• TFIDB EN
  • విష్ణు Oi
    విష్ణు ఓఐ టాలీవుడ్‌కు చెందిన యువ హాస్యనటుడు. టాక్సీవాలా (2018) చిత్రంతో హాస్యనటుడిగా తెరంగేట్రం చేశాడు. 'టాక్సీవాలా', 'మ్యాడ్‌', 'కోట బొమ్మాళి' చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటివరకూ 10 చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించాడు.

    విష్ణు Oi అభిరుచులు ఏంటి?

    ఫొటోగ్రఫి, ట్రావెలింగ్‌

    విష్ణు Oi ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    విష్ణు Oi సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సైన్మా (2014) అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

    విష్ణు Oi‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకూ తెలుగులో పది చిత్రాల్లో నటించారు.

    విష్ణు Oi In Sun Glasses

    Images

    Vishnu Oi Images in Sunglasses

    విష్ణు Oi అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Vishnu Oi

    Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌!
    Sree Vishnu: మైండ్‌ బ్లోయింగ్‌ రిస్క్‌ చేస్తున్న శ్రీ విష్ణు.. సినీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్‌! యంగ్‌ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu).. జయపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇటీవల ఆయన చేసిన చిత్రాలు హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగానూ మారిపోయాడు. కెరీర్‌ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం సోలో హీరోగా దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమాతో కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లను సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే తన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (SWAG) కోసం శ్రీ విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వార్త ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.  14 విభిన్న పాత్రల్లో.. యువ నటుడు శ్రీ విష్ణు.. ప్రస్తుతం 'స్వాగ్‌' (SWAG) అనే చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 'రాజ రాజ చోర' డైరెక్టర్ హసిత్‌ గోలి రూపొందిస్తున్నారు. దాంతో ఈ కాంబినేషన్‌పై మంచి హైప్‌ ఏర్పడింది. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ఈ మూవీలో శ్రీ విష్ణు 14 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అందులో ఒకటి ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ ఇండస్ట్రీలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇదే నిజమైతే ఏ హీరో చేయని సాహాసాన్ని శ్రీ విష్ణు చేస్తున్నట్లే చెప్పాలి. కాగా, ఈ మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్‌ టీజర్‌, హీరోయిన్‌ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఇండియాలోనే తొలిసారి! దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan).. ‘దశావతారం’ చిత్రంలో 10 విభిన్నమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే యంగ్‌ హీరో శ్రీ విష్ణు.. ఈ రికార్డును బీట్‌ చేయబోతున్నట్లు లేటెస్ట్ బజ్‌ను బట్టి తెలుస్తోంది. భారత సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ హీరో 14 విభిన్న పాత్రలు పోషించలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీ విష్ణు ఈ డేరింగ్‌ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ప్రశంసనీయమేనని చెబుతున్నారు. అయితే రోల్స్‌ సినిమాను ఏ మేరకు సక్సెస్‌ చేస్తాయో వేచి చూడాల్సి ఉందని అంటున్నారు.  కీలక పాత్రలో మీరా జాస్మిన్‌ ‘స్వాగ్‌’ చిత్రంలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ 'మీరా జాస్మిన్‌' కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను సైతం ఇటీవల మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో మీరా జాస్మిన్‌ భారీ ఆభరణాలతో డిజైనర్‌ వేర్‌ కాస్ట్యూమ్‌లో రాణిలాగా ముస్తాబై కనిపించింది. రిలీజ్ అనంతరం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, స్వాగ్‌ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్ మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు.  https://twitter.com/movielovers1021/status/1797136038881837295 శ్రీవిష్ణు ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ శ్రీ విష్ణు గత ఆరు చిత్రాలను పరిశీలిస్తే అందులో నాలుగు (రాజ రాజ చోర, అల్లూరి, సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌) మంచి హిట్‌ టాక్‌ సాధించాయి. మిగిలిన రెండు (భళా తందనాన, అర్జున పాల్గుణ) యావరేజ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ‌అతడి కెరీర్‌ హైప్‌లో ఉండటంతో నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం అతడు ‘స్వాగ్‌’ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘SV18’, ‘SV19’ ప్రొడక్షన్ టైటిల్స్‌తో ప్రస్తుతం అవి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలు కూడా సక్సెస్‌ అయితే టాలీవుడ్‌లో శ్రీ విష్ణుకు తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  View this post on Instagram A post shared by Geetha Arts (@geethaarts)
    జూన్ 04 , 2024
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా? నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: రాం అబ్బరాజు నిర్మాత: రాజేష్ దండ సంగీతం: గోపి సుందర్ ఎడిటర్: చోట కె ప్రసాద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ హీరో నటించిన ‘సామజవరగమన’ చిత్రం June 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీతో ఆ కోరిక తీరిందా? అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? బాలసుబ్రహ్మణ్యం(శ్రీవిష్ణు) ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. తాతకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ దానిని అనుభవించడానికి వీలుండదు బాలుకి. కారణం బాలు తండ్రి ఉమామహేశ్వర రావు(నరేశ్) డిగ్రీ పాస్ కాకపోవడమే. తన కొడుకు డిగ్రీ పాసైతేనే వంద కోట్ల ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తాడు ఉమా తండ్రి. దీంతో తండ్రిని చదివించడానికి బాలు నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో సరయు(రెబా మోనిక)తో పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ, వీరి ప్రేమ పెళ్లికి ఓ విషయం అడ్డు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఉమా మహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? చివరికి బాలు, సరయు ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? ప్రచార చిత్రాల్లో చూసినట్టుగా కథ తెలిసినట్టుగా అనిపించినా కథనం ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుడు కుర్చీలో నుంచి లేవడు. పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తూనే ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఇస్తుంటుంది. మంచి హాస్య కథా చిత్రాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. 2 గంటల 20 నిమిషాల స్క్రీన్ టైమ్‌ని ఆడియెన్స్ ఆస్వాదిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ములుపు, ద్వితియార్ధంలో వచ్చే సీక్వెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. మ్యూజిక్ కాస్త రుచించదు.  ఎవరెలా చేశారు? ఈ సినిమాకు నటీనటుల యాక్టింగే ప్రధాన బలం. బాలుగా శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌ని సంపూర్ణంగా స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేశాడు. ఇక, బాలు తండ్రిగా నరేశ్ గొప్పగా నటించాడు. ఈ పాత్రలో నరేశ్‌ని తప్పితే మరొకరిని ఊహించుకోలేని విధంగా తనదైన ముద్రను వేశాడు. ఒకరకంగా సినిమాకు రెండో హీరో నరేశే. ఇక రెబా మోనిక తన పరిధి మేరకు నటించింది. రఘు బాబు, వెన్నెల కిశోర్ కామెడీతో మరోసారి నవ్వించారు.  టెక్నికల్‌గా.. కథను ఊహించగలిగినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు. చక్కని కామెడీ సన్నివేశాలను రాసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలపై మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇక రాంరెడ్డి కెమెరా పనితనం ఫర్వాలేదనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సరితూగింది.  ప్లస్ పాయింట్స్ నటీనటులు కామెడీ సన్నివేశాలు స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ మ్యూజిక్ సాగతీత సన్నివేశాలు రేటింగ్: 2.75/5
    జూన్ 30 , 2023
    Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్‌ మంచు మోహన్‌ బాబు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది. గంటకో మలుపు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. మోహన్‌ బాబు (Mohan Babu), మంచు మనోజ్‌ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తొలుత ఆస్తుల వ్యవహారంలా కనిపించినా రోజులు గడుస్తున్న కొద్ది కుటుంబంలోని మరిన్ని లొసుగులు వెలుగు చూస్తున్నాయి. పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఫ్యామిలీ గొడవలు ప్రస్తావిస్తూ లేఖలు విడుదల చేయడం, ప్రెస్‌మీట్‌లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం, మీడియాపై మోహన్‌ బాబు దాడి ఇలా వరుస ఘటనలతో మంచు లొల్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది.  మోహన్‌ బాబు హెల్త్‌ బులెటిన్‌ మంగళవారం రాత్రి ఘర్షణ అనంతరం మోహన్‌బాబు అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తాజాగా హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. 'డిసెంబర్ 10న రాత్రి 8 30 గంటలకు మోహన్ బాబు గారిని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. బాడీ పెయిన్స్, యాంగ్జైటీతో సృహలేని స్థితిలో ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హుటాహుటిన ఆయకు ఎమర్జెనీ వైద్యాన్ని అందించాం.. ఆయన ఎడమ కంటి కింద గాయం అయింది.. రక్తపోటు చాలా పెరిగింది.. హార్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది.. తగిన చికిత్సను అందించాం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉంది' అని వైద్యులు తెలిపారు. https://twitter.com/Hyderabad_Mail/status/1866749374581313939 రచ్చ పెట్టుకుంటే గెలవలేరు: విష్ణు కుటుంబంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌ చేస్తోన్న ఆరోపణలు గురించి మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. అయితే ఫ్యామిలీ విషయాల గురించి తాను స్పందించనని విష్ణు తేల్చిచెప్పారు. కానీ, ఆత్మ గౌరవ పోరాటమంటూ మనోజ్‌ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించాడు. ‘ప్రేమతో గెలవాల్సింది.. రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేరండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మీరు మనోజ్‌ను శత్రువుగా చూస్తున్నారన్న ప్రశ్నపై ‘దాని గురించి చెప్పేదేమి లేదండి. ఇమ్మెచ్యూర్‌గా ఫ్యామిలీ గురించి తను మాట్లాడొచ్చు. చిన్నవాడిగా అవగాహన లేకుండా ఏదైనా చెప్పవచ్చు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఫ్యామిలీ గురించి మాట్లాడను’ అని అన్నాడు.  https://twitter.com/10TvTeluguNews/status/1866746906011111783 మా నాన్న చేసిన తప్పు అదే: విష్ణు తాజా ప్రెస్‌ మీట్‌లో మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా నాన్న చేసిన పెద్ద తప్పు ఏదైన ఉందంటే అది ముగ్గురు పిల్లలను ఎక్కువగా ప్రేమించడమేనని అన్నారు. 'ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం. ఇండస్ట్రీలో ఉన్నవారందరికీ ఇది తెలుసు. మీడియాకు నాదొక రిక్వెస్ట్‌. మీకు ఫ్యామిలీస్‌ ఉన్నాయి.. ఫాదర్స్‌ ఉన్నారు. ఏ కుటుంబం పర్ఫెక్ట్‌గా ఉండదు. పెద్దలంటారు ఫ్యామిలీస్ ఆర్‌ కాంప్లికేటెడ్ అని. నేననుకున్నా నా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని, కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం. అన్‌ఫార్చ్యునేట్‌గా ఇలా ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సి వస్తది, ఇలా మాట్లాడాల్సి వస్తది, ఇలాంటి పరిస్థితి నా ఫ్యామిలీకి వస్తదని ఎప్పుడు ఊహించలేదు’ అని విష్ణు అన్నారు.  https://twitter.com/abntelugutv/status/1866750818646626628 ‘నాన్నను  క్షమించండి’ మంగళవారం రాత్రి జర్నలిస్టుపై మోహన్‌ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మంచు విష్ణు స్పందించారు. 'జర్నలిస్టుపై దాడి విచారకరం. జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తున్నా. మా నాన్న తప్పు చేసుంటే క్షమించాలి. ఆయన మీడియాతో చాలా గౌరవంగా ఉంటారు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు. సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి. చివరికి అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నా. నిన్నటి దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆస్సత్రి పాలైంది. గేట్లు పగలగొట్టి మనోజ్‌ ఇంట్లోకి వచ్చాడు’ అని విష్ణు అన్నారు. కంటతడి పెట్టిన మనోజ్‌.. మంచు విష్ణు కంటే ముందు సోదరుడు మనోజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో కంటతడి పెట్టి బావోద్వేగానికి గురయ్యారు.‘నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు. సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నాను.  ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా’ అని మనోజ్‌ వ్యాఖ్యానించారు. https://twitter.com/swetchadaily/status/1866744650738044980 'అందుకే ఇంటికి వచ్చా'.. కొంతమంది బంధువులు, నాన్న సన్నిహితుల సూచనతో ఈ ఇంటికి వచ్చానని మనోజ్‌ తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా బయట ఉంటున్నావు. ఇంట్లో అమ్మానాన్న మాత్రమే ఉన్నారు. మీ అన్న ఫ్యామిలీతో దుబాయ్‌కు షిఫ్ట్‌ అయ్యాడు. నీ భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఈ సమయంలో నీ భార్యకు మీ తల్లి, పెద్దవాళ్ల అవసరముంది. ఒక్కడివే ఎలా చూసుకుంటావు?’ అని వారు నాతో అన్నట్లు చెప్పారు. తన భార్య కూడా వారిని సమర్థించి..  మాట వినాలని కోరడంతో ఈ ఇంటికి తిరిగి వచ్చానని వివరించారు.  ‘అన్న కోసం గొడ్డులా పనిచేశా’ తనపై చాలా ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్‌ అన్నారు. ‘దీనికి నేనేమీ చెప్పలేను. ఆధారాలు మాత్రమే చూపించగలను. నేనెప్పటినుంచో కూర్చొని మాట్లాడదామన్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను. ఆమె కోసం పోరాడాను. అందులో తప్పేముంది? పది మంది కోసం నిలబడినందుకు నేను చెడ్డవాడిని అయ్యాను. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేశాను. రమ్మంటే వచ్చాను.. పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను. గొడ్డులా కష్టపడ్డాను. మనస్ఫూర్తిగా, సంతోషంగా చేశాను. ఏ రోజూ ఒక్క రూపాయి అడిగింది లేదు.. ఆశించింది లేదు’ అని అన్నారు.  https://twitter.com/abntelugutv/status/1866742963445043239
    డిసెంబర్ 11 , 2024
    Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే? టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్లు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌  సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.  కన్నప్ప దూకుడు..! మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్‌ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్‌.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు.  రిలీజ్ ఎప్పుడంటే ప్రస్తుతం కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), మోహన్‌లాల్‌ (Mohan Lal), శివరాజ్‌ కుమార్‌ (Siva Raj Kumar), మోహన్‌ బాబు (Mohan Babu), శరత్‌ కుమార్‌ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్‌ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.  https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మిస్టర్ బచ్చన్‌ ‘షో రీల్‌’.. అదరహో! రవితేజ (Ravi Teja) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్‌ చిత్రం.. ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్‌.. 'షో రీల్స్‌'ను సోమవారం (జూన్‌ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్‌ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.  https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak దేవిశ్రీ ప్రసాద్‌ ప్రశంసలు మిస్టర్‌ బచ్చన్‌ నుంచి విడుదలైన మాస్‌ గ్లింప్స్‌.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌.. మిస్టర్‌ బచ్చన్‌ గ్లింప్స్‌పై ఎక్స్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్‌ హరీష్‌ శంకర్‌ సార్‌.. పంచ్‌ డైలాగ్‌ లేకుండానే పంచ్‌ క్రియేట్‌ చేశారు. మాస్‌ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్‌ బాస్టర్‌ లోడ్‌ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్‌ బచ్చన్‌ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్‌ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్‌ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
    జూన్ 18 , 2024

    విష్ణు Oi ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    మ్యాడ్‌, కీడాకోలాసినిమాల్లో హాస్య పాత్రలు పోషించి పాపులర్ అయ్యాడు.

    విష్ణు Oi లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    టాక్సీవాలా(2018) చిత్రంతో హాస్యనటుడిగా తెరంగేట్రం చేశాడు.

    తెలుగులో విష్ణు Oi ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    విష్ణు Oi కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    కీడా కోలా' చిత్రంలో సికిందర్‌ పాత్ర

    విష్ణు Oi బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    విష్ణు Oi బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    విష్ణు Oi కు ఇష్టమైన నటుడు ఎవరు?

    విష్ణు Oi ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    విష్ణు Oi ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    విష్ణు Oi ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    విష్ణు Oi ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    విష్ణు Oi ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ

    విష్ణు Oi ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    9,290 ఫాలోవర్లు ఉన్నారు.

    విష్ణు Oi సోషల్‌ మీడియా లింక్స్‌

    విష్ణు Oi వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విష్ణు Oi కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree