• TFIDB EN
  • సునీల్
    ప్రదేశం: భీమవరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    సునీల్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. తొలుత హస్య పాత్రల్లో నటించి తర్వాత హీరోగా మారాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో రాణిస్తున్నాడు. సునిల్ నువ్వే కావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. హాస్యనటుడిగా నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, ఢీ, రెడీ, అతడు, ఆంధ్రుడు చిత్రాలు అతనికి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి. అందాల రాముడు చిత్రం సునిల్‌కు హీరోగా మొదటి సినిమా. ఆతర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న(2010) మంచి ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం తర్వాత 10 ఏళ్లపాటు హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. దీంతో సునిల్ తన పంథాను మార్చుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఎక్కువగా నెగిటివ్ రోల్స్‌లో అలరిస్తున్నాడు. కలర్ ఫొటో, పుష్ప, మార్క్ ఆంటోని, జపాన్ వంటి హిట్‌ చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్‌లో నటించి ప్రేక్షకులకు తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు.

    సునీల్ వయసు ఎంత?

    సునీల్‌ వయసు 50 సంవత్సరాలు

    సునీల్ ఎత్తు ఎంత?

    5' 6'' (167cm)

    సునీల్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, వాచింగ్‌ మూవీస్‌

    సునీల్ ఏం చదువుకున్నారు?

    ఎంకామ్‌ (డ్రాప్‌ ఔట్‌)

    సునీల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    డైరెక్టర్‌ త్రివిక్రమ్‌.. సునీల్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. సునీల్‌ భీమవరంలో ఉన్నప్పటి నుంచే వీరి మంచి స్నేహితులు. వీరు ఫిల్మ్ అవకాశాల కోసం హైదరాబాద్‌లోని పంజాగుట్టకు వచ్చి ఒకే రూమ్‌లో కొన్ని నెలలపాటు ఉన్నారు. ఆ సమయంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌కూడా వీరితో రూమ్‌మేట్‌గా ఉండేవారు. తాము పడిన కష్టాలకు గుర్తుగా ఇప్పటికీ ఆ గదిని అలాగే ఉంచారట. దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రతీ నెల ఆ గదికి అద్దె కూడా చెల్లిస్తున్నారట.

    సునీల్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    సునీల్‌ హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇప్పటివరకూ 180కి పైగా చిత్రాల్లో నటించారు.

    సునీల్ In Sun Glasses

    సునీల్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    SS రాజమౌళి సినిమాల జాబితాEditorial List
    SS రాజమౌళి సినిమాల జాబితా
    సునిల్ హీరోగా నటించిన హిట్ చిత్రాలుEditorial List
    సునిల్ హీరోగా నటించిన హిట్ చిత్రాలు

    సునీల్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    సునీల్‌కు ఓ సోదరి ఉంది.

    సునీల్ పెళ్లి ఎప్పుడు అయింది?

    సునీల్‌కు 2002లో శృతి ఇందుకూరితో వివాహమైంది.

    సునీల్ కు పిల్లలు ఎంత మంది?

    సునీల్‌ ఓ పాప, బాబు ఉన్నారు. అమ్మాయి పేరు కుందన, అబ్బాయి పేరు దుశ్యంత్‌.

    సునీల్ Family Pictures

    సునీల్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సునీల్‌ ఫేమస్‌ అవ్వడం వెనక త్రివిక్రమ్‌పాత్ర ఉంది. అతడు సినిమాకు కథలు, డైలాగ్స్‌ రాస్తున్న సమయంలో సునీల్‌ కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను సృష్టించేవారు. త్రివిక్రమ్‌ చొరవతో సునీల్‌కు తొలి సినిమాలో ‌అవకాశం దక్కింది.

    సునీల్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో సునీల్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    కమెడియన్‌గా 'నువ్వు నేను' సునీల్‌కు ఫస్ట్‌ హిట్‌ మూవీ. హీరోగా 'మర్యాద రామన్న'తో తొలి విజయాన్ని అందుకున్నారు.

    సునీల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    మర్యాద రామన్న' చిత్రంలో సునీల్‌ పాత్ర

    సునీల్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    సునీల్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    సునీల్ రెమ్యూనరేషన్ ఎంత?

    సునీల్‌.. ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు.

    సునీల్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ బిర్యానీ

    సునీల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సునీల్ కు ఇష్టమైన నటి ఎవరు?

    సునీల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    సునీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    సునీల్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    సునీల్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    సునీల్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ధోని

    సునీల్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    BMW M4 Skoda Kodiaq

    సునీల్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    సునీల్‌ ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకూ ఉండొచ్చని సమాచారం.

    సునీల్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    4 లక్షల 17వేలకు పైగా ఫాలోవర్లు

    సునీల్ సోషల్‌ మీడియా లింక్స్‌

    సునీల్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్ - 2004

      పెదబాబు (2004) - ఉత్తమ కమెడియన్‌

    • ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్ - 2013

      తడాఖా (2013) - ఉత్తమ సహాయనటుడు

    • నంది అవార్డ్ - 2001

      నువ్వు నేను (2001) - ఉత్తమ కమెడియన్‌

    • నంది అవార్డ్ - 2005

      ఆంధ్రుడు (2005) - ఉత్తమ కమెడియన్‌

    • నంది అవార్డ్ - 2010

      మర్యాద రామన్న (2010) - స్పెషల్‌ జ్యూరీ అవార్డు

    • సైమా అవార్డ్ - 2013

      తడాఖా (2013) - ఉత్తమ హాస్య నటుడు

    • సంతోషం అవార్డ్ - 2018

      అరవింద సమేత వీర రాఘవ (2018) - ఉత్తస హాస్య నటుడు

    సునీల్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    దాబర్‌ రెడ్‌ పేస్ట్‌ ప్రకటనలో సునీల్‌ నటించారు.
    సునీల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సునీల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree