ATelugu
రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) భగవంతుణ్ణి నమ్ముతూ నాటకాలు వేస్తుంటాడు. ఈ క్రమంలో దశావతారంలో నాటకాలు మెుదలుపెడతాడు. అయితే ఈ నాటకాలలో ఏ అవతారం ఏ రోజు చేస్తారో అదే రీతిలో అనుమానాస్పదంగా హత్యలు జరగడం మెుదలవుతాయి. దీని వెనక ఎవరున్నారు? ఈ కేసును పోలీసు ఆఫీసర్ విరాట్ (శ్రీరామ్) ఎలా ఛేదించాడు? ఈ హత్యలకు కారణం ఏంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Harikatha Web Series Review: మిస్టరీ హత్యలు చేసేది దేవుడా? నరుడా?
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. ‘హరికథ: సంభవా...read more
How was the movie?
తారాగణం
రాజేంద్ర ప్రసాద్
రంగాచార్యపూజిత పొన్నాడ
దివి వడ్త్యా
అంబటి అర్జున్
శ్రీకాంత్ శ్రీరామ్
సిబ్బంది
మ్యాగీదర్శకుడు
టీజీ విశ్వనాథ్నిర్మాత
సురేష్ బొబ్బిలిసంగీతకారుడు
విజయ్ ఉల్గనాథ్సినిమాటోగ్రాఫర్
కథనాలు
Harikatha Web Series Review: మిస్టరీ హత్యలు చేసేది దేవుడా? నరుడా?
నటీనటులు: శ్రీరామ్, దివి, రాజేంద్రప్రసాద్, అర్జున్ అంబటి, పూజిత పొన్నాడ తదితరులు
డైరెక్టర్ : మ్యాగి
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ : విజయ్ ఉలగనాథ్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి
నిర్మాత : టి.జి. విశ్వప్రసాద్
ఓటీటీ వేదిక: హాట్‌స్టార్
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' (Harikatha Web Series Review) పేరుతో రూపొందిన ఈ సిరీస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మ్యాగీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను థియేటర్‌లో ఎందుకు రిలీజ్ చేయలేదని కచ్చితంగా ఫీలవుతారని నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రమోషన్స్ మాట్లాడి భారీగా అంచనాలు పెంచేశారు. ట్రైలర్, టీజర్ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. మరి ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లే మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1980 - 1990 మధ్య కథ సాగుతుంది. అరుకులోని ఓ గ్రామంలో తక్కువ కులానికి చెందిన హరి (సుమన్) ఓ హత్య కేసులో జైలుకి వెళ్తాడు. మరోవైపు రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) భగవంతుణ్ణి నమ్ముతూ విష్ణు అవతారలపై నాటకాలు వేస్తుంటాడు. అయితే ఈ నాటకాలలో ఏ అవతారం ఏ రోజు చేస్తారో అదే రీతిలో అనుమానాస్పదంగా హత్యలు జరగడం మెుదలవుతాయి. దీంతో ఆ భగవంతుడే హత్యలు చేస్తున్నాడని గ్రామస్తులంతా నమ్ముతారు. ఈ హత్యల మిస్టరీని కనుగొనేందుకు పోలీసు అధికారి విరాట్ (శ్రీరామ్) రంగంలోకి దిగుతాడు. అతడి దర్యాప్తులో తేలిన నిజాలేంటి? ఆ హత్యలు నిజంగానే భగవంతుడు చేస్తున్నాడా? మరెవరైనా దాని వెనక ఉన్నారా? అసలు హత్యకు గురైన వారు చేసిన తప్పులు ఏంటి? జైలుకెళ్లిన హరి (సుమన్) స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Harikatha Web Series Review) ఈ సిరీస్‌లో మరోమారు తన నట విశ్వరూపం చూపించాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ పోషించని పాత్రలో అదరగొట్టారు. విష్ణుమూర్తి దశావతారాల్లో చక్కగా ఒదిగిపోయారు. తన హావభావాలతో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించారు. పోలీసు ఆఫీసర్‌గా శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. మిస్టరీని ఛేదించాలని తపన పడే పోలీసు పాత్రలో చెరగని ముద్ర వేశారు. బిగ్‌బాస్ ఫేమ్ దివికి చాన్నాళ్ల తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్ర తగ్గింది. అడవి పిల్లగా ఆమె క్యారెక్టరైజేషన్ బాగుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఓ సర్‌ప్రైజ్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. మరో నటి పూజిత పొన్నాడ నటన కంటే గ్లామర్‌గా మంచి మార్కులు కొట్టేసింది. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు మ్యాగీ 1980ల కాలం నాటి స్టోరీని తీసుకొని దశావతారలను రిలేట్ చేస్తూ రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ లైన్ ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక టచ్‌తో సాగిన పలు సన్నివేశాలు మెప్పించాయి. అలాగే హత్యల చుట్టూ సస్పెన్స్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక్కో అవతరానికి తగ్గట్లు డిజైన్ చేసిన హత్యలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. దర్శకుడు మంచి కాన్సెప్ట్‌నే ఎంచుకున్నప్పటికీ రొటీన్ రీవెంజ్ డ్రామాగా కథను నడిపించడం నిరాశ పరుస్తుంది. చాలా వరకూ సీన్స్ ఎక్కడో చూసిన ఫీలింగ్‌ను కలిగించాయి. అసందర్భమైన పాటలు సైతం సిరీస్ ఫ్లోను దెబ్బతీశాయి. సరైన కథనం లోపించడం, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సిరీస్ చాలా వరకూ బోరింగ్‌గా అనిపిస్తుంది. అభ్యంతరకరమైన డైలాగ్, సీన్స్ లేకపోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కలిసొచ్చింది.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Harikatha Web Series Review) సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్ పనితీరులో లోపాలున్నాయి. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌లో నాణ్యత లోపించింది. సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదు. జునైద్ సిద్ధిఖి ఎడిటింగ్ ఓకే. ఇంకొన్ని కత్తెరలు పెట్టినా నష్టం లేదు. నిర్మాణ విలువలు సిరీస్‌కు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనడివోషనల్ టచ్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
రొటిన్ రివేంజ్ డ్రామాబోరింగ్ సన్నివేశాలువీఎఫ్‌ఎక్స్ వర్క్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 14 , 2024
Rajendra Prasad: ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’.. రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా గురించి మాట్లాడుకుంటోంది. రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా పుష్పరాజ్ సృష్టిస్తున్న రికార్డ్స్ చూసి సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి విజయం భారత సినీ చరిత్రలో అల్లు అర్జున్‌కు తప్ప ఏ నటుడికి సాధ్యం కాలేదని ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప 2’తో బన్నీకి మరో నేషనల్ అవార్డు రావడం ఖాయమని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశం మెుత్తం పుష్ప 2 ఫీవర్ నడుస్తున్న సమయంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Harikatha Prerelease Event) ఈ సినిమాపై స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. సినిమా పేరు ప్రస్తావించకుండా ‘ఎర్ర చందనం దొంగిలించేవాడు హీరోనా’ అని మాట్లాడారు. అంతటి సీనియర్ యాక్టర్ ఇలా ఎందుకు మాట్లాడారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
హరికథ ప్రీరిలీజ్ ఈవెంట్..
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హరికథ వెబ్ సిరీస్ ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో అడుగుపెడుతోంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సిరీస్ బృందమంతా పాల్గొంది.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..
‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ (Harikatha Prerelease Event) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత కలియుగంలో కథలు ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. ‘నిన్న గాక మెున్న చూశాం. వాడెవడో చందనం దొంగిలించే దొంగ.. వాడు హీరో. హీరోల మీనింగ్‌లు మారిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చారు. తన 48 ఏళ్ల సినీ జీవితంలో మన చుట్టూ ఉండే పాత్రలు చేసే అదృష్టం లభించిందన్నారు. ‘లేడీస్ టైలర్’, ‘అప్పుల అప్పారావు’, ‘పేకాట పాపారావు’ వంటి సినిమాలను ప్రస్తావించారు.
https://www.youtube.com/watch?v=N-eSYXCH7KM
‘రూ.1000 టికెట్ పెట్టి వెళ్లక్కర్లా’
‘హరికథ’ (Harikatha Prerelease Event) సిరీస్‌లో దేవుడే దుష్టసంహారం చేస్తున్నట్లు చూపించనున్నారు. దీనిపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవుడు ఎందుకు చంపుతాడు? అనుకునే వారు సిరీస్ చూడాల్సిందేనన్నారు. ‘ఇది పెద్ద కష్టమేమి కాదు. థియేటర్లకు రూ.1000 ఖర్చు పెట్టిమరీ వెళ్లేంత పని లేదు. హ్యాపీగా ఇంట్లోనే చూడొచ్చు’ అని చెప్పారు. అయితే ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా ఒక్కో టికెట్ రూ.1000కి పైగా అమ్మారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు వేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1866082101659070546
తొడ కొట్టిన రాజేంద్ర ప్రసాద్..
‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ తొడగొట్టి అందరికీ ఛాలెంజ్ చేశారు. ఈ సిరీస్ చూశాక మీరందరూ థియేటర్‌లో ఎందుకు రిలీజ్ చేయలేదని తనను తిడతారని అన్నారు. అలా జరగకపోతే తన పేరు మార్చి మరొకటి పెట్టుకుంటానని అన్నారు. సత్యంగా చెబుతున్నానని అన్నారు. ఈ మాటలతో ఈవెంట్ ప్రాంగణం మెుత్తం చప్పట్లు, విజిల్స్‌తో మారు మోగింది. అటు ఓటీటీల గురించి సైతం రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల నుంచి సినిమా ఇంటికి వచ్చేసిందని, ఈ రోజుల్లో సినిమా ఇంట్లోనే ఉందని అన్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1866091296110318029
డిసెంబర్ 09 , 2024
This Week OTT Releases Telugu: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) హవా నడుస్తోంది. గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అది ఈ వారం కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో పెద్ద హీరోల చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు సాహసించడం లేదు. దీంతో చిన్న సినిమాలు ఈ వీక్ (OTT Releases Telugu) సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
మిస్ యు (Miss You)
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ జంటగా నటించిన తాజాగా చిత్రం ‘మిస్ యు’ (Miss You). యు.ఎన్.రాజశేఖర్ దర్శకుడు. ఈ చిత్రాన్ని 7మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మించింది. డిసెంబర్ 13న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఒక యునిక్ లవ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు తమ చిత్రం తప్పక నచ్చుతుందని పేర్కొంది.
ప్రణయగోదారి (Pranaya Godari)
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranaya Godari). ఈ చిత్రానికి పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. పారమళ్ల లింగయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి తప్పక నచ్చుతుందని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఫియర్ (Fear)
ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్ రోల్‌లో నటించిన హారర్ చిత్రం ‘ఫియర్’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఈ మూవీ డిసెంబర్ 14న విడుదల కాబోతోంది. ఇందులో అరవింద్ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్ ఎలిమెంట్స్ ప్రతీ ఒక్కరినీ థ్రిల్ (OTT Releases Telugu) చేస్తారని చిత్ర బృందం చెబుతోంది.
పా.. పా.. (Pa Pa)
తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం 'డా.. డా..'ను తెలుగులో ‘పా.. పా..’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కెవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. గణేష్ కె. బాబు దర్శకత్వం వహించారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను సైతం తప్పక అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
హరికథ (Harikatha)
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' పేరుతో రూపొందిన ఈ సిరీస్ ఈ వారమే హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.
రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. డిసెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateOne Hundred Years of SolitudeMovieEnglishNetflixDec 11The Auditors MovieEnglish/KoreanNetflixDec 11How To Make Millions Before Grandma DiesMovieEnglish/ThaiNetflixDec 11Dead list CaughtMovieEnglishNetflixDec 12Law PalmaMovieEnglishNetflixDec 12Miss MatchedMovieEnglishNetflixDec 13Carry on MovieEnglishNetflixDec 131992MovieEnglishNetflixDec 14Inside out 2SeriesEnglishHotstarDec 12Jamay no.1MovieHindiZee 5Dec 09DispatchMovieHindiZee 5Dec 13BougainvilleaMovieTelugu/MalayalamSonyLIVDec 13
డిసెంబర్ 09 , 2024
OTT Suggestions: ఈ వీకెండ్.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే
ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్ (OTT Suggestions)లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
జీబ్రా (Zebra)
సత్యదేవ్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్ కథానాయిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. డేట్ అనౌన్స్ చేయనప్పటికీ డిసెంబర్ 14న ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాట్ ఏంటంటే ‘మిడిల్ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్ చేస్తుంది. ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడే క్రమంలో సూర్య రూ.5 కోట్ల ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది స్టోరీ.
తంగలాన్ (Thangalan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన 'తంగలాన్' చిత్రం ఈ వారమే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించగా మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘తంగలాన్ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ.
7/G
సోనియా అగర్వాల్ (OTT Suggestions), స్మృతి వెంకట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7/G’. హరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టెరిఫిక్ హారర్ థ్రిల్లర్‌గా థియేటర్లలో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘రాజీవ్, వర్ష దంపతులు ఐదేళ్ల కుమారుడితో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అవుతారు. అక్కడ వర్షకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. అతీతశక్తులతో ఆమె పోరాటం చేయాల్సి వస్తుంది. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.
బౌగెన్‌విల్లా (Bougainvillea)
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, కుంచకో బోబన్, జ్యోతిర్మయి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'బౌగెన్‌విల్లా'. థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 13 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'థామస్, రీతు భార్య భర్తలు. యాక్సిడెంట్‌లో గీతు గతం మర్చిపోతుంది. మరోవైపు మినిస్టర్ కుమార్తె మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృషిస్తుంటుంది. యాక్సిడెంట్‌కు ముందు మినిస్టర్ కుమార్తెను రీతు ఫాలో కావడం చూసి దర్యాప్తు చేసేందుకు ఏసీపీ కోషి వాళ్ల ఇంటికి వస్తాడు. అక్కడ ఏసీపీకి తెలిసిన షాకింగ్ నిజాలేంటి? అసలు మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు? అన్నది స్టోరీ.
హరికథ (Harikatha)
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' (OTT Suggestions) పేరుతో రూపొందిన ఈ సిరీస్ ఈ వారమే హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.
రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చింది. డిసెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్ రాహుల్ (సందీప్ సరోజ్), ఆర్జే సూర్య (తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటూ హ్యాపీగా జీవిస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. వారి రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? వారిలో వచ్చిన రియలైజేషన్ ఏంటి?’ అన్నది స్టోరీ
కంగువా (Kanguva)
ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) డిసెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ.
అమరన్ (Amaran)
పాన్ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్ తమిళ చిత్రం 'అమరన్' . అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)
’యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్ చిత్రం గత వారం ఓటీటీలోకి వచ్చింది. 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్ రావ్, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్ నైట్ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
డిసెంబర్ 12 , 2024