• TFIDB EN
  • రామ్ చరణ్
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    రామ్ చరణ్ తేజ్ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. రామ్ చరణ్‌కు ఇద్దరు చెల్లెల్లు శ్రీజ, సుష్మిత. మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ తేజ్ మెగా పవర్‌స్టార్‌గా తనకుంటూ ప్రత్యేక గుర్తుంపు సంపాదించుకున్నాడు. తన తండ్రిని అనుసరించకుండా తనదైన స్టైల్‌తో ముందుకెళ్లాడు. డ్యాన్స్, యాక్టింగ్ విషయంలో సినిమా, సినిమాకు పరణతి చెంది తండ్రికి తగ్గ తనయుడిగా శభాష్ అనిపించుకున్నాడు.

    రామ్ చరణ్ వయసు ఎంత?

    రామ్‌ చరణ్ వయసు 39 సంవత్సరాలు

    రామ్ చరణ్ ముద్దు పేరు ఏంటి?

    మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, చెర్రీ

    రామ్ చరణ్ ఎత్తు ఎంత?

    5'8"(172cm)

    రామ్ చరణ్ అభిరుచులు ఏంటి?

    రామ్‌చరణ్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. చెర్రీకి కాజల్, బాదల్ ఆశ్వాలంటే ఇష్టం. ఇవికాక విదేశీ బ్రీడ్‌కు చెందిన 25 గుర్రాలు చరణ్ దగ్గర ఉన్నాయి.

    రామ్ చరణ్ ఏం చదువుకున్నారు?

    Bcom Dropout

    రామ్ చరణ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    రామ్‌ చరణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సేయింట్ మేరీస్ కాలజీలో చదువుకున్నాడు

    రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    రానా దగ్గుపాటి రామ్‌చరణ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. వీరిద్దరు కలిసి ఇంట్లో తెగ అల్లరి చేసేవారని చిరంజీవి చెప్పారు.

    రామ్ చరణ్ In Sun Glasses

    రామ్ చరణ్ With Pet Dogs

    రామ్ చరణ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    రామ్ చరణ్ అన్‌ కేటగిరైజ్డ్ వీడియోలు

    Watch on YouTube

    Description of the image
    Editorial List
    తెలుగులో అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ -10 చిత్రాలు
    తెలుగులో హీరోలకు వ్యాధులు/లోపాల ఆధారంగా వచ్చిన టాప్‌ సినిమాలుEditorial List
    తెలుగులో హీరోలకు వ్యాధులు/లోపాల ఆధారంగా వచ్చిన టాప్‌ సినిమాలు
    యానిమల్ రన్‌టైమ్‌ 3.21 గంటలు.. మరి తెలగులో అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన సినిమా ఏదో తెలుసాEditorial List
    యానిమల్ రన్‌టైమ్‌ 3.21 గంటలు.. మరి తెలగులో అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన సినిమా ఏదో తెలుసా
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలుEditorial List
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలు

    రామ్ చరణ్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    రామ్‌ చరణ్ సినీ కుటుంబంలో జన్మించాడు. ఆయన ప్రముఖ టాలీవుడ్ హీరో మెగస్టార్ చిరంజీవి కుమారుడు. రామ్‌ చరణ్ తల్లి పేరు సురేఖ. రామ్‌ చరణ్‌కు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. రామ్ చరణ్ బాబాయి పవన్ కళ్యాణ్ తెలుగులో స్టార్ హీరోగాను.. జనసేన పార్టీ అధినేతగా కొనసాగుతున్నాడు. మరో బాబాయి నాగబాబు కూడా నటుడిగా గుర్తింపు పొందాడు. రామ్ చరణ్ బావమర్ది అల్లు అర్జున్ కూడా తెలుగులో స్టార్ హీరో. ఆయన తాత అల్లు రామలింగయ్య తెలుగులో దిగ్గజ హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. రామ్ చరణ్ చెల్లెల్ల పేర్లు.. శ్రీజ, సుస్మిత

    రామ్ చరణ్ పెళ్లి ఎప్పుడు అయింది?

    రామ్‌ చరణ్‌ వివాహం జూన్ 14 న 20012లో ఉపాసనతో జరిగింది.

    రామ్ చరణ్ కు పిల్లలు ఎంత మంది?

    రామ్‌ చరణ్ ఉపాసన దంపతులకు ఒక పాప. పాప పేరు క్లింకారా

    రామ్ చరణ్ Family Pictures

    రామ్ చరణ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    రామ్‌ చరణ్ స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా RRRచిత్రంలో అతని నటన పాన్‌ ఇండియా స్టార్‌ను చేసింది.

    రామ్ చరణ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చిరుతమూవీతో చరణ్ తెరంగేట్రం చేశాడు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ మూవీ జంజిర్ రీమెక్ చేసి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది ప్లాప్‌గా నిలిచింది.

    తెలుగులో రామ్ చరణ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    మగధీరచిత్రం రామ్‌ చరణ్‌కు తొలి హిట్‌ను అందించడంతో పాటు యూత్‌లో ఫాలోయింగ్‌ తెచ్చిపెట్టింది. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన రామ్ చరణ్ తొలి చిత్రం ఏది?

    రామ్ చరణ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    రామ్‌ చరణ్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా RRRచిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది

    రామ్ చరణ్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Stage Performance

    రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఎంత?

    రామ్‌ చరణ్ ఒక్కో చిత్రానికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    రామ్ చరణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్ బిర్యాని, మెక్సికన్, చేపల పులుసు

    రామ్ చరణ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రామ్ చరణ్ కు ఇష్టమైన నటి ఎవరు?

    రామ్ చరణ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    రామ్ చరణ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    రామ్ చరణ్ ఫెవరెట్ సినిమా ఏది?

    రామ్ చరణ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్

    రామ్ చరణ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    పోలో

    రామ్ చరణ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    London

    రామ్ చరణ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    ఫెరారీ పోర్టోఫినో (రూ. 3.5 కోట్లు), రేంజ్ రోవర్( రూ. 3.5కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంటమ్( రూ. 9 కోట్లు). ఇవికాక ఇంక చాలా కార్లు చెర్రీ దగ్గర ఉన్నాయి.

    రామ్ చరణ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.500కోట్లు

    రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    23.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    రామ్ చరణ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రామ్ చరణ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • "మూడు ఫిల్మ్‌ఫెర్, రెండు నంది అవార్డులు వచ్చాయి. వీటితో పాటు RRR చిత్రానికి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి స్పాట్‌లైట్ అవార్డు జీ సినీ అవార్డ్స్: రంగస్థలం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు"

    రామ్ చరణ్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    రాజకీయాల నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి చేసిన తొలి సినిమా ఖైదీ నం.150ను చెర్రీ నిర్మించాడు. ఇందుకోసం కొనిదెల ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి నిర్మాతగా మారాడు. ఆచార్య, సైరా వంటి చిత్రాలను నిర్మించాడు. ట్రూజెట్‌, ఆపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్ పోలో క్లబ్‌ వంటి వ్యాపారాల్లో షేర్స్ ఉన్నాయి.

    రామ్ చరణ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    మిషో, ఫ్రూటీ బ్రాండ్లకు ప్రమోటర్‌గా ఉన్నాడు

    రామ్ చరణ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    రామ్‌ చరణ్‌కు ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం లేకున్నా ఆయన తన బాబాయి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపాడు.
    రామ్ చరణ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రామ్ చరణ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree