• TFIDB EN
  • శృతి హాసన్
    జననం : జనవరి 28 , 1986
    ప్రదేశం: చెన్నై, తమిళనాడు, భారతదేశం
    శృతిహాసన్ భారతీయ నటి. ప్రముఖ తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తే. ప్రధానంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో అనగనగా ఓ ధీరుడు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలవడంతో అవకాశాలు పోటెత్తాయి. బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు, ఆగడు, క్రాక్, వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. శృతిహాసన్‌కు నటనలోనే కాకుండా గాయనిగాను మంచి గుర్తింపు ఉంది. తన సొంత చిత్రాలతో పాటు ఇతర చిత్రాల్లోనూ పాటలు పాడింది.
    Read More

    శృతి హాసన్ వయసు ఎంత?

    38 సంవత్సరాలు (2024)

    శృతి హాసన్ ముద్దు పేరు ఏంటి?

    కన్నా

    శృతి హాసన్ ఎత్తు ఎంత?

    5' 7'' (170 cm)

    శృతి హాసన్ అభిరుచులు ఏంటి?

    షాపింగ్, ట్రావెలింగ్

    శృతి హాసన్ ఏం చదువుకున్నారు?

    సైకాలజీలో డిగ్రీ

    శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది.

    శృతి హాసన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సెయింట్‌ ఆండ్రూస్‌ కాలేజ్‌, ముంబయి

    శృతి హాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    శృతి హాసన్ Hot Pics

    Images

    Shruti Haasan Hot in Black Dress

    Images

    Shruti Haasan Hot Images

    శృతి హాసన్ Childhood Images

    Images

    Shruti Haasan With Her Father

    Images

    Shruti Haasan

    శృతి హాసన్ In Saree

    Images

    Shruti Haasan Beautiful in Light Pink Saree

    Images

    Actress Shruti Haasan Saree Images

    శృతి హాసన్ In Half Saree

    Images

    Shruti Haasan Beautiful In Half Saree

    Images

    Shruti Haasan In Half Saree

    శృతి హాసన్ In Bikini

    Images

    Shruti Haasan Hot

    Images

    Actress Shruti Haasan

    శృతి హాసన్ With Pet Cats

    Images

    Shruti Haasan's Cat

    Images

    Actress Shruti Haasan's Cat

    శృతి హాసన్ With Pet Dogs

    Images

    Shruti Haasan With Pet Dog

    శృతి హాసన్ In Ethnic Dress

    Images

    Actress Shruti Haasan

    Images

    Shruti Haasan In White Dress

    శృతి హాసన్ In Modern Dress

    Images

    Shruti Haasan outfit

    శృతి హాసన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Shruti Haasan

    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలుEditorial List
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలు
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా? శృతి హాసన్ తన మెస్మరైజింగ్ టాలెంట్‌తో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో గబ్బర్ సింగ్, క్రాక్, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకున్న శృతి హాసన్(Some Lesser Known Facts about Shruti Haasan)  గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.  శృతి హాసన్ ముద్దు పేరు? కన్నా శృతి హాసన్ వయస్సు ఎంత? 1986, జనవరి28న జన్మించింది శృతి హాసన్ తెలుగులో నటించిన తొలి సినిమా? అనగనగా ఓ ధీరుడు(2011) శృతి హాసన్ హిందీలో నటించిన తొలి సినిమా? లక్(2009) శృతి హాసన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  శృతి హాసన్ ఎక్కడ పుట్టింది? చెన్నై, తమిళనాడు శృతి హాసన్  ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ శృతి హాసన్ అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ శృతి హాసన్‌కి ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ శృతి హాసన్‌కు అఫైర్స్ ఉన్నాయా? హీరో సిద్ధార్థతో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం శాంతను హజరికతో ప్రేమలో ఉంది. శృతి హాసన్‌కు  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ శృతి హాసన్‌కు ఇష్టమైన హీరో? షారుక్‌ ఖాన్, రజనీకాంత్ శృతి హాసన్‌ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల  వరకు ఛార్జ్ చేస్తోంది. శృతి హాసన్‌ తల్లిదండ్రుల పేరు? కమల్ హాసన్, సారిక ఠాకూర్ శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? శృతి హాసన్‌ సినిమాల్లోకి రాకముందు సింగర్‌గా పలు స్టేజ్ పర్ఫామెన్సెస్ ఇచ్చింది శృతి హాసన్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/shrutzhaasan/?hl=en శృతి హాసన్ వ్యాపారాలు? శృతి హాసన్ పలు కాస్మోటిక్( Guess and aldo) బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. https://www.youtube.com/watch?v=mos5_ozTwEE శృతి హాసన్ గురించి మరికొన్ని విషయాలు స్కూళ్లో చదివేటప్పుడు తన పేరు పూజ రామచంద్రన్.శృతి హాసన్‌కు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.శృతి హాసన్ తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా భాటియా ఒకరికొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.శృతితో విడిపోతున్నట్లు ఆమె మాజీ ప్రేమికుడు మైఖెల్ కార్‌సెల్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు.
    ఏప్రిల్ 27 , 2024
    Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌! టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు అడివి శేష్‌ ఓకే చెప్పాడు. స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. Sesh Ex Shruti పేరుతో స్పెషల్‌ పోస్టర్‌ సైతం రిలీజ్‌ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు కూడా మెుదలుపెట్టారు. క్రమంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్‌ చిత్ర యూనిట్‌కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! యంగ్‌ హీరో అడివి శేష్‌, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ కాంబోలో చిత్రం అనగానే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. షానియెల్‌ దేవ్‌ దర్శకత్వంలో లవ్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి 'డెకాయిట్: ఏ లవ్‌ స్టోరీ' అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మరి శ్రుతి హాసన్‌ను కన్విన్స్‌ చేసి మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.  డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్‌ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని మూవీ టీమ్‌ తెలిపింది. డెకాయిట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేశారు. ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది.  https://twitter.com/TrackTwood/status/1737423086188925221 బాలీవుడ్‌ స్టార్‌కు గాయం అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'గూఢచారి' ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'జీ 2'లో అడివి శేష్‌ నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్‌ హష్మీ గొంతు వద్ద గాయమైంది. జంపింగ్ సీన్స్ తీస్తున్న స‌మ‌యంలో మెడ స్వల్పంగా కట్ అయి ర‌క్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి న‌ట్టు స‌మాచారం. వెంట‌నే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బ‌నితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మ‌ధుశాలిని, సుప్రియ యార్ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు. https://twitter.com/Movies4u_Officl/status/1843311804039967199 అడివి శేష్‌ సినీ ప్రస్థానం ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Goodachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Major), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. 
    అక్టోబర్ 08 , 2024
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా? పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం. [toc] Eesha Rebba తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.   మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు. Tatoo images యుక్తిత రేజా రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది. నిహారిక కొణిదెల  మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్‌ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.  https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది. సంయుక్త మీనన్ మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది. అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది. https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs తృప్తి డిమ్రి టాటూస్  న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు. సమంత టాటూస్ సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC  అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది. మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) శృతి హాసన్ టాటూస్ అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.  https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh రాశి ఖన్నా టాటూస్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి.  అనసూయ భరద్వాజ్ టాటూస్ అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం. ఫరియా అబ్దుల్లా టాటూస్ పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన  ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) అనన్య నాగళ్ల టాటూ గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.  View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) మమతా మోహన్ దాస్ టాటూ ఒకప్పుడూ టాలీవుడ్‌ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది. నేహా శర్మ టాటూస్ అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది. శోభిత దూళిపాళ శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్‌ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.  షిర్లి షెటియా అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది. View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer) రుహాని శర్మ రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.
    అక్టోబర్ 22 , 2024
    Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్‌ టీజర్‌ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు.  అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది. కేజీఎఫ్‌తో సలార్ లింక్ సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్‌ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌ గురించి చూపించారు.  అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు. అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్‌)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు.  ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్‌) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.  ఫ్యాన్స్ రచ్చ రచ్చ మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్‌ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్‌ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.  సలార్‌తో నడిచేది వీరే.. ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని  కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
    జూలై 06 , 2023

    శృతి హాసన్ పెంపుడు కుక్క పేరు?

    శృతి హాసన్‌ డాగ్‌ను కాకుండా ఓ పిల్లిని పెంచుకుంటోంది. దాని పేరు క్లారా.

    శృతి హాసన్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    శృతి తల్లిదండ్రులైన కమల్‌ హాసన్‌, సారికా థాకూర్‌లకు సినిమా నటులే. ఆమె తండ్రి కమల్‌ హాసన్‌.. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. 230కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా చేశారు.

    శృతి హాసన్ Family Pictures

    Images

    Shruti Haasan Parents

    Images

    Actress Shruti Haasan

    శృతి హాసన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ధనుష్‌తో చేసిన '3' సినిమా ద్వారా శృతి హాసన్‌ పాపులర్ అయ్యింది.

    శృతి హాసన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    హిందీలో 'లక్‌' ఆమె లీడ్‌ రోల్‌లో చేసిన తొలి చిత్రం. తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' ఆమెకు ఫస్ట్ ఫిల్మ్.

    తెలుగులో శృతి హాసన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    3' సినిమా

    శృతి హాసన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    3' సినిమాాలో 'జనని' పాత్ర

    శృతి హాసన్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Best Stage Performance

    శృతి హాసన్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Dialogues

    శృతి హాసన్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    శృతి హాసన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    సాంబార్ అన్నం, దోశ, జిలేబీ, ఐస్‌క్రీమ్

    శృతి హాసన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    శృతి హాసన్ కు ఇష్టమైన నటి ఎవరు?

    శృతి హాసన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు

    శృతి హాసన్ ఫెవరెట్ సినిమా ఏది?

    మెుఘల్‌ ఈ ఆజామ్‌ (హిందీ), గాడ్‌ ఫాదర్‌ (ఇంగ్లీష్‌)

    శృతి హాసన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌, గ్రే, రెడ్‌

    శృతి హాసన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    శృతి హాసన్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లాస్‌ ఏంజెల్స్‌, గోవా

    శృతి హాసన్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    రేంజ్‌ రోవర్ స్పోర్ట్‌

    శృతి హాసన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    3-5 మిలియన్‌ డాలర్లు

    శృతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    24.8 మిలియన్‌ ఫాలోవర్లు

    శృతి హాసన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    శృతి హాసన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • "2012లో '7th సెన్స్‌' చిత్రానికి గాను బెస్ట్‌ సౌత్‌, బెస్ట్‌ తమిళ నటిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ అందుకుంది. 2012లో 'అనగనగా ఓ ధీరుడు' చిత్రానికి బెస్ట్ తెరంగేట్ర నటిగా సినిమా అవార్డు గెలుచుకుంది. 2013లో సౌత్‌ ఇండియా బెస్ట్‌ స్టైలిష్‌ నటిగా సైమా అవార్డు గెలుపొందింది. 2013లోనే గబ్బర్‌ సింగ్‌ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సినిమా అవార్డ్‌ (CiniMaa Award) వరించింది. 2015లో రేసుగుర్రం చిత్రానికి గాను బెస్ట్‌ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. 2016లో శ్రీమంతుడు చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు దక్కించుకుంది."

    శృతి హాసన్ కు సంబంధించిన వివాదాలు?

    ముంబయిలో శృతి ఉంటున్న అపార్టెమెంట్‌లో ఓ దొంగ దూరాడు. ఆమె ఉంటున్న గది తలుపులు తెరిచి పట్టుకోవడానికి ప్రయత్నించగా శృతి తప్పించుకుంది. ఇది అప్పట్లో చర్చనీయాశంగా మారింది.

    శృతి హాసన్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    పూమర్‌ ఉమెన్‌, పోతీస్‌ బౌటిక్యూ షో, కాంచిపురం వరమహాలక్ష్మీ తదితర ప్రకటనల్లో ఆమె నటించింది.

    శృతి హాసన్ పోటీ చేసిన నియోజకవర్గం ఏంటి?

    ప్రస్తుతం ఆమె ఏ పొటిలికల్‌ పార్టీలో లేదు. అయితే శ్రుతి తండ్రి కమల్‌హాసన్‌ 'మక్కల్‌ నీది మయ్యం' పేరుతో తమిళనాడులో ఓ పార్టీని స్థాపించారు.
    శృతి హాసన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శృతి హాసన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree