• TFIDB EN
  • విక్రమ్
    జననం : ఏప్రిల్ 17 , 1966
    ప్రదేశం: మద్రాసు, మద్రాసు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుత చెన్నై, తమిళనాడు, భారతదేశం)
    విక్రమ్ దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి ఆయన స్వస్థలం. ఎన్ కాదల్ కన్మణి (1990) అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు. 'అక్క పెత్తనం చెల్లెలి కాపురం' (1993)తో తెలుగులో అడుగుపెట్టాడు. 'శివపుత్రుడు' (2003) చిత్రం నటుడిగా విక్రమ్‌ కెరీర్‌ను మలుపుతిప్పింది. 'అపరిచితుడు' (2005) అతడ్ని స్టార్‌ హీరోను చేసింది. తెలుగు, తమిళ భాషలు కలిపి విక్రమ్‌ 60 పైగా చిత్రాల్లో నటించారు.

    విక్రమ్ వయసు ఎంత?

    విక్రమ్ వయసు 58 సంవత్సరాలు

    విక్రమ్ ముద్దు పేరు ఏంటి?

    చియాన్‌ విక్రమ్‌

    విక్రమ్ ఎత్తు ఎంత?

    5' 7'' (170cm)

    విక్రమ్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, బైక్‌ రైడ్‌

    విక్రమ్ ఏం చదువుకున్నారు?

    ఎంబీఏ

    విక్రమ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా చేశారు. పలు వాణిజ్య కంపెనీల ప్రకటనల్లో కనిపించారు.

    విక్రమ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    లయోలా కాలేజ్‌, చెన్నై

    విక్రమ్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో నేరుగా 9 చిత్రాలు చేశారు. తమిళంలో విక్రమ్‌ చేసిన చాలా వరకూ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి.

    విక్రమ్ In Sun Glasses

    Images

    Vikram Stylish Images

    Images

    Vikram Pics

    విక్రమ్ With Pet Dogs

    Images

    Vikram With Pet Dog

    విక్రమ్ Childhood Images

    Images

    Vikram Childhood Images

    విక్రమ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Vikram

    <strong>Thangalaan Telugu Review: విక్రమ్‌ కెరీర్‌లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్‌’ ఎలా ఉందంటే?</strong>
    Thangalaan Telugu Review: విక్రమ్‌ కెరీర్‌లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్‌’ ఎలా ఉందంటే? నటీనటులు: విక్రమ్‌, మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు దర్శకత్వం: పా.రంజిత్‌ సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె. సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్‌ కుమార్‌ నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, పా.రంజిత్‌, జ్యోతి దేశ్‌ పాండే విడుదల: 15-08-2024 ‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగులోనూ పాపులర్‌ అయిన నటుడు విక్రమ్‌ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'తంగలాన్‌' చిత్రంలో ఆటవిక మనిషిగా విక్రమ్‌ కనిపించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్‌ తనను తాను మార్చుకున్న తీరు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌, టీజర్‌ కూడా వాటిని రెట్టింపు చేసింది. ఆగస్టు 15న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. మరీ తంగలాన్ ఎలా ఉంది? విక్రమ్‌ మరోమారు తన నటనతో మెస్మరైజ్‌ చేశాడా? సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే? తంగలాన్ పాత్రలో విక్రమ్‌ అదరగొట్టేశారు. అతడు తప్ప మరొకర్ని ఊహించుకోలేనంతగా ఆ పాత్రపై ప్రభావం చూపించారు. ఆదివాసిలా తను కనిపించిన తీరు, పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇది విక్రమ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పవచ్చు. తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు ఉన్నంతలో పర్వాలేదనిపించింది. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ కెరీర్ బెస్ట్‌ నటనతో ఆకట్టుకుంది. తన లుక్స్‌, నటనతో ఆడియన్స్‌ను భయపెట్టింది. విక్రమ్‌ తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్‌ చూపిన పాత్ర ఆమెదే. విక్రమ్‌తో ఆమె చేసే యాక్షన్‌ హంగామా అలరిస్తాయి. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? తంగలాన్‌ చిత్రం ప్రధానంగా బంగారం అన్వేషణ చుట్టూ తిరిగినా అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం చేసే పోరాటంగా దర్శకుడు పా.రంజిత్ ఈ మూవీని తెరెక్కించారు. బ్రిటిషర్ల కాలంలోని వర్ణ వివక్షను కళ్లకు కట్టారు. కథ చెప్పేందుకు దర్శకుడు సృష్టించిన ప్రపంచం, ప్రజల వస్త్రధారణలు ఆడియన్స్‌ను కొత్త లోకానికి తీసుకెళ్తాయి. బిటిషర్లతో కలిసి తంగలాన్‌ బంగారం వేటకు వెళ్లడం, ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు ఉత్కంఠను రేపుతాయి. విరామంలో వచ్చే సీన్స్‌ సెకండాఫ్‌పై మరింతగా అంచనాలు పెంచేస్తాయి. అయితే సెకండ్‌ పార్ట్‌కు వచ్చే సరికి కథ గాడితప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో బ్రిటిషర్లు-తంగలాన్-నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు గందరగోళానికి గురిచేస్తుంది. ఏది తంగలాన్‌ ఊహో, ఏది నిజమో తెలియక ఆడియన్స్‌ కన్ఫ్యూజ్‌ అవుతారు. అయితే క్లైమాక్స్‌లో తంగలాన్‌ పాత్రలోని మరో కోణం చూపించి దర్శకుడు మంచి ముగింపును ఇచ్చాడు.&nbsp; టెక్నికల్‌గా ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాయి. అలాగే కథకు తగ్గట్లుగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంవిక్రమ్‌, మాళవిక నటనఫాంటసీ ఎలిమెంట్స్‌ మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌లోని సాగదీత సీన్స్‌స్లో నారేషన్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే! విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్‌. ఆయన ఎవరో కాదు చియాన్‌ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.&nbsp; శివ పుత్రుడు పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్‌ అదరగొట్టాడు. క్రూరంగా కనిపిస్తూ జాలి, దయ కలిగున్న మనిషిగా నటించాడు. రస్టీ లుక్‌లో విక్రమ్ నటనకు జాతీయ అవార్డు లభించింది. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య కూడా మరో క్యారెక్టర్‌లో నటించాడు. అపరిచితుడు&nbsp; శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో చేశాడు. తప్పులను ప్రశ్నించే అమాయకమైన రామానుజం, తప్పు చేసిన వారిని శిక్షించే అపరిచితుడు, ప్రియురాలి ప్రేమ కోసం తపించే రెమో క్యారెక్టర్‌లో నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.&nbsp; మల్లన్న విక్రమ్ సినిమా తీస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావించేలా చిత్రాల్ని ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మల్లన్న చిత్రంలోనూ వివిధ గెటప్‌లతో అలరించాడు చియాన్. కోడి మాస్క్‌ ధరించి నటించడంతో పాటు లేడీ గెటప్‌లోనూ నటించాడు. కానీ, సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.&nbsp; ఐ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్‌ చేసిన రోల్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో విచిత్రమైన వ్యాధి సోకి వృద్ధాప్యం వచ్చిన పాత్రలో మెప్పించాడు విక్రమ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఓ పాటలో బీస్ట్‌ గెటప్‌లోనూ మెరిశాడు. బాడీ బిల్డర్‌గానూ నటించిన ఈ టాప్ హీరో… చాలా రోజుల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.&nbsp; నాన్న విక్రమ్ కెరీర్‌లో నాన్న సినిమా ప్రత్యేకం. సరైన మతిస్థిమితం లేని వ్యక్తి కుమార్తెతో కలిసి ఉండే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రమ్ చేసిన క్యారెక్టర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తండ్రి, కూతురు మధ్య కేవలం సైగలతో వచ్చే సీన్‌ ఇప్పటికే చాలామందిని మెప్పించింది. ఇంకొక్కడు ఇరుముగన్‌గా వచ్చిన తమిళ్‌ సినిమా తెలుగులో ఇంకొక్కడు పేరుతో అనువాదం అయ్యింది. ఇందులో రెండు క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించాడు. లేడీ విలన్‌ రోల్‌లో అదరగొట్టాడు. ఆ గెటప్ చూస్తే నిజంగా విక్రమ్ ఇలాంటి రోల్‌ చేశాడా అనిపిస్తుంది. అంతలా మెప్పించాడు విక్రమ్. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. తంగలాన్ విక్రమ్ తదుపరి చిత్రం తంగలాన్. ఇందులో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.&nbsp; https://telugu.yousay.tv/thangalan-the-chian-mark-terror.html
    ఏప్రిల్ 18 , 2023
    SSMB29: మహేష్‌ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్‌.. కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌తో టాక్స్ బాహుబలి (Bahubali), ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రాలతో పాన్‌ వరల్డ్ డైరెక్టర్‌గా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మారిపోయారు. దీంతో ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్‌ వచ్చిన అది దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిపోతోంది. రాజమౌళి తన నెక్స్ట్‌ మూవీని మహేష్‌ బాబు (Mahesh Babu)తో కలిసి చేయనున్నాడు. దీంతో ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో SSMB29కు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.&nbsp; https://twitter.com/fanaticbuff/status/1644059697098510380?s=20 మహేష్‌తో చేయబోయే చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి కసరత్తు చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంచర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తున్న SSMB28 చిత్రం షూటింగ్‌లో మహేష్‌ బాబు బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను ఫాస్ట్‌ ఫాస్ట్‌గా ఫినిష్‌ చేసేందుకు మహేష్‌ కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూట్‌ పూర్తి కాగానే రాజమౌళి ప్రాజెక్ట్‌లో మహేష్‌ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. దీంతో SSMB 29 షూటింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కావొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.&nbsp;
    ఏప్రిల్ 07 , 2023
    Thangalan OTT: ‘తంగలాన్‌’ ఇప్పట్లో ఓటీటీలోకి రానట్లే.. మరి ఎప్పుడంటే? ‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తమిళ నటుడు విక్రమ్‌ తెలుగులోనూ పాపులర్‌ అయ్యాడు. ఇటీవల వచ్చిన 'తంగలాన్‌' చిత్రంలోనూ ఆటవిక మనిషిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్‌ తనను తాను మార్చుకున్న తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని గత కొన్ని రోజులగా సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌! చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ (Thangalan) పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో థియేటర్స్‌లో విడుదలై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత సక్సెస్‌ను అందుకోకపోవడంతో ‘తంగలాన్’ ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ పునరాలోచనలో పడ్డట్లు స‌మాచారం. ఈ క్రమంలోనే ముందుగా ఒప్పందం చేసుకున్న మొత్తానికి కాకుండా త‌క్కువ‌కే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇవ్వాల‌ని నిర్మాణ సంస్థను డిమాండ్ చేసిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఓటీటీలో రిలీజ్‌? ఓటీటీ రైట్స్‌ తక్కువకు ఇవ్వాలన్న నెట్‌ఫ్లిక్స్‌ డిమాండ్‌కు తంగలాన్‌ నిర్మాతలు ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రద్దు చేసుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఎంతకూ పంతం వీడకపోవడంతో మరో ఓటీటీ సంస్థకు ‘తంగలాన్‌’ను ఇచ్చే ప్రయత్నాలను నిర్మాతలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ తంగలాన్‌ ఓటీటీలోకి రావడమే కష్టమే అని చెప్పవచ్చు. దీంతో ఓటీటీలో తంగలాన్‌ కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్‌కు ఇది పెద్ద షాకే. కలెక్షన్స్‌ నిల్‌! ప్రముఖ తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తంగలాన్‌ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్టెత్‌తో నిర్మించారు. యావరేజ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈజీగా రూ.150 కోట్ల పైనే వసూలు చేస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా రూ.105 కోట్ల గ్రాస్‌ను మాత్రమే అందుకుంది. కేవలం రూ.70 కోట్ల నెట్‌ వసూళ్లను సాధించగలిగింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా విక్రమ్‌ నటనపై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురిశాయి. నటన పరంగా ‘తంగలాన్’ అతడి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. దీంతో ఓటీటీలోనైనా ఈ సినిమాను వీక్షించాలని అంతా భావించగా నెట్‌ఫ్లిక్స్‌ వారికి నిరాశనే మిగిల్చింది.&nbsp; కథేంటి 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ. 
    అక్టోబర్ 05 , 2024

    విక్రమ్ తల్లిదండ్రులు ఎవరు?

    నటుడు వినోద్‌ రాజ్‌, రాజేశ్వరి దంపతులకు విక్రమ్‌ జన్మించారు.

    విక్రమ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    విక్రమ్‌కు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. తమ్ముడు అరవింద్‌ సినిమాల్లో నటించారు. సోదరి అనితా టీచర్‌గా చేస్తున్నారు. విక్రమ్‌కు తమిళ నటుడు ప్రశాంత్‌ కజిన్ అవుతాడు.

    విక్రమ్ పెళ్లి ఎప్పుడు అయింది?

    1992లో శైలజా బాలకృష్ణన్‌ను విక్రమ్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె సైకాలజీ టీచర్‌గా చేస్తున్నారు. విక్రమ్‌ నటించిన 'నాన్న' సినిమా కోసం ఆమె పనిచేశారు.

    విక్రమ్ కు పిల్లలు ఎంత మంది?

    విక్రమ్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు ధ్రువ్ తమిళ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. కూతురు అక్షితను తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవడు మను రంజిత్‌కు ఇచ్చి 2017లో వివాహం చేశారు.

    విక్రమ్ Family Pictures

    Images

    Vikram Family

    విక్రమ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    అపరిచితుడు(2005) సినిమాతో విక్రమ్‌ స్టార్‌ హీరోగా మారిపోయాడు.

    విక్రమ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో విక్రమ్ మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'అక్క పెత్తనం చెల్లెలి కాపురం' (1993). ఇందులో రాజేంద్రప్రసాద్ స్నేహితుడి పాత్రలో విక్రమ్ నటించారు.

    తెలుగులో విక్రమ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విక్రమ్ తొలి చిత్రం ఏది?

    పొన్నియన్‌ సెల్వన్‌ (2022), 'పొన్నియన్‌ సెల్వన్‌ 2' (2023) చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

    విక్రమ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, చిత్రాల్లో విక్రమ్‌ అత్యుత్తమ పాత్రలు పోషించారు.

    విక్రమ్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    విక్రమ్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.

    విక్రమ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌

    విక్రమ్ కు ఇష్టమైన నటి ఎవరు?

    శాండ్రా బుల్లాక్‌, జూలియా రాబర్ట్స్‌

    విక్రమ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు

    విక్రమ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    ధరణి

    విక్రమ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    విక్రమ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    విక్రమ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    • Audi R8 • Toyota Land Cruiser Prado • Audi Q7 • Audi A4 • Porsche Turbo

    విక్రమ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    విక్రమ్‌ ఆస్తుల విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

    విక్రమ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.5 మిలియన్లు

    విక్రమ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    విక్రమ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నేషనల్‌ అవార్డ్‌ - 2003

      'పితామగన్' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 1999

      'సేతు' చిత్రానికి స్పెషల్‌ కేటగిరిలో అవార్డ్‌ తీసుకున్నారు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2001

      'కాశి' చిత్రానికి బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు వరించింది

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2003

      'పితామగన్' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2005

      'అన్నియన్‌' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నారు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2010

      'రావణన్‌' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2011

      'దైవ తిరుమగల్' చిత్రానికి ఉత్తమ నటుడిగా క్రిటిక్స్‌ విభాగంలో అవార్డు తీసుకున్నారు

    • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ - 2015

      'ఐ' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు

    • సైమా అవార్డ్‌ - 2011

      'దైవ తిరుమగల్' చిత్రానికి ఉత్తమ నటుడిగా క్రిటిక్స్‌ విభాగంలో అవార్డు తీసుకున్నారు

    • సైమా అవార్డ్‌ - 2015

      'ఐ' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు

    విక్రమ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    3 Roses, మణప్పురం గోల్డ్‌, కోకో కోలా తదితర వ్యాపార ప్రకటనల్లో నటించారు.
    విక్రమ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విక్రమ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree