

శ్రేయా రాణి రెడ్డి
జననం : నవంబర్ 28 , 1982
ప్రదేశం: చెన్నై, భారతదేశం.
శ్రేయా రాణి రెడ్డి టాలీవుడ్‌కు చెందిన యువ నటి. ఢిల్లీకి చెందిన శ్రేయా సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. 'అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' (2022) సీరియల్‌తో తొలిసారి నటనా ప్రవేశం చేసింది. 'నింద' (2024) సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అందులో జాన్వీ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. సరైన అవకాశం లభిస్తే తనను తాను నిరూపించుకునేందుకు శ్రేయా సిద్ధంగా ఉంది.
శ్రేయా రాణి రెడ్డి వయసు ఎంత?
శ్రేయా రాణి రెడ్డి వయసు 42 సంవత్సరాలు
శ్రేయా రాణి రెడ్డి ఎత్తు ఎంత?
5' 5'' (168cm)
శ్రేయా రాణి రెడ్డి అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, షాపింగ్
శ్రేయా రాణి రెడ్డి ఏం చదువుకున్నారు?
గ్రాడ్యుయేషన్
శ్రేయా రాణి రెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటిగా చేసింది. 'అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' (2022) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. బుల్లితెరపై వచ్చే 'ఢీ' డ్యాన్స్ షోలోనూ ఈ అమ్మడు అదరగొట్టింది.
శ్రేయా రాణి రెడ్డి ఫిగర్ మెజర్‌మెంట్స్?
30-26-32
శ్రేయా రాణి రెడ్డి ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
నింద(2024)
శ్రేయా రాణి రెడ్డి In Ethnic Dress
శ్రేయా రాణి రెడ్డి In Half Saree
శ్రేయా రాణి రెడ్డి In Saree
శ్రేయా రాణి రెడ్డి Hot Pics
శ్రేయా రాణి రెడ్డి అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Shreya Rani Reddy Viral Video
Insta Hot Reels
Shreya Rani Reddy Hot Insta Reel
Shreya Rani Reddy Insta Reel
- OG Movie: టిల్లు బ్యూటీతో పవన్ కల్యాణ్ రొమాన్స్!పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలోని ప్రాజెక్ట్స్‌లో 'ఓజీ' (OG) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా 'ఓజీ'ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఓజీ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేహాశెట్టి స్పెషల్ సాంగ్ యంగ్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ‘డీజే టిల్లు’తో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించింది. రాధిక అనే పాత్రతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘ఓజీ’ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేస్తునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఓజీ’ మూవీ షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడే ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా మెుదలైనట్లు మూవీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్‌లో నేహా పర్‌ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్‌కు పక్కాగా విజువల్ ట్రీట్ ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. దీంతో ‘ఓజీ’పై అంచనాలు అభిమానుల్లో రెట్టింపయ్యాయని చెప్పవచ్చు. https://twitter.com/Fukkard/status/1869238838721437802 ‘ఓజీ’తో బౌన్స్ బ్యాక్..! ‘డీజే టిల్లు’ బ్లాక్ బాస్టర్ కావడంతో నేహా శెట్టికి తిరుగుండదని అంతా భావించారు. కానీ ఆ మూవీ సక్సెస్ హీరో సిద్ధు జొన్నగడ్డకు ఉపయోగపడినట్లుగా నేహాకు యూజ్ కాలేదు. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడికి బడా చిత్రాల్లో అవకాశాలు రాలేదు. ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ వంటి చిన్న ప్రాజెక్ట్స్ చేసినా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’లో గెస్ట్ రోల్, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మెప్పించినా తర్వాత మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో 'ఓజీ'లో స్పెషల్ సాంగ్తోనైనా నేహా బౌన్స్‌బ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల 'పుష్ప 2'లో ‘కిస్సిక్’ సాంగ్ చేసి శ్రీలీల వరుస అవకాశాలు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ మూవీగా ‘ఓజీ’ పవన్ కల్యాణ్ చేతిలోని ‘హరి హర వీరమల్లు’, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ‘ఓజీ’ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. అలానే జపనీస్ నటుడు కజుకి కిటముర కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీరితో పాటు అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్తమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) వంటి వారు ఈ సినిమాలో నటిస్తుండటంతో ‘ఓజీ’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఓజీలో ప్రభాస్, అకీరానందన్? ‘ఓజీ’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ఓ క్యామియో ఇవ్వబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మూవీ క్లైమాక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. అంతేకాదు సుజీత్ - ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘సాహో’ చిత్రంతో ఓజీకి లింక్ కూడా ఉండనున్నట్లు కథనాలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ‘ఓజీ’లో నటించినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపించింది. పవన్ చిన్నప్పటి పాత్రలో అకీరా నటించాడని, స్క్రీన్‌పై అతడి రోల్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అవుతారంటూ కూడా నెట్టింట పోస్టులు కనిపించాయి. https://twitter.com/TBO_Updates/status/1862813629441011860 https://twitter.com/FilmyTwood/status/1859094576272953795#డిసెంబర్ 18 , 2024
- OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై ఫోకస్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయన చేతిలోని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రీసెంట్‌గా ఆ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మినహా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ తిరిగి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్‌ను సైతం మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో పవన్ మూడు ప్రాజెక్ట్స్‌లో ముందుగా హరిహర వీరమల్లునే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి తారుమారైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ముందే ‘ఓజీ’ రిలీజ్? పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న 'ఓజీ' ప్రాజెక్ట్‌కు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే ‘ఓజీ’ (OG Release Update) రిలీజ్ అవుతుందని సమాచారం. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ మూవీని త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ కంటే ఎక్కువ బజ్ ‘ఓజీ’ పైనే ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ సినిమానే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను త్వరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై పవన్‌తో చర్చించి త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. హరిహర వెనక్కి తగ్గాల్సిందే! పవన్ హీరోగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది. అయితే పవన్ మూడు ప్రాజెక్టుల్లో ముందుగా మెుదలైన చిత్రం ఇదే. 2020లోనే దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పట్టాలెక్కించారు. అనేక బ్రేక్స్ వచ్చినప్పటికీ క్రిష్ 60 శాతం షూటింగ్ ఫినిష్ చేశాడు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో పవన్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసేందుకు నిర్మాత రత్నం కుమారుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఎన్నికల అనంతరం షూటింగ్‌కు పవన్ కూడా సై అనడంతో మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసేశారు. ఇప్పుడు సడెన్‌గా ‘ఓజీ’ రిలీజ్ తెరపైకి రావడంతో ‘హరిహర వీరమల్లు’కు కొత్త సమస్య వచ్చి పడింది. ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న దృష్ట్యా పవన్ కూడా ‘ఓజీ’ రిలీజ్‌కే మద్దతు తెలిపితే ‘హరిహర వీరమల్లు’ టీమ్ వెనక్కితగ్గక తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓజీపై ఎందుకంత హైప్? పవన్ కల్యాణ్ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG Release Update) చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385 ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి? గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్డేట్స్తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 11 , 2024
- Nindha Movie Review: వరుణ్ సందేశ్ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?నటీనటులు : వరుణ్ సందేశ్, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు రచన, దర్శకత్వం : రాజేష్ జగన్నాథం సంగీతం : సంతు ఓంకార్ సినిమాటోగ్రఫీ : రమిజ్ నవీత్ ఎడిటర్ : అనిల్ కుమార్. పి నిర్మాత: రాజేష్ జగన్నాథం విడుదల తేదీ: 21 జూన్, 2024 వరుణ్‌సందేశ్ హీరోగా.. రాజేశ్ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న వరుణ్ సందేశ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు. దీంతో అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? ఆ ఆరుగురిలో హత్య చేసింది ఎవరు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్ అడ్డుకోగలిగాడా? లేదా? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే కెరీర్‌లో చాలా వరకూ లవర్ బాయ్ పాత్రలే చేసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే పాత్రలో కొత్త కనిపించాడు. మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా తన మార్క్ నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పడిన కష్టం.. ప్రతీ సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాతో అతడు నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. అటు బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు రాజేష్ జగన్నాథం ఈ పాయింట్‌నే కథాంశంగా తీసుకోవడం ప్రశంసనీయం. ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్‌తో కథ మెుదలు పెట్టిన దర్శకుడు.. వారి నుంచి నిజాన్ని రాబట్టేందుకు ఇంటర్వెల్ వరకూ సమయాన్ని తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అన్న ప్రశ్నలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇస్తూ వచ్చారు డైరెక్టర్. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లోని సాగదీత సన్నివేశాలను పక్కనబెడితే క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్‌ను డామినేట్ చేయడం వల్ల సరిగా వినిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లోకేషన్స్‌లో సినిమాను తీసినప్పటికీ విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ వరణ్ సందేశ్ నటననేపథ్య సంగీతంసెకండాఫ్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్‌సాగదీత సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5జూన్ 21 , 2024

Nindha Movie Review: వరుణ్ సందేశ్ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : వరుణ్ సందేశ్, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు
రచన, దర్శకత్వం : రాజేష్ జగన్నాథం
సంగీతం : సంతు ఓంకార్
సినిమాటోగ్రఫీ : రమిజ్ నవీత్
ఎడిటర్ : అనిల్ కుమార్. పి
నిర్మాత: రాజేష్ జగన్నాథం
విడుదల తేదీ: 21 జూన్, 2024
వరుణ్‌సందేశ్ హీరోగా.. రాజేశ్ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న వరుణ్ సందేశ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు. దీంతో అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? ఆ ఆరుగురిలో హత్య చేసింది ఎవరు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్ అడ్డుకోగలిగాడా? లేదా? అనేది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
కెరీర్‌లో చాలా వరకూ లవర్ బాయ్ పాత్రలే చేసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే పాత్రలో కొత్త కనిపించాడు. మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా తన మార్క్ నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పడిన కష్టం.. ప్రతీ సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాతో అతడు నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. అటు బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు రాజేష్ జగన్నాథం ఈ పాయింట్‌నే కథాంశంగా తీసుకోవడం ప్రశంసనీయం. ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్‌తో కథ మెుదలు పెట్టిన దర్శకుడు.. వారి నుంచి నిజాన్ని రాబట్టేందుకు ఇంటర్వెల్ వరకూ సమయాన్ని తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అన్న ప్రశ్నలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇస్తూ వచ్చారు డైరెక్టర్. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లోని సాగదీత సన్నివేశాలను పక్కనబెడితే క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్‌ను డామినేట్ చేయడం వల్ల సరిగా వినిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లోకేషన్స్‌లో సినిమాను తీసినప్పటికీ విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వరణ్ సందేశ్ నటననేపథ్య సంగీతంసెకండాఫ్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్‌సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
జూన్ 21 , 2024
‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
కథను మలుపు తిప్పే సీన్లు ప్రతీ సినిమాలోనూ కచ్చితంగా ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. సాధారణంగా సాగిపోతున్న కథకు అవి బూస్టర్స్‌లాగా పనిచేస్తాయి. కథ గమనాన్ని మార్చి.. ప్రేక్షకుల అటెన్షన్‌ను తిరిగి సినిమాపై మళ్లేలా చేస్తాయి. అయితే ఇలాంటి సీన్లు ఒకే విధంగా ఉండాలన్న నిబంధన ఏమి లేదు. కథ అవసరాన్ని బట్టి డైరెక్టర్లు ఆ సీన్లను కామెడీ, యాక్షన్, సెంటీమెంట్ జానర్లలో ఎంచుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సలార్ (Salaar)
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ మాత్రం పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాకేజీలా అనిపిస్తుంది. ప్రభాస్ గురించి నటి శ్రియా రెడ్డి ఇచ్చే ఎలివేషన్స్ మెప్పిస్తాయి.
https://twitter.com/i/status/1760698195787870606
ఆర్‌ఆర్‌ఆర్
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం గ్లోబల్ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీన్.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. బ్రిటీష్ బంగ్లాలోకి తారక్ జంతువులతో ప్రవేశించే సీన్ హైలేట్ అని చెప్పవచ్చు. అటు తారక్ - రామ్‌చరణ్ ఫైటింగ్ కూడా మెప్పిస్తుంది.
https://twitter.com/i/status/1758341886304284738
బాహుబలి 2 (Bahubali 2)
బాహుబలి 2లో ప్రతీ సీనూ.. ఓ అద్భుతమే అని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే రానా పట్టాభిషేకం సన్నివేశం మాత్రం ప్రేక్షకలకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. రానా చక్రవర్తిగా పట్టభిషేకం చేసుకున్న తర్వాత ప్రభాస్ సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ అదరహో అనిపిస్తాయి.
https://www.youtube.com/watch?v=TloNJQKZiFg
జెర్సీ (Jersey)
నేచురల్ స్టార్ నాని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న చిత్రాల్లో జెర్సీ ముందు వరుసలో ఉంటుంది. కొడుకు కోరిక మేరకు తిరిగి బ్యాట్ పట్టిన నాని.. జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. తన కల నెరవేరిన సమయంలో ట్రైన్ వెళ్తుండగా నాని అరిచే సీన్.. వీక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
https://www.youtube.com/watch?v=UXPR1I8sYnw
రేసుగుర్రం (Race Gurram)
అల్లుఅర్జున్ (Allu Arjun) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం (రేసుగుర్రం). అయితే ఈ చిత్ర విజయంలో బ్రహ్మీ (Brahmanandam) పాత్ర కూాడా కాస్త ఎక్కువగానే ఉంది. క్లైమాక్స్‌లో కిల్‌బిల్ పాండే పాత్రతో సర్‌ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మీ.. ఫ్రస్టేషన్‌తో ఉన్న పోలీసాఫీసర్‌గా నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో కిల్ బిల్ సీక్వెన్స్ చిత్రానికే హైలెట్
https://www.youtube.com/watch?v=jxBLgrppzpc
వేదం (Vedam)
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అల్లుఅర్జున్ (Allu Arjun), మంచు మనోజ్ (Manju Manoj), అనుష్క (Anushka) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’ (Vedam). ఇందులో బన్నీ.. కేబుల్ రాజు పాత్రలో అదరగొట్టాడు. అయితే ద్వితియార్థంలో ఓ వృద్దుడి నుంచి అల్లు అర్జున్ డబ్బులు కొట్టేసే సీన్ సినిమాలో హైలెట్ అని చెప్పవచ్చు. పెద్దాయన కూతురు కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బును.. ఆస్పత్రిలో బన్నీ ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కాళ్లు పట్టుకొని బతిమాలగా.. వదిలించుకొని మరి వెళ్తాడు. అయితే తన తప్పును తెలుసుకొని బన్నీ డబ్బు తిరిగి ఇచ్చే సీన్ హృదయాలకు హత్తుకుంటుంది.
https://www.youtube.com/watch?v=XVGHRAdH2dk
పోకిరి (Pokiri)
మహేశ్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ ఎన్ని రికార్డులు తిరగరాసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన మహేశ్.. పోలీసు ఆఫీసర్ అని తెలియడంతో అంతా షాక్‌కు గురవుతారు.
https://www.youtube.com/watch?v=PvkITH66FEc
ఈగ (Eega)
దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) అద్భుత సృష్టి ‘ఈగ’ (Eega) సినిమా. ఇందులో నాని (Nani), సమంత (Samantha), కన్నడ స్టార్ సుదీప్ (Sudeep) ప్రధాన పాత్రలు పోషించారు. పవర్‌ఫుల్ విలన్ అయిన సుదీప్‌ను క్లైమాక్స్‌లో ఒక చిన్న ఈగ చంపే సీన్ ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=1SCFGWtXtDE
ఛత్రపతి (Chatrapathi)
ప్రభాస్ (Prabhas), రాజమౌళి కాంబినేషన్‌లో ఛత్రపతి సినిమా.. అప్పట్లో టాలీవుడ్‌ను షేక్ చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వెేయిస్తుంది. ప్రభాస్ తొలిసారి విలన్లపై పిడికిలి బిగించే సీన్ అదరహో అనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=eF5OVQcHfsc
జనతా గ్యారేజ్ (Janatha Garage)
కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’లో తారక్ పవర్ ప్యాక్డ్ హీరోగా నటించాడు. మోహన్‌లాల్ నుంచి జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్నాక వచ్చే తొలి ఫైట్ సీన్ మెప్పిస్తుంది. రాజీవ్ కనకాల సమస్యను తీర్చేందుకు తారక్ తన గ్యాంగ్‌తో వెళ్లి విలన్లకు బుద్ది చెప్తాడు.
https://www.youtube.com/watch?v=FmAak259Its
టెంపర్ (Temper)
తారక్-పూరి కాంబోలో వచ్చిన టెంపర్ చిత్రంలో.. కోర్టు సీన్ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఓ రేప్‌లో విలన్ సోదరులు తప్పించుకోకుడదన్న ఉద్దేశ్యంతో తారక్ తాను ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకుంటాడు. ఈ ఊహించని పరిణామం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుంది.
https://twitter.com/i/status/1668264361469591558
https://twitter.com/i/status/1668264361469591558
విక్రమార్కుడు (Vikramarkudu)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ (Ravi Teja) ద్విపాత్రాభినయం చేశాడు. విక్రమ్ రాథోడ్ అనే పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ (Prakash Raj), రవితేజ (Ravi Teja) మధ్య వచ్చే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
https://www.youtube.com/watch?v=aorA5S083W4
మగధీర (Magadheera)
రామ్‌చరణ్ (Ramcharan), రాజమౌళి (S S Rajamouli కాంబోలో వచ్చిన చిత్రం ‘మగధీర’. ఈ సినిమాలో రామ్‌చరణ్ షేర్‌ఖాన్ పంపిన వందమంది సైనికులను చంపే సీన్ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సీన్ సినిమాను మలుపు తిప్పుతుంది.
https://www.youtube.com/watch?v=9NJya1B8mvI
మిర్చి (Mirchi)
ప్రభాస్ హీరోగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో వచ్చిన ‘మిర్చి’.. టాలీవుడ్‌లో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో తండ్రిని బెదిరించిన విలన్ తరపు మనుషులకు ప్రభాస్ వార్నింగ్ ఇచ్చే ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=5aSph4tD8yQ
ఆడవారి మాటలకు అర్థాలే
ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో వెంకటేష్, కోటా శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు ప్రేమ విషయం చెప్పేందుకు వెళ్లిన కోటా శ్రీనివాసరావును హీరోయిన్ త్రిష అనుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన అతడు నిద్రలోనే ప్రాణం విడిస్తాడు. తండ్రి శవం ముందు వెంకటేష్ పడిన బాధ.. ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది.
https://www.youtube.com/watch?v=L26KInZYQcI
ఇంద్ర (Indra)
మెగాస్టార్ చిరంజీవి మరుపురాని చిత్రాల్లో ఇంద్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను అద్బుతమే. ముఖ్యంగా చిరంజీవి పవర్‌ఫుల్ గతాన్ని రివీల్ చేసే ఇంటర్వెల్ సీన్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటారు.
https://www.youtube.com/watch?v=I4JvUuSQh2I
సింహాద్రి (Simhadri)
రాజమౌళి దర్శకత్వంలో తారక్ హీరోగా చేసిన రెండో చిత్రం ‘సింహాద్రి’. ఇందులో తన అక్కను చంపిన విలన్లపై తారక్ ప్రతీకారం తీర్చుకునే సీన్ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. తమను పట్టిపీడిస్తున్న రౌడీలను తారక్ చంపుతున్న క్రమంలో కేరళ ప్రజలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సూపర్‌గా అనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=u0PlQ1J6EHo
తులసి (Thulasi)
బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన తులసి చిత్రంలో హీరో వెంకటేష్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. కోర్టు పరిసరాల్లో తండ్రికి వార్నింగ్ ఇచ్చిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకునే సీన్ నెవర్‌బీఫోర్ అనిపిస్తుంది.
https://youtu.be/1Spz6cJ1ebk?si=_aVPwuSM3khOaPBS
ఫిబ్రవరి 24 , 2024
OG Movie Story: పవన్ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' (OG). ప్రభాస్‌తో సాహో తీసిన డైరెక్టర్ సుజిత్.. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‍గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ (OG Movie Story) కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఓజీ కథ ఇదేనా! (Is this the story of OG)?
ఓజీ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ డేట్ అప్‌డేట్ కూడా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా స్టోరీలైన్ అంటూ ఓ కథ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘ముంబయిలో పదేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గ్రూప్స్ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్ గంభీర సడెన్‌గా మాయం అవుతాడు. తన శత్రు మూకలపై రివేంజ్ తీర్చుకోవడానికి మళ్లీ తిరిగి వస్తాడు’ అన్నది కథ సారాంశం. దీంతో ఈ మూలకథ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఓజీ ఫస్ట్ గ్లింప్స్‌తోనే డైరెక్టర్ సుజీత్ కథ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్ చేశాడు. ‘పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని అజ్ఞాతంలో ఉన్న అతడు మళ్ళీ వచ్చాడు’ అన్నట్టు చూపించారు.
సుజీత్ ‘డీపీ’ వైరల్
ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డీపీని మార్చారు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు 'ఓజీ' (పవన్ కల్యాణ్) కాగా, మరొకరు డైరెక్టర్ సుజీత్. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘తన ఓజీతో సుజీత్’ (Sujeeth) అని కామెంట్స్ చేస్తున్నారు. ‘వైరల్ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్ ఉంటే చాలు’ అని అంటున్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ సరిపోతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్.. ఓజీలోనూ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక నిర్మాతలు చాలా ముందున్నారని వ్యాఖ్యానించారు. చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పాడు.
ఓజీపై శ్రియారెడ్డి హైప్
సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఓజీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సలార్ కంటే ఓజీ ప్రపంచం చాలా పెద్దదని వ్యాఖ్యానించింది. ఓజీలో తానది నెగిటివ్ పాత్ర కాదని.. సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర చాలా పెద్దదని చెప్పింది. ఓజీలో తన పాత్ర చూసిన తర్వాత సలార్‌లో తన రోల్ చాలా చిన్నదిగా అనిపిస్తుందని తెలిపింది. ఓజీ మూవీలోని క్యారెక్టర్ లైఫ్ లాంగ్ తనకు గుర్తింపు తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 17 , 2024
UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
కస్టడీ (మే 12)
నాగచైతన్య - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా ‘కస్టడీ’. వెంకట్ ప్రభు డైరెక్షన్ చేశారు
భువన విజయం (మే 12)
భువన విజయంలో సునీల్ లీడ్ రోల్‌లో చేశారు. యలమంద చరణ్ దర్శకత్వం వహించారు.
కథ వెనుక కథ (మే 12)
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్, విశ్వంత్ లీడ్ రోల్స్ చేశారు
మ్యూజిక్ స్కూల్ (మే 12)
ఈ సినిమాలో శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు
ఛత్రపతి (మే 12)
ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. V.V వినాయక్ డైరక్టర్
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ (మే 12)
క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నిహాల్, దృషికా జంటగా నటించారు.
ఫర్హానా (మే 12)
ఐశ్వర్య రాజేశ్ కీ రోల్‌లో డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించిన చిత్రం ‘ఫర్హానా’.
అన్నీ మంచి శకునములే (మే 18)
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం.
సామజవరగమన (మే 18)
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. రెబా మోనికా కథానాయిక
బిచ్చగాడు 2 (మే 19)
ఇందులో విజయ్ ఆంటోనీ, కావ్య తాపర్ జంటగా చేశారు. బిచ్చగాడు మూవీకి సీక్వెల్ ఇది.
మళ్ళీ పెళ్లి (మే 26)
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా చేసిన చిత్రం మళ్ళీ పెళ్లి. MS రాజు దర్శకత్వం వహించారు.
టక్కర్ (మే 26)
సిదార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా చేసిన చిత్రం ‘టక్కర్'. కార్తీక్.జి.క్రిష్ దర్శకత్వం వహించారు.
మేమ్ ఫేమస్ (మే 26)
మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రలు పోషించారు. సుమంత్ ప్రభాస్ డైరెక్షన్ చేశారు.
అహింస (జూన్ 02)
రాణా బ్రదర్ అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్‌గా గీతిక చేసింది.
విమానం (జూన్ 02)
సముద్రఖని నటించిన ద్విభాషా చిత్రం ‘విమానం’. అనసూయ కీలక పాత్ర పోషించింది.
ఆదిపురుష్ (జూన్ 16)
రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ డైరెక్షన్ చేశాడు.
స్పై (జూన్ 29)
హీరో నిఖిల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పై'. ఎడిటర్ ‘గ్యారీ. BH డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
మే 11 , 2023
శ్రేయా రాణి రెడ్డి ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
నటి కాకముందు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా శ్రేయా పాపులర్ అయ్యింది. నింద సినిమాతో వెండితెరపై అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.
శ్రేయా రాణి రెడ్డి లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
నింద(2024)
శ్రేయా రాణి రెడ్డి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
నింద సినిమాలో జాన్వీ పాత్ర
శ్రేయా రాణి రెడ్డి బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
శ్రేయా రాణి రెడ్డి కు ఇష్టమైన ఆహారం ఏంటి?
హైదరాబాద్ బిరియానీ
శ్రేయా రాణి రెడ్డి ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీషు
శ్రేయా రాణి రెడ్డి ఫేవరేట్ కలర్ ఏంటి?
పింక్, వైట్
శ్రేయా రాణి రెడ్డి ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
శ్రేయా రాణి రెడ్డి ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
శ్రేయా రాణి రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
101K ఫాలోవర్లు ఉన్నారు.
శ్రేయా రాణి రెడ్డి సోషల్ మీడియా లింక్స్
శ్రేయా రాణి రెడ్డి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శ్రేయా రాణి రెడ్డి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.