• TFIDB EN
  • ఎస్పీ శైలజ
    జననం : అక్టోబర్ 09 , 1962
    ప్రదేశం: నెల్లూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    శ్రీపతి పండితారాధ్యుల శైలజ తెలుగులో ప్రముఖ నేపథ్య గాయని. దిగ్గజ గాయకుడు ఎస్‌. పి బాలసుబ్రహ్మణ్యం సోదరి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో 7 వేలకు పైగా పాటలు పాడారు. ఈమె భర్త నటుడు శుభలేఖ సుధాకర్. మార్పు(1978) చిత్రం ద్వారా గాయనిగా పరిచయమయ్యారు. సాగర సంగమంలో చిత్రంలోని పాటల ద్వారా గుర్తింపు పొందారు. అందులో 'వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే' ఆ సినిమాలో కీలక పాత్రలో నటించారు కూడా. పలు సినిమాల్లో నటిగాను ఆమె రాణించారు. శైలజ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గాను అనేక మంది హీరోయిన్లకు గాత్ర దానం చేశారు. సోనాలీ బింద్రే, టబు, శ్రీదేవి వంటి హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. తెలుగు టెలివిజన్ సింగింగ్ కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతగా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పాడుతా తీయగా, సూపర్ సింగర్ వంటి షోల్లో పాల్గొన్నారు.
    ఎస్పీ శైలజ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఎస్పీ శైలజ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree