• TFIDB EN
  • విశాల్
    జననం : ఆగస్టు 29 , 1977
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    విశాల్‌ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు. అతడి అసలు పేరు విశాల్ కృష్ణ రెడ్డి. టాలీవుడ్‌ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న విశాల్‌ జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్‌ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్‌ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి', 'పొగరు', 'భరణి', 'పూజ', 'అభిమన్యుడు' చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. విశాల్‌ హీరోగా 38 చిత్రాల్లో నటించాడు. ప్రొడ్యుసర్‌గా 9 సినిమాలను నిర్మించాడు.

    విశాల్ వయసు ఎంత?

    విశాల్‌ వయసు 47 సంవత్సరాలు

    విశాల్ ఎత్తు ఎంత?

    5' 11'' (180cm)

    విశాల్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌

    విశాల్ ఏం చదువుకున్నారు?

    విజువల్‌ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాడు.

    విశాల్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    లయోలా కాలేజ్‌, చెన్నై

    విశాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    హీరో ఆర్య

    విశాల్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో నేరుగా సెల్యూట్‌, పిస్తాఅనే రెండు చిత్రాలు మాత్రమే చేశారు. అయితే అతడు తమిళంలో చేసిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులో డబ్‌ అయ్యాయి. 38 చిత్రాల్లో విశాల్‌ హీరోగా నటించాడు.

    విశాల్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌సిరీస్‌లు చేయలేదు. అయితే సన్‌ టీవీలో వచ్చిన 'సున్ నామ్ ఒరువర్' షోకు హోస్ట్‌గా వ్యవహరించాడు.

    విశాల్ In Sun Glasses

    Images

    Hero Vishal Images in Sunglasses

    Images

    Hero Vishal images in Sunglasses

    విశాల్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Vishal

    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!Editorial List
    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
    Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్‌.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా?
    Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్‌.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా? నటీనటులు : విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌, సముద్రఖని, రామచంద్రరాజు, యోగి బాబు, మురళిశర్మ, హరీష్‌ పెరడి, మోహన్‌ రమన్‌, విజయ్‌ కుమార్‌ తదితరులు కథ, దర్శకత్వం: హరి సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ : ఎం. సుకుమార్‌ ఎడిటింగ్‌ : టీ.ఎస్‌. జై నిర్మాత : కార్తికేయన్‌ సంతానం, అలంకార్‌ పాండియన్‌ విడుదల తేదీ: 26 ఏప్రిల్‌, 2024 యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో రూపొందిన హ్యాట్రిక్‌ చిత్రం ‘రత్నం’ (Rathnam Movie Review In Telugu). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి ‘భరణి’, ‘పూజా’ ఘన విజయాలను సాధించాయి. దీంతో మూడోసారి ఈ హిట్‌ కాంబో రిపీట్‌ కావడంతో ‘రత్నం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించింది. సముద్రఖని, యోగి బాబు, మురళిశర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశాల్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? రత్నం సినిమా అంచనాలు అందుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి? రత్నం (విశాల్‌).. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో జీవిస్తుంటాడు. జననీ (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? చివరికీ ఏమైంది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో విశాల్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన నటనతో అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా భవానీ శంకర్‌ మెప్పించింది. విశాల్‌తో వచ్చే ఏమోషనల్‌ సీన్స్‌లో ఈ అమ్మడు పోటీపడి మరి నటించింది. కామెడియన్ యోగిబాబు మరోమారు తన మార్క్‌ కామెడీతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. గౌతమ్‌ మీనన్‌, సముద్రఖని, మురళి శర్మ తమ పాత్రల్లో జీవించేశారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ హరి.. ఎప్పటిలాగే ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేశారు. అదిరిపోయే యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఇచ్చారు. ఫస్టాఫ్‌లో విశాల్ ఇంట్రో సీన్స్, ప్రియా భవానీ శంకర్ మధ్య వచ్చే ఏమోషన్ సన్నివేశాలను చక్కగా ప్రెజెంట్‌ చేశారు. అయితే వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ కంటే సినిమాటిక్‌ టోన్‌ ఎక్కువగా ఉంది. యోగిబాబు కామెడీ సీన్లు తమిళ నేటివిటితో ఉండటం.. తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. ఇక డైరెక్టర్‌ హరి గత చిత్రాలతో పోలిస్తే స్క్రీన్‌ప్లే కూడా చాలా పూర్‌గా ఉంది. అయితే విశాల్‌ అభిమానులు, మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చాలా ఎలిమెంట్స్‌ సినిమాలో ఉండటం మూవీకి ప్లస్‌. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు, సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఎమోషనల్‌, యాక్షన్‌ సీక్వెన్‌లో దేవి ఇచ్చిన BGM.. ఆ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. అటు ఎం. సుకుమార్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంది. టీ.ఎస్‌ జై ఎడిటింగ్‌ వర్క్స్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ విశాల్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కంటెంట్‌ లేకపోవడంఆసక్తి పెంచని స్క్రీన్‌ ప్లే Telugu.yousay.tv Rating : 2.5/5 
    ఏప్రిల్ 26 , 2024
    REVIEW: విశాల్‌ “లాఠీ”తో మెప్పించాడా? లేదా?]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 13 , 2023
    Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!  కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. అతడు చేసే యాక్షన్‌ చిత్రాలకు మాస్‌ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్‌ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్‌ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్‌ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్‌ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.  అసలేం జరిగింగంటే? హీరో విశాల్‌ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్‌ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ విశాల్‌ కొన్ని కామెంట్స్‌ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్‌ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్‌ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్‌ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.  విశాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!  ‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్‌ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్‌. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్‌ కథిరేసన్‌ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్‌ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.  https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070 విశాల్‌ ఎలా పాపులర్ అంటే? తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్‌ టాలీవుడ్‌ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్‌ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్‌ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్‌ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. 
    జూలై 27 , 2024
    Vishal: సరిగా మాట్లాడలేని స్థితిలో విశాల్‌.. అనారోగ్యానికి కారణమిదే? తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించిన తమిళ నటుల్లో హీరో విశాల్‌ (Vishal) ఒకరి. కోలీవుడ్‌లో ఆయన తీసిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘పందెం కోడి’, ‘పొగరు’, ‘భరణి’, ‘పూజ’, ‘అభిమన్యుడు’, ‘డిటెక్టివ్’ తదితర చిత్రాలతో విశాల్‌ తెలుగు ఆడియన్స్‌ను విశేషంగా అలరించారు. గతేడాది ‘రత్నం’ (తమిళంలో రత్తం) సినిమాతో తెలుగు ఆడియన్స్‌ పలకరించారు. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా విశాల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన గుర్తుపట్టలేనంతగా బాగా సన్నగా మారిపోయారు. వణికిపోతూ కనిపించారు. దీంతోో ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.  వణుకుతున్న చేతులతో..  చెన్నైలో ఆదివారం (జనవరి 5) జరిగిన 'మదగజ రాజ' (Madha Gaja Raja) ప్రీ రిలీజ్ ఈవెంట్​కు విశాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్ బాగా సన్నగా కనిపించారు. అసిస్టెంట్‌ సాయంతో చాలా నెమ్మదిగా స్టేజీపైకి వెళ్లారు. అనంతరం మైక్‌లో మాట్లాడే సమయంలో విశాల్‌ చేతులు వణికిపోయాయి. మాటల కూడా తడబడ్డాయి. చాలా నెమ్మదిగా ఎంతో ఇబ్బంది పడుతూ విశాల్‌ మాట్లాడారు. స్టేజీపైన కూర్చునే సమయంలోనూ ‘బిచ్చగాడు’ నటుడు విజయ్ ఆంటోనీ ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే విశాల్‌ను ఒక్కసారిగా ఇలా చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విశాల్‌కు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.  https://twitter.com/letscinema/status/1875913583147856184 https://twitter.com/cinemagallery/status/1876182562215010624 అనారోగ్యానికి కారణం ఏంటీ? తమ అభిమాన హీరో విశాల్‌ (Vishal).. అలా వణికిపోతుండటాన్ని చూసి ఫ్యాన్స్ చలించిపోతున్నారు. ఆయనకు ఏమైందని తెగ ఆరా తీస్తున్నారు. అయితే విశాల్‌ ప్రస్తుతం హై ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. 'మదగజ రాజ' చిత్రం 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌ అవుతుండటంతో ఆయన హాజరు తప్పనిసరి అయ్యిందని సమాచారం. ఆరోగ్యం సహకరించకపోయిన విశాల్‌ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారని తెలుస్తోంది. అయితే ఎంత ఫీవర్ ఉన్నా ఈ స్థాయిలో చేతులు వణకడంపై ఫ్యాన్స్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనిషి బాగా తగ్గిపోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నిజంగానే జ్వరమా? లేదా ఇంకేమైనా కారణం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.  https://twitter.com/Sugumar_Tweetz/status/1875897727168753774 త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు.. సమస్య ఏదైనా నటుడు విశాల్‌ (Vishal) త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. సినీ సమస్యలపై ఎంతో ధైర్యంగా మాట్లాడే విశాల్‌ను ఇలా చూడటం బాధగా ఉందని పోస్టులు పడుతున్నారు. జ్వరంతో ఉండి కూడా తన సినిమా ప్రమోషన్‌కు రావడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాపై ఆయనకున్న నిబద్ధత మరోమారు రుజువైందని చెబుతున్నారు. మునుపటిలా విశాల్‌ ఆరోగ్యంగా ఉండేలా చేయమని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.  సంక్రాంతి బరిలో విశాల్‌..! విశాల్‌ నటించిన తాజా చిత్రం ‘మదగజ రాజ’ (Madha Gaja Raja) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న తమిళనాట ఈ సినిమా విడుదల కానుంది. సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2013లోనే షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంది. ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కథానాయికలుగా చేశారు. కమెడియన్‌ సంతానం కీలక పాత్ర పోషించారు. బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ సంగీతం సమకూర్చారు. 
    జనవరి 06 , 2025

    విశాల్ తల్లిదండ్రులు ఎవరు?

    తెలుగు సినీ నిర్మాత జి.కె. రెడ్డి జానకీ దేవిలకు 29 ఆగస్టు 1975న చెన్నైలో విశాల్‌ జన్మించారు.

    విశాల్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    విశాల్‌కు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. సోదరుడు పేరు విక్రమ్‌ కృష్ణ. ప్రముఖ నటి శ్రేయా రెడ్డిని విక్రమ్‌ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. దీంతో విశాల్‌కు శ్రేయా రెడ్డి వదిన అవుతుంది. ఇక విశాల్‌ సోదరి పేరు ఐశ్వర్య.

    విశాల్ పెళ్లి ఎప్పుడు అయింది?

    తెలుగు అమ్మాయి అనీషా రెడ్డిని విశాల్‌ నిశ్చితార్థం చేసుకున్నారు.

    విశాల్ Family Pictures

    Images

    Vishal Family

    Images

    Vishal With His Mother

    విశాల్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    పందెం కోడి, పొగరుచిత్రాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో విశాల్ ఫేమస్ అయ్యాడు.

    విశాల్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో విశాల్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    విశాల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    వాడు వీడు' సినిమాలో విశాల్‌ చేసిన పాత్ర ఇప్పటివరకూ చేసిన వాటిలో అత్యుత్తమమైనది.

    విశాల్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    విశాల్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    విశాల్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.6-10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

    విశాల్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ బిర్యానీ

    విశాల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    విశాల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, ఇంగ్లీషు

    విశాల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    తమిళ దర్శకుడు బాలా

    విశాల్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    గ్రే, బ్లాక్‌

    విశాల్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    విశాల్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ఎం.ఎస్‌. ధోని

    విశాల్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    విశాల్ ఆస్తుల విలువ రూ.125 కోట్లకు పైగా ఉందని సమాచారం.

    విశాల్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    932K ఫాలోవర్లు ఉన్నారు.

    విశాల్ సోషల్‌ మీడియా లింక్స్‌

    విశాల్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నార్వే తమిళ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డ్స్‌ - 2011

      'అవన్‌ ఇవన్‌' (వాడు వీడు) చిత్రానికి గాను స్పెషల్‌ జ్యూరీ అవార్డ్ అందుకున్నాడు

    • సైమా అవార్డ్ - 2014

      'పాండియ నాడు' చిత్రానికి గాను ఉత్తమ డెబ్యూ నిర్మాతగా అవార్డు తీసుకున్నారు

    విశాల్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌తో విశాల్‌ రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి.

    విశాల్ కు సంబంధించిన వివాదాలు?

    మార్క్‌ ఆంటోని హిందీ వెర్షన్‌ కోసం ముంబయిలోని ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఆఫీసులో రూ.6.5 లక్షలు లంచం ఇచ్చినట్లు గతంలో విశాల్‌ పోస్టు చేయడం వివాదం రేపింది. ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార శాఖ సైతం స్పందించింది.

    విశాల్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    విశాల్‌ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. 2024 వరకూ 9 చిత్రాలను నిర్మించారు.

    విశాల్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    పొలిటికల్‌గా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌ గురించి పలు సందర్భాల్లో విశాల్‌ సానుకూలంగా మాట్లాడారు.
    విశాల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విశాల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree