• TFIDB EN
  • సందీప్ రెడ్డి వంగ
    ప్రదేశం: వరంగల్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
    సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ డైరెక్టర్‌. 1988 డిసెంబర్ 25న వరంగల్‌లో జన్మించారు. ఫిజియోథెరపీ పూర్తిచేసి వైజాగ్‌లో కొంతకాలం జాబ్‌ చేశారు. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో ఫిలిం మేకింగ్‌కు సంబంధించి సిడ్నీలో శిక్షణ తీసుకున్నారు. 2010లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2017లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో డైరెక్టర్‌గా మారారు. ఆ చిత్రం సందీప్‌ రెడ్డి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆపై హిందీలో చేసిన 'కబీర్‌ సింగ్‌' (2019), పాన్‌ ఇండియా మూవీ 'యానిమల్‌' (2023) చిత్రాలు సందీప్‌ను స్టార్‌ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి చేతిలో ప్రభాస్‌ 'స్పిరిట్‌', రణ్‌బీర్‌ సింగ్‌ 'యానిమల్‌ 2' వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి.

    సందీప్ రెడ్డి వంగ వయసు ఎంత?

    సందీప్ రెడ్డి వంగా వయసు 35 సంవత్సరాలు

    సందీప్ రెడ్డి వంగ ఎత్తు ఎంత?

    5' 8'' (178 cm)

    సందీప్ రెడ్డి వంగ అభిరుచులు ఏంటి?

    వాచింగ్‌ ఫిల్మ్‌, ఫ్లైయింగ్‌ కైట్స్‌, ఫొటోగ్రఫీ, సంగీతం వినడం

    సందీప్ రెడ్డి వంగ ఏం చదువుకున్నారు?

    ఫిజియోథెరపిలో గ్యాడ్యుయేషన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో డిగ్రీ

    సందీప్ రెడ్డి వంగ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    డైరెక్టర్‌ కాకముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా 'కేడీ', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాలకు పని చేశారు.

    సందీప్ రెడ్డి వంగ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఎస్‌.డీ. ఎం. కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ధర్వాడ్‌, కర్ణాటక ఇంటర్నేషల్‌ ఫిల్మ్‌ స్కూల్‌, సిడ్నీ, ఆస్ట్రేలియా

    సందీప్ రెడ్డి వంగ‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో అర్జున్‌ రెడ్డి, యానిమల్‌(పాన్‌ ఇండియా) చిత్రాలను డైరెక్ట్‌ చేశాడు. హిందీలో 'కబీర్‌ సింగ్‌' (అర్జున్‌ రెడ్డి రీమేక్‌) అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

    సందీప్ రెడ్డి వంగ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    సందీప్ రెడ్డి వంగ‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ప్రణయ్‌ రెడ్డి అనే సోదరుడు ఉన్నాడు. అతడు 'భద్రకాళి పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సందీప్‌ డైరెక్ట్‌ చేస్తున్న చిత్రాలకు నిర్మాత లేదా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    సందీప్ రెడ్డి వంగ పెళ్లి ఎప్పుడు అయింది?

    2014లో మనీషా రెడ్డిని సందీప్‌ రెడ్డి వంగా వివాహం చేసుకున్నారు.

    సందీప్ రెడ్డి వంగ కు పిల్లలు ఎంత మంది?

    సందీప్‌ రెడ్డికి ఒక పాప, బాబు ఉన్నారు.

    సందీప్ రెడ్డి వంగ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తొలి చిత్రం 'అర్జున్‌ రెడ్డి'తో రాత్రికి రాత్రి స్టార్‌ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యారు.

    తెలుగులో సందీప్ రెడ్డి వంగ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సందీప్ రెడ్డి వంగ తొలి చిత్రం ఏది?

    కబీర్ సింగ్ (2019), యానిమల్‌(2023) చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.

    సందీప్ రెడ్డి వంగ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    అతడు డైరెక్ట్‌ చేసిన సినిమాల్లో అర్జున్‌ రెడ్డి పాత్ర అత్యుత్తమమైనది.

    సందీప్ రెడ్డి వంగ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.100-150 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

    సందీప్ రెడ్డి వంగ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌ వెజ్‌

    సందీప్ రెడ్డి వంగ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సందీప్ రెడ్డి వంగ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    సందీప్ రెడ్డి వంగ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    డేవిడ్‌ ఫించర్‌, మార్టిన్‌ స్కోర్సెస్‌

    సందీప్ రెడ్డి వంగ ఫెవరెట్ సినిమా ఏది?

    7G బృందావన కాలనీ (2004), తమాషా (2015), గుడ్‌ ఫెల్లాస్‌ (1990)

    సందీప్ రెడ్డి వంగ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    రెడ్‌, బ్లాక్‌

    సందీప్ రెడ్డి వంగ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    సందీప్ రెడ్డి వంగ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    సందీప్‌ రెడ్డి వంగా ఆస్తుల విలువ రూ.200-300 కోట్ల వరకూ ఉంటుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి.

    సందీప్ రెడ్డి వంగ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    470K ఫాలోవర్లు ఉన్నారు.

    సందీప్ రెడ్డి వంగ సోషల్‌ మీడియా లింక్స్‌

    సందీప్ రెడ్డి వంగ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డ్‌ - 2018

      'అర్జున్‌ రెడ్డి' చిత్రానికి గాను ఉత్తమ డెబ్యూట్‌ డైరెక్టర్‌గా ఎంపిక

    • సినీగోర్స్‌ అవార్డ్‌ - 2018

      'అర్జున్‌ రెడ్డి' చిత్రానికి గాను ఉత్తమ డెబ్యూట్‌ డైరెక్టర్‌గా ఎంపిక

    సందీప్ రెడ్డి వంగ కు సంబంధించిన వివాదాలు?

    సందీప్‌ రెడ్డి డైరెక్ట్‌ చేసిన 'అర్జున్‌ రెడ్డి', 'యానిమల్‌' చిత్రాలపై పలువురు ప్రముఖులు విమర్శలు చేయడం వివాదానికి దారి తీసింది.
    సందీప్ రెడ్డి వంగ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సందీప్ రెడ్డి వంగ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree