• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    రష్మిక మందన్న
    ప్రదేశం: విరాజ్‌పేట, కర్ణాటక, భారతదేశం

    నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, అనిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది.


    @2021 KTree