• TFIDB EN
  • రెబా మోనికా జాన్
    జననం : ఫిబ్రవరి 04 , 1994
    ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
    రెబా మోనికా జాన్‌ ప్రముఖ దక్షిణాది చలనచిత్ర నటి. ఆమె 2016లో మలయాళ చిత్రం 'జాకోబిన్ట్ స్వర్గరాజ్యం' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ప్రధానంగా తమిళ్, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో అక్టోబర్ 31 లేడీస్ నైట్ చిత్రం ద్వారా పరిచయం అయింది. సామజవరగమన సినిమా ద్వారా పరిచయం అయింది.

    రెబా మోనికా జాన్ వయసు ఎంత?

    రెబా మోనికా జాన్‌ వయసు 31 సంవత్సరాలు

    రెబా మోనికా జాన్ ఎత్తు ఎంత?

    5'4'' (163 cm)

    రెబా మోనికా జాన్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్, ట్రావెలింగ్

    రెబా మోనికా జాన్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యూయేట్

    రెబా మోనికా జాన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మోడలింగ్ చేసేది

    రెబా మోనికా జాన్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-26-33

    రెబా మోనికా జాన్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    సామజ వరగమన, అక్టోబర్ 31 లేడీస్ నైట్

    రెబా మోనికా జాన్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    రెబా మోనికా జాన్ Hot Pics

    Images

    Reba Monica John Hot Images

    Images

    Reba Monica John Hot In Saree

    రెబా మోనికా జాన్ In Saree

    Images

    Reba Monica John Hot In Saree

    Images

    Reba Monica John In Saree

    రెబా మోనికా జాన్ In Bikini

    Images

    Reba Monica John Hot In Bikini

    Images

    Reba Monica John Bikini Images

    రెబా మోనికా జాన్ In Ethnic Dress

    Images

    Actress Reba Monica John Images In Ethnic Wear

    రెబా మోనికా జాన్ With Pet Dogs

    Images

    Reba Monica John With Pet Dog

    రెబా మోనికా జాన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Reba Monica John

    Insta Hot Reels

    View post on Instagram
     

    Reba Monica John Insta Reel

    Tollywood Debut Actress in 2023​: అరంగేట్రంతోనే తమ జాతకాన్ని మార్చుకున్న హీరోయిన్స్‌ వీరే!
    Tollywood Debut Actress in 2023​: అరంగేట్రంతోనే తమ జాతకాన్ని మార్చుకున్న హీరోయిన్స్‌ వీరే! ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పలువురు తారలు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అరంగేట్రం సినిమాతోనే తమదైన ముద్ర వేశారు. జయపజయాలకు అతీతంగా తమ నటన, అభినయం, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భవిష్యత్‌లో స్టార్‌ హీరోయిన్స్‌గా ఎదిగేందుకు అవసరమైన టాలెంట్‌ తమలో ఉందని నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరు? తెలుగులో వారు చేసిస తెరంగేట్ర చిత్రం ఏది? ఇప్పుడు చూద్దాం.  ఆషికా రంగనాథ్‌  కర్ణాటకకు చెందిన ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘అమిగోస్‌’ (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది. ప్రియా భవాని శంకర్‌ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రియా భవాని శంకర్‌ (Priya Bhavani Shankar).. ‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యువనటుడు సంతోష్‌ శోభన్‌కు జంటగా కనిపించి మెప్పించింది. మంచు మనోజ్‌ అప్‌కమింగ్‌ మూవీ 'అహం బ్రహ్మాస్మి' లోనూ ఈమె నటిస్తోంది. అలాగే కమల్‌హాసన్‌ 'భారతీయుడు-2' చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.   టీనా శిల్పరాజ్  'రైటర్‌ పద్మభూషణం' సినిమా ద్వారా టీనా శిల్పరాజ్‌ (Tina Shilparaj) తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇది ఆమె చేసిన మెుట్ట మెుదటి సినిమానే అయిన్పపటికీ నటనలో ఎంతో అనుభవం ఉన్నట్లు చేసింది. తన అందం, అభినయంతోనే మంచి మార్కులే కొట్టేసింది. రెబా మోనికా జాన్‌ ఈ భామ ‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. రెబా (Reba Monica John) ఇప్పటికే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. పలు టీవీ షోలలోనూ పాల్గొంది.  గీతిక తివారి రానా సోదరుడు అభిరామ్‌ దగ్గుబటి హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అహింస'. ఇందులో గీతికా తివారి (Geethika Tiwary) హీరోయిన్‌గా చేసింది. నటిగా తొలి చిత్రమే అయినప్పటికీ గీతిక అద్భుత నటన కనబరిచింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఐశ్వర్య మీనన్‌ నిఖిల్‌ హీరోగా చేసిన 'స్పై' (Spy) చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ (Iswarya Menon) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ తొలుత అక్కడ సీరియళ్లలో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో ఛాన్స్‌ సంపాదించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ రొమాంటిక్‌ సినిమాలో ఐశ్వర్య నటిస్తోంది. ఇందులో ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేస్తున్నాడు. యుక్తి తరేజా కన్నడ ఇండస్ట్రీకి చెందిన యుక్తి తరేజా (Yukti Thareja) ఈ ఏడాది వచ్చిన రంగబలి చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఇందులో నాగశౌర్యకు జోడీగా సహజ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నిఖిల్‌ గౌడ జంటగా కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో దునియా విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సాక్షి వైద్య యంగ్‌ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ ఏడాది రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అఖిల్‌ ఏజెంట్‌ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన సాక్షి.. ఆ తర్వాత గాండీవధారి అర్జున మూవీతో మరోమారు పలకరించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలం అయినప్పటికీ నటిగా సాక్షి వైద్యకు మంచి మార్కులే పడ్డాయి. ప్రగతి శ్రీవాస్తవ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల రూపొందించిన చిత్రం 'పెద్ద కాపు'. ఈ సినిమా ద్వారా ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టింది. తొలి సినిమాతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ ఆనంద్‌ దేవరకొండ సరసన ‘గం గం గణేశ’ చిత్రంలో నటిస్తోంది.  నుపుర్‌ సనన్‌ బాలీవుడ్‌ బ్యూటీ నుపుర్ సనన్‌ (Nupur Sanon) టైగర్ నాగేశ్వర రావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాస్ మహారాజా రవితేజతో పోటాపోటీగా నటించి అదరగొట్టింది.  వైష్ణవి చైతన్య బేబి చిత్రం ద్వారా 'వైష్ణవి చైతన్య' (Vaishnavi Chaitanya) వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తన నటన, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు యూట్యూబ్‌ సిరీస్‌లలో వైష్ణవి హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు సినిమాల్లోనూ ఆడపా దడపా హీరోయిన్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్లు చేసింది. 
    డిసెంబర్ 15 , 2023
    This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..! జూన్ నెలలో ఆఖరి వారంలోకి అడుగు పెట్టేశాం. నెలాఖరున పలు చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో తెరకెక్కిన సినిమాలు ఈ వారం(June 29,30) విడుదల అవుతుండటం విశేషం. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.  థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు స్పై(SPY) నిఖిల్ సిద్ధార్థ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవిత స్పై ఏజెంట్లు ఎలా ఉంటారో ఇందులో చూపించినట్లు మూవీ టీం వెల్లడించింది. కె.రాజశేఖర్ రెడ్డి కథ అందించి ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఐశ్వర్య మీనన్ నిఖిల్ సరసన నటించింది. జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. సామజవరగమన(Samajavaragamana) శ్రీవిష్ణు కథానాయకుడిగా వస్తున్న చిత్రమే ‘సామజవరగమన’. వినూత్నమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా రాజేశ్ దండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించాడు. రెబా మోనికా జాన్ కథానాయిక. నరేశ్, సత్య, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 29న విడుదలకు సిద్ధమైంది.  ఇండియానా జోన్స్(Indiana Jones) సాహసోపేతమైన సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ కోవలో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్‌ అప్పట్లో ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో చిత్రం రాబోతోంది. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది. తమిళ్,  తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌లో దాదాపు 14 ఏళ్ల క్రితం చివరి చిత్రం వచ్చింది. మళ్లీ ఇప్పుడే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది. మాయా పేటిక(Mayaa Petika) శ్రీనివాస్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పృథ్వీ తదితరులు కలిసి నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సెల్‌ఫోన్ చుట్టూ జరిగే కథగా ఈ సినిమా సాగనుందని చిత్రబృందం వెల్లడించింది. రమేశ్ రాపార్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఎట్టకేలకు జూన్ 30న విడుదల అయ్యేందుకు ముస్తాబైంది.  లవ్ యూ రామ్(Love You Ram) ప్రముఖ రచయిత, దర్శకుడు దశరథ్ కథ అందించి నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యూ రామ్’. తనదైన శైలిలో ఈ ప్రేమ కథను చెక్కారు దశరథ్. విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ ఎక్కడిదాకా సాగింది? చివర్లో ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెరపై చూడాల్సిందేనని చిత్రబృందం తెలిపింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటించగా బి.వి.చౌదరి దర్శకత్వం వహించాడు. దశరథ్‌తో నిర్మాణ బాధ్యతలు పంచుకున్నాడు. జూన్ 30న చిత్రం రిలీజ్ కానుంది. ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateWeekend Family Season 2Web SeriesEnglishDisney + HotstarJune 28Lust Stories 2Web SeriesHindiNetflixJune 29See You In my Nineteenth LifeWeb SeriesKoreanNetflixJune 29Jack ran Season 4Web SeriesEnglishAmazon Prime June 30CelebrityWeb SeriesKoreanNetflixJune 30The Night Manager Season 2Web SeriesHindiDisney+ HotstarJune 30Arthamainda ArunkumarWeb SeriesTeluguAhaJune 30SargentWeb SeriesHindiJio CinemaJune 30
    జూన్ 26 , 2023
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా? నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: రాం అబ్బరాజు నిర్మాత: రాజేష్ దండ సంగీతం: గోపి సుందర్ ఎడిటర్: చోట కె ప్రసాద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ హీరో నటించిన ‘సామజవరగమన’ చిత్రం June 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీతో ఆ కోరిక తీరిందా? అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? బాలసుబ్రహ్మణ్యం(శ్రీవిష్ణు) ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. తాతకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ దానిని అనుభవించడానికి వీలుండదు బాలుకి. కారణం బాలు తండ్రి ఉమామహేశ్వర రావు(నరేశ్) డిగ్రీ పాస్ కాకపోవడమే. తన కొడుకు డిగ్రీ పాసైతేనే వంద కోట్ల ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తాడు ఉమా తండ్రి. దీంతో తండ్రిని చదివించడానికి బాలు నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో సరయు(రెబా మోనిక)తో పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ, వీరి ప్రేమ పెళ్లికి ఓ విషయం అడ్డు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఉమా మహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? చివరికి బాలు, సరయు ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? ప్రచార చిత్రాల్లో చూసినట్టుగా కథ తెలిసినట్టుగా అనిపించినా కథనం ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుడు కుర్చీలో నుంచి లేవడు. పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తూనే ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఇస్తుంటుంది. మంచి హాస్య కథా చిత్రాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. 2 గంటల 20 నిమిషాల స్క్రీన్ టైమ్‌ని ఆడియెన్స్ ఆస్వాదిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ములుపు, ద్వితియార్ధంలో వచ్చే సీక్వెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. మ్యూజిక్ కాస్త రుచించదు.  ఎవరెలా చేశారు? ఈ సినిమాకు నటీనటుల యాక్టింగే ప్రధాన బలం. బాలుగా శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌ని సంపూర్ణంగా స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేశాడు. ఇక, బాలు తండ్రిగా నరేశ్ గొప్పగా నటించాడు. ఈ పాత్రలో నరేశ్‌ని తప్పితే మరొకరిని ఊహించుకోలేని విధంగా తనదైన ముద్రను వేశాడు. ఒకరకంగా సినిమాకు రెండో హీరో నరేశే. ఇక రెబా మోనిక తన పరిధి మేరకు నటించింది. రఘు బాబు, వెన్నెల కిశోర్ కామెడీతో మరోసారి నవ్వించారు.  టెక్నికల్‌గా.. కథను ఊహించగలిగినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు. చక్కని కామెడీ సన్నివేశాలను రాసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలపై మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇక రాంరెడ్డి కెమెరా పనితనం ఫర్వాలేదనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సరితూగింది.  ప్లస్ పాయింట్స్ నటీనటులు కామెడీ సన్నివేశాలు స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ మ్యూజిక్ సాగతీత సన్నివేశాలు రేటింగ్: 2.75/5
    జూన్ 30 , 2023
    Tollywood Celebrity Baby Names: క్లింకారా, అయాన్‌, దేవసేన.. సెలబ్రిటీ పిల్లల పేర్ల అర్థాలు తెలుసా? మనిషి జీవితంలో సంతానం అనేది చాలా ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల ద్వారా వారసత్వాని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతమేమి కాదు. అయితే సెలబ్రిటీల పిల్లలు అనగానే సహజంగానే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. తమ అభిమాన హీరోల వారసులుగా ఆ చిన్నారులను కూడా ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. అయితే సెలబ్రిటీలు తమ పిల్లలకు పెట్టే కొత్త తరహా పేర్ల విషయంలో ఫ్యాన్స్‌ కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాటి అర్థం తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పిల్లలు (Tollywood Celebrity Baby Names), వారి పేర్లకు అర్థాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  [toc] రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగా ఫ్యామిలీలోకి గతేడాది జూన్‌లో బుల్లి ప్రిన్సెస్‌ అడుగుపెట్టింది. రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తమకు పుట్టిన గారాల పట్టికి ‘క్లింకారా’ అనే పేరు పెట్టారు. క్లింకారా అంటే ప్రకృతికి ప్రతిబింబం అని అర్థం. అలాగే అమ్మవారి శక్తి రూపానికి ప్రతీకగా కూడా భావిస్తుంటారు. ఈ గుణాలను పోగుచేసుకొని క్లీంకారా ఎదగాలని మెగా ఫ్యామిలీ ఈ పేరు పెట్టింది. జూ. ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూ.ఎన్టీఆర్‌కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తారక్‌ - ప్రణీత దంపతులు తమ మెుదటి సంతానానికి అభయ్‌ రామ్‌ అనే పెట్టారు. రెండో కుమారుడికి భార్గవ్ రామ్‌ అని నామకరణం చేశారు. హరికృష్ణ తన కొడుకులకి జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్(ఎన్టీఆర్) అని చివర్లో రామ్‌ వచ్చేలా పెట్టుకున్నారు. అదే సంప్రదాయాన్ని తారక్‌ కూడా కొనసాగించడం విశేషం. అభయ్ అంటే భయం ఎరుగని వాడు అని అర్థం. ఇక భార్గవ్ రామ్‌ అంటే శ్రీరాముడు అనేక నామాల్లో ఇదీ ఒకటి.  అల్లు అర్జున్‌ (Allu Arjun) ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. మగబిడ్డకు అల్లు అయాన్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన ఆడపిల్లకు అల్లు అర్హా అని నామకరణం చేశారు. అయాన్ అంటే దివ్యమైనది (సంస్కృతి), దేవుని బహుమతి (అరబిక్‌), గుర్తుపెట్టుకోవాల్సింది (పర్షియన్‌) అని అర్థం. అలాగే అర్హా అంటే 'శివం' అని మీనింగ్ వస్తుంది. ఇస్లామిక్ అర్థాన్ని తీసుకుంటే ప్రశాంతమైన, నిర్మలమైన అని సూచిస్తుందట. నాని (Nani) నేచురల్‌ స్టార్ నాని దంపతులకు ఓ బాబు ఉన్నాడు. పేరు అర్జున్‌. ముద్దుగా జున్ను అని పిలుచుకుంటారు. అర్జున్‌ అంటే సంస్కృతం నుంచి వచ్చిన హిందూ పేరు. పాండవుల్లో ఒకరైన అర్జునుడు గొప్ప వీరుడిగా గుర్తింపు పొందాడు.  నితిన్‌ (Nithiin) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో నితీన్‌ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే కొత్తగా తండ్రయ్యాడు. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడి పేరును నితిన్‌ ఎక్కడా రివీల్‌ చేయలేదు. మంచు మనోజ్‌ (Manchu Manoj) నటుడు మంచు మనోజ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు దేవసేన శోభాగా నామకరణం చేశారు. దేవసేన అంటే హిందూ దేవత. దేవతల సైన్యాధిపతిగా పురణాల్లో ఆ పేరును ప్రస్తావించారు. కాగా, ఇరుకుటుంబాల అంగీకారంతో గతేడాది మనోజ్‌ - మౌనిక వివాహం జరిగింది. మౌనికకు అప్పటికే మెుదటి ద్వారా జన్మించిన కుమారుడు ఉన్నాడు. నిఖిల్‌ సిద్దార్థ్‌  (Nikhil Siddharth) టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడికి ధీరా సిద్ధార్థ్‌ అని పేరు పెట్టారు. ధీర అంటే గొప్ప వీరుడు అని అర్థం. సుహాస్‌ (Suhas) టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుహాస్‌ కూడా ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతడి భార్య లలిత జనవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు పుట్టిన బిడ్డకు తాను పేరు పెట్టనని సుహాస్‌ గతంలో తెలిపారు. తన హీరోగా చేసిన ‘కలర్‌ ఫొటో’ డైరెక్టర్‌కు పేరు పెట్టే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. మరి ఏ పేరు పెట్టారో సుహాస్ అనౌన్స్‌ చేయలేదు.  రణ్‌వీర్‌ - దీపికా (Ranveer Singh - Deepika Padukone) బాలీవుడ్ స్టార్ క‌పుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. సెప్టెంబర్‌లో దీపికా ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపకు దువా పదుకొణే సింగ్‌ అని పేరు పెట్టారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. తమ ప్రార్థనలకు సమాధానమే ఈమె అంటూ దీపికా నవంబర్‌ 2న స్పెషల్ పోస్టు పెట్టింది.  రణ్‌బీర్‌ - అలియా (Ranbir Kapoor - Alia Bhatt) బాలీవుడ్ బెస్ట్ కపుల్ రణ్‌బీర్ ఆలియా భట్ 2022లో పేరెంట్స్ అయ్యారు. ఓ కూతురుకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు రాహా అనే పేరు పెట్టారు. రాహా అంటే పీస్‌ఫుల్‌, హ్యాపీనెస్‌ ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.  విరాట్‌ - అనుష్క (Virat Kohli - Anushka Sharma) భార‌త స్టార్ క‌పుల్ విరాట్-అనుష్కలు ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తమ మగ బిడ్డకు ‘అకాయ్‌’ అనే పేరు పెట్టారు. అకాయ్‌ అంటే సంస్కృతంలో నిరాకారమని, రూపం లేనిదని అర్థం. టర్కీ భాషలో మెరుస్తున్న చంద్రుడు అని కూడా అంటారు. ఇక తమ మెుదటి కుమార్తెకు దుర్గాదేవి పేరు వచ్చేలా ‘వామిక’ అని విరుష్క దంపతులు పేరు పెట్టారు.  యామి గౌతమ్‌ (Yami Gautam) బాలీవుడ్‌ నటి యామి గౌతమ్‌ (Tollywood Celebrity Baby Names) ఈ ఏ డాది మేలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. యామి - ఆదిత్య ధర్‌ దంపతులు తమ బిడ్డకు వేదవిద్‌ అని పేరు పెట్టారు. వేదవిద్‌ అంటే వేదాలు బాగా తెలిసినవాడు అని అర్థం. అమలా పాల్‌ (Amala Paul) తమిళ స్టార్ నటి అమలాపాల్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. అమలాపాల్‌ - జగత్‌ దేశాయ్‌ దంపతులు జూన్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ఇలాయ్‌ అని పేరు పెట్టారు. తమిళంలో ఇలాయ్‌ అంటే ఆకు (Leaf) అని అర్థం. హీబ్రూలో లాంగ్వేజ్‌లో ఆరోహణ అని కూడా అర్థం వస్తుంది.
    నవంబర్ 12 , 2024

    రెబా మోనికా జాన్ పెంపుడు కుక్క పేరు?

    స్కూబీ

    రెబా మోనికా జాన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    ఆమె తండ్రి చనిపోయారు. తల్లి పేరు మిని జాన్

    రెబా మోనికా జాన్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    సోదరి పేరు లిబ్బి జాన్, సోదరుడు పేరు షానే జాన్

    రెబా మోనికా జాన్ పెళ్లి ఎప్పుడు అయింది?

    2022లో జోయిమోన్ జాన్‌ను పెళ్లి చేసుకుంది.

    రెబా మోనికా జాన్ Family Pictures

    Images

    Reba Monica John Images

    Images

    Reba Monica John Pics Family

    రెబా మోనికా జాన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    రెబా మోనికా జాన్‌ ప్రముఖ మలయాళి టెలివిజన్ షో మిడుక్కి రియాలిటీ సిరీస్‌లో రన్నరప్‌గా నిలవడంతో ప్రాచూర్యం పొందింది.

    రెబా మోనికా జాన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    అక్టోబర్ 31 లేడీస్ నైట్

    తెలుగులో రెబా మోనికా జాన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రెబా మోనికా జాన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    సామజవరగమనచిత్రంలో ఆమె చేసిన సరయు పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

    రెబా మోనికా జాన్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Reba Monica John best dialogues

    రెబా మోనికా జాన్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ. 40LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.

    రెబా మోనికా జాన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    పిజా

    రెబా మోనికా జాన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్

    రెబా మోనికా జాన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్

    రెబా మోనికా జాన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    ఫుట్‌బాల్

    రెబా మోనికా జాన్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    లియోనెల్ మెస్సీ

    రెబా మోనికా జాన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

    రెబా మోనికా జాన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రెబా మోనికా జాన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • - 2013

      మలయాళ మనోరమ ఛానెల్ రియాలిటీ షో విడుక్కిలో రన్నరప్‌గా నిలిచింది.

    రెబా మోనికా జాన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రెబా మోనికా జాన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree