• TFIDB EN
  • ఎస్వీ కృష్ణా రెడ్డి
    ప్రదేశం: కొంకుదురు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    తెలుగులో కుటుంబ కథాచిత్రాలకు, హాస్య చిత్రాలకు కెరాఫ్ అడ్రస్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి గుర్తింపు పొందారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలందించారు. కె. అచ్చిరెడ్డితో కలిసి ఆయన రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. హీరో కావాలని వచ్చి దర్శకుడిగా మారిన కృష్ణా రెడ్డి.. 'కొబ్బరి బొండం(1991) చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'మాయలోడు', శుభలగ్నం, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, నంబర్ వన్, ఘటోత్కచుడు, ఆహ్వానం, పెళ్లిపీటలు, వినోదం, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయెరా, అతడే ఒక సైన్యం వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. అలీ హీరోగా అరంగేట్రం చేసిన యమలీల చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన SV కృష్ణా రెడ్డి శైలి చిత్రాల శకానికి నాంది పలికింది. సకుటుంబ సపరివార సమేతం, ఆహ్వానం చిత్రాలకు గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులు అందుకున్నాడు. శుభలగ్నం చిత్రానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డు పొందాడు.
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన  ఈ సినిమాల గురించి మీకు తెలుసా?Editorial List
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?

    ఎస్వీ కృష్ణా రెడ్డి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఎస్వీ కృష్ణా రెడ్డి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree