• TFIDB EN
  • సూర్య
    ప్రదేశం: మద్రాస్ (ప్రస్తుతం చెన్నై), తమిళనాడు, భారతదేశం
    సూర్య దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు. తమిళనాడులోని చెన్నైలో జూలై 23, 1975న జన్మించాడు. సూర్య తండ్రి తమిళ సినీ నటుడు శివకుమార్. 'నెరుక్కు నెర్' (1997) మూవీతో సూర్య తెరంగేట్రం చేశాడు. 'గజిని' (2005) సక్సెస్‌తో స్టార్‌ హీరోగా మారాడు. 'ఉయిరిలే కలంతతు', 'నందా', 'ఖాకా ఖాకా', 'గజిని', 'నువ్వు నేను ప్రేమ', 'సింగం', 'సింగం 2', 'సింగం 3', 'జై భీమ్‌' చిత్రాలతో బ్లాక్‌బాస్టర్‌ విజయాలను అందుకున్నాడు. ప్రొడ్యుసర్‌గా మారి 15 చిత్రాలను నిర్మించారు.

    సూర్య వయసు ఎంత?

    సూర్య వయసు 49 సంవత్సరాలు

    సూర్య ఎత్తు ఎంత?

    5' 7'' (170cm)

    సూర్య అభిరుచులు ఏంటి?

    లాంగ్‌ డ్రైవింగ్‌, క్యాంపింగ్‌

    సూర్య ఏం చదువుకున్నారు?

    బీకాం

    సూర్య సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సినిమాల్లోకి రాకముందు ఓ గార్మెంట్‌ కంపెనీలో 3 సంవత్సరాల పాటు మేనేజర్‌గా వర్క్‌ చేశారు.

    సూర్య ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    లయోలా కాలేజీ, చెన్నై

    సూర్య రిలేషన్‌లో ఉంది ఎవరు?

    తమిళ హీరో సూర్య ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి అఫైర్స్, గాసిప్స్ లేవు. సినిమా కెరీర్ ఆరంభంలో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

    సూర్య‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 'రక్త చరిత్ర 2' మాత్రమే నేరుగా చేశారు. అయితే తమిళంలో చేసిన చాలా వరకూ చిత్రాలు తెలుగు డబ్ చేసి రిలీజ్‌ చేశారు. ఇప్పటివరకూ 51 చిత్రాల్లో సూర్య నటించారు.

    సూర్య అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!Editorial List
    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
    ZEE5లో టాప్ ఫ్రీ మూవీస్ లిస్ట్ ఇదే!Editorial List
    ZEE5లో టాప్ ఫ్రీ మూవీస్ లిస్ట్ ఇదే!

    సూర్య‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    సూర్యకు తమిళ స్టార్‌ హీరో కార్తీసోదరుడు అవుతాడు. 29 చిత్రాల్లో కార్తీ హీరోగా చేశాడు. తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. సూర్యకు బృందా శివకుమార్‌ అనే సోదరి కూడా ఉంది.

    సూర్య పెళ్లి ఎప్పుడు అయింది?

    ప్రముఖ నటి జ్యోతికనుసూర్య 2006లో వివాహం చేసుకున్నారు. ఒకప్పటి పాపులర్‌ హీరోయిన్‌ నగ్మాకుజ్యోతిక సోదరి అవుతారు. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా 50 పైగా చిత్రాల్లో జ్యోతిక నటించారు.

    సూర్య కు పిల్లలు ఎంత మంది?

    సూర్యకు ఒక పాప, బాబు ఉన్నారు. అబ్బాయి పేరు దేవ్‌, అమ్మాయి పేరు దియా.

    సూర్య Family Pictures

    సూర్య ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    గజిని' చిత్రం సూర్య కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటికే హీరోగా పలు చిత్రాలు చేసినప్పటికీ బ్రేక్‌ రాలేదు. 'గజిని'తో తమిళంతో తెలుగులోనూ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు.

    సూర్య లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    నెఱుక్కు నెర్' (1997)

    తెలుగులో సూర్య ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ఉయిరిలే కలంతతు' (2000)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సూర్య తొలి చిత్రం ఏది?

    సూర్య చేసిన సింగం 2, సింగం 3, కాపన్‌ చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.

    సూర్య కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    గజిని, సింగం సిరీస్‌, జై భీమ్‌, ఆకాశం నీ హద్దురా చిత్రాల్లోని పాత్రలు అత్యుత్తమమైనవి.

    సూర్య బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    సూర్య బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    సూర్య రెమ్యూనరేషన్ ఎంత?

    సూర్య ఒక్కో సినిమాకు రూ.25-50 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

    సూర్య కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    కర్డ్‌ రైస్‌, దోశ

    సూర్య కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సూర్య కు ఇష్టమైన నటి ఎవరు?

    సూర్య ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు

    సూర్య ఫెవరెట్ సినిమా ఏది?

    ఇరానియన్‌ ఫిల్మ్స్‌

    సూర్య ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌, వైట్‌

    సూర్య ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    సూర్య ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ఎం.ఎస్‌ ధోని

    సూర్య వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Audi A7 Sportback BMW 7 Series Mercedes-Benz G-Class Range Rover Vogue

    సూర్య ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    సూర్య ఆస్తుల విలువ రూ.350 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.

    సూర్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    9.3 మిలియన్లు

    సూర్య సోషల్‌ మీడియా లింక్స్‌

    సూర్య కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2004

      'పితామగన్‌' చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2005

      'పెరాజగన్‌' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డ్‌ తీసుకున్నాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2009

      'వారణం ఆయిరం' చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డ్ తీసుకున్నాడు

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ - 2017

      '24' చిత్రానికి క్రిటిక్స్‌ విభాగంలో బెస్ట్‌ యాక్టర్‌గా పురస్కారం అందుకున్నాడు

    • ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్‌ - 2022

      'జైభీమ్‌' చిత్రానికి గాను బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డ్‌ తీసుకున్నారు

    • సైమా అవార్డ్‌ - 2017

      '24' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • సైమా అవార్డ్‌ - 2021

      'సూరరై పొట్రు' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    సూర్య కు సంబంధించిన వివాదాలు?

    - 2016లో ఓ మహిళతో వాగ్వాదానికి దిగిన యువకుడ్ని సూర్య కొట్టారు. అతడు ఫిర్యాదు చేయడంతో సూర్యపై కేసు నమోదైంది. - 2017లో సూర్య సహా 8 మంది తమిళ నటులపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీగా కావడం వివాదాస్పదంగా మారింది.

    సూర్య కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    సూర్య హీరోగా నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. 2024 వరకూ 15 చిత్రాలను నిర్మించారు.

    సూర్య ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    Intex Aqua Ace TV, NESCAFE ప్రకటనల్లో సూర్య నటించారు.
    సూర్య వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సూర్య కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree