• TFIDB EN
  • వీజీ చంద్రశేఖర్
    ప్రదేశం: చెన్నై, భారతదేశం
    విజి చంద్రశేఖర్ భారతీయ నటి. ఆమె అనేక తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడ చిత్రాలలో కనిపించింది. ఆమె అనేక అవార్డులను గెలుచుకున్న ఆరోహణంలో మహిళా ప్రధాన పాత్రను పోషించింది. ఆమె తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది మరియు ఆమె టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించింది. ఆమె అళగి అనే టెలివిజన్ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించింది.
    కథనాలు
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా? సినిమా- స్పై తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా,  ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్: గ్యారీ బీహెచ్ మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి నేపథ్యంతో వచ్చిన కార్తికేయ సిరీస్ 1,2 మంచి హిట్ సాధించాయి. ఈసారి దేశ భక్తి కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పై'  విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ప్రేక్షకుల అంచనాలను స్పై అందుకుందా? నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. కథ:  జై(నిఖిల్) రా ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మిషిన్‌లో పనిచేస్తూ 'రా' ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్( ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకోవాలని 'రా' చీఫ్ శాస్త్రి( మకరంద్ పాండే) ఆ కేసు ఫైల్స్  జైకి అప్పగిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అనుహ్యంగా  దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి జైకి తెలుస్తుంది. అసలు  ఓ ఉగ్రవాది దగ్గర నేతాజీ ఫైల్స్ ఎందుకున్నాయి? నేతాజీ డెత్ మిస్టరీ చివరకు జై ఛేదించాడా? అన్న అంశాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎలా ఉందంటే? స్పై మూవీ గతంలో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాలనే పోలి ఉంది. ఓ రా చీఫ్.. హీరో అయిన రా ఏజెంట్‌కు సిక్రెట్ మిషిన్ అప్పగిస్తాడు. అతడు చివరికి మిషిన్ పూర్తి చేసి విలన్ చంపే కామన్ పాయింట్‌ను స్పై చిత్రం కూడా ఫాలో అయింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించి గూఢాచారి 116 నుంచి అడవి శేషు నటించిన గూఢచారి వరకు ఇదే ఫార్మూలలో వచ్చి హిట్ సాధించాయి. స్పై మూవీ సైతం ఇదే తరహాలో ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు కొత్తదనం అనిపించదు. ఫస్టాప్‌లో నిఖిల్, హీరోయిన్ వైష్ణవి లవ్ స్టోరీ, జోర్డాన్‌లో ఆయుధాల స్మగ్లింగ్ వంటి సీన్లు ఉంటాయి. నేతాజీ రిలేటెడ్ సీన్స్ బాగున్నాయి. కోర్ పాయింట్స్ ఉన్నా సీన్లకు హైప్ తీసుకురాలేదు.  అయితే ఫస్టాఫ్‌లో ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌ విషయానికొస్తే... ఏజెంట్ జై టీమ్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్‌ గురించి తెలుస్తుంది. దాని ఆధారంగా చేసుకుని సెకండాఫ్ సాగుతుంది. సినిమాలో దేశభక్తి కోటింగ్ తప్ప.. ఆ కోర్ పాయింట్‌కు తగ్గ సీన్లు మాత్రం పడలేదు. రెగ్యులర్ స్పై మూవీలాగే కనిపిస్తుంది. కొన్ని ఓవర్ ఎలివేటెడ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు అంతగా పండలేదు. ఎవరెలా చేశారంటే? రా ఏజెంట్‌గా నిఖిల్ సిద్ధార్జ్ బాగా సూట్ అయ్యాడు.  గతంలో చేసిన క్యారెక్టర్స్ మాదిరి ఉండటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో పర్వాలేదనిపించింది. అభినవ్ గోమఠం.. కామెడీని పండించాడు. అతనితో యాక్షన్ సీన్ల కంటే కామెడీ సీన్లే ఎక్కువ ఉంటాయి. రానా దగ్గుపాటి కొద్దిసేపు కనిపించి అలరిస్తాడు. మిగతా క్యారెక్టర్లు పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్, ఆర్యన్ రాజేష్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. టెక్నికల్‌గా.. స్పై సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ మెపిస్తాయి. యాక్షన్ సీన్లు ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. సాంగ్స్ మెప్పించవు. విశాల్ చంద్ర శేఖర్ ట్యూన్స్ విషయంలో ఇంకాస్తా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే.  గ్రాఫిక్స్ సీన్స్ మెప్పించవు. కొన్ని చోట్లు తేలిపోయాయి.యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. స్వతహాగా ఎడిటర్ అయిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పనిచెప్పడంలో పనిచెప్పలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి.  చివరగా: ఓవరాల్‌గా గూఢచారి టెంప్లెట్‌లో సినిమా కావాలనుకునే వారికి 'స్పై' వినోదాన్ని అయితే పంచుతుంది. రేటింగ్: 2.25/5
    జూన్ 29 , 2023
    Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్‌ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. 1. సంఘర్షణ మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తొలిసారి సంఘర్షణ చిత్రంలో నటించారు. మురళి మోహన్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసింది. 2. స్వయం కృషి చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో విజయశాంతి- చిరంజీవి పోటీపడి మరి నటించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ సినిమాను కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 3. దేవాంతకుడు వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎస్‌ ఏ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జీవీ నారాయణరావు నిర్మించారు. కే చక్రవర్తి మ్యూజిక్ అందించారు. 4. మహానగరంలో మాయగాడు చిరంజీవి- విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ సినిమాను విజయ బాపినేడు డైరెక్ట్ చేశారు. మాగంటి రవింద్రనాథ్ చౌదరి నిర్మించారు. 5. ఛాలెంజ్ చిరంజీవి, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని కూడా నటించింది. 6. చిరంజీవి చిరంజీవి తన సొంత పేరుతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రాన్ని  సీవీ రాజేంద్రన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతితో పాటు భానుప్రియ కూడా నటించింది. 7. కొండవీటి రాజా చిరు, విజయశాంతి, రాధ జంటగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది.  'కొండవీటి రాజా' సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.  8. ధైర్యవంతుడు చిరు, విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన 'ధైర్యవంతుడు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేశాడు. 9. చాణక్య శపథం కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి జంటకు పీడ కలను మిగిల్చింది. 10. పసివాడి ప్రాణం చిరంజీవిని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చేసిన చిత్రం ఇది. తన తరం ఉన్న హీరోలతో ఉన్న పోటీని తట్టుకుని చిరంజీవి నంబర్ 1 గా నిలిచాడు. విజయశాంతితో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 11. మంచి దొంగ రాఘవేంద్ర రావు డైరెక్షన్‌ వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని నటించింది. 12. యముడికి మొగుడు చిరంజీవి, విజయశాంతి (Chiranjeevi and Vijayashanthi) జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.  13. యుద్ధ భూమి  మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన 'యుద్ధభూమి' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ అయింది. ఈ సినిమాను కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు. 14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిరంజీవి, విజయశాంతి జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 15. కొండవీటి దొంగ చిరు, విజయశాంతి, రాధ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 16. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతితో పాటు నిరోషా నటించింది. 17. గ్యాంగ్ లీడర్ చిరంజీవికి మెగాస్టార్ క్రేజ్‌ను సుస్థిరం చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. చిరు సరసన విజయశాంతి((Chiranjeevi and Vijayashanthi) హీరోయిన్‌గా నటించింది. 18.  మెకానిక్ అల్లుడు చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమాలో నాగేశ్వరరావు చిరంజీవికి మామగా నటించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను బి. గోపాల్ తెరకెక్కించారు. 19. రుద్ర నేత్ర కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా విజయశాాంతి, రాధ నటించారు. 
    నవంబర్ 07 , 2023
    This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు! గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు వెయ్‌ దరువెయ్‌ ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’ (Vey Dharuvey). యషా శివకుమార్‌ హీరోయిన్‌. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్‌, సత్యం రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.  రజాకార్‌  బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్‌’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.  తంత్ర యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్‌ ధ్రువన్‌ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.  షరతులు వర్తిస్తాయి! చైతన్యరావ్‌, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్‌ కుమార్‌, విజయ, కృష్ణకాంత్‌ సంయుక్తంగా నిర్మించారు.  లైన్‌మ్యాన్‌ త్రిగుణ్‌, కాజల్‌ కుందర్‌ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్‌’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.  రవికుల రఘురామ ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్‌ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్‌ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్‌ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది. లంబసింగి  భరత్‌ రాజ్‌ హీరోగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్‌ తన్నీరు నిర్మించారు.  యోధ సిద్ధార్థ్‌ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్‌ బాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యోధ’ (Yodha). సాగర్‌ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్‌ జోహార్‌, కరణ్‌ జోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇతర చిత్రాలు పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateHanuman MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
    మార్చి 11 , 2024
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌! దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్‌.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్‌ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్‌ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.  సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా! దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్‌ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.  ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్‌? సలార్‌ మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌.. మరో రెండు నెలల్లో మే 9న 'కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.  హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌! శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్‌ కానుండగా హీరోయిన్‌ రాశి సింగ్‌ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్‌ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ  కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.  ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఇవే! ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. 
    ఫిబ్రవరి 27 , 2024

    వీజీ చంద్రశేఖర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వీజీ చంద్రశేఖర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree