

రుక్సార్ ధిల్లాన్
జననం : అక్టోబర్ 12 , 1993
ప్రదేశం: లండన్, యునైటెడ్ కింగ్డమ్
రుక్సర్ థిల్లాన్ టాలీవుడ్‌కు చెందిన నటి. 1993 అక్టోబరు 12న లండన్‌లో ఓ పంజాబి కుటుంబంలో జన్మించింది. 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది.
రుక్సార్ ధిల్లాన్ వయసు ఎంత?
రుక్సార్ ధిల్లాన్ వయసు 31 సంవత్సరాలు
రుక్సార్ ధిల్లాన్ అభిరుచులు ఏంటి?
సినిమాలు చూడటం, ట్రావెలింగ్
రుక్సార్ ధిల్లాన్ ఏం చదువుకున్నారు?
ఫ్యాషన్ డిజైనింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది.
రుక్సార్ ధిల్లాన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
మోడల్
రుక్సార్ ధిల్లాన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
మనోవికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, గోవా
బల్డ్‌విన్ గర్ల్స్ హై స్కూల్, బెంగళూరు
బెంగళూరు విశ్వవిద్యాలయం, కర్ణాటక
రుక్సార్ ధిల్లాన్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
రుక్సర్ థిల్లాన్ తన లవర్ సన్నీ కౌషల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
రుక్సార్ ధిల్లాన్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
32-24-32
రుక్సార్ ధిల్లాన్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో 2024 వరకూ ఆరు చిత్రాల్లో రుక్సర్ నటించింది.
రుక్సార్ ధిల్లాన్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
జుగాదిస్తాన్ (2022)
రుక్సార్ ధిల్లాన్ Hot Pics
రుక్సార్ ధిల్లాన్ In Ethnic Dress
రుక్సార్ ధిల్లాన్ In Saree
రుక్సార్ ధిల్లాన్ With Pet Dogs
రుక్సార్ ధిల్లాన్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Actress Rukshar Dhillon Insta Reel
Rukshar Dhillon Hot Insta Reel
- Stars celebrate Christmas 2024: క్రిస్మస్ రోజున సెలబ్రటీల వెలుగు జిలుగులు.. ఓ లుక్కేయండి!క్రిస్మస్ పర్వదినం (Stars celebrate Christmas 2024) సందర్భంగా పలువులు సెలబ్రిటీలు ఎంతో సంతోషంగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు ఇంట్లో పండగ జరుపుకుంటే మరికొందరు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొందరు విదేశాల్లో పండగను ఆస్వాదించారు. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. రామ్‌చరణ్ - ఉపాసన జంట.. కూతురు క్లింకారతో కలిసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇంట్లో పనిచేసే వారితో కలిసి సంతోషంగా ఈ పండగ చేసుకున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde).. క్రిస్మస్ రోజున ఎంతో సరదాగా గడిపింది. క్రిస్మస్ ట్రీ పక్కన కాఫీ దాగుతూ బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేసింది. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తన భర్త సిద్ధార్ధ్ మల్హోత్రా (Sidharth Malhotra)తో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. భర్తను ఆలింగనం చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌషల్ (Vicky Kaushal) - కత్రీనా కైఫ్ (Katrina Kaif) విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంది. శాంటా క్లాజ్ గెటప్‌లో ఉన్న వ్యక్తితో వారు దిగిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. హీరోయిన్ డింపుల్ హయాతీ ఇంట్లోనే క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకొని ఆనందంగా గడిపింది. క్రిస్మస్ ట్రీ, కేక్ మధ్య ఆమె దిగిన ఫొటో అలరిస్తోంది. ప్రముఖ నటి కీర్తి సురేష్ (Keerthi Suresh) 'బేబీ జాన్' హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి క్రిస్మస్ జరుపుకుంది. చేతులు చాచి వారిద్దరు దిగిన ఫొటోపై మీరు ఓ లుక్కేయండి. స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara).. భర్త విఘ్నేష్, కవల పిల్లలతో క్రిస్మస్ రోజున సరదాగా గడిపింది. క్రిస్మస్ ట్రీ వద్ద ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్సులను పిల్లలకు ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) తన తల్లితో కలిసి క్రిస్టమస్ జరుపుకుంది. తలపై క్రిస్మస్ టోపీతో తల్లిని ఆలింగనం చేసుకున్న ఫొటో ఆకట్టుకుటోంది. క్రిస్మస్ సందర్భంగా రణ్‌బీర్ (Ranbir Kapoor) - అలియా (Alia Bhatt) జంట మరోమారు తళుక్కుమంది. కూతురు రాహాతో కలిసి వారు సంతోషంగా దిగిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Ali Khan) క్రిస్మస్ రోజున సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌తో దిగిన ఫొటో ప్రత్యేకంగా నిలుస్తోంది. వారిద్దరు క్రిస్మస్ ట్రీ ఎదుట ఫొటోకు ఫోజులిచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని (MS Dhoni) కుటుంబ సభ్యులతో క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ క్యాప్‌తో భార్య, కూతురుతో అతడు దిగిన ఫొటో క్రికెట్ లవర్స్‌ను తెగ మెప్పిస్తోంది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయ (Sivakarthikeyan) తన కుమారుడు గుగన్ దాస్‌తో పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. క్రిస్మస్ ట్రీ ముందు కుమారుడితో అందమైన సెల్ఫీ దిగి నెట్టింట పోస్టు చేశాడు. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), భార్య లావణ్య త్రిపాఠితో కలిసి విదేశాల్లో క్రిస్మస్ జరుపుకున్నాడు. ధ్రువపు జింకతో వారు జిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Hassan).. క్రిస్మస్ ట్రీతో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఆమె దిగిన ఫొటో నెటిజన్లను మెప్పిస్తోంది. తెలుగు హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) క్రిస్మస్ రోజున చాలా సంతోషంగా గడిపింది. వివిధ రకాల ఫోజుల్లో క్రిస్టమస్ చెట్టుతో ఫొటోలు దిగింది. వాటిని మీరూ చూసేయండి. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) ఇంట్లోనే క్రీస్తు పండగను చేసుకుంది. క్రిస్మస్ ఎంతో ఉత్తేజకరమైన రోజని ఆమె పేర్కొన్నారు. తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) తలపై శాంటా క్లాజ్ హెయిర్ బాండ్ పెట్టుకొని పోస్టు చేసిన ఫొటో ఆకట్టుకుంటోంది. టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty).. పారిస్ నగరంలో క్రిస్మస్‌ను ఘనంగా చేసుకుంది. ఈఫిల్ టవర్ కనిపించేలా ఆమె దిగిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ (Amrita Aiyer) క్రిస్మస్ ట్రీ పక్కన ఎంతో అందంగా ఫొటో దిగింది. క్రిస్మస్ వెలుగుల మధ్య ఆమె అందం మరింత రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందాల భామ హన్సిక (Haniska) ఈ పండగ సందర్భంగా తళుక్కున మెరిసింది. క్రిస్మస్ చెట్టు, శాంటా క్లాజ్ బొమ్మ పక్కన ఎంతో స్టైలిష్‌గా ఫొటో దిగింది. ప్రముఖ నటి రాయ్ లక్ష్మీ (Ray Lakshmi) క్రిస్మస్ వెలుగుల మధ్య ఎంతో సంతోషంగా గడిపింది. ఫ్యాన్స్‌ను ఉత్తేజపరుస్తూ ఆమె ఇచ్చిన ఫోజు మెప్పిస్తోంది. 'గద్దల గణేష్' ఫేమ్ మృణాళిని రవి (Mirnalini Ravi).. విదేశాల్లో క్రిస్మస్ పండుగను ఆస్వాదించింది. అక్కడి వీధుల్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆమె దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. ప్రముఖ నటి రుక్సార్ ధిల్లాన్ (Ruksar Dillon) కూడా ఘనంగా జరుపుకుంటోంది. రెడ్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. డిసెంబర్ 26 , 2024
- Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లేటాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి Sobhita Dhulipala శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది. Meenakshi Chaudhary మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది. Sreeleela శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది Samantha సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. Courtesy Instagram: samantha Rashmika Mandanna నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది . Sai Pallavi సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. Kiara Advani కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ . ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. Rukshar Dhillon రుక్సర్ థిల్లాన్ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది. Samyuktha Menon సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. Keerthy Suresh కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. Divyansha Kaushik దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది. Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. Mirnalini Ravi మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది. Kethika Sharma కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. Chandini Chowdary చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Eesha Rebba ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. Priyanka Jawalkar "ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న ప్రియాంక ఎన్.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. Courtesy Instagram: Dimple Hayathi Pujita Ponnada పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది. Ananya Nagalla అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. Courtesy Instagram:Ananya Nagallaడిసెంబర్ 04 , 2024
- Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్ ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్ నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్ తరుణ్ పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ: హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ- యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ- జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది. ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి. ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్. మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్మే 23 , 2024

Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
సొగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) కమర్షియల్ విజయం దక్కలేదు. మధ్యలో ఘోస్ట్ చిత్రం చేసినప్పటికీ.. విజయం వరించలేదు. దీంతో మరోసారి యాక్షన్ జనర్ నమ్ముకున్న నాగార్జున 'నా సామిరంగ' చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా విడుదలకు (Naa Saami Ranga Review) ముందు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో నా సామిరంగ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగార్జున హిట్ కొట్టాడా? YouSay సమీక్షలో చూద్దాం.
నటీనటులు
నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, కరుణ కుమార్, నాసర్, రావు రమేష్
కథ
ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కొరియోగ్రాఫర్ అయిన విజయ్ బిన్నికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన నాగార్జున నమ్మకాన్ని బిన్ని నిలబెట్టుకున్నాడు. కథలో ఎక్కడా ఎమోషన్స్ పండించాలో అక్కడ పండించి క్యారెక్టర్స్‌కు తగ్గ ఎలివేషన్స్ అందించాడు. ఎక్కడ ఎమోషన్స్ మిస్ కాకుండా నాగార్జున మ్యానరిజాన్ని జాగ్రత్తగా వాడుకుని కామెడీ పండిచడంలో విజయవంతం అయ్యాడు.
సినిమా ఎలా ఉందంటే?
నా సామిరంగ ఫస్టాఫ్ మొత్తం నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ ట్రాక్, ఆషికా రంగనాథ్(Ashika Ranganath) లవ్ ట్రాక్ అలరిస్తుంది. నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్‌ల మధ్య నడిచే కామెడీ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండాఫ్ పూర్తి సీరియస్‌గా నడుస్తుంది. ఓ కీలక పాత్ర చనిపోవడంతో నాగార్జున ప్రతీకారం తీర్చుకునేందుకు విలన్లపై పొరాడుతుంటాడు. ఎమోషనల్ సీన్లు బాగున్నప్పటికీ..కొన్ని సీన్లల్లో లెంత్ మరీ ఎక్కువ అయిపోయింది. దాన్ని లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే (Naa Saami Ranga Review in Telugu) ఈ సినిమాలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనే భావన కనిపిస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిజంతో పాటు ఆషిక రంగనాథ్‌తో నాగార్జున రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి.
ఎవరెలా చేశారంటే?
నా సామిరంగ(Naa Saami Ranga ) సినిమాలో టైటిల్ రోల్ పోషించిన నాగార్జున యాక్టింగ్ ఇరగదీశాడు. కింగ్ నాగార్జున(Nagarjuna) మరోసారి వింటేజ్ మాస్ లుక్‌ను గుర్తు తెచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకునేలా కనిపించాడు. ఆషికా రంగనాథ్‌తో రొమాన్స్ పండించాడు. ముఖ్యంగా 'నా సామిరంగ' అనే ఆ ఊత పదంతో ప్రేక్షకులందరిలో జోష్ నింపాడు. ఇంటర్వెల్ బ్రేక్‌లో నాగార్జున స్వాగ్ సినిమాకే హైలెట్. ఆ సీన్‌న్లో కీరవాణి బీజీఎమ్ అదిరిపోయింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు. నాగార్జునతో కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో పోటీపడి నటించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు నాజర్, రావురమేష్ కూడా వాళ్ల పరిధి మేరకు నటించారు. సినిమా విజయానికి కావాల్సిన ఇన్‌పుట్స్‌ను తమ నటన ద్వారా అందించారు.
టెక్నికల్ విషయాలు…
సాంకేతికంగా నా సామిరంగ చిత్రం ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరధి తన విజువల్స్ టేకింగ్‌లో మ్యాజిక్ చేశాడు. వింటేజ్ నాగార్జున చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఆస్కార్ విజేత MM కీరవాణి మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు ఓకే అనిపిస్తాయి. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే', నాసామిరంగ(Naa Saami Ranga ) టైటిల్ సాంగ్ విజిల్స్ కొటిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. నాగార్జున యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రాజమౌళి సినిమాలో ఇచ్చినట్టుగా మ్యూజిక్ రాలేదు కానీ... సినిమాకు కావాల్సిన మేర అందించాడు. మరోవైపు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. చాలా సీన్లను లాంగ్ లెంగ్త్‌తో కట్ చేశారు. అక్కడక్కడా లాగ్ అనిపిస్తాయి. ఇక రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ కూడా అదిరిపోయాయి. మరి ఓవర్ కాకుండా హీరోయిజన్ని ఎలివేట్ చెసేలా ఉన్నాయి.
బలాలు
నాగార్జున వింటేజ్ యాక్షన్అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ ట్రాక్ఆషికా రంగనాథ్- నాగార్జున లవ్ ట్రాక్ఇంటర్వెల్ సీన్
బలహీనతలు
ల్యాగ్ సీన్లుఅక్కడక్కడ అనవసరమైన సీన్లు
చివరగా: సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి నా సామిరంగ నిరాశ పరుచదు.
రేటింగ్: 3/5
జనవరి 14 , 2024
Stars celebrate Christmas 2024: క్రిస్మస్ రోజున సెలబ్రటీల వెలుగు జిలుగులు.. ఓ లుక్కేయండి!
క్రిస్మస్ పర్వదినం (Stars celebrate Christmas 2024) సందర్భంగా పలువులు సెలబ్రిటీలు ఎంతో సంతోషంగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు ఇంట్లో పండగ జరుపుకుంటే మరికొందరు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొందరు విదేశాల్లో పండగను ఆస్వాదించారు. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
రామ్‌చరణ్ - ఉపాసన జంట.. కూతురు క్లింకారతో కలిసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇంట్లో పనిచేసే వారితో కలిసి సంతోషంగా ఈ పండగ చేసుకున్నారు.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde).. క్రిస్మస్ రోజున ఎంతో సరదాగా గడిపింది. క్రిస్మస్ ట్రీ పక్కన కాఫీ దాగుతూ బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేసింది.
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తన భర్త సిద్ధార్ధ్ మల్హోత్రా (Sidharth Malhotra)తో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. భర్తను ఆలింగనం చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.
బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌషల్ (Vicky Kaushal) - కత్రీనా కైఫ్ (Katrina Kaif) విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంది. శాంటా క్లాజ్ గెటప్‌లో ఉన్న వ్యక్తితో వారు దిగిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
హీరోయిన్ డింపుల్ హయాతీ ఇంట్లోనే క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకొని ఆనందంగా గడిపింది. క్రిస్మస్ ట్రీ, కేక్ మధ్య ఆమె దిగిన ఫొటో అలరిస్తోంది.
ప్రముఖ నటి కీర్తి సురేష్ (Keerthi Suresh) 'బేబీ జాన్' హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి క్రిస్మస్ జరుపుకుంది. చేతులు చాచి వారిద్దరు దిగిన ఫొటోపై మీరు ఓ లుక్కేయండి.
స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara).. భర్త విఘ్నేష్, కవల పిల్లలతో క్రిస్మస్ రోజున సరదాగా గడిపింది. క్రిస్మస్ ట్రీ వద్ద ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్సులను పిల్లలకు ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) తన తల్లితో కలిసి క్రిస్టమస్ జరుపుకుంది. తలపై క్రిస్మస్ టోపీతో తల్లిని ఆలింగనం చేసుకున్న ఫొటో ఆకట్టుకుటోంది.
క్రిస్మస్ సందర్భంగా రణ్‌బీర్ (Ranbir Kapoor) - అలియా (Alia Bhatt) జంట మరోమారు తళుక్కుమంది. కూతురు రాహాతో కలిసి వారు సంతోషంగా దిగిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Ali Khan) క్రిస్మస్ రోజున సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌తో దిగిన ఫొటో ప్రత్యేకంగా నిలుస్తోంది. వారిద్దరు క్రిస్మస్ ట్రీ ఎదుట ఫొటోకు ఫోజులిచ్చారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని (MS Dhoni) కుటుంబ సభ్యులతో క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ క్యాప్‌తో భార్య, కూతురుతో అతడు దిగిన ఫొటో క్రికెట్ లవర్స్‌ను తెగ మెప్పిస్తోంది.
తమిళ స్టార్ హీరో శివకార్తికేయ (Sivakarthikeyan) తన కుమారుడు గుగన్ దాస్‌తో పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. క్రిస్మస్ ట్రీ ముందు కుమారుడితో అందమైన సెల్ఫీ దిగి నెట్టింట పోస్టు చేశాడు.
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), భార్య లావణ్య త్రిపాఠితో కలిసి విదేశాల్లో క్రిస్మస్ జరుపుకున్నాడు. ధ్రువపు జింకతో వారు జిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Hassan).. క్రిస్మస్ ట్రీతో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఆమె దిగిన ఫొటో నెటిజన్లను మెప్పిస్తోంది.
తెలుగు హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) క్రిస్మస్ రోజున చాలా సంతోషంగా గడిపింది. వివిధ రకాల ఫోజుల్లో క్రిస్టమస్ చెట్టుతో ఫొటోలు దిగింది. వాటిని మీరూ చూసేయండి.
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) ఇంట్లోనే క్రీస్తు పండగను చేసుకుంది. క్రిస్మస్ ఎంతో ఉత్తేజకరమైన రోజని ఆమె పేర్కొన్నారు.
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) తలపై శాంటా క్లాజ్ హెయిర్ బాండ్ పెట్టుకొని పోస్టు చేసిన ఫొటో ఆకట్టుకుంటోంది.
టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty).. పారిస్ నగరంలో క్రిస్మస్‌ను ఘనంగా చేసుకుంది. ఈఫిల్ టవర్ కనిపించేలా ఆమె దిగిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ (Amrita Aiyer) క్రిస్మస్ ట్రీ పక్కన ఎంతో అందంగా ఫొటో దిగింది. క్రిస్మస్ వెలుగుల మధ్య ఆమె అందం మరింత రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అందాల భామ హన్సిక (Haniska) ఈ పండగ సందర్భంగా తళుక్కున మెరిసింది. క్రిస్మస్ చెట్టు, శాంటా క్లాజ్ బొమ్మ పక్కన ఎంతో స్టైలిష్‌గా ఫొటో దిగింది.
ప్రముఖ నటి రాయ్ లక్ష్మీ (Ray Lakshmi) క్రిస్మస్ వెలుగుల మధ్య ఎంతో సంతోషంగా గడిపింది. ఫ్యాన్స్‌ను ఉత్తేజపరుస్తూ ఆమె ఇచ్చిన ఫోజు మెప్పిస్తోంది.
'గద్దల గణేష్' ఫేమ్ మృణాళిని రవి (Mirnalini Ravi).. విదేశాల్లో క్రిస్మస్ పండుగను ఆస్వాదించింది. అక్కడి వీధుల్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆమె దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.
ప్రముఖ నటి రుక్సార్ ధిల్లాన్ (Ruksar Dillon) కూడా ఘనంగా జరుపుకుంటోంది. రెడ్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.
డిసెంబర్ 26 , 2024
Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
యావత్ ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతి. తెలుగు వారికి ఇది ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్లు సైతం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంతకీ ఆ అందాల తారలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం.
మీనాక్షి చౌదరి
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఈ చిత‌్ర విజయంపై మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా, ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.
శ్రీలీల
గతేడాది వరుస చిత్రాలతో అలరించిన శ్రీలీల ఈ ఏడాది ప్రారంభంలోనే మరో భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ భామ కూడా ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటిస్తోంది.
ఆషికా రంగనాథ్
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గతేడాది ‘అమిగోస్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో నిరాశకు గురైంది. ఈ ఏడాది నాగార్జున పక్కన ‘నా సామిరంగ’ చిత్రంలో ఈ తార నటించింది. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడతాయని ఆషికా భావిస్తోంది.
రుక్సార్ థిల్లాన్
యంగ్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ కూడా ‘నా సామిరంగ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
మిర్నా మీనన్
తమిళ నటి మిర్నా మీనన్.. గతేడాది ఉగ్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగార్జున సరసన ‘నా సామిరంగ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా విజయం ద్వారా మరిన్ని టాలీవుడ్ అవకాశాలను దక్కించుకోవాలని మిర్నా భావిస్తోంది.
అమృత అయ్యర్
కన్నడ నటి అమృత అయ్యర్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీవిష్ణు పక్కన అర్జున ఫల్గుణలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జ సరసన ఈ భామ నటించింది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది.
శ్రద్ధ శ్రీనాథ్
స్టార్ హీరో వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. 'జెర్సీ' సినిమా తర్వాత శ్రద్ధాకు ఆ స్థాయి హిట్ లభించలేదు. దీంతో ఈ బ్యూటీ సైంధవ్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 13న విడుదల కానుంది.
రుహానీ శర్మ
2018లో వచ్చిన ‘చి.ల.సౌ.’ సినిమా ద్వారా రుహానీ శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే వెంకటేష్ సైంధవ్‌లో ఈ భామకు అవకాశం వచ్చింది. ఈ చిత్ర విజయంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని రుహానీ భావిస్తోంది.
అనుపమ పరమేశ్వరన్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఈగల్’. ఈ మూవీలో కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్ర విజయం ద్వారా కొత్త ఏడాదిని గ్రాండ్ ప్రారంభించాలని అనుపమ భావిస్తోంది. ఇక ఈమె నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది.
కావ్యా థాపర్
'ఏక్ మినీ కథ' సినిమాతో నటి కావ్యా థాపర్ తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ‘ఈగల్’ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయంతోనైనా మంచి అవకాశాలు వస్తాయని కావ్యా భావిస్తోంది.
జనవరి 02 , 2024

నా సామి రంగ
14 జనవరి 2024 న విడుదలైంది

స్పార్క్ లైఫ్
17 నవంబర్ 2023 న విడుదలైంది
.jpeg)
జాదుగర్
15 జూలై 2022 న విడుదలైంది

అశోక వనంలో అర్జున కల్యాణం
06 మే 2022 న విడుదలైంది
.jpeg)
ABCD: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ
17 మే 2019 న విడుదలైంది

కృష్ణార్జున యుద్ధం
12 ఏప్రిల్ 2018 న విడుదలైంది

ఆకతాయి
10 మార్చి 2017 న విడుదలైంది
రుక్సార్ ధిల్లాన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
థిల్లాన్ (తండ్రి), రామిందర్ దంపతులకు 12 అక్టోబర్, 1993న రుక్సర్ జన్మించింది.
రుక్సార్ ధిల్లాన్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
రుక్సర్‌కు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. వారి పేర్లు సబిహాహ్ థిల్లాన్, తేజిందర్ థిల్లాన్
రుక్సార్ ధిల్లాన్ Family Pictures
రుక్సార్ ధిల్లాన్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
2018లో వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో రుక్సర్ పాపులర్ అయ్యింది.
రుక్సార్ ధిల్లాన్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
ఆకతాయి(2017)
తెలుగులో రుక్సార్ ధిల్లాన్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
నా సామి రంగ (2024)
రుక్సార్ ధిల్లాన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంలో నేహా పాత్ర.
రుక్సార్ ధిల్లాన్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Rukshar Dhillon best stage performance
రుక్సార్ ధిల్లాన్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Rukshar Dhillon best dialogues
Rukshar Dhillon dialogues
రుక్సార్ ధిల్లాన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రుక్సర్ ఆస్తుల విలువ రూ.20 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.
రుక్సార్ ధిల్లాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
904K ఫాలోవర్లు ఉన్నారు
రుక్సార్ ధిల్లాన్ సోషల్ మీడియా లింక్స్
రుక్సార్ ధిల్లాన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రుక్సార్ ధిల్లాన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.