్రసాద్ టాప్ బెస్ట్ 15 సినిమాల లిస్ట్ ఇదే!

తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?

తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!
కథనాలు

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ... సీతారామం సినిమా సూపర్ హిట్‌తో తెలుగులో దుల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు భిన్నంగా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ నటనపరంగా భేష్ అనింపించుకుంటున్నారు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు మీకోసం..
దుల్కర్ సల్మాన్‌ను అలా ఎందుకు పిలుస్తున్నారు?
దుల్కర్ సల్మాన్ మలయాళం మెగాస్టార్ మమ్మూటి కొడుకు. తన ఇంటిపేరు లేకుండానే తన కొడుకు సొంతకాళ్లపై ఎదగాలని దుల్కర్ సల్మాన్ పేరు పెట్టినట్లు మమ్మూటి చెప్పారు.
దుల్కర్ సల్మాన్ ఎత్తు ఎంత?
5 అడుగుల 8 అంగుళాలు
దుల్కర్ సల్మాన్ ఎక్కడ పుట్టారు?
కొచ్చి, కేరళ
దుల్కర్ సల్మాన్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1986 జులై 28
దుల్కర్ సల్మాన్ భార్య పేరు?
అమల్ సూఫియా
దుల్కర్ సల్మాన్‌కు ఎంత మంది పిల్లలు?
ఒక బాబు, పేరు మరియం అమీరా సల్మాన్
దుల్కర్ సల్మాన్ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, కుకింగ్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తొలిసినిమా?
ABCD( అమెరికన్ బోర్న్.. కన్ఫ్యూజ్డ్ దేశీ
దుల్కర్ సల్మాన్‌కు అభిమాన నటుడు?
మమ్మూటి
దుల్కర్ సల్మాన్ అభిమాన హీరోయిన్?
అలియా భట్
దుల్కర్ సల్మాన్‌కు స్టార్ డం అందించిన చిత్రం?
సీతారామం
దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన కలర్?
వైట్
దుల్కర్ సల్మాన్ తల్లిదండ్రుల పేర్లు?
మమ్మూటి, సలాఫత్ కుట్టి
దుల్కర్ ఏం చదివాడు?
బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్
దుల్కర్ సల్మాన్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 13 సినిమాల్లో నటించాడు
https://www.youtube.com/watch?v=Ms2rrZ25ne0
దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన ఆహారం?
బిర్యానీ
దుల్కర్ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.4కోట్లు- రూ.5కోట్లు తీసుకుంటాడు.
మార్చి 19 , 2024
Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
సీతారామం సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జతకట్టిన దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ హిట్ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో, మృణాల్ సీత పాత్రలో అలరించారు. స్వచ్ఛమైన ప్రేమకథను తమ కళ్లతోటే పలికించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు. మృణాల్ ఠాకూర్ సాంప్రదాయ వస్త్రధారణతో ఆమె చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ జోడీ మరోసారి జత కట్టనుట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పరుశురామ్ శిష్యుడు రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మంచి ప్రేమకథా చిత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హిట్ పేయిర్ రిపీట్
సీతారామం మూవీ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో పాటు మృణాల్ ఠాకూర్‌కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దుల్కర్ కింగ్ కొత్త వంటి వెబ్ సిరీస్‌లో నటించినా అది ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి. మరోవైపు సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్నా, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసింది. ఇందులో హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా... ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం చతికిలపడిపోయింది. ఫ్యామిలీ స్టార్‌కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆశించినంతగా వసూళ్లు రాలేదు. ఈ సినిమా కోసం మృణాల్ బాగానే కష్టపడిందని చెప్పాలి. విజయ్ దేవరకొండతో కలిసి మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గొంది. స్వయంగా రీల్స్ చేసి వైరల్ చేసినా.. సినిమా ఫలితం మాత్రం వేరేలాగా వచ్చింది. దీంతో ఆమె కెరీర్ తెలుగులో ప్రశ్నార్థకంగా మారింది. కొత్త హీరోయిన్లతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
మృణాల్ హవా కొనసాగేనా?
దశాబ్దకాలంగా మృణాల్ బాలీవుడ్‌లో నటిస్తోంది."సూపర్ 30"లో హృతిక్ రోషన్‌తో జతకట్టింది, కానీ ఇప్పటివరకు ఈ కలువ కనుల సుందరికి బీటౌన్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. అయితే టాలీవుడ్‌లో మృణాల్ కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తెలుగు ప్రజల ప్రేమకు మైమరిచిపోయిన ఈ భామ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.సీతారామం విజయం మృణాల్‌కు టాలీవుడ్‌లో రాచబాట పరిచింది. సీతారామం సినిమాకోసం రూ.80 లక్షలు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత తన రెమ్యూనరేషన్‌ను రూ.కోటీన్నరకు పెంచింది. ఫ్యామిలీ స్టార్ పరాజయంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లాయి. రవి డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్‌తో జత కట్టే సినిమాపై ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ను నిర్ణయించే అవకాశం ఉంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ
టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకుర్ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. ఈ జంటలో మరో మారు సినిమా తీయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం అసిస్టెంట్ డైరెక్టర్ రవి ఈ జంటతో సినిమా తీసేందుకు ముందుకొచ్చాడని సమాచారం. దుల్కర్- సల్మాన్ కోసం ఓ వినూత్నమైన ప్రేమ కథను రాసుకున్నాడంట. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా రవి పూర్తి చేశాడంట. ఈ సినిమా కోసం దిల్ రాజు దగ్గరికి వెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్‌ను ఎంపిక చేశారంట. ఆయన కూడా ఈ సినిమాకు పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. తెలుగులో సార్, ఆదికేశవ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. సార్ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే తరహాలో మ్యూజిక్ అందించేందుకు జీవీ ప్రకాశ్ సిద్ధమయ్యారు.
షూటింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్, విజయ్ దేవరకొండతో మరో సినిమాతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే దుల్కర్- మృణాల్ ఠాకూర్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అటు మృణాల్ ఠాకూర్ సైతం పూజా మేరి జాన్ అనే బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. ఇటు దుల్కర్ సైతం మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తికాగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ జంటపై ఊహగానాలు వినిపిస్తున్నాయి.
మే 14 , 2024
Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే?
సినిమా: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రాంకీ, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులుసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ఎడిటింగ్: నవీన్ నూలిసినిమాటోగ్రఫీ: నిమేశ్ రవినిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యరచన, దర్శకత్వం: వెంకీ అట్లూరివిడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
ఈ దీపావళికి ముందు పండగ సందడి తెచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్.’ పాన్ ఇండియా స్థాయి చిత్రంగా, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుల్కర్ - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటి? ఈ కథలో హీరో లక్కీ అవుతాడా? అన్నది తెలుసుకుందాం.
కథ
భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కథ.
సినిమా ఎలా ఉందంటే?
చాలా కాలం తర్వాత బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ నేపథ్యంపై ఓ తెలుగు సినిమా తెరపై ఆవిష్కరించబడింది. 90ల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ముడి పడిన హర్షద్ మెహతా కుంభకోణం కథకు కీలకమైన అంశం. దర్శకుడు వెంకీ అట్లూరి సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను, వారి ఆర్థిక చిత్తశుద్ధిని మిళితం చేస్తూ ఈ కథను ఆవిష్కరించారు. కథలోని మలుపులు మరియు పాత్రలు ప్రేక్షకుల హృదయానికి చేరువగా ఉంటాయి. మొదటగా భాస్కర్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను, అతనికి జరిగిన అవమానాలను కథలో భాగంగా చూపించడం, ఆ తర్వాత అతను కష్టాల్ని దాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు అతినికి జీవితంపై నమ్మకాన్ని కలిగిస్తాయి.
భాస్కర్ చేసే రిస్క్, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కొంటూ తన తెలివితేటలతో బతికే విధానం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు, ప్రథమార్ధంలో భాస్కర్ పడ్డ చిక్కులు ఆకట్టుకుంటాయి. కానీ, రెండవ అర్ధభాగం లో కొన్ని సన్నివేశాలు కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ల వంటి అంశాలు సాధారణ ప్రేక్షకులకు అంత సులభంగా అర్థం కావు. భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పు, కుటుంబ సమస్యలను పరిష్కరించాలనే తీరు ఆకర్షిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. అతని అభినయం, మధ్య తరగతి వ్యక్తిగా పాత్రలో జీవించడం మంచి అనుభూతినిస్తుంది. సుమతిగా మీనాక్షి చౌదరి తన పాత్రలో నిజాయితీని చూపించింది. రాంకీ, సచిన్ ఖేడేకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికత
సాంకేతికంగా, చిత్రం ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకి కీలకంగా నిలిచింది. అతని నేపథ్య సంగీతం కథకు హైప్ ఇచ్చింది. నిమేశ్ రవి ఛాయాగ్రహణం సినిమా వాతావరణాన్ని 90 వ దశకానికి తీసుకెళ్తుంది. వెంకీ అట్లూరి రచన, పాత్రల అభివృద్ధిలో చూపించిన నైపుణ్యం, కథా మలుపుల నిర్వహణ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. 90ల కాలంలో ముంబై వాతావరణాన్ని ప్రతిబింబించడానికి రాజీ లేకుండా నిర్మాణ విలువలను ప్రదర్శించారు.
బలాలు
బలమైన కథ
దుల్కర్ సల్మాన్ నటన
నేపథ్య సంగీతం, ట్విస్టులు
బలహీనతలు
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
చివరగా
‘లక్కీ భాస్కర్’ ఒక ఆకట్టుకునే కథా నేపథ్యంతో, స్మార్ట్ థ్రిల్లర్. భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకుంటూ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు మంచి అనభూతి పంచాడు. కథలో అనేక ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదించినప్పటికీ, కథనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన పాత్రలు సినిమాని ప్రేక్షకుల మనసుకు దగ్గర చేస్తాయి.
రేటింగ్: 4/5
నవంబర్ 01 , 2024
Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్, ‘క’ చిత్రాల్లో దీపావళి విన్నర్ ఎవరంటే?
దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది.
లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections)
మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections)
ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
“క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections)
కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
నవంబర్ 02 , 2024

సంక్రాంతికి వస్తున్నాం
14 జనవరి 2025 న విడుదలైంది

కోతి కొమ్మచ్చి
28 డిసెంబర్ 2024 న విడుదలైంది

జనక అయితే గనక
11 అక్టోబర్ 2024 న విడుదలైంది

ఉత్సవం
13 సెప్టెంబర్ 2024 న విడుదలైంది

బెంచ్ లైఫ్
12 సెప్టెంబర్ 2024 న విడుదలైంది

జిలేబి
18 ఆగస్టు 2023 న విడుదలైంది

అన్ని మంచి శకునములే
18 మే 2023 న విడుదలైంది

ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు
03 మార్చి 2023 న విడుదలైంది

వాల్తేరు వీరయ్య
13 జనవరి 2023 న విడుదలైంది

శాసనసభ
16 డిసెంబర్ 2022 న విడుదలైంది

అనుకోని ప్రయాణం
28 అక్టోబర్ 2022 న విడుదలైంది

మాచర్ల నియోజకవర్గం
12 ఆగస్టు 2022 న విడుదలైంది
రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాజేంద్ర ప్రసాద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.