• TFIDB EN
  • వరుణ్ తేజ్
    జననం : జనవరి 19 , 1990
    ప్రదేశం: వరుణ్‌ తేజ్‌ హైదరాబాద్‌లో జన్మించాడు.
    మెగా కాంపౌడ్ నుంచి సినీరంగ ప్రవేశం చేసిన మరో హీరో వరుణ్ తేజ్. అభిమానులు ముద్దుగా మెగా ప్రిన్స్ అంటూ పిలుచుకుంటారు. వరుణ్ తేజ్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద(2014) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆతర్వాత క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన కంచె(2015) చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫిదా(2017), తొలిప్రేమ(2018), గద్దలకొండ గణేష్(2019), F2(2019) వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన తండ్రి నాగబాబు, సోదరుడు రామ్‌చరణ్ తెలుగులో ప్రముఖ నటులుగా ఉన్నారు.
    Read More

    వరుణ్ తేజ్ వయసు ఎంత?

    వరుణ్‌ తేజ్‌ వయసు 35 సంవత్సరాలు

    వరుణ్ తేజ్ ఎత్తు ఎంత?

    6' 4'' (193cm)

    వరుణ్ తేజ్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌

    వరుణ్ తేజ్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యూయేషన్‌

    వరుణ్ తేజ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సెయింట్ మేరీస్ కాలేజ్, హైదరాబాద్

    వరుణ్ తేజ్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    వరుణ్ తేజ్ 2024 వరకు 13 సినిమాల్లో హీరోగా నటించాడు.

    వరుణ్ తేజ్ In Sun Glasses

    Images

    Varun Tej Images

    Images

    Varun Tej Sunglasses Images

    వరుణ్ తేజ్ Childhood Images

    Images

    Varun Tej Childhood Images

    Images

    Varun Tej

    వరుణ్ తేజ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Varun Tej

    Description of the image
    Editorial List
    క్రిష్ జాగర్లమూడి హిట్ సినిమాల జాబితా
    క్రిష్ జాగర్లమూడి సినిమాల జాబితాEditorial List
    క్రిష్ జాగర్లమూడి సినిమాల జాబితా
    మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవేEditorial List
    మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
    ఈ వారం ఓటీటీల్లో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలుEditorial List
    ఈ వారం ఓటీటీల్లో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు మెగా ప్రిన్స్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్… టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌తో మాస్  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. కంచె, ముకుందా, తొలిప్రేమ వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్‌ హీరోల్లో స్టార్ డంతో కొనసాగుతున్న వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వరుణ్ తేజ్ అసలు పేరు? సాయి వరుణ్ తేజ్. స్క్రీన్‌పై పెద్దదిగా ఉంటుందని తీసేశారట. అతని అన్ని సర్టిఫికెట్లలో ఇదే పేరు ఉంటంది. వరుణ్ తేజ్  ఎత్తు ఎంత? 6 అడుగుల 4 అంగుళాలు వరుణ్ తేజ్ తొలి సినిమా? ముకుందా ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కంచె చిత్రం గుర్తింపు తెచ్చింది.  వరుణ్ తేజ్‌కు వివాహం అయిందా? 2023 నవంబర్ 1న లావణ్య త్రిపాఠితో ఇటలీలో పెళ్లి జరిగింది. వరుణ్ తేజ్ క్రష్ ఎవరు? తనకు తన భార్య లావణ్య త్రిపాఠి అంటే మొదటి నుంచి క్రష్ ఉండేదని.. తర్వాత అది ప్రేమగా మారి ఆమెనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అయితే సెకండ్ ఆప్షన్‌గా సాయి పల్లవి పేరు చెప్పాడు. వరుణ్ తేజ్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? గద్దలకొండ గణేష్, ఎఫ్2 వంచి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి. వరుణ్ తేజ్‌కు ఇష్టమైన కలర్? వైట్ వరుణ్ తేజ్ పుట్టిన తేదీ? 19 January 1990 వరుణ్ తేజ్ తల్లి పేరు? పద్మజ వరుణ్ తేజ్ వ్యాపారాలు? ఆర్ట్స్‌ వర్క్స్ రీ సెల్లింగ్  వరుణ్ తేజ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? సైమా అవార్డ్స్‌ల్లో ఉత్తమ హీరో కెటగిరీలో కంచె, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ చిత్రాలకు గాను నామినేట్ అయ్యాడు. కానీ అవార్డులు రాలేదు. వరుణ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? వరుణ్ తేజ్ 2024 వరకు 13 సినిమాల్లో హీరోగా నటించాడు.  https://www.youtube.com/watch?v=Mh9qxcJVGfI వరుణ్ తేజ్‌కు ఇష్టమైన సినిమా? ఇంద్ర వరుణ్ తేజ్‌కు ఇష్టమైన ఆహారం? థాయ్, మెక్సికన్ వంటలంటే ఇష్టం వరుణ్ తేజ్ ఇల్లు ఎక్కడ? వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హైదరాబాద్- మణికొండలో కొత్తగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నాడు.
    మార్చి 21 , 2024
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా? మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం శుక్రవారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై సర్వత్రా క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎంత కలెక్ట్ చేసిందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన కొన్న ఉద్రిక్త సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో  డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్రతిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్  వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్రతిబింబించాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, క్లైమాక్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. కలెక్షన్లు ఇలా… ప్రముఖ వెబ్‌ సైట్ సాక్‌నిక్ ముందస్తు అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూ.1.25కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనం(Operation Valentine Box Office Collection) రాసింది. అయితే తొలి రోజు లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని, ఈ కలెక్షన్లే పూర్తి విలువ కాదని పేర్కొంది.  మరో బాలీవుడ్ వెబ్‌సైట్ కోయిమోయి ఆపరేష్ వాలెంటైన్ చిత్రం రూ.3కోట్లు-రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. అయితే వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువ అని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన F3 సినిమా తొలి రోజు రూ.15కోట్ల వరకు వసూలు చేసిందని గుర్తు చేసింది.  ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు(Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది. పాజిటివ్ రివ్యూస్ మరోవైపు వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా ఆ పాత్రలో జీవించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచాడు. వరుణ్ సరసన నటించిన మానుషి చిల్లర్ (Manushi Chhillar)  సైతం తన పాత్రకు న్యాయం చేసింది. వీళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ పాత్రలు కూడా సినిమాలో మెప్పిస్తాయి. సినిమా సాంకేతికంగాను ఉన్నతంగా ఉంది. పోరాట సన్నివేశాలు కోరుకునేవారికి ఈ చిత్రం మంచి విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులు చెబుతున్నారు. అప్పుడే  ఓటీటీలోకి! అటు 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. థియేటర్‌ వెర్షన్‌లో తెలుగు, హిందీ భాషల్లో విడుదలైలన ఈ చిత్రం… ఓటీటీల్లో మాత్రం, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 02 , 2024
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.  https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20 https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20 కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నయనతార- విఘ్నేష్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.  Screengrab Instagram:nayanatara నమ్రత- మహేశ్ బాబు నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.  అలియా భట్- రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.  విజయనిర్మల- కృష్ణ సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.  జ్యోతిక- సూర్య  సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).  అమల- నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.  నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు. జీవిత- రాజశేఖర్ జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.  షాలిని- అజిత్ బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంటలు కూడా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
    జూన్ 09 , 2023
    Matka Promotions: ట్రెండ్ సెట్‌ చేసిన వరుణ్ తేజ్‌ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్‌! మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'మట్కా' (Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ భామా నోరా ఫతేహి మరో కీలక పాత్రలో నటించింది. గురువారం(నవంబర్‌ 14న) గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ ఆడియన్స్‌లో తమ మూవీపై హైప్‌ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే నటుడు వరుణ్‌ తేజ్‌ సైతం వినూత్న ప్రమోషన్స్‌ (Matka Promotions)కు తెరతీశాడు. తన పాత్ర చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని అతడు చేసిన ఓ వీడియో సినీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇదెక్కడి మాస్‌ ప్రమోషన్స్! మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2014లో వచ్చిన 'ముకుంద'తో తెలుగు ఆడియన్స్‌కు తొలిసారి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘కంచె’, ‘ఫిదా’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు చేశాడు. అలాగే లోఫర్‌, మిస్టర్‌, ‘గాండీవధారి అర్జున’ వంటి ఫ్లాప్‌లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే 'మట్కా' ప్రమోషన్స్‌లో భాగంగా తన చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని వరుణ్ ఓ ఆసక్తికర వీడియోను చేశాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన హిట్‌, ఫ్లాప్‌ చిత్రాలు ఎదురుపడితే తన రియాక్షన్‌ ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఒక్కో వ్యక్తిని ఒక్కో సినిమాగా భావిస్తూ తన ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు. చివర్లో 'మట్కా'గా వచ్చిన వ్యక్తికి బిగ్‌ హగ్‌ ఇచ్చి బాగా ప్రమోట్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. https://twitter.com/SivaKri54096510/status/1856617018276839798 తిరుమలలో ‘మట్కా’ టీమ్‌! తిరుమల శ్రీవారిని ‘మట్కా’ (Matka Promotions) చిత్రబృందం ఇవాళ (నవంబర్‌ 13) తెల్లవారుజామున దర్శించుకుంది. వీఐపీ దర్శన సమయంలో నటుడు వరుణ్‌ తేజ్‌, చిత్ర యూనిట్‌ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర యూనిట్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం ‘మట్కా’ సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు వరుణ్‌ తెలిపారు. తిరుమలలో మట్కా టీమ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  https://twitter.com/baraju_SuperHit/status/1856530909580677270 వరుణ్‌ మేకోవర్‌ చూశారా? మట్కా సినిమాలో వరుణ్‌ తేజ్ శివ అనే పాత్ర పోషించాడు. మట్కా జూదాన్ని ప్రారంభించిన రతన్ ఖాత్రి అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. 1970-90 ప్రాంతంలో వైజాగ్‌ పరిస్థితులను ఈ చిత్రంలో కళ్లకు కట్టనున్నారు. ఇదిలా ఉంటే వాసు పాత్ర కోసం వరుణ్‌ తేజ్‌ పూర్తిగా తన గెటప్‌ను మార్చుకున్నాడు. తన హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్‌ను 1970వ దశకానికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఆ పాత్రలకు వరుణ్‌ ఏ విధంగా మారాడో తెలియజేసే వీడియోను మేకర్స్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఓవర్సీస్‌లో ఏ ఏ థియేటర్లలో తమ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారో ఓ పోస్టర్‌ ద్వారా మట్కా టీమ్‌ తెలియజేసింది.  https://www.youtube.com/watch?v=b3CRE3IMdzA https://twitter.com/baraju_SuperHit/status/1856380138553802773 సెన్సార్‌ రివ్యూ వరుణ్‌ తేజ్‌ మట్కా (Matka Promotions) చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు యూఏ (U/A) సర్టిఫికేట్‌ జారీ చేశారు. ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేశారు. ఇంటర్వెల్ ముందు నాలుగు ఫైట్స్ ఉంటాయని సమాచారం. ఆ నాలుగూ బాగా వచ్చాయని టాక్. ఇక క్లైమాక్స్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు కరుణ కుమార్ రాసిన కథ, తీసిన తీరు సెన్సార్‌ సభ్యులకు బాగా నచ్చిందట. డైలాగులు కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని వారు ఫీలయ్యారట. మట్కా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నట్లు వారు భావించారట. క్యారెక్టర్ పరంగా వరుణ్ తేజ్ గెటప్స్ హైలైట్ అవుతాయని టాక్. నటుడిగా వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కే సినిమా 'మట్కా'  అవుతుందని అంటున్నారు. 
    నవంబర్ 13 , 2024

    వరుణ్ తేజ్ తల్లిదండ్రులు ఎవరు?

    వరుణ్ తేజ్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    వరుణ్‌ తేేజ్‌ తండ్రి కొణిదెల నాగబాబు.. మెగాస్టార్‌ చిరంజీవికిసోదరుడు. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్‌ జడ్జిగా, పొలిటీషియన్‌గా గుర్తింపు పొందాడు. తల్లి పద్మజ హౌస్‌ వైఫ్‌.

    వరుణ్ తేజ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    వరుణ్‌ తేజ్‌కు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నిహారిక కొణిదెల. యాంకర్‌, నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. ఇక స్టార్‌ హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరిష్‌.. వరణ్‌కు కజిన్స్‌ అవుతారు.

    వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అయింది?

    ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిని వరుణ్‌ తేజ్‌ వివాహం చేసుకున్నాడు. 2023 నవంబర్‌ 1న ఇటలీలో వీరి వివాహం జరిగింది.

    వరుణ్ తేజ్ Family Pictures

    Images

    Varun Tej Family Images

    Images

    Varun Tej Family

    వరుణ్ తేజ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ముకుందసినిమా ద్వారా వరుణ్‌ తేజ్‌ ఫేమస్‌ అయ్యాడు.

    వరుణ్ తేజ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో వరుణ్ తేజ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన వరుణ్ తేజ్ తొలి చిత్రం ఏది?

    వరుణ్ తేజ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    కంచెసినిమాలో దూపాటి హరిబాబు పాత్ర

    వరుణ్ తేజ్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Varun Tej best stage performance

    వరుణ్ తేజ్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Varun Tej best dialogues

    Varun Tej dialogues

    వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత?

    రూ.10-15 కోట్లు

    వరుణ్ తేజ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    థాయ్, మెక్సికన్ వంటలంటే ఇష్టం

    వరుణ్ తేజ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    వరుణ్ తేజ్ కు ఇష్టమైన నటి ఎవరు?

    వరుణ్ తేజ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    వరుణ్ తేజ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    వరుణ్ తేజ్ ఫెవరెట్ సినిమా ఏది?

    వరుణ్ తేజ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు

    వరుణ్ తేజ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    వరుణ్ తేజ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    ఇటలీ

    వరుణ్ తేజ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    • Mercedes Benz GLS 350D • Volvo • BMW 7-series • Toyota Villfire

    వరుణ్ తేజ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.47 కోట్లు

    వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3.5 మిలియన్లు

    వరుణ్ తేజ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    వరుణ్ తేజ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    అదురి గ్రూప్‌, నాగార్జున సిమెంట్స్‌ తదితర ప్రకటనల్లో వరుణ్‌ తేజ్‌ నటించాడు.

    వరుణ్ తేజ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    వరుణ్‌ తేజ్‌.. బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీతో సంబంధాలను కలిగి ఉన్నాడు. తండ్రి నాగబాబుకూడా ఈ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. బాబాయి గెలుపును ఆకాంక్షిస్తూ 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్‌ తరపున పిఠాపురంలో వరుణ్‌ ప్రచారం చేశారు.
    వరుణ్ తేజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వరుణ్ తేజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree