• TFIDB EN
  • విష్ణు మంచు
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    మంచు విష్ణు.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో. టాలీవుడ్‌ దిగ్గజం మోహన్‌బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'విష్ణు' (2003) సినిమాతో తెరంగేట్రం చేశారు. 2007లో వచ్చిన 'ఢీ' చిత్రం మంచు విష్ణు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆపై వచ్చిన దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఈడో రకం ఆడో రకం హిట్స్‌తో స్టార్‌ హీరోగా మారాడు. 22కు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అలరించాడు. అటు నిర్మాతగాను మారి 6 చిత్రాలను నిర్మించారు.

    విష్ణు మంచు వయసు ఎంత?

    మంచు విష్ణు వయసు 41 సంవత్సరాలు

    విష్ణు మంచు ఎత్తు ఎంత?

    5'11'' (180cm)

    విష్ణు మంచు అభిరుచులు ఏంటి?

    రీడింగ్‌, ట్రావెలింగ్‌, ప్లేయింగ్‌ క్రికెట్‌

    విష్ణు మంచు ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    విష్ణు మంచు ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    "పద్మ శేషాద్రి బాల భవన్‌, చెన్నై శ్రీ విద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, తిరుపతి"

    విష్ణు మంచు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    విష్ణు మంచు‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    మంచు విష్ణు.. తెలుగులో 2024 వరకూ 23 చిత్రాల్లో హీరో నటించాడు.

    విష్ణు మంచు అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?

    విష్ణు మంచు తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    టాలీవుడ్‌ దిగ్గజ నటుడు మోహన్‌ బాబు, నిర్మలా దేవి దంపతులకు మంచు విష్ణు జన్మించారు. అతడి తండ్రి మోహన్‌ బాబు.. 573 సినిమాల్లో నటించారు. 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2007లో పద్మశ్రీ పురస్కారం సైతం అందుకున్నారు.

    విష్ణు మంచు‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    మంచు విష్ణుకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. తమ్ముడు మంచు మనోజ్‌ టాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతున్నాడు. సోదరి మంచు లక్ష్మీ కూడా ఇండస్ట్రీలో నటిగా రాణిస్తోంది.

    విష్ణు మంచు పెళ్లి ఎప్పుడు అయింది?

    విరానిక రెడ్డిని 2009లో మంచు విష్ణు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, దివంగత వైయస్‌. రాజశేఖర్‌ రెడ్డికి మేనకోడలు. ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మంచు విష్ణుకు బంధువు అవుతారు.

    విష్ణు మంచు కు పిల్లలు ఎంత మంది?

    మంచు విష్ణుకు ఒక బాబు, ముగ్గురు పాపలు (అందులో ఇద్దరు ట్విన్స్‌) ఉన్నారు. అబ్బాయి పేరు అవ్‌రామ్‌ భక్త. ట్విన్స్‌ పేర్లు అరియానా, వివియానా.

    విష్ణు మంచు లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో విష్ణు మంచు ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ఢీ(2007)

    విష్ణు మంచు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఢీలోబబ్లూ పాత్ర

    విష్ణు మంచు బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Vishnu Manchu best stage performance

    Watch on YouTube

    Vishnu Manchu stage performance

    Watch on YouTube

    Manchu Vishnu best stage performance

    విష్ణు మంచు బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Vishnu Manchu best dialogues

    Watch on YouTube

    Vishnu Manchu dialogues

    Watch on YouTube

    Vishnu Manchu best dialogues

    విష్ణు మంచు రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.6-8 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం.

    విష్ణు మంచు కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ బిర్యాని

    విష్ణు మంచు కు ఇష్టమైన నటుడు ఎవరు?

    విష్ణు మంచు కు ఇష్టమైన నటి ఎవరు?

    విష్ణు మంచు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    విష్ణు మంచు ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    విష్ణు మంచు ఫెవరెట్ సినిమా ఏది?

    విష్ణు మంచు ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌, బాస్కెట్‌ బాల్‌

    విష్ణు మంచు ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    విష్ణు మంచు వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Mercedes 4 matic

    విష్ణు మంచు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    7.9M మిలియన్లు

    విష్ణు మంచు సోషల్‌ మీడియా లింక్స్‌

    విష్ణు మంచు కు సంబంధించిన వివాదాలు?

    "- సోదరుడు మంచు మనోజ్‌ అనుచరుడిగా వ్యవహరిస్తున్న సారథిపై మంచు విష్ణు దాడి చేయడం తీవ్ర వివాదస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. - 'మా' ఎలక్షన్స్‌ బరిలో నిలిచిన సందర్భంగా మంచు విష్ణు చేసిన పలు వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. - 'దేనికైనా రెడీ'లోని కొన్ని సీన్స్‌లో బ్రాహ్మణులను అవమానించారంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగటం వివాదానికి కారణమైంది. "

    విష్ణు మంచు కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    మంచు విష్ణు నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. '24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ' బ్యానర్‌పై 5 సినిమాలు, 'చదరంగం' అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించాడు. అలాగే తన తండ్రి స్థాపించిన శ్రీవిద్యా నికేతన్‌ విద్యాసంస్థలను మంచు విష్ణు దగ్గరుండి చూసుకుంటున్నారు. న్యూయార్‌ అకాడమీ అనే విద్యాసంస్థకు ఛైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు.

    విష్ణు మంచు కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వై.ఎస్‌. జగన్‌.. విష్ణుకి బంధువు. ఈ నేపథ్యంలో విష్ణు ఆ పార్టీకి సానుభూతి పరుడిగా ఉన్నారు.
    విష్ణు మంచు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విష్ణు మంచు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree