సింగీతం శ్రీనివాసరావు
ప్రదేశం: ఉదయగిరి, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
సింగీతం శ్రీనివాసరావు తెలుగులో ప్రయోగాత్మక డైరెక్టర్లలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. నీతి నిజాయితీ(1972) సినిమా ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు, మేడమ్, అపూర్వ సోదరులు, అమవాస్య చంద్రుడు, భైరవ ద్వీపం వంటి వైవిధ్యభరితమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 ఈయన డైరెక్ట్ చేసిందే. తొలితరం దిగ్గజ దర్శకుడు కెవి రెడ్డి దగ్గర ఆయన శిష్యరికం చేశాడు. సాక్షి ఎక్సలెన్సీ అవార్డుల్లో ఆయన జీవిత సాఫల్య పురస్కారం లభించింది.
సింగీతం శ్రీనివాసరావు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సింగీతం శ్రీనివాసరావు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.