• TFIDB EN
  • విజయ లలిత
    జననం : జూన్ 17 , 1949
    ప్రదేశం: అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా
    విజయలలిత తెలుగు సినిమా నటి. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చిన్నమ్మ. శృంగార నాట్యతారగా సినీ జీవితాన్ని ప్రారంభించి, హీరోయిన్‌గాను ఆ తర్వాత నిర్మాతగానూ చిత్రపరిశ్రమకు సేవలందించింది. తెలుగులో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తదితర అగ్ర హీరోల సరసన నటించిన ఈమె లేడీ జేమ్స్‌బాండ్ పాత్రలకు ప్రసిద్ధి. ఈమె నటించిన సినిమాలలో రౌడీరాణి, రివాల్వర్ రాణి, చలాకీ రాణి కిలాడీ రాజా, భలే రంగడు, మనుషుల్లో దేవుడు, కదలడు వదలడు సినిమాలు ప్రసిద్ధమైనవి. దాదాపు 800కు పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా విజయ లలిత నిలిచింది. సమయపాలనతో కచ్చితమైన సమయానికి సినిమా షూటింగులకు హాజరవుతూ ఉండేది. విజయలలిత ఉదయం 7 గంటలకు కాల్‌ షీట్‌ అంటే 6 గంటలకే మేకప్‌ చేయించుకుని కార్లో వచ్చి 7 గంటలకి షూటింగ్‌ వున్న స్టూడియోకి వచ్చి ఫ్లోర్‌గేట్‌ తాళం తీయక పోయినా, అక్కడే కూర్చునేది. ఈ క్రమశిక్షణా ధోరణి వలన ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.
    విజయ లలిత వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విజయ లలిత కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree