

సత్యదేవ్ కంచరణా
జననం : జూలై 04 , 1989
ప్రదేశం: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
సత్య దేవ్ కాంచరాన ప్రముఖ తెలుగు సినిమా నటుడు. హిందీ చిత్రాల్లోనూ గుర్తింపు పొందాడు. తొలుత విశాఖపట్నంలో షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా కెరీర్ ఆరంభించిన సత్యదేవ్, 2011 లో మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రంలో చిన్న పాత్రతో నట ప్రస్థానాన్ని ప్రారంభిచాడు. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ముకుంద చిత్రాలలో నటించాడు. జ్యోతి లక్ష్మి చిత్రంలో ప్రధాన పాత్ర కోసం ఆడిషన్ చేసిన 500 మందికి పైగా కళాకారుల నుండి సత్య ఎంపికయ్యాడు. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించనప్పటికీ.. సత్యదేవ్‌కు మంచి గుర్తింపు లభించింది. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం మంచి టాక్ సంపాదించింది. ఈ చిత్రం తర్వాత సత్యదేవ్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. గుర్తుందా శీతాకాలం, గాడ్సె, స్కైలాబ్, పిట్టకథలు, ఘాజీ, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించాడు.
సత్యదేవ్ కంచరణా వయసు ఎంత?
సత్యదేవ్ వయసు 35 సంవత్సరాలు
సత్యదేవ్ కంచరణా ఎత్తు ఎంత?
5' 10'' (178cm)
సత్యదేవ్ కంచరణా అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, సినిమాలు చూడటం
సత్యదేవ్ కంచరణా ఏం చదువుకున్నారు?
బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చేశాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొంతకాలం పాటు పనిచేశాడు.
సత్యదేవ్ కంచరణా ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
మహారాజ్ విజయ్‌రామ్ గజపతిరాజ్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం
సత్యదేవ్ కంచరణా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
సత్యదేవ్ కంచరణా ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.
సత్యదేవ్ కంచరణా ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
గాడ్స్ ఆఫ్ ధర్మపురి (G.O.D), లాక్డ్(Locked)
సత్యదేవ్ కంచరణా In Sun Glasses
సత్యదేవ్ కంచరణా Childhood Images
సత్యదేవ్ కంచరణా అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Satyadev Kancharana Viral Video

Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!

సత్యదేవ్ నటించి టాప్ హిట్ సినిమాలు

ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?
- SSMB 29: సోషల్ మీడియాలో మహేష్ బాబు లెటెస్ట్ ఫొటోలు లీక్… సింహంతో మాములుగా లేడు! మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా కోసం 2025 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రల ఎంపికకు కూడా రాజమౌళి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. Image Credit: X ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో సినిమా నిర్మాణం సినిమా గొప్పతనాన్ని మరింత పెంచేందుకు రాజమౌళి వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్‌తో చేతులు కలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికా అడవుల్లో కొన్ని వినూత్నమైన లొకేషన్లను పరిశీలించి, (Mahesh Babu Ai Images)అత్యంత యథార్థంగా ఉండేలా ఎంపిక చేశారని టాక్. అంతేకాకుండా, గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరిపి, ఇంటర్నేషనల్ స్థాయికి తగినంత ఉన్నతమైన విజువల్ ఎఫెక్ట్స్‌పై దృష్టి సారించారు. Image Credit: X రెండేళ్ల పాటు షూటింగ్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ సెట్స్‌లోనే(Mahesh Babu Ai Images) గడపవలసి ఉంటుంది. ఈ సినిమా హై-వోల్టేజ్ యాక్షన్, అడ్వెంచర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. https://twitter.com/AbhiM2608/status/1866455157590184410 ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ జోడీగా ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా ఎలిజబెత్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు. Image Credit: X ఎక్స్‌లో మహేష్ బాబు ఏఐ పిక్స్ వైరల్ SSMB29 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని ఫ్యాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ద్వారా క్రియేట్ చేశారు. SSMB29 కథా నేపథ్యంతో ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలు ఆశ్యర్యపరుస్తున్నాయి. సింహంతో ఉన్న మహేష్ బాబు పిక్స్ ఔరా! అని అబ్బురపడేలా ఉన్నాయి. అడవిలో మహేష్ బాబు ఫైట్స్ చేస్తున్నట్లుగా ఏఐ క్రియేట్ చేసింది. మరో ఫొటోలో రాజమౌళి మహేష్ బాబుకు సీన్ వివరిస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం(Mahesh Babu Ai Images) ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇలాగే మహేష్ మెకోవర్ ఉంటే ఫ్యాన్స్‌కు పండగేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Image Credit: X ముఫాసా పాత్రపై మహేష్ ఉత్సాహం ఇటీవల మహేష్ బాబు, డిసెంబర్ 20న విడుదల కానున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్లో లీడ్ క్యారెక్టర్ ముఫాసా పాత్రకు వాయిస్ అందించారు. ఈ అవకాశంపై మహేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, "ముఫాసా పాత్ర నాకు ఎంతో ఇష్టమైనది. కుటుంబంపై ప్రేమ, సంరక్షణ అనే అంశాలను ఈ పాత్ర అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాత్రకు డబ్బింగ్ ఇవ్వడం నా కల సాకారమైనంతటిది" అని అన్నారు. తెలుగు వెర్షన్లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ అందించగా, ఇతర పాత్రలకు (Mahesh Babu Ai Images)సత్యదేవ్, అలీ, బ్రహ్మానందం, అయ్యప్ప పి. శర్మ వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించగా, డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. Image Credit: X అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు SSMB 29 చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా కావడం, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, భారీ బడ్జెట్, మహేష్ బాబు వంటి స్టార్ హీరో అందులో నటించడమే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలను అందుకునే విధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.డిసెంబర్ 10 , 2024
- Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్ సేన్ మార్కెట్.. సత్యదేవ్, ఆశోక్ గల్లా పరిస్థితి మరీ దారుణం!ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. మాస్ కా దాస్ విష్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్‌ను పలకరించింది. అలాగే ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అయితే విష్వక్, సత్యదేవ్ చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకోగా అశోక్ గల్ల (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మరీ తొలి రోజు ఈ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయా? లేదా మంచి వసూళ్లనే సాధించాయా? ఇప్పుడు పరిశీలిద్దాం. ‘మెకానిక్ రాకీ’ కలెక్షన్స్ ఎంతంటే విష్వక్ సేన్ (Vishwaksen) హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా చేసిన చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanik Rocky Day 1 Collections). రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. శుక్రవారం (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలతో విష్వక్ ప్రేక్షకులను పలకరించాడు. మంచి హిట్ టాక్ కూడా సొంతం చేసుకున్నాడు. ‘మెకానిక్ రాకీ’తో ఎలాగైన హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావించిన విష్వక్‌కు ఈ మూవీ ఝలక్ ఇచ్చారు. యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. ఈ ప్రభావం తొలి రోజు కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది. మెకానిక్ రాకీ తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 2.3 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. ఇది విష్వక్ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన గత చిత్రాలు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’ తొలి రోజున వరుసగా రూ.8 కోట్లు, రూ.8.6 కోట్ల గ్రాస్ సాధించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ కూడా రూ.8.88 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రాలతో పోలిస్తే మెకానిక్ రాకీ డే 1 కలెక్షన్స్ 75% మేర పడిపోయాయని చెప్పవచ్చు. ‘జిబ్రా’ కలెక్షన్స్ ఎంతంటే సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (daali dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్’ సినిమాను డైరెక్ట్ చేసిన ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్ క్రైమ్ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.65.8 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.55.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. శని, ఆది వారాల్లో సినిమా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ లేకపోలేదని తెలిపాయి. దేవకీ నందన వాసుదేవ కలెక్షన్స్ ఎంతంటే ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ మెుదటి నుంచి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 22) రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకొని అందరినీ షాక్‌కు గురించేసింది. మూవీ టాక్‌కు తగ్గట్లే కలెక్షన్స్ కూడా దారుణంగా నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.15.5 లక్షలు మాత్రమే దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి. నవంబర్ 23 , 2024
- Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్ హిట్ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్, జెన్నీఫర్, సునీల్, సత్య, సత్యరాజ్, సురేష్ చంద్ర మీనన్ తదితరులు దర్శకత్వం : ఈశ్వర్ కార్తిక్ సంగీతం : రవి బస్రూర్ సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్ ఎడిటింగ్: అనిల్ క్రిష్ నిర్మాతలు: ఎస్.ఎన్. రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం విడుదల తేదీ: నవంబర్ 22, 2024 సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (Daali Dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్’ సినిమాను డైరెక్ట్ చేసిన ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్ క్రైమ్ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సత్యదేవ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి మిడిల్ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్ఫర్ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ (Zebra Movie Review). ఎవరెలా చేశారంటే సూర్య పాత్రలో నటుడు సత్యదేవ్ (Satyadev) మరోమారు దుమ్ములేపాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని కలగలిసిన పాత్రలో సత్యదేవ్ అదరగొట్టాడు. సత్యదేవ్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించాడు కన్నడ నటుడు డాలి ధనంజయ్. ఆది పాత్రలో అతడు జీవించేశాడు. సినిమాలో అత్యంత పవర్ఫుల్ పాత్ర అతడిదే. కొన్ని సన్నివేశాల్లో సత్యదేవ్‌ను డామినేట్ చేశాడన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రియా భవానీ శంకర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. జెన్నిఫర్ తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. సత్య కామెడీ టైమింగ్ మరోమారు ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం సూర్య వర్సెస్ ఆది అన్నట్లు సాగిపోవడంతో మిగిలిన పాత్రలు పెద్దగా హైలెట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ బ్యాంకింగ్ రిలేటెడ్ కంటెంట్ (Zebra Movie Review)ను తీసుకొని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో అతడి నైపుణ్యం బాగా కనిపిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఫ్రాడ్స్‌ను కళ్లకు కట్టే ప్రయత్నంలో కొంతమేర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలో బ్యాంక్ ఎంప్లాయిగా ఈశ్వర్ కార్తిక్ పని చేయడం సినిమాకు కలిసివచ్చింది. అయితే సాధారణ బ్యాంక్ ఎంప్లాయి అయిన హీరో నాలుగు రోజుల్లో రూ.5 కోట్లను సంపాదించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. రూ.100 కోట్ల సమస్యను సైతం ఒక్క ఈమెయిల్‌తో తప్పించుకోవడం కూడా లాజిక్కు అందదు. లాజిక్కులను పట్టించుకోని ప్రేక్షకులకు మాత్రం జిబ్రా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. సత్యదేవ్ - డాలీ మధ్య జరిగే ఇంట్రస్టింగ్ వార్, సత్య కామెడీ, సునీల్ నటన, డైలాగ్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Zebra Movie Review) రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సత్య పోన్మార్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. బ్యాంక్‌ను పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ మంచి మార్కులు కొట్టేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లేసత్యదేవ్, ధనంజయ్ నటననేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ లాజిక్కు అందని సన్నివేశాలుఇరికించినట్లు వచ్చే పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5 నవంబర్ 22 , 2024

సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సత్యదేవ్ ఒకరు. బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సత్యదేవ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం.
సత్యదేవ్ అసలు పేరు?
సత్యదేవ్ కంచరణా
సత్యదేవ్ ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
సత్యదేవ్ తొలి సినిమా?
మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం ద్వారా సత్యదేవ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'బ్లప్ మాస్టర్'
సత్యదేవ్ ఎక్కడ పుట్టాడు?
విశాఖపట్నం, ఏపీ
సత్యదేవ్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1989 జులై 4
సత్యదేవ్‌కు వివాహం అయిందా?
దీపికతో 2016లో పెళ్లి జరిగింది. 2020లో ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు. పేరు సావర్ణిక్
సత్యదేవ్ ఫెవరెట్ హీరో?
మెగాస్టార్ చిరంజీవి
సత్యదేవ్ తొలి హిట్ సినిమా?
జ్యోతి లక్ష్మి చిత్రం సత్యదేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్‌ఫాదర్ వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి.
సత్యదేవ్‌కు ఇష్టమైన కలర్?
బ్లాక్ అండ్ వైట్
సత్యదేవ్ తల్లిదండ్రుల పేర్లు?
ప్రసాద్ రావు, లక్ష్మి
సత్యదేవ్‌కు ఇష్టమైన ప్రదేశం?
విశాఖపట్నం
సత్యదేవ్ ఏం చదివాడు?
ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొద్దికాలం బెంగుళూరులో పనిచేశాడు.
సత్యదేవ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.
సత్యదేవ్‌కు ఇష్టమైన ఆహారం?
దోశ
సత్యదేవ్ నికర ఆస్తుల విలువ ఎంత?
రూ. 7.5 కోట్లు
సత్యదేవ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=bLnXyZ4pzhE
మార్చి 21 , 2024
This week Telugu Ott Releases: ఈ వారం(నవంబర్ 18- 24) థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు ఇవే
కలెక్షన్ల పరంగా, వినోదం పరంగా గతవారం తెలుగు ఇండస్ట్రీకి తీవ్ర నిరాశ మిగిల్చింది.'కంగువ', 'మట్కా' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈవారం విడుదలయ్యే కొత్త సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం పెద్ద హీరోల సినిమాలు లేనప్పటికీ.. విష్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' కాస్త చెప్పుకోదగింది. ఆ తర్వాత 'రోటీ కపడా రొమాన్స్', 'జీబ్రా', లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలో 30కి పైగా కొత్త చిత్రాలు- వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేవకీ నందన వాసుదేవ
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా చేస్తోన్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ట్రైలర్‌లో అశోక్ మంచి స్క్రీన్ ప్రజెన్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. హీరోయిన్‌గా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి నటిస్తోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందించారు. తొలుత ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలనుకున్నప్పటికీ... ఈ వారంలో నవంబర్ 22న విడుదల చేస్తున్నారు.
మెకానిక్ రాకీ
సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్వక్ సేన్.. మరో విభిన్నమైన కథతో మెకానిక్ రాకీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘మెకానిక్ రాకీ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.
రోటి కపడా రొమాన్స్
గత ఏడాదిగా వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న రోటి కపడా రొమాన్స్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నువేక్ష, హర్ష నర్రా, ఖుష్బు చౌదరీ, మేఘలేఖ, తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
జీబ్రా
విలక్షణ నటుడు సత్యదేవ్ కంచరాణా ప్రధాన పాత్రలో తెలుగులో రాబోతున్న చిత్రం జీబ్రా. విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సాధించింంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేయగా.. దినేష్ సుందరం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ వారం( November 18- 24) ఓటీటీలో విడుదల కానున్న తెలుగు చిత్రాలు
మరో వైపు ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే, 'నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, కిష్కింద కాండం' అనే డబ్బింగ్ సినిమా, దీనితో పాటు రానా హోస్ట్ చేసిన టాక్ షో 'ఉన్నంతలో' కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
PlatformMovie/Webseries NameLanguage/TypeRelease DateHotstarKishkindha KandamTelugu Dubbed MovieNovember 19Interior ChinatownEnglish SeriesNovember 19Alien: RomulusEnglish MovieNovember 21Bia & VictorPortuguese SeriesNovember 22Out of My MindEnglish MovieNovember 22ETV WinI Hate LoveTelugu MovieNovember 21Repathi VeluguTelugu MovieNovember 21NetflixNayanthara: Beyond the FairytaleDocumentaryNovember 18Wonderoos Season 2English SeriesNovember 18Zombiverse Season 2Korean SeriesNovember 19See Her AgainCantonese SeriesNovember 20AdorationItalian SeriesNovember 20A Man on the InsideEnglish SeriesNovember 21Tokyo Over RideJapanese SeriesNovember 21JoyEnglish MovieNovember 22Pokémon Horizons Part 4Japanese SeriesNovember 22SpellboundEnglish MovieNovember 22The Helicopter HeistSwedish SeriesNovember 22The Piano LessonEnglish MovieNovember 22TransmithSpanish MovieNovember 22Yeh Kaali Kaali Ankhein Season 2Hindi SeriesNovember 22The Empress Season 2German SeriesNovember 22Amazon PrimeCampus Beats Season 4Hindi SeriesNovember 20Wack GirlsHindi SeriesNovember 22PimpineroSpanish MovieNovember 22The Rana Daggubati ShowTelugu Talk ShowNovember 23Jio CinemaDune: ProphecyEnglish SeriesNovember 18Based on a True Story Season 2English SeriesNovember 22The Sex Lives of College Girls Season 3English SeriesNovember 22Harold and the Purple CrayonEnglish MovieNovember 23Manorama MaxTekku VadakkuMalayalam MovieNovember 19Apple TV+BlitzEnglish MovieNovember 22BookMyShowFrom DarknessSwedish MovieNovember 22The Girl in the TrunkEnglish MovieNovember 22The Night My Dad Saved ChristmasSpanish MovieNovember 22Lionsgate PlayGreedy PeopleEnglish MovieNovember 22
నవంబర్ 18 , 2024
Krishnamma Movie Review: రివేంజ్ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్… సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : సత్య దేవ్, అథిరా రాజ్, ఆర్చన అయ్యర్, రఘు కుంచె
డైరెక్టర్ : వి. వి. గోపాల కృష్ణ
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రాఫర్ : సన్నీ కుర్రపాటి
ఎడిటర్ : తిమ్మరాజు
నిర్మాత : కృష్ణ కొమ్మలపాటి
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సత్య దేవ్‌కు మరో హిట్‌ను అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
విజయవాడ వించిపేటలో జీవించే భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా జీవిస్తుంటారు. గతంలో నేరాలకు పాల్పడిన ఈ ముగ్గురు కొన్ని కారణాలతో మంచిగా మారతారు. భద్ర ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా వీరికి రూ. 3 లక్షలు అవసరం పడతాయి. చివరిసారిగా ఒక నేరం చేసి అవసరం తీర్చుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. జైలుకు కూడా వెళ్తారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు అనూహ్యంగా చనిపోతారు? స్నేహితుల్లో ఒకరు చనిపోవడానికి కారణం ఎవరు? వారు జైలుకెళ్లేలా కుట్ర చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
విలక్షణ నటుడు సత్యదేవ్ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తనదైన నటనతో అదరగొట్టాడు. పగతో రగిలిపోయే భద్ర పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఎమోషనల్ సన్నివేశాల్లో సత్యదేవ్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరోయిన్‌గా అతిర పాత్ర పరిమితమే. నటన పరంగా ఆమె పాత్రకు పెద్ద స్కోప్ లేదు. స్నేహితులుగా చేసిన మీసాల లక్ష్మణ్, కృష్ణ తేజా రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు. పోలీసు ఆఫీసర్‌గా చేసిన నందగోపాల్ పర్వాలేదనిపించాడు. రఘు కుంచే పాత్ర కూడా సినిమాలో బాగుంది. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వి.వి గోపాలకృష్ణ.. రివేంజ్ డ్రామాగా ఈ సినిమాకు తెరకెక్కించాడు. అయితే కథ పరంగా చూస్తే కొత్త దనం ఏమి లేదని చెప్పాలి. ఈ తరహా రివేంజ్ డ్రామాలు చాలానే వచ్చాయి. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లిన విధానం ప్రశంసనీయం. ఫస్టాఫ్ మెుత్తం ఓ దారుణ హత్య.. స్నేహితుల పాత్రలు, వారి మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్‌ను పరిచయం చేయడంతోనే సరిపోయింది. దీంతో ఆడియన్స్‌కు కథ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. సెకండాఫ్‌కు వచ్చాక దర్శకుడు కథలో వేగం పెంచాడు. తమ ఫ్రెండ్‌ను చంపిన వారిని హీరో టార్గెట్ చేసే సీన్లను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. అయితే క్లైమాక్స్ ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. చిన్న చిన్న లోపాలున్నా దర్శకుడిగా వి.వి. గోపాల కృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సన్నీ కుర్రపాటి తన కెమెరా పనితనంతో తెరపై ప్లెజెంట్ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అటు కాల భైరవ అందించిన పాటలు సో సోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సత్యదేవ్ నటనస్క్రీన్‌ప్లేసెకండాఫ్
మైనస్ పాయింట్స్
రొటిన్ రీవెంజ్ డ్రామాబోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-satyadev.html
మే 10 , 2024
This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
కృష్ణమ్మ
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వివి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ప్రతినిధి 2
నారా రోహిత్ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీ రూపొందింది. సప్తగిరి, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. వాస్తవానికి ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
జితేందర్ రెడ్డి
ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన లేటేస్ట్ చిత్రం ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). రాకేశ్ వర్రే కథానాయకుడిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను నిర్మించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆరంభం
మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
హాలీవుడ్‌లో ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంఛైజీ నుంచి వచ్చే చిత్రాలకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తోన్న నాల్గో చిత్రం ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (kingdom of the planet of the apes). వెస్‌బాల్ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ‘మనుషులపై యుద్ధం ప్రకటించిన ప్రాక్సిమస్ సీజర్ అనే కోతితో ఓ యువతి ఎలాంటి పోరాటం చేసింది. అందుకు మరో కోతి ఎలాంటి సహకారం అందించింది’ అన్నది కథ.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు
గీతాంజలి మళ్లీ వచ్చింది
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi). 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మే 8 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో రాబోతోంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఈ చిత్రం అలరిస్తుందో చూడాలి.
ఆవేశం
పుష్ప ఫేమ్ విలన్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ చిత్రం 'ఆవేశం'. ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.130 కోట్ల కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ చిత్రాన్ని మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి తీసుకున్నారు. తెలుగు, మలయాళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి రానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBodkin SeriesEnglishNetflixMay 09Mother Of The BrideMovieEnglishNetflixMay 09Thank You NextSeriesEnglishNetflixMay 09AaveshamMovieTelugu/MalayalamAmazon primeMay 09The GoatSeriesEnglishAmazon primeMay 09YodhaMovieHindiAmazon primeMay 108AM MetroMovieHindiZee 5May 10All Of Us StrangersMovieEnglishDisney+HotstarMay 8Un Dekhi 3SeriesHindiSonyLIVMay 10RomeoMovieTamilAhaMay 10Dark MatterSeriesEnglishApple Plus TvMay 8Hollywood Con QueenSeriesEnglishApple Plus TvMay 8
మే 06 , 2024
.jpeg)
బ్లఫ్ మాస్టర్
హాస్యం , థ్రిల్లర్
28 డిసెంబర్ 2018 న విడుదలైంది

ఇస్మార్ట్ శంకర్
యాక్షన్ , సైన్స్ ఫిక్షన్ , థ్రిల్లర్
18 జూలై 2019 న విడుదలైంది

బ్రోచేవారెవరురా
హాస్యం , థ్రిల్లర్
28 జూన్ 2019 న విడుదలైంది

సరిలేరు నీకెవ్వరు
యాక్షన్ , డ్రామా
11 జనవరి 2020 న విడుదలైంది
.jpeg)
గాడ్ ఫాదర్
యాక్షన్ , డ్రామా
05 అక్టోబర్ 2022 న విడుదలైంది

రామ్ సేతు
యాక్షన్ , అడ్వెంచర్
25 అక్టోబర్ 2022 న విడుదలైంది

ముఫాసా: ది లయన్ కింగ్
20 డిసెంబర్ 2024 న విడుదలైంది

జీబ్రా
22 నవంబర్ 2024 న విడుదలైంది

కృష్ణమ్మ
10 మే 2024 న విడుదలైంది

గుర్తుందా శీతాకాలం
09 డిసెంబర్ 2022 న విడుదలైంది

రామ్ సేతు
25 అక్టోబర్ 2022 న విడుదలైంది
.jpeg)
గాడ్ ఫాదర్
05 అక్టోబర్ 2022 న విడుదలైంది
.jpeg)
గాడ్సే
17 జూన్ 2022 న విడుదలైంది
.jpeg)
ఆచార్య
29 ఏప్రిల్ 2022 న విడుదలైంది
.jpeg)
స్కైలాబ్
04 డిసెంబర్ 2021 న విడుదలైంది

తిమ్మరుసు: అసైన్మెంట్ వల్లి
30 జూలై 2021 న విడుదలైంది

పిట్ట కథలు
19 ఫిబ్రవరి 2021 న విడుదలైంది

గువ్వ గోరింక
17 డిసెంబర్ 2020 న విడుదలైంది
సత్యదేవ్ కంచరణా సోదరుడు/సోదరి పేరు ఏంటి?
సత్యదేవ్‌కు తోబుట్టువులు ఎవరూ లేరు. వారి తల్లిదండ్రులకు సత్యదేవ్ ఒకరే సంతానం.
సత్యదేవ్ కంచరణా పెళ్లి ఎప్పుడు అయింది?
2020లో దీపిక అనే యువతిని సత్యదేవ్ వివాహం చేసుకున్నారు.
సత్యదేవ్ కంచరణా కు పిల్లలు ఎంత మంది?
సత్యదేేవ్‌కు ఓ బాబు ఉన్నాడు. పేరు నిక్కి.
సత్యదేవ్ కంచరణా Family Pictures
సత్యదేవ్ కంచరణా ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
బ్లఫ్ మాస్టర్ సినిమాతో సత్యదేవ్ బాగా పాపులర్ అయ్యాడు.
సత్యదేవ్ కంచరణా లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
జ్యోతిలక్ష్మీ(2015)
తెలుగులో సత్యదేవ్ కంచరణా ఫస్ట్ హిట్ మూవీ ఏది?
సత్యదేవ్ కంచరణా కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
బ్లఫ్ మాస్టర్‌లో చేసిన ఉత్తమ్ కుమార్ పాత్ర
సత్యదేవ్ కంచరణా బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Satyadev Kancharana best stage performance
సత్యదేవ్ కంచరణా బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Satyadev Kancharana best dialogues
Satyadev Kancharana dialogues
సత్యదేవ్ కంచరణా రెమ్యూనరేషన్ ఎంత?
సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
సత్యదేవ్ కంచరణా కు ఇష్టమైన ఆహారం ఏంటి?
దోశ
సత్యదేవ్ కంచరణా కు ఇష్టమైన నటుడు ఎవరు?
సత్యదేవ్ కంచరణా కు ఇష్టమైన నటి ఎవరు?
సత్యదేవ్ కంచరణా ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, ఇంగ్లీషు, హిందీ
సత్యదేవ్ కంచరణా ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
సత్యదేవ్ కంచరణా ఫెవరెట్ సినిమా ఏది?
సత్యదేవ్ కంచరణా ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్, బ్లూ
సత్యదేవ్ కంచరణా కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?
సత్యదేవ్ కంచరణా ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
సత్యదేవ్ కంచరణా ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
సత్యదేవ్ ఆస్తుల విలువ రూ. 7.5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
సత్యదేవ్ కంచరణా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
6 లక్షల 41 వేల మంది ఫాలోవర్లు
సత్యదేవ్ కంచరణా సోషల్ మీడియా లింక్స్
సత్యదేవ్ కంచరణా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సత్యదేవ్ కంచరణా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.