• TFIDB EN
  • విజయ్ ఆంటోని
    జననం : జూలై 24 , 1975
    ప్రదేశం: నాగర్‌కోయిల్, తమిళనాడు, భారతదేశం
    ఫ్రాన్సిస్ ఆంటోనీ సిరిల్ రాజా వృత్తిపరంగా విజయ్ ఆంటోని అని పిలుస్తారు, ఒక భారతీయ సంగీత స్వరకర్త, నేపథ్య గాయకుడు, నటుడు, చలనచిత్ర సంపాదకుడు, గీత రచయిత, ఆడియో ఇంజనీర్ మరియు చిత్రనిర్మాత తమిళ సినిమాలో ప్రధానంగా పనిచేస్తున్నారు. అతను 2005లో సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేసాడు. ఉత్తమ సంగీత విభాగంలో నాక ముక్క ప్రకటన చిత్రం కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ సంగీత దర్శకుడు. ఈ పాట 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ప్లే చేయబడింది. అతను 2012లో తన తొలి చిత్రం నాన్‌ని చేసాడు. అతను సలీం (2014), మరియు పిచైక్కారన్ (2016) వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు, 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో నక్కా ముక్కా సాంగ్ ప్లే చేయబడింది.
    <strong>Pushpa 2: గేమ్ చేంజర్‌కు పోటీగా పుష్ప2 సాంగ్? తగ్గేదేలే!</strong>
    Pushpa 2: గేమ్ చేంజర్‌కు పోటీగా పుష్ప2 సాంగ్? తగ్గేదేలే! ప్రస్తుతం యావత్‌ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) మేనియా నడుస్తోంది. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్&nbsp; చిత్రం ‘పుష్ప’ (2021)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి ఈ మూవీపై పడింది. రిలీజ్‌కు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో హీరో బన్నీతో పాటు మూవీ టీమ్ దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్‌ చేస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి నగరాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించి సినిమా మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇటీవల కొచ్చి ఈవెంట్‌లో ‘పీలింగ్స్‌’(peelings) అనే సాంగ్‌ను మలయాళ ప్రేక్షకుల కోసం బన్నీ స్పెషల్‌గా ప్లే చేశారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. రిలీజ్‌ డేట్‌ను సైతం ప్రకటించారు. అయితే ఈ పాటను ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer)కు పోటీగా తీసుకొస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సాంగ్‌ వచ్చేది ఎప్పుడంటే? అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. ఫహాద్‌ ఫాజిల్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు. జగపతిబాబు, సునీల్‌, అనసూయ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా 'పుష్ప 2' టీమ్‌ నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్‌ చేసింది. కొచ్చి ఈవెంట్‌లో కొద్ది సెకన్ల పాటు ప్లే చేసిన 'పీలింగ్స్‌' పాటకు సంబంధించి ఈ ప్రోమోను విడుదల చేశారు. ఆ ఈవెంట్‌లో బన్నీ చెప్పినట్లుగానే మలయాళ లిరిక్స్‌తో పాట మెుదలైంది. 25 సెకన్ల పాటు ఉన్న ఈ ప్రోమో మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. డిసెంబర్‌ 1 ఆదివారం రోజున ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. https://twitter.com/i/status/1862395532343484578 https://twitter.com/baraju_SuperHit/status/1862394696338973169 ‘నానా హైరానా’కు పోటీగా రిలీజ్‌? రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి గురువారం (నవంబర్‌ 28) మూడో సింగిల్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘నానా హైరానా’ (Naanaa Hyraanaa) అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కు మ్యూజిక్‌ లవర్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఇటీవల ‘పుష్ప 2’ నుంచి రిలీజైన ‘కిస్సిక్‌’ పాట కంటే ‘నానా హైరానా’ చాలా బాగుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. పలు యూట్యూబ్‌ చానెళ్లు సైతం దీనిపై పోల్స్‌ నిర్వహించగా మెజారిటీ ప్రేక్షకులు ‘నానా హైరానా’కు అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆ మెలోడీ సాంగ్‌కు పోటీగా మంచి బీట్‌ ఉన్న ‘పీలింగ్స్‌’ పాటను ‘పుష్ప 2’ మేకర్స్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో ‘పుష్ప 2’ మేకర్స్‌కే తెలియాలి. హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌ తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇవాళ ముంబయిలోనూ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్‌ చేశారు. అయితే హోమ్‌ ల్యాండ్‌ అయిన తెలుగు స్టేట్స్ ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించలేదు. దీంతో హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌ను ‘పుష్ప 2’ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు ఎంతో కీలకమైన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ శ్రేయాస్‌ మీడియా ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి సైతం లభిస్తే డిసెంబర్‌ 1న సాయంత్రం ఈవెంట్‌ జరగనుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే ఫోర్త్‌ సింగిల్‌ ‘పీలింగ్స్‌’ను కూడా రిలీజ్‌ చేసే అవకాశముంది. సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత బన్నీనే! ‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి గురువారం సెన్సార్‌ బోర్డ్‌ రివ్యూ పూర్తైంది. ఈ సినిమాకు సెన్సార్‌ సభ్యులు U/A సర్టిఫికేట్‌ జారీ చేశారు. అంతేకాదు 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ ఓ అరుదైన ఘనతను సాధించింది. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన అత్యధిక నిడివి గల చిత్రాల జాబితాలో టాప్‌ - 3 నిలిచింది. గతంలో నందమూరి తారకరామారావు చేసిన దాన వీర శూర కర్ణ (3 గం.ల 43 నిమిషాలు), లవ కుశ&nbsp; (3 గం.ల 28 నిమిషాలు) చిత్రాలు నిడివి పరంగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాబట్టి నిడివి పరంగా సీనియర్ ఎన్టీఆర్‌ తర్వాత బన్నీ టాప్‌లో ఉన్నాడని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/sairaaj44/status/1862102202971787356 నెట్టింట హీట్‌ పెంచేసిన రష్మిక! ఈ తరం స్టార్ హీరోయిన్లలో యంగ్‌ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒకరు. ఆమెను అంతా నేషనల్‌ క్రష్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. తాజాగా ‘పుష్ప 2’ ఈవెంట్‌కు హాజరైన రష్మిక తన గ్లామర్‌తో అక్కడి వారి మతి పోగొట్టింది. గ్రీన్‌ కలర్‌ శారీలో ఎద అందాలు చూపిస్తూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాయి. నేషనల్ క్రష్‌ అంటే ఆమాత్రం అందం ఉండాలిలే అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు ‘పుష్ప 2’ సినిమా లవర్స్‌ సైతం శ్రీవల్లి భలే గ్లామర్‌గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలను మీరూ ఓసారి చూడండి.&nbsp; https://twitter.com/Actresshddd/status/1862326105690317215 https://twitter.com/CeleBeautyHQ/status/1862195078669681134 https://twitter.com/itzFantasyWorld/status/1862382376334057619 https://twitter.com/natshathiram/status/1862209642795016288 https://twitter.com/RSprabha8/status/1862200290948391300
    నవంబర్ 29 , 2024
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్ నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు నందమూరి బాలకృష్ణ ఎవరు? బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం. నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత? 5 అడుగుల 9&nbsp; అంగుళాలు నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు? చెన్నై నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు? 1960 జూన్ 10 &nbsp;నందమూరి బాలకృష్ణ భార్య పేరు? వసుంధర దేవి బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి? ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?&nbsp; ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని) నందమూరి బాలకృష్ణ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కుకింగ్ NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు? తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ బాలకృష్ణ అభిమాన నటుడు? నందమూరి తారక రామారావు బాలకృష్ణ అభిమాన హీరోయిన్? సావిత్రి బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు? మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ. బాలకృష్ణకు ఇష్టమైన కలర్? వైట్ బాలకృష్ణ ఏం చదివాడు? నిజాం కాలేజీలో డిగ్రీ బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 108 సినిమాల్లో నటించాడు బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం? చికెన్ పలావు బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు. బాలకృష్ణ 100వ సినిమా పేరు? గౌతమిపుత్ర శాతకర్ణి https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం? హిందూపురం బాలయ్య గెలుచుకున్న అవార్డులు? బాలయ్య&nbsp; 3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
    మార్చి 19 , 2024
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా? నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్‌ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్‌ చేయగల సామర్థ్యం తారక్‌ సొంతం. అందుకే తారక్‌ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) ముందు వరకూ టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్‌ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ (మే 20) జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Jr NTR Birthday Special Story) అసలు పేరు&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ అసలు పేరు 'తారక్‌ రామ్‌' (Jr NTR Life Memorable Moments) . ఓ రోజు తారక్‌ను తీసుకొని తండ్రి హరికృష్ణ.. నందమూరి తారకరామారావు వద్దకు వెళ్లారు. అప్పుడు తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో మురిసిపోయారట. తన మనవడికి తనే పేరే పెట్టాలని సూచించారట. అంతేకాదు స్వయంగా ఆయనే నందమూరి తారక రామారావుగా తారక్‌ పేరు మార్చారు.&nbsp; ఎనిమిదేళ్ల వయసులోనే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన నట ప్రస్థానాన్ని బాల్యం నుంచి మెుదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బాల రామయాణం’ కంటే ముందే తారక్‌ ఓ సినిమాలో నటించాడు. తారక్‌ తన ఎనిమిదేళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించాడు. (Jr NTR Birthday Special Story) 100కి పైగా ప్రదర్శనలు తారక్‌కు కూచిపూడి నృత్యంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ల పాటు కూచిపూడి సాధన చేశాడు. దేశవ్యాప్తంగా 100పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడంటే అందుకు కారణం.. కూచిపూడిలో నేర్చుకున్న మెళుకువలేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; ఆ విషయంలో ఎప్పటికీ లోటే! కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో తారక్‌ ముందు వరుసలో ఉంటాడు. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీ ఎదుట వాలిపోతుంటాడు. అయితే తారక్‌కు తొలి నుంచి ఓ కుమార్తె కావాలన్న కోరిక ఉండేదట. అయితే భార్య ప్రణతీకి ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కూతురు లేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని ఓ ఇంటర్యూలో తారక్‌ తెలిపాడు.&nbsp; ఫోర్బ్స్‌ జాబితా జాతీయ స్థాయిలో తారక్‌ (Jr NTR Life Memorable Moments) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలో మంచి క్రేజ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తారక్‌.. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నాడు. ఆ దేశంలో యమా క్రేజ్‌! టాలీవుడ్‌ హీరోల క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆయా దేశాల్లోని తెలుగు వారంతా తమకు ఇష్టమైన హీరోలను అభిమానిస్తూ వారి సినిమాలకు ఓవర్సీస్‌లో సక్సెస్ చేస్తుంటారు. అయితే జపాన్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్‌ తారక్‌కు ఉంది. అక్కడ జూ.ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయసంఖ్యలో ఉంటుంది.&nbsp; ఎన్టీఆర్‌ మంచి గాయకుడు ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించడమే కాదు.. మంచిగా పాటలు కూడా పాడగలడు.&nbsp; ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్‌ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్‌ ఈజ్‌ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అతడు ఫ్యాన్స్‌ను అలరించాడు.&nbsp; హోస్ట్‌గానూ సూపర్‌ సక్సెస్‌ ప్రముఖ టెలివిజన్‌ షోలకు తారక్‌ గతంలో హోస్ట్‌గానూ (Jr NTR Life Memorable Moments) వ్యవహిరించాడు. గొప్ప వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్‌ తెలుగు’ షోలకు హోస్ట్‌గా పని చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సంపాదించాడు.&nbsp; తారక్ ఫేవరేట్‌ నెంబర్‌ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు అందరిలాగే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తారక్‌కి ‘9’ సంఖ్య అంటే మహా ఇష్టం. దానిని తన లక్కీ నెంబర్‌గా ఫీలవుతుంటాడు తారక్‌. తన కారు నెంబర్‌ ప్లేట్‌ కూడా 9999 వచ్చేలా తీసుకున్నాడు. ట్విటర్‌&nbsp; ఫేవరేట్‌ సాంగ్‌ &amp; సినిమా తారక్‌కు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. తారక్‌ ఆల్‌టైమ్ ఫేవరేట్‌ సాంగ్‌.. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ). ఇష్టమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.&nbsp; రికార్డు స్థాయిలో ఆడియో ఫంక్షన్‌ ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన మెుట్ట మెుదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఏపీలోని నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్‌ కోసం రైల్వే శాఖ స్పెషల్‌ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో సుమారు 10 లక్షల మంది తారక్‌ అభిమానులు పాల్గొన్నారు.&nbsp; రీరిలీజ్‌ రికార్డు గతేడాది ఇదే రోజున (మే 20) తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్‌ చేశారు. 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఒక రీరిలీజ్‌ చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించడం అదే తొలిసారి.&nbsp;
    మే 20 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు 'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.&nbsp; టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి&nbsp; ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.&nbsp; 'కర్మ' అనే సినిమాతో&nbsp; డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.&nbsp; విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.&nbsp; మరో నాలుగేళ్ల తర్వాత&nbsp; దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు.&nbsp;అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &amp;సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే&nbsp; అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే&nbsp; డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024

    విజయ్ ఆంటోని వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విజయ్ ఆంటోని కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree