• TFIDB EN
  • వివేక్ ఆత్రేయ
    ప్రదేశం: గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    వివేక్ ఆత్రేయ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్. రొమాంటిక్ కామెడీ సినిమా మెంటల్ మదిలో సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బ్రోచేవారెవరురా క్రైమ్ కామెడీ సినిమాతో గుర్తింపు పొందాడు. అంటే సుందరానికీ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలు పొందాడు. వివేక్ ఆత్రేయ 1989, అక్టోబర్ 18న గుంటూరులో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇద్దరూ ఇండియా పోస్ట్‌లో పనిచేస్తున్నారు. శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వివేక్, చెన్నైలోని ఐబిఎంలో ఐదు సంవత్సరాలు పనిచేశాడు. సినిమారంగంలోకి రావడంకోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు పాటలు రాసి తనలోని రచయితను సైతం పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

    వివేక్ ఆత్రేయ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వివేక్ ఆత్రేయ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree