• TFIDB EN
  • సత్యం
    చెళ్లపిళ్ల సత్యం తెలుగులో ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరు. ఆయన వంశస్థులంతా సంగీత సాహిత్యాలలో ఆపారమైన ప్రతిభను చాటిన వారే. సత్యం ముత్తాత చెళ్లపిల్ల వెంకట కవి... తిరుపతి వెంకట కవుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1962వ సంవత్సరంలో ఎం.ఎస్.నాయక్ నిర్మించిన "శ్రీ రామాంజనేయ యుద్ధం" అనే కన్నడ సినిమాకి తొలిసారి మ్యూజిక్ అందించే అవకాశం లభించింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో కన్నడలో అవకాశాలు వెల్లువెత్తాయి. మొదట్లో తెలుగులో అడప దడప సినిమాలు చేస్తూన్నా మంచి గుర్తింపు రాలేదు. ఈలోపు కన్నడంలో 42 సినిమాలకు స్వరకల్పన చేశాక 1973 లో "కన్నె వయసు" సినిమా తరువాత ఇక తెలుగులో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. సత్యం స్వరజీవితంలోనే అగ్రతాంబూలం ఇవాల్సిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" పాట ఈ సినిమాలోనిదే. ఇలా తన 20 ఏళ్ల సినీ జీవితంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు. కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్రతారల చిత్రాలకు విజయవంతమైన సంగీతం అందించారు. 70 వ దశకంలో దాదాపు కృష్ణ నటించిన అన్నీ కౌబాయ్ చిత్రాలకు సత్యమే మ్యూజిక్ అందించారు. మట్టిలో మాణిక్యం, జేమ్స్ బాండ్ 777 , రౌడీలకు రౌడీలు, పాపం పసివాడు, బాలమిత్రుల కథ, కన్నె వయసు, నోము, తోట రాముడు, కార్తీక దీపం, భువనేశ్వరి, ధర్మచక్రం, అంకుశం, గృహ ప్రవేశం వంటి హిట్ చిత్రాలకు బాణీలు అందించారు. దాదాపు 400కు పైగా సినిమాలకు సంగీతం అందించారు.


    @2021 KTree